Alia Bhatt Open Up On When Her and Ranbir Kapoor Love Story Begins - Sakshi
Sakshi News home page

Alia Bhatt-Ranbir Kapoor Love Story: ఆరేళ్ల రిలేషన్‌.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది

Published Fri, Jul 8 2022 1:35 PM | Last Updated on Fri, Jul 8 2022 2:16 PM

Alia Bhatt Open Up On When Her and Ranbir Kapoor Love Story Begins - Sakshi

ఆరేళ్లు ప్రేమలో మునిగి తేలిన బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్ ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌లు ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎప్రీల్‌ 14న ఇరు కటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఈ జంట వివాహం ఘనంగా జరిగింది. ఇక పళ్లయిన రెండు నెలలకే ఆలియా ప్రెగ్నెన్సీని ప్రకటించి ఫ్యాన్స్‌కు శుభవార్త అందించింది. ఇదిలా ఉంటే రణ్‌బీర్‌, ఆలియా ప్రేమయాణంపై ఫ్యాన్స్‌కు ఎంతో ఆసక్తిగా ఉంటారు. బ్రహ్మస్త్రకు ముందు అసలు కలిసి నటించిన ఈ జంట మధ్య పరిచయం, ప్రేమ ఎలా మొదలైందా అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహమే.

చదవండి: నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు

అయితే తాజాగా ఓ షో పాల్గొన్న ఆలియా తమ ప్రేమ ఎక్కడ ఎప్పుడు మొదలైందనే దానిపై నోరు విప్పింది. తాజాగా ఆమె తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ జోహార్‌ 7వ సీజన్‌లో హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి సందడి చేసింది. తమ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ సోకు తొలి గెస్ట్స్‌గా వచ్చిన ఆలియా ఈ సందర్భంగా తన లవ్‌, మ్యారేజ్‌ లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నప్పటి నుంచే రణ్‌బీర్‌ అంటే క్రష్‌ అని గతంలో పలుమార్లు ఆలియా చెప్పిన సంగతి తెలిసిందే. కొంతకాలం సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న ఆలియా-రణ్‌బీర్‌ ఎప్పుడు తమ అభిప్రాయాలను పంచుకోలేదని చెప్పంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రహ్మస్త్రం షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి ప్రేమ బలపడిందని చెప్పింది.

చదవండి: నటి సాయి పల్లవికి హైకోర్టులో ఎదురుదెబ్బ

‘షూటింగ్‌ కోసం మేము ఒకే విమానంలో ప్రయాణిస్తున్నాం. అప్పుడు రణ్‌వీర్‌ సీటు సరిగా లేదు. దీంతో నా పక్కన వచ్చి కుర్చున్నాడు. అప్పుడు మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒకరి అభిప్రాయలను ఒకరం షేర్‌ చేసుకున్నాం. దీంతో అప్పుడే డిసైడ్‌ అయ్యాం. మా ఈ లాంగ్‌ రిలేషన్‌లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పుకొచ్చింది. అయితే అంతకు ముందేప్పుడు వారిద్దరు నేరుగా ప్రపోజ్‌ చేసుకోలేదు కానీ ఒకరిపై ఒకరు ఇష్టంతో ఉన్నామని పేర్కొంది. కాగా ఈ రియల్‌ కపుల్‌ జంటగా నటించిన తొలి చిత్రం బ్రహ్మస్త్రం. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement