
ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో కనిపించే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చర్యలు చాలా సందర్భాల్లో వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా అలాంటి పనే మరోటి చేశాడు ఈ యంగ్ హీరో. రణవీర్ సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గల్లీబాయ్. ఈ సినిమాలో రణవీర్.. రాప్ గాయకుడిగా ఎదగాలనుకునే కుర్రాడి పాత్రలో కనిపిస్తున్నాడు.
ప్రేమికుల రోజు కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈసందర్భంగా లాక్మే ఫ్యాషన్ వీక్‌లో రణవీర్ లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. స్టేజ్ మీద పాటపాడుతూ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న అభిమానులపైకి దూకేశాడు. దీంతో అక్కడున్న కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. రణవీర్ చర్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక్క సెలబ్రిటీకి కనీస సివిల్ సెన్స్ లేదంటూ నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment