coffee with karan
-
సినిమా వాళ్లతో డేటింగ్ చేయను, ఎందుకంటే..: జాన్వీ కపూర్
శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. దఢక్ సినిమాతో హీరోయిన్ గా మారిన జాన్వీ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూబాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తుంది. త్వరలోనే టాలీవుడ్ తెరపై కూడా సందడి చేయబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాలో జాన్వీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే జాన్వీ ఆమె సోదరి ఖుషీ కపూర్ ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’కి గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డేటింగ్ పై తన అభిప్రాయం ఏంటో చెప్పింది. సినిమా వాళ్లతో డేటింగ్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పేసింది. ‘డేటింగ్ చేసేవాళ్లకు నేనే ప్రపంచమై ఉండాలి. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. సినీ రంగంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఒకే వృత్తిలో ఉండేవాళ్లు దాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టం. అందుకే నేను సినిమా వాళ్లతో డేటింగ్ చేయను’అని జాన్వీ చెప్పుకొచ్చింది. (చదవండి: అమ్మ నన్ను తిట్టేది: జాన్వీ) -
అతనితో డేటింగ్.. నోరు జారిన దేవర భామ!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. శ్రీదేవి ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి చిత్రం ధడక్‌తో అలరించింది. గతేడాది బవాల్ చిత్రంలో మెరిసింది. తాజాగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర మూవీతో టాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన జాన్వీ కపూర్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా దేవర గ్లింప్స్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారుయ అయితే ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్ తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. తన సోదరి ఖుషి కపూర్‌తో కలిసి కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. కాఫీ విత్ కరణ్ సీజన్ -8 పాల్గొన్న జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కరణ్ అడిగిన ప్రశ్నలకు జాన్వీ, ఖుషి ఆసక్తికర సమాధానాలిచ్చారు. (ఇది చదవండి: ఫ్యాన్స్‌కు పోస్టర్‌తో ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్.. దేవర గ్లింప్స్ రెడీ) జాన్వీ కపూర్‌ను ప్రశ్నిస్తూ నీ స్పీడ్ డయల్ నంబర్స్‌లో ముగ్గురి పేర్లు చెప్పమని కరణ్ జోహార్ అడిగాడు. దీనికి ఆమె సమాధానమిస్తూ పాపా(నాన్న), ఖుషు, శిక్కు అని ఠక్కున చెప్పేసింది. దీనికి ఖుషీ, కరణ్ ఆశ్చర్యంగా జాన్వీ వైపు చూశారు. ఆమె సమాధానంతో నటుడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉందన్న విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో చాలాసార్లు జాన్వీ కపూర్, శిఖర్ పహారియా జంటగా చాలాసార్లు కనిపించారు. కానీ తమ రిలేషన్‌పై ఎక్కడా స్పందించలేదు. కాగా.. శిఖర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. 'కాఫీ విత్ కరణ్ సీజన్ 8' ఫుల్ ఎపిసోడ్ జనవరి 4న ఓటీటీ ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. -
బ్లాక్‌బస్టర్ మూవీ.. క్యాన్సర్ వల్ల వదిలేసుకున్న హీరోయిన్!
సినీ ఇండస్ట్రీలో దీర్ఘకాలం కొనసాగడం హీరోలకు చాలా మామూలు విషయం. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా ఉండదు. వరుస ఫ్లాపులు వచ్చినా, వయసు మీదపడ్డ ఛాయలు కనిపించినా, శరీరాకృతిలో మార్పులు వచ్చినా వెంటనే రిజెక్ట్ చేస్తారు. స్టార్ హీరోయిన్గా కీర్తి అందుకున్నా సరే కొద్దికాలానికే తెరమరుగు అవుతుంటారు. కానీ కొందరే తమకు ఎదురయ్యే ఆటంకాలను దాటుకుని ఎక్కువ కాలంపాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అలాంటివారిలో సీనియర్ హీరోయిన్ షర్మిల ఠాగూర్ ఒకరు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటిగా కొనసాగిన ఈమె ఇటీవలే గుల్మొహర్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ పాత్ర షర్మిల చేయాల్సింది తాజాగా హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే 'కాఫీ విత్ కరణ్' షోకి హాజరైన షర్మిల తాను క్యాన్సర్‌తో పోరాడిన విషయాన్ని బయటపెట్టింది. ముందుగా యాంకర్, నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ.. 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాలో షబానా అజ్మీ పోషించిన పాత్ర షర్మిల చేయాల్సింది. ముందు తననే అడిగాను. కానీ తన అనారోగ్య కారణాల వల్ల ఆమె చేయనని చెప్పింది. తనతో పని చేయలేకపోయానన్న బాధ మాత్రం నాకు అలాగే ఉండిపోయింది' అన్నాడు కరణ్. క్యాన్సర్‌తో పోరాడిన సీనియర్ హీరోయిన్ దీనికి షర్మిల స్పందిస్తూ.. 'తను నాకు సినిమా ఆఫర్ ఇచ్చినప్పుడు కరోనా పీక్స్‌లో ఉంది. నేను వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. పైగా అప్పుడే నేను క్యాన్సర్ నుంచి కోలుకున్నాను. అందుకే నేను రిస్క్ చేయడానికి నా ఫ్యామిలీ ఒప్పుకోలేదు' అని చెప్పుకొచ్చింది. తాను ఎప్పుడు క్యాన్సర్ బారిన పడింది? ఎలా కోలుకుంది? అన్న విషయాలనేమీ వివరించలేదు. ఆమె క్యాన్సర్‌తో పోరాడిన విషయం తెలిసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. సత్తా చాటిన హీరోయిన్ కాగా ఈమె సత్యజిత్ రే 'ద వరల్డ్ ఆఫ్ అపు' అనే బెంగాలీ సినిమాతో 14 ఏళ్ల వయసులోనే వెండితెర ప్రవేశం చేసింది. కొంతకాలానికే బాలీవుడ్లో ప్రవేశించి అక్కడా జెండా పాతింది. ఆరాధన, మౌసమ్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన షర్మిల ఇటీవలే గుల్మొహర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి సైఫ్, సోహ, సబ అని ముగ్గురు సంతానం. సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ ప్రభుత్వం షర్మిలను 2013లో పద్మభూషణ్‌తో సత్కరించింది. చదవండి: నల్లగా ఉన్నాడని హేళన.. ఏడాదిలో 18 సినిమాలు -
లైగర్ హీరోయిన్‌తో బ్రేకప్‌పై స్పందించిన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే- షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ విడిపోయినట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఖాళీ పీలి సినిమా నుంచి మొదలైన వారి డేటింగ్ జర్నీ ముగిసినట్లు తెలుస్తుంది. గతంలో పార్టీలకు, ఫంక్షన్లకు, ట్రిప్పులకు, టూర్లకు కలిసి వెళ్తూ హడావుడి చేసిన జంట తాజాగా బ్రేకప్ చెప్పేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఇదే విషయాన్ని అనన్య పాండే ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ ఇషాన్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఇషాన్ ఖట్టర్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అనన్యతో నువ్వు విడిపోయావు కదా అని కరణ్ ప్రశ్నించగా ప్రస్తుతానికి తాను సింగిల్ అని పేర్కొన్నాడు. మరిప్పుడు అనన్యతో స్నేహంగా ఉంటున్నారా అని అడగ్గా నా జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నా. నాకు తెలిసిన వాళ్లలో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అనన్య అని చెప్పాడు. -
మలైకాతో పెళ్లికి రెడీగా లేను.. అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. సినిమాల కంటే డేటింగ్ వార్తలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఈ జంట. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ ప్రేమపక్షలు పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. ఈ వార్తలపై అర్జున్ కపూర్ ఆసక్తికర రీతిలో స్పందించారు. పాపులర్ షో కాఫీ విత్ కరణ్ షోకి గెస్ట్‌గా వచ్చిన అర్జున్ కపూర్ మలైకాతో ప్రేమ, పెళ్లి విషయాలపై స్పందించాడు. 'నేను మలైకాను ఇప్పుడే పెళ్లి చేసుకునేందుకు రెడీగా లేను. కోవిడ్ లాక్డౌన్ కారణంగా రెండేళ్లు సినిమాలు లేక అలా సమయం గడిచిపోయింది. ఇప్పుడు నేను నా కెరీర్ మీద దృష్టిపెట్టాలని అనుకుంటున్నా. నా పని నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను సంతోషంగా ఉంటేనే నా భాగస్వామిని సంతోషపెట్టగలను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేమీ లేవు' అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం అర్జున్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా నిర్దోషులు
'కాఫీ విత్ కరణ్' షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీమిండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలకు ఊరట లభించింది. వీరితో పాటు షో హోస్ట్, ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌కు కూడా ఈ కేసు నుంచి విముక్తి లభించింది. ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేలుస్తూ జోధ్‌పూర్ హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. 2018లో కాఫీ విత్ కరణ్ సీజన్ 6 సందర్భంగా షో హోస్ట్ కరణ్ జోహర్ అడిగిన అభ్యంతరకర ప్రశ్నలకు (సెక్స్ లైఫ్) రాహుల్, పాండ్యాలు వ్యంగ్యమైన సమాధానాలు చెప్పారు. ఇందుకు గాను వీరు తగిన మూల్యమే చెల్లించుకున్నారు. అప్పట్లో వీరిద్దరు తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు. బీసీసీఐ ఈ ఇద్దరిని అర్ధంతరంగా ఆసీస్ పర్యటన నుంచి వెనక్కు పంపించేసింది. అంతటితోనే ఆగకుండా వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. ఈ విషయమై డాక్టర్ మేఘ్వాల్.. రాహుల్, హార్థిక్ సహా కరణ్ జోహర్‌లపై జోధ్‌పూర్‌లోని లునీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాదాపు మూడేళ్ల పాటు సాగిన ఈ కేసులో తాజాగా తీర్పు వెలువడింది. ఆ ముగ్గురు ఉద్దేశపూర్వకంగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని కోర్టు ఈ కేసును కొట్టేసింది. కాగా, ప్రస్తుతం కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు టీమిండియాలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. పాండ్యా ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాలో భాగంగా ఉంటే, ఇటీవలే గాయం నుంచి కోలుకుని రాహుల్ ఆసియా కప్‌కు సిద్ధంగా ఉన్నాడు. చదవండి: IND vs WI: విండీస్‌తో మూడో టీ20.. శ్రేయస్ అవుట్! హుడాకు ఛాన్స్! -
Koffee With Karan: నాగ చైతన్యతో విడాకులు, భరణంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సమంత-నాగ చైతన్య విడాకులు ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వీరి విడాకులకు గల కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఇందులో ఎక్కువగా సమంత తప్పే ఉందని మొదట్లో అందరు ఆమెను నిందించారు. అంతేకాదు సమంత నాగ చైతన్య నుంచి రూ. 250 కోట్లు భరణం తీసుకుందని కూడా ప్రచారం జరిగింది. ఇందులో నిజం లేదని సామ్ అప్పుడే స్పష్టం చేసింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. తాజాగా ఓ షోలో సమంతకు ఇదే ప్రశ్న ఎదురైంది. బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్‌ల హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సమంతకు విడాకులు, రూ. 250 కోట్ల భరణం వంటి విషయాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. హోస్ట్ కరణ్ జోహార్ తనని వ్యక్తిగతమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టను అంటూనే విడాకులపై ప్రశ్నించాడు. దీనికి సామ్ ‘మా విడాకులు అంత సామరస్యంగా జరగలేదు. డైవర్స్ తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. విడాకులు తీసుకున్న కొత్తలో చాలా బాధపడ్డాను. జీవితం చాలా కఠినంగా అనిపించింది. చదవండి: ‘థ్యాంక్యూ’ మూవీ ట్విటర్ రివ్యూ కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాను. మునుపటి కంటే ఇప్పుడే మరింత బలంగా మారాను. ప్రస్తుతం నా పని నేను చేసుకుంటున్నాను. అయితే విడాకుల తర్వాత ఇద్దరం ఒకరిపై ఒకరం తీవ్ర మనోవేదనకు గురయ్యాం’ అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే రూ. 250 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ‘నేను రూ.250 కోట్లు తీసుకున్నట్లు చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఈ పుకార్లు వచ్చినప్పుడు నా ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేస్తారేమో అని ఎదురుచూశా’ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. -
సమంతను ఎత్తుకొచ్చిన అక్షయ్, ఊ అంటావా పాటకు డ్యాన్స్..
పుష్ప ఎన్నో రికార్డులను తిరగరాస్తూ బాలీవుడ్‌ను షేక్ చేసిందీ మూవీ. సినిమానే కాదు పాటలు కూడా ప్రజలను ఓ ఊపు ఊపాయి. మరీ ముఖ్యంగా అందులో ఊ అంటావా మావా పాటకు సామాన్యులే కాదు బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా అయ్యారు. మొట్టమొదటిసారిగా ఐటం సాంగ్‌లో నటించిన సమంతకు ఎనలేని ప్రశంసలు దక్కాయి. తాజాగా సామ్ మరోసారి ఊ అంటావా సాంగ్‌కు స్టెప్పులేసింది. కాకపోతే ఈసారి అక్షయ్ కుమార్‌తో! కాఫీ విత్ కరణ్ 7వ సీజన్లో సామ్, అక్షయ్ కలిసి ఓ ఎపిసోడ్లో పాల్గొన్నారు. ఈ మేరకు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో అక్షయ్.. సామ్‌ను ఎత్తుకుని స్టేజీ మీదకు తీసుకొచ్చారు. ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా అంటూ సామ్, అక్షయ్ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీళ్ల జోడీ అదిరిందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఏడ్చినట్లుంది, ముందు ఆమెను కిందకు దించు అని విసుక్కుంటున్నారు. ఏదేమైనా మా సామ్ మాత్రం ఎప్పటిలాగే తన క్యూట్‌నెస్‌తో అదిరిపోయిందని మురిసిపోతున్నారు సామ్ ఫ్యాన్స్. We can’t wait to see this quirky pair team up on the Koffee couch! ☕️ Get ready for episode 3 of #HotstarSpecials #KoffeeWithKaran#HotstarSpecials #KoffeeWithKaranS7 now streaming @karanjohar @akshaykumar @Samanthaprabhu2 @apoorvamehta18 @aneeshabaig @jahnvio @Dharmatic_ pic.twitter.com/phw0io4FYO — Disney+ Hotstar (@DisneyPlusHS) July 19, 2022 Akki-Sam rock ❤️🔥❤️🔥 pic.twitter.com/QnAiLhw1Jh — 𝑓𝑢𝑛𝑡𝑎𝑠𝑡𝑖𝑐_𝑎𝑘𝑘𝑖𝑤𝑜𝑟𝑙𝑑 (@Akkiworld1) July 20, 2022 చదవండి: లలిత్ మోదీతో డేటింగ్, సుష్మితా సేన్‌కు సెల్యూట్ చేయాల్సిందే! -
విజయ్‌తో డేట్‌కి వెళ్తానన్నా సారా.. లైగర్ రియాక్షన్ చూశారా!
‘రౌడీ’ విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తానంటూ మనసులో మాట బయటపెట్టింది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్. సారా కామెంట్స్‌పై విజయ్ దేవరకొండ ఆసక్తిగా స్పందించాడు. ఈ మేరకు.. సారాతో పాటు జాన్వీ కపూర్‌కు సైతం గట్టి హగ్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేశాడు విజయ్. కాగా సారా అలీ ఖాన్, జాన్వి కపూర్లు ఇండస్ట్రీలో మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఈ మేరకు వారిద్దరు తాజా కాఫీ విత్ కరణ్ జోహార్ సీజన్-7లో సందడి చేశారు. ఈ వీకెండ్లో ప్రసారమయ్యే ఈ షో ప్రోమోను తాజాగా హాట్‌స్టార్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ‘నువ్వు ఎవరితోనైనా డేట్‌కు వెళ్లాలనుకుంటున్నావా? అతను ఎవరు?’ అని ప్రశ్నిస్తాడు హోస్ట్ కరణ్. దీనికి సారా సిగ్గు పడుతూ విజయ్ దేవరకొండ అంటూ సమాధానం ఇస్తుంది. ‘నువ్వు కూడా విజయ్‌తోనేనా!’ అని కరణ్ జాన్వీతో అంటాడు. ఆ వెంటనే సారా అలీ ఖాన్ స్పందిస్తూ ‘ఏంటీ నువ్వు విజయ్‌ని ఇష్టపడుతున్నావా?’ అని జాన్విని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇలా సాంతంగా ఈ ప్రోమోను విజయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. దీనికి విజయ్ ‘నాపై ఇంతటి అభిమానం చూపిస్తున్న మీకు నా గట్టి హగ్, ప్రేమ పంపిస్తున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా విజయ్ అంటే క్రష్ అని గతంలో పలుమార్లు సారా, జాన్వీలు తమ మనసులో మాట చెప్పిన సంగతి తెలిసిందే. తనదైన నటన, మ్యానరిజంతో విజయ్ దేవరకొండ టాలీవుడ్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక లైగర్ మూవీతో విజయ్ బాలీవుడ్‌కు సైతం పరిచయం కాబోతున్నాడు. అక్కడ కూడా తనదైన సైల్తో విజయ్ బి-టౌన్ హీరోయిన్ల మనసును కొల్లగోడుతున్నాడు. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
ఆరేళ్ల రిలేషన్.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది: ఆలియా
ఆరేళ్లు ప్రేమలో మునిగి తేలిన బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్లు ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎప్రీల్ 14న ఇరు కటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఈ జంట వివాహం ఘనంగా జరిగింది. ఇక పళ్లయిన రెండు నెలలకే ఆలియా ప్రెగ్నెన్సీని ప్రకటించి ఫ్యాన్స్‌కు శుభవార్త అందించింది. ఇదిలా ఉంటే రణ్‌బీర్, ఆలియా ప్రేమయాణంపై ఫ్యాన్స్‌కు ఎంతో ఆసక్తిగా ఉంటారు. బ్రహ్మస్త్రకు ముందు అసలు కలిసి నటించిన ఈ జంట మధ్య పరిచయం, ప్రేమ ఎలా మొదలైందా అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహమే. చదవండి: నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు అయితే తాజాగా ఓ షో పాల్గొన్న ఆలియా తమ ప్రేమ ఎక్కడ ఎప్పుడు మొదలైందనే దానిపై నోరు విప్పింది. తాజాగా ఆమె తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్ 7వ సీజన్లో హీరో రణ్వీర్ సింగ్‌తో కలిసి సందడి చేసింది. తమ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ సోకు తొలి గెస్ట్స్‌గా వచ్చిన ఆలియా ఈ సందర్భంగా తన లవ్, మ్యారేజ్ లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నప్పటి నుంచే రణ్‌బీర్ అంటే క్రష్ అని గతంలో పలుమార్లు ఆలియా చెప్పిన సంగతి తెలిసిందే. కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఆలియా-రణ్‌బీర్ ఎప్పుడు తమ అభిప్రాయాలను పంచుకోలేదని చెప్పంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రహ్మస్త్రం షూటింగ్ సమయంలోనే వీరిద్దరి ప్రేమ బలపడిందని చెప్పింది. చదవండి: నటి సాయి పల్లవికి హైకోర్టులో ఎదురుదెబ్బ ‘షూటింగ్ కోసం మేము ఒకే విమానంలో ప్రయాణిస్తున్నాం. అప్పుడు రణ్వీర్ సీటు సరిగా లేదు. దీంతో నా పక్కన వచ్చి కుర్చున్నాడు. అప్పుడు మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒకరి అభిప్రాయలను ఒకరం షేర్ చేసుకున్నాం. దీంతో అప్పుడే డిసైడ్ అయ్యాం. మా ఈ లాంగ్ రిలేషన్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పుకొచ్చింది. అయితే అంతకు ముందేప్పుడు వారిద్దరు నేరుగా ప్రపోజ్ చేసుకోలేదు కానీ ఒకరిపై ఒకరు ఇష్టంతో ఉన్నామని పేర్కొంది. కాగా ఈ రియల్ కపుల్ జంటగా నటించిన తొలి చిత్రం బ్రహ్మస్త్రం. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. -
నా చేతుల్లో ఏమీ లేకపోయింది: హార్దిక్
న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిషేధానికి గురైన విషయం తెలిసిందే. నాడు అతనితో పాటు ఉన్న సహచరుడు లోకేశ్ రాహుల్‌కు కూడా బోర్డు శిక్ష విధించింది. అయితే ఇప్పుడు మళ్లీ నాటి ఘటనపై పాండ్యా స్పందించాడు. ఏం జరిగిందో తాను అర్థం చేసుకోనేలోపే అంతా చేయిదాటిపోయిందని అతను గుర్తు చేసుకున్నాడు. ‘మేం క్రికెటర్లం మాత్రమే. షో తర్వాత ఏం జరగవచ్చో ఊహించలేకపోయాం. ఆ పరిస్థితిలో బంతి నా కోర్టులో లేదు. నిర్ణయం తీసుకోగలిగే మరొకరి చేతుల్లో ఉంది. సరిగ్గా చెప్పాలంటే మనపై మాటల దాడికి అవకాశం ఉన్న వేదిక అది. ఎవరూ అక్కడ ఉండాలని కోరుకోరు’ అని పాండ్యా అన్నాడు. -
‘ఇక చాలు.. వివాదానికి ముగింపు పలుకుదాం’
ముంబై: ‘కాఫీ విత్ కరణ్’ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లకు ఊరట కలిగించే వార్త. కీలక ప్రపంచకప్‌కు ముందే ఈ వివాదానికి ముగింపు పలకాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఈ వివాదంపై వ్యక్తిగతంగా హాజరుకావాలని పాండ్యా, రాహుల్‌లకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్9న పాండ్యా, ఆ తర్వాతి రోజు రాహుల్‌లు జైన్‌కు వివరణ ఇవ్వనున్నారు. కీలక ఐపీఎల్, ప్రపంచకప్ దృష్ట్యా ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేయకూడదనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వారు క్షమాపణలు తెలిపారని, అంతేకాకుండా కొద్ది రోజులు క్రికెట్ ఆడకుండా నిషేధానికి గురైన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడితేనే అందరికీ మంచిదని బోర్డు భావిస్తోంది. అసలేం జరిగిందంటే.. ‘కాఫీ విత్ కరణ్’ షోకి హాజరైన హార్దిక్, రాహుల్.. అమ్మాయిలు, డేటింగ్ గురించి వివాదాస్పదంగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ పాలకుల కమిటీ ఆ ఇద్దరిపై ఈ ఏడాది జనవరిలో కొద్దిరోజులు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. కానీ.. రెండు వారాల వ్యవధిలోనే ఆ నిషేధాన్ని ఎత్తివేసిన కమిటీ.. బీసీసీఐ అంబుడ్స్‌మన్ నియామకం తర్వాత విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు.. బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా డీకే జైన్‌ని నియమించింది. తాజాగా జైన్ సారథ్యంలోని కమిటీ హార్దిక్, రాహుల్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. (చదవండి: పాండ్యా, రాహుల్‌లకు బీసీసీఐ నోటీసులు) -
పాండ్యా, రాహుల్‌లకు బీసీసీఐ నోటీసులు
సాక్షి, ముంబై: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కామెంట్స్ మరోసారి తెరపైకిరానున్నాయి. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి హాజరైన హార్దిక్, రాహుల్.. అమ్మాయిలు, డేటింగ్ గురించి వివాదాస్పదంగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ పాలకుల కమిటీ ఆ ఇద్దరిపై ఈ ఏడాది జనవరిలో కొద్దిరోజులు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. కానీ.. రెండు వారాల వ్యవధిలోనే ఆ నిషేధాన్ని ఎత్తివేసిన కమిటీ.. బీసీసీఐ అంబుడ్స్‌మన్ నియామకం తర్వాత విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు.. బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా డీకే జైన్‌ని నియమించింది. తాజాగా జైన్ సారథ్యంలోని కమిటీ హార్దిక్, రాహుల్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. దీంతో హార్దిక్(ముంబై ఇండియన్స్), రాహుల్(కింగ్స్ పంజాబ్)లు ఐపీఎల్లో పలు మ్యాచ్‌లు గైర్హాజరీ అయ్యే అవకాశం ఉండటంతో వారు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చిస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే కీలక ఐపీఎల్, ప్రపంచకప్‌లకు ముందు ఈ వివాదం మరోసారి తెరలేవడం ఆ ఇద్దరి ఆటగాళ్లకు ఇబ్బంది కలిగించే విషయమే. ఇక బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా, ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుడిగా సౌరవ్ గంగూలీ విరుద్ద ప్రయోజనాలకు పాల్పడుతున్నాడన్న ఫిర్యాదుపై కూడా విచారణ కోనసాగుతోందని జైన్ తెలిపారు. (చదవండి: వివాదానికి ముందు... వివాదానికి తరువాత...) -
పాండ్యా, రాహుల్‌లపై కేసు నమోదు
జోద్పూర్ : ‘కాఫీ విత్ కరణ్ షో’ లో చేసిన అనుచిత వ్యాఖ్యల సెగ టీమిండియా యువ క్రికెటర్లు హర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లను ఇప్పట్లో వదిలేలా లేదు. ఒళ్లు మరిచి మహిళల పట్ల చేసిన అసభ్యకర కామెంట్స్‌కు ఇప్పటికే తగిన మూల్యం చెల్లించుకున్న ఈ యువ క్రికెటర్ల కష్టాల కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పాండ్యా, రాహుల్‌తో పాటు షో నిర్వాహకుడు, కరణ్ జోహర్‌లపై కేసు నమోదైంది. మహిళలను కించపరిచేలా జుగుప్సాకరంగా మాట్లాడిన పాండ్యా, రాహుల్‌తో పాటు షో నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్తాన్ చెందిన డీఆర్ మెఘవాల్ అనే వ్యక్తి జోద్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పాండ్యా, రాహుల్‌ల వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో నిరవధిక నిషేధం విధిస్తూ బీసీసీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి ఆటగాళ్లను ఆస్ట్రేలియా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించింది. తొలుత క్రికెట్ పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టాలని భావించినా, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టడంతో వీరిద్దరిపై నిరవధిక నిషేధాన్ని విధించారు. కొన్ని రోజుల నాటకీయ పరిణామాల అనంతరం పాండ్యా, రాహుల్‌లపై సీఓఏ నిషేధాన్ని ఎత్తివేసింది. అనంతరం పాండ్యా న్యూజిలాండ్ పర్యటనలో పాల్గొని చెలరేగగా.. రాహుల్ భారత్-ఏ జట్టు తరపున ఇంగ్లండ్ బ్లూ జట్టుతో ఆడుతున్నాడు. ఈ వివాదంతో తీవ్రంగా కలత చెందిన పాండ్యా తన కసిని మైదానంలో చూపించాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో అదరగొట్టి ఆల్‌రౌండర్‌గా తన సత్తాను చాటాడు. ఈ నేపథ్యంలో ముగిసిపోయిందనుకున్న ఈ వివాదంపై మళ్లీ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఇది ప్రపంచకప్‌లో పాల్గొనబోయే పాండ్యా ఆటపై ప్రభావం చూపుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కరణ్ షోతో పాండ్యా చాలా డిస్టర్బ్ అయ్యాడు
సాక్షి, ముంబై: ‘కాఫీ విత్ కరణ్ షో’లో తాను మాట్లాడిన మాటలు వివాదానికి దారితీయడంతో హార్దిక్ పాండ్యా చాలా డిస్టర్బ్ అయ్యాడని అతడి మెంటర్, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరే తెలిపారు. ఆ షోలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడని వివరించాడు. ప్రస్తుతం పాండ్యా టీమిండియా కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని మోరే తెలిపాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ మోరే మాట్లాడుతూ.. ‘ఆ షోలో పాండ్యా కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడాడు. కానీ పాండ్యా స్వభావం, వ్యక్తిత్వం అటువంటిది కాదు. పొరపాట్లనేవి ప్రతీ ఒక్కరి జీవితంలో సహజం. దీనిపై ఇప్పటికే బీసీసీఐకి, మహిళలకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం అన్ని వివాదాలు తొలిగిపోయాయి. పాండ్యాకు ఇప్పుడు క్రికెట్ గురించి తప్ప వేరే ధ్యాసే లేదు. ప్రపంచకప్‌లో టీమిండియాకు పాండ్యా అదనపు బలం. కేఎల్ రాహుల్ కూడా తన పొరపాట్లను సరిదిద్దుకున్నాడు. జట్టులోకి త్వరలోనే తిరిగొస్తాడని భావిస్తున్నా (తొలిసారి బరిలో పాండ్యా బ్రదర్స్!) ప్రపంచకప్‌లో పాండ్యా తప్పకుండా ఉంటాడు ఇంగ్లండ్ వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ప్రపంచకప్‌లో టీమిండియానే ఫేవరేట్. అయితే భారత ప్రపంచకప్ జట్టులో పాండ్యా తప్పకుండా స్థానాన్ని సంపాదిస్తాడు. పాండ్యాతోనే టీమ్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడంలో పాండ్యా దిట్ట, అదేవిధంగా బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. దీంతో ప్రపంచకప్‌లో టీమిండియా ప్రధాన ఆటగాడు పాండ్యా అనడంలో ఎలాంటి సందేహం లేదు.’అంటూ కిరణ్ మోరే పాండ్యా గురించి పలు విషయాలు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. కాఫీ విత్ కరణ్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి ఆటగాళ్లను ఆస్ట్రేలియా పర్యటన నుంచి మొదట్లో అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించి విచారణ చేపట్టారు. తొలుత క్రికెట్ పరిపాలక కమిటీ (సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్ రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టాలని భావించినా, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టారు. దీంతో వీరిద్దరిపై నిరవధిక నిషేధాన్ని విధించారు. కొన్ని రోజుల నాటకీయ పరిణామాల అనంతరం పాండ్యా, రాహుల్‌లపై సీవోఏ నిషేధాన్ని ఎత్తివేసింది. (పాండ్యా.. బంతిని కరణ్ అనుకున్నావా?) -
ఓవర్ రియాక్ట్ కావొద్దు ప్లీజ్ : రాహుల్ ద్రవిడ్
సాక్షి, బెంగుళూరు : పాండ్యా, కేఎల్ రాహుల్ వివాదంపై టీమిండియా మాజీ కెప్టెన్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. ఈ వివాదంపై ఓవర్ రియాక్ట్ కావొద్దంటూ సూచించారు. మైదానంతోపాటు బయట ఉండే సవాళ్లపట్ల ఆటగాళ్లకు చక్కని అవగాహన కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. చాలా ఏళ్లుగా ఇండియా ఏ, అండర్ 19 క్రికెట్లో ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆటగాళ్ల ప్రవర్తనపై నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ట్రైనింగ్ ఉంటుందని అన్నారు. తీరికలేని షెడ్యూల్ వల్ల టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఈ కార్యక్రమానికి ఎక్కువగా హాజరుకాలేక పోతున్నారని చెప్పారు. కాగా, ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో మహిళలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్, కేఎల్ రాహుల్ జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ‘గతంలో ఆటగాళ్లెవరూ ఇలాంటి పొరపాట్లు చేయలేదని కాదు. వర్క్‌షాప్‌లు నిర్వహించి అవగాహన కల్పించినంత మాత్రాన మళ్లీ అటువంటి ఘటనలు జరగవని కాదు. కానీ, పాండ్యా, రాహుల్ వివాదం మాదిరిగా ఏవైనా జరిగినప్పుడు ఓవర్ రియాక్ట్ కావొద్దు. వివాదాస్పద వ్యాఖ్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తపడాలి కానీ, ఘటన జరిగిన తర్వాత వకాల్తా పుచ్చుకొని ఇష్టారీతిన కామెంట్లు చేయొద్దు’ అని ద్రవిడ్ సూచించాడు. గతంలో చోటుచేసుకున్న పొరపాట్ల గుర్తెరిగి ఆటగాళ్లు మసలుకోవాలి. భారత ఆటగాడిగా తమపై ఉన్న గురుతర బాధ్యతల్ని ప్రతి ఒక్క ఆటగాడు మరువకూడదు’ అని ద్రవిడ్ మీడియాతో అన్నారు. ఒక్కో ఆటగాడు ఒక్కో నేపథ్యం నుంచి జట్టులోకి వస్తాడని, వ్యవస్థను తప్పుబట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. కర్ణాటక సీనియర్ ఆటగాళ్లు, తల్లిదండ్రులు, పెద్దల నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. చుట్టూ ఉన్నవారిని గమనించి మంచి విషయాలు అలవర్చుకున్నానని, తనకు మరెవరో వచ్చి పాఠాలు చెప్పేలా ఎప్పుడూ ప్రవర్తించనని వెల్లడించారు. -
మేం సింగిల్
ప్రజంట్ టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో ప్రభాస్, రానా టాప్‌లో ఉంటారు. కానీ వీళ్ల రిలేషన్షిప్ స్టేటస్‌ల మీద ఫ్యాన్స్‌కు సరైన క్లారిటీ లేదు. అనుష్కతో ప్రభాస్ రిలేషన్షిప్లో ఉన్నారని చాలా వార్తలే వచ్చాయి. ఏకంగా పెళ్లి ఫిక్స్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వార్త హల్ చల్ చేసింది. రానా విషయానికొస్తే... అప్పుడప్పుడూ ఎవరో ఒక హీరోయిన్‌తో లింక్ పెట్టి వార్తలు వస్తుంటాయి. అయితే ఈ ఇద్దరూ ‘మేం సింగిల్’ అన్నట్లుగానే సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ‘కాఫీ విత్ కరణ్’ షోలోనూ అదే అన్నారు. ఈ షోలో రాజమౌళి, ప్రభాస్, రానా పాల్గొన్నారు. జనరల్‌గా ఈ షోలో ఎలాంటి మొహమాటం లేకుండా నేరుగా ప్రశ్నలు సంధించేస్తారు కరణ్. అదే విధంగా.. మీరు, త్రిష రిలేషన్షిప్లో ఉండేవారట? అని రానాని అడగ్గా – ‘‘మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. కొన్ని రోజులు డేటింగ్ కూడా చేశాం. ప్రస్తుతానికి నేను సింగిలే’’ అని సూటిగా సమాధానం చెప్పేశారు. అలాగే ప్రభాస్‌ను మీరు అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నారట కదా అని అడగ్గానే– ‘‘అనుష్క నాకు 8 ఏళ్లుగా తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్. వరుసగా కలసి సినిమాలు చేసేసరికి ఇలాంటి వార్తలు వస్తుంటాయి. అందులో వాస్తవం లేదు. నేనింకా సింగిలే’’ అని సమాధానమిచ్చారు ప్రభాస్. మరి తెలుగులో ఎవరు సెక్సియస్ట్ హీరోయిన్ అన్న ప్రశ్నకు అనుష్క పేరు చెప్పారు ప్రభాస్. ఆ వెంటనే.. ఈ సమాధానానికి, మా గురించి ప్రచారమవుతున్న రూమర్కీ సంబంధం లేదని ప్రభాస్ నవ్వేశారు. ఇక.. రానా, ప్రభాస్ ఇద్దరిలో రానాకే త్వరగా పెళ్లి అవుతుంది. ప్రభాస్ పెళ్లి లేట్ అవ్వడానికి కారణం తన బద్ధకమే అని రాజమౌళి పేర్కొనడంతో అందరూ హాయిగా నవ్వుకున్నారు. ప్రొఫెషనల్‌గా మీ విజన్‌తో పోటీగల బాలీవుడ్ దర్శకుడు ఎవరైనా ఉన్నారా? అని రాజమౌళిని కరణ్ అడగ్గా – ‘లేరు’ అని సమాధానమిచ్చారు. అలాగే రజనీకాంత్, కమల్హాసన్లలో ఎవర్ని డైరెక్ట్ చేయాలని ఉంది? అనే ప్రశ్నకు – ‘‘రజనీకాంత్’’ అన్నారు రాజమౌళి. బాలీవుడ్ ఖాన్స్‌లో ఎవరిష్టం అన్న ప్రశ్నకు ‘సల్మాన్ ఖాన్’ పేరు చెప్పారు రాజమౌళి. -
త్రిషతో డేటింగ్ చేశాను కానీ..
ఇదివరకు ఏ ఇంటర్వ్యూలో వెల్లడించని పలు అంశాలను బాహుబలి టీమ్ కాఫీ విత్ కరణ్ షోలో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ షోలో పాల్గొన్న రాజమౌళి, ప్రభాస్, రానాల ముందు కరణ్ పలు ఆసక్తికర ప్రశ్నలు ఉంచారు. అంతేకాకుండా కొన్ని ప్రశ్నలతో వారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రభాస్, రానా, రాజమౌళి మాత్రం కరణ్ ప్రశ్నలకు తమదైన రీతిలో సమాధానలిచ్చారు. ముఖ్యంగా ప్రభాస్, రానాల పెళ్లి గురించి షోలో ఆసక్తికర సంభాషణ సాగింది. మీరు ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారా అని కరణ్ రానాను ప్రశ్నించారు. దీనికి తాను సింగిల్ అని సమాధానమిచ్చారు. వెంటనే కరణ్ త్రిషతో రిలేషన్షిప్ గురించి ప్రస్తావించారు. దానిని తోసిపుచ్చిన రానా.. చాలా కాలంగా తామిద్దరం స్నేహితులుగా ఉన్నామని తెలిపారు. ఆమెతో దశాబ్ధ కాలంగా స్నేహం చేస్తున్నాను. చాలా కాలంగా స్నేహితులుగా కొనసాగాం.. కొంతకాలం డేటింగ్ కూడా చేశాం. కానీ పరిస్థితులు అనుకూలించలేద’ని తెలిపారు. పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం రావాలన్నది తన అభిప్రాయమన్నారు. రానా పెళ్లిపై రాజమౌళి స్పందిస్తూ.. రానా ఓ స్ట్రక్చర్ ప్రకారం ముందుకు వెళ్తున్నాడని.. ఏ వయస్సులో ఏది చేయాలో అది చేస్తాడని తెలిపారు. అందులో పెళ్లి అనే అంశం కూడా ఉందని పేర్కొన్నారు. కాగా, చాలా కాలంగా రానా, త్రిషల బంధం గురించి పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. -
‘అందుకే ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదు’
కాఫీ విత్ కరణ్ సీజన్ 6లో పాల్గొన్న బాహుబలి త్రయం(ప్రభాస్, రానా, రాజమౌళిలు) పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి టెలికాస్ట్ అయిన కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో కరణ్ పలు ఆసక్తికర ప్రశ్నలను బాహుబలి టీమ్ ముందు ఉంచారు. ప్రభాస్, రానాల పెళ్లిపై.. ప్రభాస్, రానాల పెళ్లి ఎప్పుడని కరణ్ రాజమౌళిని ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదంటే.. అతడు చాలా లేజి, పెళ్లి చూపులు, వెడ్డింగ్ కార్డులు పంచడం, పెళ్లి వేడుక ఇదంతా చాలా టైమ్ తీసుకుంటుందని.. అదంతా ప్రభాస్ చేయలేడని సరదాగా వ్యాఖ్యానించారు. ఇవన్నీ కాకుండా ఓ అమ్మాయితో మూవ్ అన్ కావచ్చుగా అని కరణ్ అడగ్గా.. ప్రభాస్ అలా చేయడని.. మ్యారేజీ చేసుకోవడానికి మాత్రం లేజిగా ఫీల్ అవుతాడని తెలిపారు. రానా ఓ స్ట్రక్చర్ ప్రకారం ముందుకు వెళ్తున్నాడని.. ఏ వయస్సులో ఏది చేయాలో అది చేస్తాడని తెలిపారు. అందులో పెళ్లి అనే అంశం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రభాస్ చాలా ఫూడీ అని రాజమౌళి తెలిపారు. హైదరాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో పెద్ద పెద్ద పార్టీలు ఏర్పాటు చేయడానికి ప్రభాస్ ఇష్టపడతారని తెలిపారు. View this post on Instagram Who do you think will get married first? #KoffeeWithKaran #KoffeeWithTeamBaahubali A post shared by Star World (@starworldindia) on Dec 23, 2018 at 8:04am PST ఫిల్మ్ స్కూల్‌కు వెళ్లినట్టయింది.. ఇంతటి గొప్ప చిత్రానికి పనిచేయడం ఎలా అనిపించిందని కరణ్ ప్రశ్నించగా నాలుగేళ్లు ఫిల్మ్ స్కూల్‌కు వెళ్లినట్టుందని రానా సరదా సమాధానమిచ్చారు. బాహుబలి షూటింగ్‌లోనే తమ మూడు, నాలుగు బర్త్ డేలు కూడా జరిగాయని తెలిపారు. బాహుబలి ది బిగినింగ్ సినిమా విడుదల సమయంలో తాను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి ప్రభాస్ ఈ షోలో వెల్లడించారు. ‘ఈ సినిమా రిలీజ్ రోజు నా స్నేహితులకు ఓ విషయం చెప్పాను. సినిమా బ్లాక్బాస్టర్ రెస్పాన్స్ వస్తేనే నాకు ఫోన్ చేసి నిద్ర లేపమని, లేకుంటే వద్దని చెప్పాన’ని పేర్కొన్నారు. బాహుబలి హిందీలో తీసి ఉంటే.. అలాగే ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో బాహుబలి హిందీలో తీసి ఉంటే ఎవరిని నటీనటులుగా ఎంచుకునే వారని కరణ్ రాజమౌళిని ప్రశ్నించారు. దీనిపై రాజమౌళి స్పందిస్తూ.. అనుష్క పోషించిన దేవసేన పాత్రకు దీపికా పదుకోనె సరిపోయేదని తెలిపారు. అలాగే రానా, ప్రభాస్ క్యారెక్టర్ల విషయంలో మాత్రం ఆయన ఎవరి పేరు చెప్పలేదు. ఆ పాత్రల్లో వారిని తప్ప ఎవరిని ఊహించుకోలేనని స్పష్టం చేశారు. అనుష్కతో డేటింగ్‌పై.. ‘హీరో హీరోయిన్లు వరుసగా కలిసి పనిచేస్తే.. వారిద్దరికి లింక్ పెట్టేసి ప్రచారం చేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే అనుష్కతో డేటింగ్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదు. ఆమె నాకు మంచి స్నేహితురాలు మాత్రమే.. కావాలంటే రాజమౌళిని (సరదాగా) అడగండ’ని ప్రభాస్ తెలిపారు. -
విజయ్ దేవరకొండలా నిద్ర లేస్తానంటోన్న జాన్వీ!
అమ్మాయిల్లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భీమవరంలో జరిగిన ‘టాక్సీవాలా’ విజయ యాత్రలో ఆయన లేడీ ఫ్యాన్స్ స్కూటీలతో ర్యాలీ చేసిన ఫొటోలు వైరల్ అవడం ఇందుకు ఒక ఉదాహరణ. విజయ్ క్రేజ్ బాలీవుడ్‌కి కూడా చేరింది. విజయ్‌తో ఓ సినిమా చేయాలని ఉందని శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ చెప్పారు. కాఫీ విత్ కరణ్ షోలో అన్నయ్య అర్జున్ కపూర్‌తో కలిసి పాల్గొన్నారు జాన్వీ కపూర్. ఈ షోలో ‘సడన్‌గా ఓ మేల్ యాక్టర్లా ఓ రోజు నువ్వు నిద్ర లేవాలి అనుకుంటే ఎవరిని ఊహించుకుంటావు? అని జాన్వీని కరణ్ జోహార్ అడిగితే.. ‘‘విజయ్‌దేవర కొండలా నిద్రలేచి, నాతో సినిమా చేయమని అడుగుతాను’’ అన్నారు. జాన్వీ ఇలా అనగానే ‘అర్జున్‌రెడ్డి’ అని అర్జున్ కపూర్ అన్నారు. ‘‘ఇప్పుడు ఆ సినిమా రీమేక్ ‘కబీర్‌సింగ్’ లోనే షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. విజయ్ సెక్సీ’’ అని కరణ్ అన్నారు. ఏది ఏమైనా జాన్వీ నోటి నుంచి విజయ్ దేవరకొండ పేరు రావడంతో తెలుగు సినిమాల్లో నటించాలని ఈ యంగ్ హీరోయిన్‌కి ఉందని స్పష్టం అవుతోంది. ముఖ్యంగా విజయ్‌తో జోడీ కట్టాలనుకుంటున్నారని కూడా అర్థమైంది. మరి.. జాన్వీ ఊహ నెరవేరుతుందా? వేచి చూద్దాం. -
అప్పుడూ.. ఇప్పుడూ.. నా మాట ఒకటే!
‘‘స్టార్ కిడ్స్ ప్రభావంతో బాలీవుడ్లో కొత్తవారికి అవకాశాలు రావడం లేదు’’ అంటూ బంధుప్రీతిపై (నెపోటిజమ్) కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనమైన విషయం తెలిసిందే. ప్రముఖ హిందీ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా ఆమెను కొంతమంది నిందించారు. స్టార్ కిడ్స్ అయితే కంగనా మీద విరుచుకుపడ్డారు. ఓ నాలుగైదు రోజులు ఈ వివాదం సాగింది. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. అయితే, మళ్లీ కంగనా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇటీవల అనుపమ్ ఖేర్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా ‘‘బంధుప్రీతిపై నా మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉంటా. ఎప్పటికీ నా అభిప్రాయం మారదు’’ అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ కిడ్స్‌పై పెట్టిన శ్రద్ధ బయట వాళ్లపై చూపించడంలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి. -
ఐష్ నన్ను నన్నుగానే ఇష్టపడింది
తానో బాలీవుడ్ స్టార్‌నో.. లేదా బచ్చన్ కుటుంబం నుంచి వచ్చాననో ఐశ్వర్య తనను పెళ్ల చేసుకోలేదని, తనను తానుగానే ఇష్టపడిందని అభిషేక్ బచ్చన్ అన్నాడు. 'కాఫీ విత్ కరణ్' షోలో అభిషేక్ ఈ విషయం చెప్పాడు. భూ ప్రపంచంలోనే అత్యంత అందగత్తె అయిన ఐశ్వర్యా రాయ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా అభద్రతా భావంతో ఉన్నారా అని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ మాట చెప్పాడు. ఈ భూమ్మీద తనకు సంబంధించి ఐశ్యర్యే అత్యంత అందగత్తె అని, ప్రతిరోజూ అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు మాత్రం చాలా భయంగా అనిపిస్తుందని అన్నాడు. అందం విషయంలో ఆమెతో పోటీ పడగలిగే పరిస్థితి లేదని తెలిపాడు. అందుకే తామిద్దరం అంత మంచి జంట కాకపోవచ్చని కూడా వ్యాఖ్యానించాడు. అయితే, ఐశ్వర్యను మాత్రం ఈ విషయంలో ఆకాశానికి ఎత్తేశాడు. ఆమె చాలా సామాన్యంగా ఉంటుందని, అసలు అంత సాధారణంగా ఉంటుందని ఎవరూ అనుకోలేరని అభిషేక్ చెప్పాడు. తాను కూడా ఐశ్వర్యను అందగత్తె అని చూసి పెళ్లి చేసుకోలేదని, ఆమె మనసును చూసే పెళ్లి చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. అందుకే తామిద్దరి మధ్య అందం అనే సమస్య ఎప్పుడూ రాలేదని జూనియర్ బచ్చన్ చెప్పాడు. 2007లో పెళ్లి చేసుకున్న అభిషేక్, ఐశ్వర్య దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే.