అనన్య పాండే.. బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్. లైగర్ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది. కానీ ఈ సినిమా బెడిసికొట్టడంతో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటోంది. అయితే 25 ఏళ్లకే బాగా సంపాదించిన అనన్య పాండే తాజాగా ముంబైలో కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. ధంతేరస్ నాడు నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ 'ఇదే నా కొత్త ఇల్లు' అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
గుమ్మం ముందు కొబ్బరి కాయ కొట్టిన తర్వాతే లోనికి అడుగుపెట్టింది. ఈ వీడియోను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది చూసిన సెలబ్రిటీలు ఈ బ్యూటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంత త్వరగా ఇల్లు కొనేశావా? వావ్.. ఈ ఇల్లు నీకు సంతోషంతోపాటు అదృష్టాన్ని కూడా అందించాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అటు అనన్య తల్లి భావన ఈ పోస్ట్‌పై స్పందిస్తూ.. నువ్వు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి.. చాలా గర్వంగా ఉంది అని కామెంట్ చేసింది.
కాగా అనన్య పాండే చివరగా డ్రీమ్ గర్ల్ 2 సినిమాలో నటించింది. ఇది 2019లో వచ్చిన డ్రీమ్ గర్ల్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ రెండో భాగంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా రాజ్ శాండిల్య దర్శకత్వం వహించాడు. ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో కో గయే హమ్ కహాన్, కంట్రోల్ సినిమాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment