సమంత-నాగ చైతన్య విడాకులు ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వీరి విడాకులకు గల కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఇందులో ఎక్కువగా సమంత తప్పే ఉందని మొదట్లో అందరు ఆమెను నిందించారు. అంతేకాదు సమంత నాగ చైతన్య నుంచి రూ. 250 కోట్లు భరణం తీసుకుందని కూడా ప్రచారం జరిగింది. ఇందులో నిజం లేదని సామ్ అప్పుడే స్పష్టం చేసింది.
చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..
తాజాగా ఓ షోలో సమంతకు ఇదే ప్రశ్న ఎదురైంది. బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్‌ల హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సమంతకు విడాకులు, రూ. 250 కోట్ల భరణం వంటి విషయాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. హోస్ట్ కరణ్ జోహార్ తనని వ్యక్తిగతమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టను అంటూనే విడాకులపై ప్రశ్నించాడు. దీనికి సామ్ ‘మా విడాకులు అంత సామరస్యంగా జరగలేదు. డైవర్స్ తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. విడాకులు తీసుకున్న కొత్తలో చాలా బాధపడ్డాను. జీవితం చాలా కఠినంగా అనిపించింది.
చదవండి: ‘థ్యాంక్యూ’ మూవీ ట్విటర్ రివ్యూ
కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాను. మునుపటి కంటే ఇప్పుడే మరింత బలంగా మారాను. ప్రస్తుతం నా పని నేను చేసుకుంటున్నాను. అయితే విడాకుల తర్వాత ఇద్దరం ఒకరిపై ఒకరం తీవ్ర మనోవేదనకు గురయ్యాం’ అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే రూ. 250 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ‘నేను రూ.250 కోట్లు తీసుకున్నట్లు చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఈ పుకార్లు వచ్చినప్పుడు నా ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేస్తారేమో అని ఎదురుచూశా’ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment