
న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిషేధానికి గురైన విషయం తెలిసిందే. నాడు అతనితో పాటు ఉన్న సహచరుడు లోకేశ్ రాహుల్‌కు కూడా బోర్డు శిక్ష విధించింది. అయితే ఇప్పుడు మళ్లీ నాటి ఘటనపై పాండ్యా స్పందించాడు. ఏం జరిగిందో తాను అర్థం చేసుకోనేలోపే అంతా చేయిదాటిపోయిందని అతను గుర్తు చేసుకున్నాడు.
‘మేం క్రికెటర్లం మాత్రమే. షో తర్వాత ఏం జరగవచ్చో ఊహించలేకపోయాం. ఆ పరిస్థితిలో బంతి నా కోర్టులో లేదు. నిర్ణయం తీసుకోగలిగే మరొకరి చేతుల్లో ఉంది. సరిగ్గా చెప్పాలంటే మనపై మాటల దాడికి అవకాశం ఉన్న వేదిక అది. ఎవరూ అక్కడ ఉండాలని కోరుకోరు’ అని పాండ్యా అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment