స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఈ బ్యూటీ లైగర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా అనన్య నటిస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే రీసెంట్‌గా ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పార్టీకి హాజరైన అనన్య ప్రస్తుతం ట్రోలింగ్ బారిన పడింది. చదవండి: పార్టీలో హీరోయిన్‌తో విజయ్ ముచ్చట్లు.. వీడియో తీసిన చార్మీ
ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించిన ఈ బర్త్‌డే పార్టీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్, అనన్య, చార్మీ, పూరి జగన్నాథ్‌లు కూడా పార్టీలో తళుక్కున మెరిశారు. అయితే అనన్య వేసుకున్న డ్రెస్‌ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాను కాపీ కొడుతున్నావా ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: స్టార్ హీరో తమ్ముడితో లైగర్ భామ డేటింగ్, కన్ఫర్మ్ చేసిన తల్లి!
Comments
Please login to add a commentAdd a comment