Kurkure company
-
కుర్కురే తెచ్చిన రగడ.. 30 మంది అరెస్ట్
బనశంకరి: ఐదు రూపాయల కుర్కురే ప్యాకెట్‌పై రెండు కుటుంబాల మధ్య పెద్ద పోరాటమే సాగింది. 10 మంది గాయపడగా, అంతకుమించి పరారీలో ఉన్నారు. ఈ ఘటన దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. అతీఫుల్లా అనే వ్యక్తి కిరాణా అంగడిలో సద్దాం కుటుంబానికి చెందిన పిల్లలు కుర్కురే కొన్నారు. సద్దాం కుటుంబీకులు దగ్గరిలోనే చిన్న హోటల్ పెట్టుకున్నారు. గడువు మీరిన కుర్కేరే విక్రయించారని సద్దాం కుటుంబీకులు వచ్చి ప్రశ్నించారు. దీంతో రగడ రాజుకుంది. రెండు కుటుంబాలవారు కొట్టుకున్నారు. ఇది చాలదన్నట్లు 30 మంది అతీఫుల్లా మనుషులు రెండు వాహనాల్లో వచ్చి హోటల్లో వస్తువులను చెల్లాచెదురుగా పడేసి కొట్టారని సద్దాం కుటుంబీకులు ఆరోపించారు. ఇరు కుటుంబాలు చెన్నగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అరెస్ట్ భయంతో 25 మంది పరారీలో ఉన్నట్లు ఎస్ఐ బాలచంద్రనాయక్ తెలిపారు. కుర్కురే కోసం ఇంత గొడవ జరిగిందా అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొట్లాట దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఇక గాయపడిన పలువురు ఆస్పత్రిలో చేరారు. -
వీడియో: సమంత ఇంట్లో దొంగతనం!
స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో దొంగతనం జరిగింది. ఇదంతా సమంతకు తెలిసే జరిగింది. అంతేకాదు, అర్ధరాత్రి దొంగను పట్టుకున్న ఆమె దొంగోడు తినడానికి 'స్నాక్స్' ప్యాకెట్ కూడా ఇచ్చింది. ఇంతకీ దేని గురించి చెప్తున్నామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. పైన చెప్పిందంతా కుర్కురే యాడ్‌లో ఓ సన్నివేశం మాత్రమే! బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బ్రాండ్ కుర్కుర్ స్నాక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే సమంతతో కలిసి కుర్కురే యాడ్లోనూ నటించాడు. తాజాగా కుర్కురే నుంచి యాడ్ రిలీజ్ అయింది. ఇందులో అక్షయ్ కుమార్ సమంత ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు. అక్కడ కుర్కురేను చూడగానే నోట్లో నీళ్లూరతాయి. వెంటనే అతడు ఆ ప్యాకెట్‌ను చేతుల్లొకి తీసుకోగానే సమంత ఫ్యామిలీ అక్కడికి వచ్చేస్తుంది. అక్షయ్ చేతిలోని ప్యాకెట్‌ను లాక్కుని ఫ్యామిలీ అంతా తింటూ ఉంటారు. అది చూసి ఉండబట్టలేకపోయిన అక్షయ్ తనకూ ఇవ్వమని కోరడంతో సామ్ ఆ ప్యాకెట్‌ను అతడికి ఇస్తుంది. వెంటనే ఆవురావురుమంటూ ప్యాకెట్ ఖాళీ చేస్తాడు అక్షయ్. ఇక వెళ్తానని సెలవు తీసుకుంటుండగా నీ కోసం బండి వస్తుందని చెప్తుంది సామ్. ఓహ్.. బండి కూడా ఇస్తారా? అని సంతోషించేలోపు పోలీస్ సైరన్ మోగుతుంది, అక్షయ్ ముఖం వాడిపోతుంది. ఈ యాడ్‌ను సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ 'సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించే హీరో కుర్కురే దొంగగా మారిపోయాడు. ఈ ప్రవర్తనేంటి అక్షయ్ కుమార్?' అంటూ కొంటెగా ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ప్రకటన వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
నువ్వు చేసింది పెద్ద నేరం తెలుసా..!!
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు పెద్దలు. వ్యక్తుల అభిరుచులు, వాటి అనుచరణ కాస్త వింతగా తోచినపుడు వాడే ఈ నానుడిని.. ప్రస్తుతం నెటిజన్లు మరోసారి ఉటంకిస్తున్నారు. సాహిల్ అధికారి అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేసిన ఓ ఫొటో ఇందుకు కారణమైంది. భోజన ప్రియుడైన సాహిల్‌కు ఆహార పదార్థాలను రకరకాల కాంబినేషన్లతో తినడం ఇష్టమట. అందుకే ఈసారి వైరైటీగా కుర్కురేను పాలల్లో కలుపుకొని తినేశాడు. అంతేకాదు దానికి కుర్కురే మిల్క్‌షేక్ అనే పేరు కూడా పెట్టాడు. రుచికి రుచి.. కొత్తదనం కూడా అంటూ ఈ విషయాన్ని సాహిల్ ట్విటర్లో పంచుకోవడంతో ఇప్పుడు ఈ వెరైటీ వంటకం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలో... ‘ కొత్త కాంబినేషన్. మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి. స్వీట్ చూడ్డానికి బాగుంది. కుర్కురే హీరో’ అని ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తూ కొంతమంది సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘ నువ్వు చేసింది పెద్ద నేరం. ఇలాంటివి తింటే భారతదేశంలో నివసించే అర్హత కోల్పోతావు. దేశ బహిష్కరణ తప్పదు’ అంటూ ఆహారపుటలవాట్ల విషయంలో సంప్రదాయవాదుల జోక్యాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా గతంలో కూడా స్వీట్ మ్యాగీ, చాకొలేట్ చెర్రీ దోస గురించి నెట్టింట్లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. Kurkure Milkshake❤️ pic.twitter.com/U5fnwHMC0L — Desi Gooner (@Sahil_Adhikaari) November 7, 2019 -
పెప్సికో కుర్కురే దెబ్బకు వందల పోస్టులు డిలీట్
న్యూఢిల్లీ : కుర్కురే అంటే ఎవరికి ఇష్టముండదో చెప్పండి.. భారతీయులకు కుర్కురే ఎంతో ఇష్టమైన బ్రాండ్. ఖాళీగా ఉన్నప్పుడు, ఆకలి వేసినప్పుడు, టైమ్ పాస్‌కు చాలా మంది కుర్కురే తింటూ ఉంటారు. కానీ గత కొంత కాలంగా కుర్కురేలో ప్లాస్టిక్ ఉందంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అయితే ఈ చర్చ విజృంభించింది. వీడియోల మీద వీడియోలు, పోస్టుల మీద పోస్టులు సర్క్యూలేట్ అయ్యాయి. దీంతో తమ బ్రాండ్ కుర్కురేను దెబ్బతీస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై, ఆ బ్రాండ్ కంపెనీ పెప్సికో న్యాయపోరాటానికి దిగింది. బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీసేలా.. నకిలీ, పరువు నష్టం కంటెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు సర్క్యూలేట్ చేస్తున్నాయని పెప్సికో, ఢిల్లీ హైకోర్టులో దావా దాఖలు చేసింది. దీంతో కుర్కురేకు వ్యతిరేకంగా ఉన్న వెబ్సైట్ లింక్‌లను, పోస్టులను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు సోషల్ మీడియాలను ఆదేశించింది. కుర్కురేకు వ్యతిరేకంగా పోస్టు అయిన వందల కొద్దీ పోస్టులను ఈ కంపెనీలు తొలగించాయి. యూట్యూబ్ కూడా ఇలాంటి వందల కొద్దీ వీడియోలకు స్వస్తి పలికింది. ఈ ఏడాది ప్రారంభంలో పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలపై సివిల్ దావా ఫైల్ చేసింది. 2018 జూన్ 1న సోషల్ మీడియా కంపెనీలకు కోర్టు ఈ ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. ‘కుర్కురేలో ప్లాస్టిక్ ఉందంటూ వచ్చిన నకిలీ వార్తలతో, తమ బ్రాండ్ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపింది. సోషల్ మీడియాలో సర్య్యూలేట్ అయిన పరువు నష్టం కంటెంట్, నకిలీ వార్తల వల్లే, ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాం’ అని పెప్సికో అధికార ప్రతినిధి చెప్పారు. ఈ విషయాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని తెలిపారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లతో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని, నకిలీ, పరువు నష్టం కలిగించే అంశాలపై తాము కౌంటర్ దాఖలు చేస్తున్నామని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కుర్కురేకు ఎవరూ వ్యతిరేకంగా కామెడీ, విమర్శనాత్మక పోస్టులు పెట్టినా.. వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా పెప్సికో రంగం సిద్ధం చేసింది. అయితే ఇలాంటి విషయాలపై న్యాయ అథారిటీలు జోక్యం చేసుకోవాలని పెప్సికో కోరడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పెప్సికో ‘లేస్ చిప్స్’ కు వ్యతికేంగా వచ్చిన ఫేస్బుక్, యూట్యూబ్‌లలో వీడియోలు, వెబ్‌లింక్‌లను బ్లాక్ చేయాలని కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. లేచిప్స్ తినడం వల్ల ఓ వ్యక్తి మరణించినట్టు గత ఫిబ్రవరి 26న మింట్ రిపోర్టు చేసింది. -
నకిలీ కుర్కురే కంపెనీ సీజ్.. ఓనర్ అరెస్ట్
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో నకిలీ కంపెనీలు, వాటి ఉత్పత్తులపై ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా శంషాబాద్‌లో నకిలీ కుర్కురే కంపనీపై పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు. నకిలీ కుర్కురే కంపెనీని సీజ్ చేసిన ఎస్ఓటీ పోలీసులు కంపెనీ యజమాని మహ్మద్ ఇర్ఫాన్‌ను అరెస్టు చేసి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ కంపెనీ రెండు లక్షల విలువ చేసే ఉత్పత్తులు చేస్తున్నట్లు సమాచారం.