Samantha Dance On Oo Antava Song With Akshay Kumar - Sakshi
Sakshi News home page

Samantha: ఊ అంటావా పాటకు అక్షయ్‌తో స్టెప్పులేసిన సామ్‌

Published Wed, Jul 20 2022 9:05 PM | Last Updated on Wed, Jul 20 2022 9:32 PM

Samantha Dance On Oo Antava Song With Akshay Kumar - Sakshi

పుష్ప ఎన్నో రికార్డులను తిరగరాస్తూ బాలీవుడ్‌ను షేక్‌ చేసిందీ మూవీ. సినిమానే కాదు పాటలు కూడా ప్రజలను ఓ ఊపు ఊపాయి. మరీ ముఖ్యంగా అందులో ఊ అంటావా మావా పాటకు సామాన్యులే కాదు బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా ఫిదా అయ్యారు. మొట్టమొదటిసారిగా ఐటం సాంగ్‌లో నటించిన సమంతకు ఎనలేని ప్రశంసలు దక్కాయి. తాజాగా సామ్‌ మరోసారి ఊ అంటావా సాంగ్‌కు స్టెప్పులేసింది. కాకపోతే ఈసారి అక్షయ్‌ కుమార్‌తో! కాఫీ విత్‌ కరణ్‌ 7వ సీజన్‌లో సామ్‌, అక్షయ్‌  కలిసి ఓ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు.

ఈ మేరకు ఎపిసోడ్‌ ప్రోమో రిలీజ్‌ చేశారు. ఇందులో అక్షయ్‌.. సామ్‌ను ఎత్తుకుని స్టేజీ మీదకు తీసుకొచ్చారు. ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా అంటూ సామ్‌, అక్షయ్‌ డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీళ్ల జోడీ అదిరిందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఏడ్చినట్లుంది, ముందు ఆమెను కిందకు దించు అని విసుక్కుంటున్నారు. ఏదేమైనా మా సామ్‌ మాత్రం ఎప్పటిలాగే తన క్యూట్‌నెస్‌తో అదిరిపోయిందని మురిసిపోతున్నారు సామ్‌ ఫ్యాన్స్‌.

చదవండి: లలిత్‌ మోదీతో డేటింగ్‌, సుష్మితా సేన్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement