
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు పెద్దలు. వ్యక్తుల అభిరుచులు, వాటి అనుచరణ కాస్త వింతగా తోచినపుడు వాడే ఈ నానుడిని.. ప్రస్తుతం నెటిజన్లు మరోసారి ఉటంకిస్తున్నారు. సాహిల్ అధికారి అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేసిన ఓ ఫొటో ఇందుకు కారణమైంది. భోజన ప్రియుడైన సాహిల్‌కు ఆహార పదార్థాలను రకరకాల కాంబినేషన్లతో తినడం ఇష్టమట. అందుకే ఈసారి వైరైటీగా కుర్‌కురేను పాలల్లో కలుపుకొని తినేశాడు. అంతేకాదు దానికి కుర్‌కురే మిల్క్‌షేక్ అనే పేరు కూడా పెట్టాడు.
రుచికి రుచి.. కొత్తదనం కూడా అంటూ ఈ విషయాన్ని సాహిల్ ట్విటర్‌లో పంచుకోవడంతో ఇప్పుడు ఈ వెరైటీ వంటకం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలో... ‘ కొత్త కాంబినేషన్. మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి. స్వీట్ చూడ్డానికి బాగుంది. కుర్‌కురే హీరో’ అని ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తూ కొంతమంది సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘ నువ్వు చేసింది పెద్ద నేరం. ఇలాంటివి తింటే భారతదేశంలో నివసించే అర్హత కోల్పోతావు. దేశ బహిష్కరణ తప్పదు’ అంటూ ఆహారపుటలవాట్ల విషయంలో సంప్రదాయవాదుల జోక్యాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా గతంలో కూడా స్వీట్ మ్యాగీ, చాకొలేట్ చెర్రీ దోస గురించి నెట్టింట్లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
Kurkure Milkshake❤️ pic.twitter.com/U5fnwHMC0L
— Desi Gooner (@Sahil_Adhikaari) November 7, 2019
Comments
Please login to add a commentAdd a comment