త్రిషతో డేటింగ్‌ చేశాను కానీ.. | Rana Daggubati Comments Over His Break Up With Trisha | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 24 2018 1:30 PM | Last Updated on Mon, Dec 24 2018 1:31 PM

Rana Daggubati Comments Over His Break Up With Trisha - Sakshi

ఇదివరకు ఏ ఇంటర్వ్యూలో వెల్లడించని పలు అంశాలను బాహుబలి టీమ్‌ కాఫీ విత్‌ కరణ్‌ షోలో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ షోలో పాల్గొన్న రాజమౌళి, ప్రభాస్‌, రానాల ముందు కరణ్‌ పలు ఆసక్తికర ప్రశ్నలు ఉంచారు. అంతేకాకుండా కొన్ని ప్రశ్నలతో వారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రభాస్‌, రానా, రాజమౌళి మాత్రం కరణ్‌ ప్రశ్నలకు తమదైన రీతిలో సమాధానలిచ్చారు. ముఖ్యంగా ప్రభాస్‌, రానాల పెళ్లి గురించి షోలో ఆసక్తికర సంభాషణ సాగింది. 

మీరు ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా అని కరణ్‌ రానాను ప్రశ్నించారు. దీనికి తాను సింగిల్‌ అని సమాధానమిచ్చారు. వెంటనే కరణ్‌ త్రిషతో రిలేషన్‌షిప్‌ గురించి ప్రస్తావించారు. దానిని తోసిపుచ్చిన రానా.. చాలా కాలంగా తామిద్దరం స్నేహితులుగా ఉన్నామని తెలిపారు. ఆమెతో దశాబ్ధ కాలంగా స్నేహం చేస్తున్నాను. చాలా కాలంగా స్నేహితులుగా కొనసాగాం.. కొంతకాలం డేటింగ్‌ కూడా చేశాం. కానీ పరిస్థితులు అనుకూలించలేద’ని తెలిపారు. పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం రావాలన్నది తన అభిప్రాయమన్నారు.

రానా పెళ్లిపై రాజమౌళి స్పందిస్తూ.. రానా ఓ స్ట్రక్చర్‌ ప్రకారం ముందుకు వెళ్తున్నాడని.. ఏ వయస్సులో ఏది చేయాలో అది చేస్తాడని తెలిపారు. అందులో పెళ్లి అనే అంశం కూడా ఉందని పేర్కొన్నారు. కాగా, చాలా కాలంగా రానా, త్రిషల బంధం గురించి పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement