విజయ్‌తో డేట్‌కి వెళ్తానన్నా సారా.. లైగర్‌ రియాక్షన్‌ చూశారా! | Vijay Deverakonda Reaction After Sara Ali Khan Said Wish To Date With Him | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda-Sara Ali Khan: విజయ్‌తో డేట్‌కి వెళ్తా.. సారా కామెంట్స్‌కు ‘లైగర్‌’ రియాక్షన్‌ ఇదే

Published Wed, Jul 13 2022 1:50 PM | Last Updated on Wed, Jul 13 2022 2:06 PM

Vijay Deverakonda Reaction After Sara Ali Khan Said Wish To Date With Him - Sakshi

‘రౌడీ’ విజయ్‌ దేవరకొండతో డేటింగ్‌ చేస్తానంటూ మనసులో మాట బయటపెట్టింది బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీఖాన్‌. సారా కామెంట్స్‌పై విజయ్‌ దేవరకొండ ఆసక్తిగా స్పందించాడు. ఈ మేరకు.. సారాతో పాటు జాన్వీ కపూర్‌కు సైతం గట్టి హగ్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ షేర్‌ చేశాడు విజయ్‌. కాగా సారా అలీ ఖాన్‌, జాన్వి కపూర్‌లు ఇండస్ట్రీలో మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఈ మేరకు వారిద్దరు తాజా కాఫీ విత్‌ కరణ్‌ జోహార్‌ సీజన్‌-7లో సందడి చేశారు. ఈ వీకెండ్‌లో ప్రసారమయ్యే ఈ షో ప్రోమోను తాజాగా హాట్‌స్టార్‌ రిలీజ్‌ చేసింది.

ఈ వీడియోలో ‘నువ్వు ఎవరితోనైనా డేట్‌కు వెళ్లాలనుకుంటున్నావా? అతను ఎవరు?’ అని ప్రశ్నిస్తాడు హోస్ట్‌ కరణ్‌. దీనికి సారా సిగ్గు పడుతూ విజయ్‌ దేవరకొండ అంటూ సమాధానం ఇస్తుంది. ‘నువ్వు కూడా విజయ్‌తోనేనా!’ అని కరణ్ జాన్వీతో అంటాడు. ఆ వెంటనే సారా అలీ ఖాన్‌ స్పందిస్తూ ‘ఏంటీ నువ్వు విజయ్‌ని ఇష్టపడుతున్నావా?’ అని జాన్విని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇలా సాంతంగా ఈ ప్రోమోను విజయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశాడు. 

దీనికి విజయ్‌ ‘నాపై ఇంతటి అభిమానం చూపిస్తున్న మీకు నా గట్టి హగ్‌, ప్రేమ పంపిస్తున్నా’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. కాగా విజయ్‌ అంటే క్రష్‌ అని గతంలో పలుమార్లు సారా, జాన్వీలు తమ మనసులో మాట చెప్పిన సంగతి తెలిసిందే. తనదైన నటన, మ్యానరిజంతో విజయ్‌ దేవరకొండ టాలీవుడ్‌లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక లైగర్‌ మూవీతో విజయ్‌ బాలీవుడ్‌కు సైతం పరిచయం కాబోతున్నాడు. అక్కడ కూడా తనదైన సైల్‌తో విజయ్‌ బి-టౌన్‌ హీరోయిన్ల మనసును కొల్లగోడుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement