
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే- షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ విడిపోయినట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఖాళీ పీలి సినిమా నుంచి మొదలైన వారి డేటింగ్ జర్నీ ముగిసినట్లు తెలుస్తుంది. గతంలో పార్టీలకు, ఫంక్షన్‌లకు, ట్రిప్పులకు, టూర్లకు కలిసి వెళ్తూ హడావుడి చేసిన జంట తాజాగా బ్రేకప్ చెప్పేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఇదే విషయాన్ని అనన్య పాండే ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ ఇషాన్ క్లారిటీ ఇచ్చేశాడు.
తాజాగా కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఇషాన్ ఖట్టర్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అనన్యతో నువ్వు విడిపోయావు కదా అని కరణ్ ప్రశ్నించగా ప్రస్తుతానికి తాను సింగిల్ అని పేర్కొన్నాడు. మరిప్పుడు అనన్యతో స్నేహంగా ఉంటున్నారా అని అడగ్గా నా జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నా. నాకు తెలిసిన వాళ్లలో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అనన్య అని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment