స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో దొంగతనం జరిగింది. ఇదంతా సమంతకు తెలిసే జరిగింది. అంతేకాదు, అర్ధరాత్రి దొంగను పట్టుకున్న ఆమె దొంగోడు తినడానికి 'స్నాక్స్' ప్యాకెట్ కూడా ఇచ్చింది. ఇంతకీ దేని గురించి చెప్తున్నామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. పైన చెప్పిందంతా కుర్‌కురే యాడ్‌లో ఓ సన్నివేశం మాత్రమే! బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బ్రాండ్ కుర్‌కుర్ స్నాక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే సమంతతో కలిసి కుర్‌కురే యాడ్‌లోనూ నటించాడు.
తాజాగా కుర్‌కురే నుంచి యాడ్ రిలీజ్ అయింది. ఇందులో అక్షయ్ కుమార్ సమంత ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు. అక్కడ కుర్‌కురేను చూడగానే నోట్లో నీళ్లూరతాయి. వెంటనే అతడు ఆ ప్యాకెట్‌ను చేతుల్లొకి తీసుకోగానే సమంత ఫ్యామిలీ అక్కడికి వచ్చేస్తుంది. అక్షయ్ చేతిలోని ప్యాకెట్‌ను లాక్కుని ఫ్యామిలీ అంతా తింటూ ఉంటారు. అది చూసి ఉండబట్టలేకపోయిన అక్షయ్ తనకూ ఇవ్వమని కోరడంతో సామ్ ఆ ప్యాకెట్‌ను అతడికి ఇస్తుంది. వెంటనే ఆవురావురుమంటూ ప్యాకెట్ ఖాళీ చేస్తాడు అక్షయ్. ఇక వెళ్తానని సెలవు తీసుకుంటుండగా నీ కోసం బండి వస్తుందని చెప్తుంది సామ్. ఓహ్.. బండి కూడా ఇస్తారా? అని సంతోషించేలోపు పోలీస్ సైరన్ మోగుతుంది, అక్షయ్ ముఖం వాడిపోతుంది. ఈ యాడ్‌ను సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ 'సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించే హీరో కుర్‌కురే దొంగగా మారిపోయాడు. ఈ ప్రవర్తనేంటి అక్షయ్ కుమార్?' అంటూ కొంటెగా ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ప్రకటన వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment