ఐష్ నన్ను నన్నుగానే ఇష్టపడింది | Aishwarya did not marry me because I am star or I am a Bachchan, says abhishek bachchan | Sakshi
Sakshi News home page

ఐష్ నన్ను నన్నుగానే ఇష్టపడింది

Published Sat, Feb 15 2014 6:04 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఐష్ నన్ను నన్నుగానే ఇష్టపడింది - Sakshi

ఐష్ నన్ను నన్నుగానే ఇష్టపడింది

తానో బాలీవుడ్ స్టార్నో.. లేదా బచ్చన్ కుటుంబం నుంచి వచ్చాననో ఐశ్వర్య తనను పెళ్ల చేసుకోలేదని, తనను తానుగానే ఇష్టపడిందని అభిషేక్ బచ్చన్ అన్నాడు. 'కాఫీ విత్ కరణ్' షోలో అభిషేక్ ఈ విషయం చెప్పాడు. భూ ప్రపంచంలోనే అత్యంత అందగత్తె అయిన ఐశ్వర్యా రాయ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా అభద్రతా భావంతో ఉన్నారా అని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ మాట చెప్పాడు. ఈ భూమ్మీద తనకు సంబంధించి ఐశ్యర్యే అత్యంత అందగత్తె అని, ప్రతిరోజూ అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు మాత్రం చాలా భయంగా అనిపిస్తుందని అన్నాడు. అందం విషయంలో ఆమెతో పోటీ పడగలిగే పరిస్థితి లేదని తెలిపాడు. అందుకే తామిద్దరం అంత మంచి జంట కాకపోవచ్చని కూడా వ్యాఖ్యానించాడు.

అయితే, ఐశ్వర్యను మాత్రం ఈ విషయంలో ఆకాశానికి ఎత్తేశాడు. ఆమె చాలా సామాన్యంగా ఉంటుందని, అసలు అంత సాధారణంగా ఉంటుందని ఎవరూ అనుకోలేరని అభిషేక్ చెప్పాడు. తాను కూడా ఐశ్వర్యను అందగత్తె అని చూసి పెళ్లి చేసుకోలేదని, ఆమె మనసును చూసే పెళ్లి చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. అందుకే తామిద్దరి మధ్య అందం అనే సమస్య ఎప్పుడూ రాలేదని జూనియర్ బచ్చన్ చెప్పాడు.  2007లో పెళ్లి చేసుకున్న అభిషేక్, ఐశ్వర్య దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement