Birthday party
-
హీరోయిన్ బర్త్‌డే పార్టీలో బాలయ్య సందడి (ఫోటోలు)
-
మందేసి చిందేసిన టీడీపీ ఎమ్మెల్యే
-
పుట్టిన రోజు వేడుకలకూ నోచుకోలేదు
ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తోంది? ఏదో హెయిరాయిల్ ప్రకటనలా ఉంది కదా! కానీ నిజానికి అదో బర్త్‌డే పార్టీ. అత్యంత రహస్యంగా చేసుకున్న పార్టీ. అందులో పాల్గొన్న అమ్మాయిలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడ్డారు. బర్త్‌డే పార్టీ అంత రహస్యంగా చేసుకోవడమెందుకు? వేరే ఏ దేశంలోనైనా అవసరం లేదు. కానీ ఆఫ్గానిస్తాన్‌లో మాత్రం అది అత్యవసరం! తాలిబన్ల పాలనలో అక్కడి మహిళలు, బాలికల దుస్థితికి అద్దం పడుతున్న ఈ ఫొటోను ఇరాన్–కెనడియన్ ఫొటో జర్నలిస్ట్ కియానా హయేరి తీశారు. ఇలాంటి చిత్రాల సమాహారాన్ని ‘నో విమెన్స్ లాండ్’ పేరిట ఈ నెల పారిస్‌లో ప్రదర్శించనున్నారు.ఏడు ప్రావిన్సులు తిరిగి... ఫ్రెంచ్ పరిశోధకురాలు మెలిస్సా కార్నెట్తో హయేరి 2018 నుంచి కలిసి పని చేస్తున్నారు. వారు కొన్నేళ్లుగా అఫ్గాన్‌లోనే ఉంటున్నారు. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్‌ను వీడటం, దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం వంటి పరిణామాలకు వాళ్లు ప్రత్యక్ష సాక్షులు. నానాటికీ దిగజారుతున్న పరిస్థితులు వారిని భయపెట్టాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని కల్లబొల్లి ప్రతిజ్ఞలు చేసిన తాలిబన్లు చివరికి వాళ్లకు అసలు ప్రజా జీవితమే లేకుండా చేశారు. ప్రాథమిక హక్కులతో సహా సర్వం కాలరాశారు. మహిళల గొంతు వినపడటమే నిషేధం. ముసుగు లేకుండా, మగ తోడు లేకుండా గడప దాటడానికి లేదు! బాలికల చదువుకు పాఠశాల స్థాయితోనే మంగళం పాడారు. బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, నృత్యం నిషేధం. అఫ్గాన్ మహిళల దుస్థితిని బయటి ప్రపంచానికి చూపేందుకు హయేరి, కార్నెట్ ఏడు ప్రావిన్సుల్లో పర్యటించారు. ఎంతోమంది మహిళలను కలిశారు.ఆశలకు ప్రతీకలు కూడా... ఎంతసేపు అణచివేత గురించే ఎందుకు చెప్పాలి? అందుకే అఫ్గాన్ బాలికలు, మహిళలకు భవిష్యత్తు మీదున్న ఆశను కూడా హయేరి, కార్నెట్ ఫొటోల్లో బందించారు. తమ చీకటి జీవితాల్లో వెలుగులు నింపే వేడుకలను వాళ్లు జరుపుకొంటున్నారో చెబుతున్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో బాలికలు, స్త్రీలకు సంబంధించి చిన్న వేడుక అయినా అది నేరుగా తాలిబన్ ప్రభుత్వాన్ని ధిక్కరించడమే. అందుకే బాలికలు పుట్టిన రోజులు, పెళ్లిళ్ల వంటి వేడుకల్లో స్నేహితులను కలుస్తున్నారు. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ప్రమాదాలు తెచ్చి పెడుతుందని తెలిసీ రిస్క్ చేస్తున్నారు. మహిళలు గుర్తింపుకే నోచుకోని చోట ఇలాంటి చిన్న వేడుకైనా పెద్ద ప్రతిఘటనే! చిరునవ్వులు చిదిమేస్తున్న కాలంలో ఆనందాన్ని ప్రదర్శించడం కూడా తిరుగుబాటే. అందుకే నిరసనను వ్యక్తం చేసే ఏ అవకాశాన్నీ మహిళలు వదులుకోవడం లేదంటున్నారు. హయేరి, కార్నెట్.తాలిబన్లలోనూ విభేదాలు!మహిళలను తీవ్రంగా అణచివేయడంపై తాలిబన్లలోనే వ్యతిరేకత పెరుగుతోంది! అతివాది అయిన దేశాధినేత షేక్ హైబతుల్లా అఖుందా జాదా నిర్ణయాలను తాలిబన్లలోనే ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ వంటివాళ్లు బాలికలు, యువతుల విద్య కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఆరో తరగతి తర్వాత కూడా విద్యను అందించే అండర్ గ్రౌండ్ పాఠశాలలపై తాలిబన్లలోని కొన్ని విభాగాలు దృష్టి సారించినట్టు కార్నెట్ పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిజినెస్‌మ్యాన్ బర్త్ డే పార్టీలో చిరు-మహేశ్-వెంకటేశ్ ఫుల్ చిల్ (ఫొటోలు)
-
బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఓరీ.. థాయ్‌లాండ్‌లో రచ్చ (ఫొటోలు)
-
బర్త్ డే పార్టీలో కేజీఎఫ్ స్టార్.. అదరగొట్టేశాడుగా!
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న శాండల్‌వుడ్ హీరో యశ్. ప్రస్తుతం ఆయన టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది.అయితే తాజాగా యశ్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఓ బర్త్ డే పార్టీకి హాజరైన కేజీఎఫ్ స్టార్ తనదైన స్టెప్పలతో హోరెత్తించారు. స్టార్ హీరో శివరాజ్‌కుమార్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్ రాకింగ్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. యశ్ డ్యాన్స్ చేసిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది.వివాదంలో టాక్సిక్ టీమ్యశ్ నటిస్తోన్న టాక్సిక్ టీమ్ ఊహించని వివాదంలో చిక్కుకుంది. రీసెంట్గా బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది. రెండు రోజులు షూటింగ్ చేశారు. అయితే సెట్ నిర్మాణ కోసం అక్రమంగా వేలాది చెట్లు నరికేశారనే ఆరోపణలొచ్చాయి.ఈ విషయంపై కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. 'టాక్సిక్' మూవీ టీమ్ చెట్లు నరికేశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేయడంతో పాటు స్యయంగా ఆ ప్రదేశానికి వెళ్లి సందర్శించారు. చెట్ల నరికివేతకు అనుమతించిన వ్యక్తులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో షూటింగ్ అర్థంతరంగా నిలిచిపోయింది.Rocking Star @TheNameIsYash bringing all the energy, dancing to Century Star @NimmaShivanna 's hit "Tagaru Bantu Tagaru" at Yatharv’s birthday party.#YashBoss #Shivanna pic.twitter.com/pM1mM413NZ— Bhargavi (@IamHCB) October 31, 2024 -
శారీ.. ఫర్ ఎవర్
నగరం ఓ మినీ ఇండియా. నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్‌తో పాటు మధ్య భారతం, పశి్చమ, వాయువ్య భారతం అంతా కనిపిస్తుంది. నోరు విప్పి మాట్లాడిన తరవాత భాషను బట్టి వారిది ఏ రాష్ట్రమో తెలుస్తుంది. కానీ మహిళల వస్త్రధారణ మౌనంగా మాట్లాడుతుంది. ఇండియన్ ఫ్యాషన్ అవుట్ ఫిట్‌లో చీరది ప్రత్యేకమైన స్థానం. చీరలకు అతి పెద్ద షోకేస్ హైదరాబాద్ నగరం. వెస్టర్న్ ప్యాటర్న్స్ ఎన్ని వచి్చనా వాటిని స్వాగతిస్తూనే ఉంది. పాతికేళ్ల కిందట ఒక టేబుల్ వేసుకుని కాటన్ వస్త్రం మీద అందమైన డిజైన్లను అద్దడంతో చీర కొత్త పుంతలు తొక్కింది. అప్పటి వరకూ చేనేతకారులు తరతరాల సాదా మోడల్స్ దగ్గరే ఉన్నారు. సూరత్‌లోని టెక్స్టైల్ మిల్స్ ఒక డిజైన్ రూపొందిస్తే ఆ డిజైన్‌లో వేలాది చీరలు దేశమంతటా విస్తరించేవి. అలాంటి సమయంలో ఒక చీరకు అద్దిన డిజైన్ మరో చీరలో ఉండకూడదని, వేటికవే వినూత్నంగా ఉండాలని మహిళా డిజైనర్లు చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ప్రతిదీ యూనిన్గా ఉండాలని కోరుకునే మహిళలకు ఈ ప్రయోగం ఓ వరంలా కనిపించింది. డిజైనర్లు రూపొందించిన డిజైన్లకే పరిమితం కాకుండా సొంత డిజైన్లు గీసి మరీ చేయించుకోవడం మొదలైంది. క్రమంగా అద్దకం ఓ ట్రెండ్ అయ్యింది. చీరను ట్రెండ్ నుంచి పక్కకు పోనివ్వకుండా కాపాడుకుంటూనే ఉంది మెట్రో ఫ్యాషన్. పాతికేళ్లుగా హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్‌ని గమనిస్తున్న ప్రముఖ డిజైనర్ గాయత్రి రెడ్డి చెబుతున్న మాట ఇది. నేతలో క్రియేటివిటీ.. చీర మీద అద్దిన డిజైన్ హైలైట్ కావడానికి డిజైన్ అవుట్ లైన్ ఎంబ్రాయిడరీ చేయడం మరో ప్రయోగం. అక్కడి నుంచి మగ్గం వర్క్ మొదలైంది. చీరతోపాటు బ్లౌజ్‌కు ఎంబ్రాయిడరీ, చీర కంటే బ్లౌజ్‌కు పెద్ద ఎంబ్రాయిడరీ, బ్లౌజ్‌కు హైలైట్ కావడానికి ప్లెయిన్ చీర కాంబినేషన్ వంటి ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఇదే సమయంలో మహిళా డిజైనర్లు తమ క్రియేటివిటీని చేనేత వైపు మళ్లించారు. పోచంపల్లి, ఇకత్ నుంచి నారాయణపేట, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, పాటూరు వంటి నేతలన్నింటికీ ఫ్యాషన్ లుక్ తెచ్చారు. దాంతో ఫ్యాషన్ ప్రపంచాన్ని చేనేత శాసించేంతగా డిజైన్లు పాపులర్ అయ్యాయి. పట్టు చీరల బరువు తగ్గించడంలో విజయవంతమయ్యారు. దాదాపు క్రేప్ మాదిరి తేలిగ్గా ఉంటోందిప్పుడు.వాతావరణం మారింది నగరంలో ఏడాదిలో పది నెలలు చల్లని వాతావరణం ఉండేది. ఈ పాతికేళ్లలో బాగా మార్పులు వచ్చాయి. ఏడాదిలో పది నెలలు వేడిగా ఉంటోంది. వెదర్‌కు అనుకూలంగా ఉండేటట్లు డిజైనర్ శారీస్ కాటన్లో తీసుకురావడం కొత్త తరం మహిళలు చీరపై మోజు పడడానికి ఓ కారణం. చీర కట్టే రోజులు తగ్గినా.. కొనడం మాత్రం తగ్గలేదు. ప్రతి ఫంక్షన్‌కీ ఓ కొత్త చీర కొనే ట్రెండ్ వచ్చేసింది. సాఫ్ట్వేర్ ఉమర్స్ పారీ్టలకు చీరలో మెరిసిపోతున్నారు. రోజూ చుడీదార్ ధరించే వాళ్లు కూడా బర్త్‌డే పార్టీ, గెట్ టు గెదర్ వంటి వాటికి చీర కడుతున్నారు. చీర చుట్టూ ఫ్యాషన్..పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌లో నూటికి 70 నుంచి 80 శాతం మహిళలు రోజూ చీరలే ధరించేవారు. క్రమంగా 2015 నాటికి 40 శాతానికి పరిమితమైంది. వర్కింగ్ ఉమెన్స్, డాక్టర్లు, లెక్చరర్లు చీరలతోనే డ్యూటీ చేశారు. ఇప్పుడిది పాతిక శాతం మాత్రమే ఉంది. ఆధునిక వనితల వార్డ్‌రోబ్‌లో చుడీదార్, జీన్స్ డైలీ వేర్ స్థానాన్ని ఆక్రమించాయి. కానీ చీర మాత్రం దూరం కాలేదు. తనను తాను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్యాషనబుల్‌గా మారుతోంది చీర. అందుకే శారీఫ్యాషన్ ఎప్పటికీ తెరమరుగు కాదు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కన్నుకొట్టిన అనసూయ.. భర్తతో కలిసి పార్టీలో అలా.. (ఫొటొలు)
-
పుట్టిన రోజు వేడుకలు.. అంతలోనే విషాదం
పుట్టిన రోజుల వేడుకలను ఆనందంగా జరుపుకున్న వేళ విధి ఆ స్నేహితుల కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ సమీపంలో 19 ఏళ్ల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి తన కారు గార్డ్‌రైల్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని ఐశ్వర్యా పాండే మృతి చెందింది.ఐశ్వర్య పాండే, తన నలుగురు స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అనంతరం అద్దెకు తీసుకున్న హ్యుందాయ్ కారులో గురుగ్రామ్ నుండి తిరిగి అతివేగంతో వస్తుండగా కారు అదుపు తప్పింది. పక్కనే ఉన్న గార్డ్‌రైల్‌పైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో గార్డ్‌రైల్ గుచ్చుకోవడంతో ఐశ్వర్యాతో పాటు ఆమె స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు.అయితే ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే దేశ్ పాండే చికిత్స పొందుతూ మృతి చెందారు. మద్యమత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాదమిక విచారణ తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇదీ చదవండి : మా సంస్థపై విష ప్రచారం తగదు -
క్రేజీ.. థీమ్స్.. వంట నుంచి వడ్డన దాకా..
ఆహారం వడ్డించడానికి ఇత్తడి పళ్లెం, నీళ్లు తాగడానికి రాగి, గాజు గ్లాసు, బిర్యానీ వండేందుకు మట్టి కుండలు, ఆహారం వడ్డించేందుకు ఇత్తడి గరిటెలు, స్పూన్లు.. ఇదంతా ఎప్పుడో పూర్వకాలం రోజులు అనుకుంటే పొరపాటు పడినట్లే.. హైదరాబాద్ నగరంలో తాజాగా హోటల్ యాజమాన్యాలు అవలంబిస్తున్న ట్రెండ్ ఇది. వివిధ రకాల థీమ్‌లతో ఏర్పాటు చేస్తున్న హోటల్స్‌లో రుచికరమైన ఆహారంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణంలో యువతను ఆకట్టుకునేందుకు సెల్ఫీ పాయింట్లు, స్టార్ హీరోల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో కొత్తకొత్త పేర్లతో రెసిపీలను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆహార ప్రియులు లొట్టలేసుకుని తింటున్నారు. టీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొందరు చేసిన చిన్న పొరపాట్లకు మొత్తం హోటల్ వ్యాపార రంగంపై ప్రభావం కనిపిస్తోంది. ఫలితంగా రొటీన్‌గా నడిచే హోటళ్లు ఆదరణ కోల్పోతున్నాయి. దీంతో ఈ ప్రభావం నుంచి బయటపడేందుకు ఎవరికి వారు ప్రత్యేకంగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా, కాస్త ధర ఎక్కువైనా మనకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేసుకోవాలని హోటల్ నిర్వాహకులు, యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఆర్థికంగా వీటి నిర్వహణ భారమైనప్పటికీ పోటీ మార్కెట్లో తప్పదంటున్నారు. అదే సమయంలో ఆహారప్రియుల నుంచి ఊహించిన దానికంటే మంచి స్పందన వస్తుందని సంతోషపడుతున్నారు. పార్టీలకు ప్రత్యేకంగా ఏర్పాట్లువివాహాది శుభకార్యాలకు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. చిన్న కుటుంబం పుట్టినరోజు పార్టీ చేసుకుందామంటే ఫంక్షన్ హాల్‌కు వెళ్లే పరిస్థితి ఉండదు. ఇటువంటి వారి కోసం హోటళ్లలో 20 నుంచి 30 సీటింగ్‌తో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంప్లిమెంటరీగా కేకులు సైతం ఉచితంగా అందిస్తామంటున్నారు.బిర్యానీలకు స్థానిక పేర్లు..హైదరాబాద్ అంటేనే దమ్ బిర్యానీకి ఫేమస్. అయితే ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ఓ హోటల్లో వంటకాలకు స్థానిక పేర్లను పెడుతూ ఆకట్టుకుంటున్నారు. పాలకొల్లు ఫ్రై పీస్ బిర్యానీ, మొగల్తూరు మటన్ బిర్యానీ, రాజమండ్రి రొయ్యల బిర్యానీ, గుంటూరు మిర్చి కోడి బిర్యానీ, ఓజీ బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు అంటూ కొత్తకొత్త పేర్లు మెనూలో కనిపిస్తున్నా యి. దీంతో పాటే దక్షిణ భారత దేశం రెసిపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆహారం తయారీ విధానాన్ని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టా, రీల్స్‌లో పోస్ట్ చేస్తున్నారు.మట్టి పాత్రలో..ప్రస్తుత రోజుల్లో మట్టి పాత్రల్లో వంట చేయడం గ్రామీణ ప్రాంతాల్లో సైతం కనుమరుగైందనే చెప్పాలి. స్టీల్, అల్యూమినియం పాత్రలు మన్నిక ఎక్కువగా వస్తాయని, అంతా అటువైపు మొగ్గుచూపుతున్నారు. అయితే నగరంలోని హోటల్స్‌లో మాత్రం ప్రధానంగా కుండ బిర్యానీకి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే కొన్ని హోటళ్లలో నేరుగా కుండలోనే బిర్యానీ వండి, వడ్డిస్తున్నారు. పార్సిల్ తీసుకునే వారికి నేరుగా కుండతోనే డెలివరీ ఇస్తున్నారు. దీన్ని ఆహార ప్రియులు ఆస్వాదిస్తున్నారు. ఆదరణ బాగుంది...ఒక థీమ్ ఎంపిక చేసుకున్నాం. మార్కెట్లో ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. సాధారణంగా భోజనం తినే ప్లేట్లు రూ.200నుంచి 500లో లభిస్తాయి. అయినా ఇత్తడి ప్లేట్లు పెడుతున్నాం. ఒక్కో ప్లేటు ధర రూ.3500 వరకూ ఉంది. అలాగే యూత్ ఎక్కడికి వెళ్లినా సెల్ఫీ మస్ట్ అన్నట్లు ఉన్నారు. దీనికోసం కొంత ప్లేస్ కేటాయించాం. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అప్డేట్ అవుతున్నాం. ఫుడ్ క్వాలిటీలో ఎక్కడా రాజీపడటంలేదు. అందుకే అందరి ఆదరణ పొందగలుగుతున్నాం. – ప్రసాద్, అశోక్, అద్భుతాహారం నిర్వాహకులు, రాయదుర్గం -
బర్త్‌డే పార్టీలో మహారాణిలా మెరిసిన పాప్‌స్టార్ జెన్నిఫర్ లోపెజ్ (ఫోటోలు)
-
అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
ఫ్లోరెన్స్: అమెరికాలో కెంటకీ రాష్ట్రం ఫ్లోరెన్స్‌లోని ఓ ఇంట్లో బర్త్ డే పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం వేకువజామున ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారకుడిగా భావిస్తున్న యువకుడిని పోలీసులు వెంటాడారు. ఛేజింగ్ సమయంలో అతడు కారు సహా లోయలో పడిపోయాడని పోలీసులు తెలిపారు. అతడు తనను తాను కాల్చుకున్నాడని, గాయాలతో ఆస్పత్రిలో మృతి చెందాడని చెప్పారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
రజనీకాంత్ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్.. క్రికెట్ థీమ్‌తో.. (ఫోటోలు)
-
బెంగళూరు రేవ్ పార్టీ..బయటపడ్డ సంచలన నిజాలు..
-
బర్త్ డే పార్టీలో డ్రగ్స్...
-
Pragya Jaiswal Birthday Photos: ప్రగ్యా జైస్వాల్ బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి..ఫొటోలు వైరల్
-
Namrata Shirodkar Photos: ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్ డే పార్టీ ఎంజాయ్ చేస్తున్న నమ్రత శిరోద్కర్ (ఫోటోలు)
-
బర్త్‌డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది
పుణె: తన పుట్టినరోజును పురస్కరించుకుని దుబాయ్‌కు తీసుకెళ్లి వేడుక చేయలేదనే వీరావేశంతో భర్తను భార్య పిడిగుద్దులు కురిపించి చంపేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుణెకు చెందిన 38 ఏళ్ల నిఖిల్ ఖన్నా వాన్వాడియా ప్రాంతంలో వ్యాపారం చేస్తుండేవారు. అతనికి 36 ఏళ్ల భార్య రేణుక ఉంది. ఆమె పుట్టినరోజు సెప్టెంబర్ 18. అదే రోజున తనను దుబాయ్‌కు తీసుకెళ్లి పుట్టినరోజు వేడుక జరపాలని పట్టుబట్టింది. అందుకు భర్త ససేమిరా అన్నాడు. ఈ నెల ఐదో తేదీన వీరి వివాహ వార్షికోత్సం జరిగింది. ఆ రోజూ తనకేమైనా ప్రత్యేక బహుమతులు ఇస్తాడేమో అని ఆశపడి భంగపడింది. ఢిల్లీలోని తన బంధువుల వేడుకలకూ వెళ్లాలని భావించినా అదీ నెరవేరలేదు. ఒకదాని వెంట మరోటి ఏ ఒక్క ఆశ తీరకపోవడంతో నవంబర్ 24వ తేదీన భర్తతో వాగ్వాదానికి దిగింది. తీవ్ర వాదులాట సందర్భంగా వీరావేశంతో భర్త ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో ముక్కు నుంచి రక్తం కారుతూ అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భార్యభర్త ఘర్షణ పడుతున్న విషయం తెల్సి ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి భర్తను వెంటనే దగ్గర్లోని ససూన్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు. -
Mahesh Babu- Namrata Shirodkar: ప్రముఖ వ్యాపారవేత్త బర్త్ డే వేడుకల్లో మహేశ్ బాబు, నమ్రత (ఫొటోలు)
-
సెంట్రల్ ఢిల్లీలో డ్రోన్ కలకలం
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్రం జరుగుతున్న సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఓ డ్రోన్ ఎగరడంతో పోలీస్ అధికారులను చెమటలు పట్టించింది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బర్త్‌డే పార్టీని షూట్ చేసేందుకు వాడిన డ్రోన్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని సంబంధీకుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జీ20 సదస్సు నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తగా ఆగస్ట్ 29 నుంచి ఈ నెల 12 వరకు పలు భద్రతా చర్యలు ప్రకటించారు. పారా గ్లైడర్లు, బెలూన్లు, డ్రోన్ల వంటివి ఎగరేయడంపై నిషేధం కూడా అందులో ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా సెంట్రల్ ఢిల్లీలోని షాది ఖాంపూర్‌కు చెందిన హర్మన్‌జీత్ సింగ్(29) బంధువు పుట్టిన రోజు వేడుకను తన నివాసం టెర్రస్‌పై ఏర్పాటు చేశాడు. దీనిని షూట్ చేసేందుకు డ్రోన్‌ను వాడాడు. జీ20 శిఖరాగ్రం జరుగుతున్న ప్రాంతంలో ఇది ఆకాశంలో ఎగురుతుండటం గమనించిన కంట్రోల్ స్టేషన్ అధికారులు, అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. వారు వెంటనే డ్రోన్‌ను వినియోగిస్తున్న హర్మన్‌జీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్లోని ఫుటేజీని పరిశీలించడగా అది బర్త్‌డే పార్టీకి సంబంధించిందేనని తేలింది. డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. -
Karnataka: బీజేపీ నేతలకు డీకే గాలం!
సాక్షి, బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల నాటికి ఆపరేషన్ హస్తం చేపట్టి బీజేపీ, జేడీఎస్‌లలోని బలమైన నేతలను చేర్చుకుని ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ హస్తం తలుపు తట్టకపోవడంతో కేపీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకు అన్ని అవకాశాల్ని వాడుకుంటున్నారు. శనివారం రాత్రి బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు బీసీ పాటిల్, రాజుగౌడ, మరికొందరితో చర్చలు జరిపారు. ప్రముఖ నటుడు నటుడు కిచ్చ సుదీప్ ఒక హోటల్లో జరిపిన పుట్టిన రోజు విందు ఇందుకు వేదికైంది. ఈ వేడుకకు హాజరైన బీజేపీ నాయకులతో డీకే మాటలు కలిపినట్లు సమాచారం. నేను బీజేపీని వీడను: రాజుగౌడ ఆపరేషన్ హస్తం చేసేందుకు నాకు క్యాన్సర్ గడ్డ ఏమీ లేదు, నాకు బీజేపీలో సరైన స్థానం ఇవ్వలేదని అసంతృప్తి ఉంది, అయినా పార్టీనీ వీడను అని రాజుగౌడ చెప్పారు. నియోజకవర్గంలో మంచి పనులు చేపట్టినా కూడా ఎందుకు ఓటమి పాలయ్యారని డీకే అడిగారు. సుదీప్ పుట్టినరోజు కంటే శివకుమార్‌తో మేము మాట్లాడిందే పెద్ద వార్త అయ్యింది అని చమత్కరించారు. చదవండి: అదనపు కట్నం కోసం పోలీస్ అకృత్యాలు.. భార్యపై లాఠీచార్జీ -
తమిళ స్టార్ డైరెక్టర్స్‌తో రామ్‌చరణ్.. ఎందుకు కలిశాడు?
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. అలానే తన తర్వాతి చిత్రం కోసం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబుతో కలిసి పనిచేయబోతున్నాడు. దీని తర్వాత చేయబోయే మూవీ కోసం లోకేశ్ కనగరాజ్ లాంటి దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?) ఇలా రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో తమిళ టాప్ డైరెక్టర్స్‌తో కలిసి రామ్ చరణ్ కనిపించాడు. దీనికి కారణం దర్శకుడు శంకర్ పుట్టినరోజు కావడం. 'గేమ్ ఛేంజర్' సెట్లో ఆల్రెడీ బర్త్ డే జరుపుకొన్న శంకర్.. చెన్నై స్పెషల్‌గా పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, వెట్రిమారన్, వెంకట్ ప్రభు, ఎస్జే సూర్య లాంటి దర్శకులు కనిపించారు. అయితే ఇది కేవలం పార్టీగా అయితే ఉండిపోదు. బహుశా ఈ దర్శకుల్లో చరణ్ తో సినిమా చేసే ప్లాన్ కూడా ఉండొచ్చు. కాబట్టి త్వరలో చరణ్-మరో తమిళ స్టార్ డైరెక్టర్ కాంబోలో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. (ఇదీ చదవండి: మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!) -
పిచ్చి పరాకాష్టకు.. టీడీపీ నేత టీజీ భరత్ బర్త్‌డే వేడుక నవ్వులపాలు
ఎవరిదైనా బర్త్‌డే జరిగితే అభిమానంతో వెళ్తాం. పుష్పగుచ్ఛమిచ్చి స్వీట్లు తినిపిస్తాం. ఇంకా దగ్గరి వాళ్లయితే కేక్ తీసుకెళ్లి కట్ చేయిస్తాం. వీలైతే ఒక గిఫ్ట్ కూడా ఇస్తాం. కానీ ఓ టీడీపీ నేత తన బర్త్‌డేకు రమ్మని ఏకంగా కూపన్లు పంచిపెట్టాడు. వాళ్లు మాత్రమే వచ్చి శుభాకాంక్షలు తెలపాలి. అప్పుడే అక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఆ కూపన్లను చూసి రూ.700 విలువ చేసే గిఫ్ట్ ఇస్తారు. లేకపోతే వచ్చిన దారిలో వెళ్లిపోవాల్సిందే. ఇదండీ కథ. తండ్రి ప్రజల్లో విశ్వాసం కోల్పోతే.. కుమారుడు లేని ప్రజాదరణను చూపించుకునేందుకు తన బర్త్‌డేను వేదికగా చేసుకోవడం నవ్వులపాలైంది. నాయకుడి బర్త్‌డే అంటే స్వచ్ఛందంగా వచ్చి శుభాకాంక్షలు తెలుపుతారు కానీ.. ఇదెక్కడి విడ్డూరమని కొందరంటే, ఆ ఫ్యామిలీ అంతే పబ్లిసిటీ పిచ్చి అంటూ మరికొందరు నోరు చేసుకున్నారు. సాక్షి ప్రతినిధి కర్నూలు: బీజేపీ నేత టీజీ వెంకటేశ్ కుమారుడు, టీడీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్ బర్త్‌డే శనివారం జరిగింది. 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం! ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించుకునేందుకు తన బర్త్‌డేను ఎంచుకున్నారు. నాలుగేళ్లుగా జనం మధ్య లేరు, చంద్రబాబు వచ్చినా జనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో తన బర్త్‌డేకు జనం రారని భరత్ ముందే ఊహించినట్లున్నాడు. అందులో భాగంగా ఓ ప్లాన్ వేశాడు. డబ్బులిచ్చి ఎన్నికల ప్రచారానికి జనాలను పిలిపించుకున్నట్లు ‘గిఫ్ట్’లు ఎరగా వేశాడు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో టీడీపీ నాయకులను పదిరోజుల కిందట పిలిపించి సమావేశం నిర్వహించాడు. తన బర్త్‌డే వేడుకకు రూ.700 విలువ చేసే గిఫ్ట్ ఇస్తామని, దాని కోసం ఓ జాబితా తయారు చేయాలని, ఆ ప్రకారం కూపన్లు అందజేసి గిఫ్ట్‌లు పంపిణీ చేద్దామని నిర్ణయించారు. ఆ మేరకు జాబితాలు తయారయ్యాయి. వ్యక్తుల పేరు, ఓటర్ ఐడీ నెంబర్, పోలింగ్ బూత్ నెంబర్, ఫోన్ నెంబర్‌తో కూపన్ ప్రింట్ చేయించారు. ఈ కూపన్లను నియోజకవర్గంలోని డివిజన్లలో తమ పార్టీ సానుభూతిపరులకు పంపిణీ చేశారు. వీరు ఎస్టీబీసీ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకకు వచ్చి భరత్‌కు శుభాకాంక్షలు చెప్పి, భోజనం చేసి చివరలో గిఫ్ట్‌లు తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పొదుపు మహిళలకు ముక్కుపుడకలు.. కొందరికి గిఫ్ట్‌లు, ఇలా మొత్తం పుట్టిన రోజు ముసుగులో లేని అభిమానానికి ఈ బర్త్‌డే బాయ్ చేసిన ఖర్చు అక్షరాల రూ.5కోట్ల పైనే. జనం బలం ఉందని చూపించుకునే తాపత్రయం టీజీ వెంకటేశ్ కుటుంబంపై ప్రజల్లో విశ్వసనీయత లేదు. టీడీపీలో ఉన్న టీజీ వెంకటేశ్ 2004 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2014లో తిరిగి టీడీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. కుమారుడు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పారీ్టలో చేరడం మినహా టీజీ వెంకటేశ్‌కు రాజకీయ స్థిరత్వం లేదనేది తన రాజకీయ ప్రస్తానాన్ని విశ్లేషిస్తే స్పష్టమవుతోంది. అలాగే తండ్రీకొడుకుల్లో ఒకరు బీజేపీ, మరొకరు టీడీపీలో ఉండటం అవకాశవాద రాజకీయాన్ని సుస్పష్టం చేస్తోంది. పాత రోజులు కాకుండా ప్రజలు రాజకీయంగా చైతన్యం అయ్యారు. దీంతో టీజీ కుటుంబం అవకాశవాద రాజకీయాలను పసిగట్టి వారికి దూరంగా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ అత్యంత బలహీనపడింది. ఒకే నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ నేతలుగా ఉన్న వీరు రాజకీయంగా ఏ రోజు పరస్పరం విమర్శించుకున్నదీ లేదు. తమ రాజకీయాల కోసం ఏ క్షణం, ఏ పారీ్టలోనైనా చేరే నేతగా టీజీ వెంకటేశ్ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. ఆయన కుమారుడు భరత్ నాలుగేళ్లలో విపక్షపార్టీ నేతగా పోరాటం చేసిందీ లేదు. కేవలం ఎన్నికలకు ముందు బలప్రదర్శన చేసుకోవాలని భావించి, బలం లేక ఆర్థికబలంతో కోట్లు ఖర్చు చేసి గిఫ్ట్‌లు పంపిణీ చేసి వాటి కోసం వచ్చిన వారిని తమ అభిమానులుగా చిత్రీకరించుకుని రాజకీయ అడుగులు వేసే ప్రయత్నం చేశాడు. ఎన్నికల ‘వేడుక’ టీడీపీ నాయకుడు భరత్ పిచ్చి పరాకాష్టకు ఈ వేడుక తాజా నిదర్శనం. పుట్టిన రోజుకు రావాలని పిలవడం బాగుంటుంది కానీ, ఏకంగా ఓటరు ఐడీ జిరాక్స్ కాపీ జత చేసి తీసుకురావాలని కూపన్ల మీద కొట్టించడం ఇదంతా ఎన్నికల వేడుక అని చెప్పకనే చెప్పినట్లయింది. ఇంతేకాదు.. కూపన్ల మీ ద ఇచ్చిన వివరాలన్నీ ఓటరు ఐడీ కార్డు తరహాలో ఉండటం గమనార్హం. ఓటరు ఐడీ నెంబర్, బుక్ ఫోలియో, వార్డు నెంబర్, బూత్ నెంబర్‌ను పంపిణీ చేసిన కూపన్లపైనే ముద్రించారు. డేటా చౌర్యం గురించి మాట్లాడే టీడీపీ నేతలు కూపన్ల మాటున ఏకంగా ఓటరు ఐడీలనే బజారుకు తీసుకురావడం ఏమనుకోవాలనే చర్చకు తావిస్తోంది. చంద్రబాబు వద్ద విశ్వసనీయత కోల్పోయారా?! లక్కీటు బ్రదర్స్‌గా చెప్పుకునే రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్‌లను పార్టీ నుంచి తప్పించాలని భరత్ ప్రయతి్నంచాడు. నియోజకవర్గంలో జరిగిన బస్సుయాత్రలో కూడా లక్కీటు బ్రదర్స్ పాల్గొనలేదు. దీంతో వీరు చంద్రబాబుకు భరత్‌పై ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అధిష్టానం భరత్, లక్కీటు బ్రదర్స్‌ను ఇద్దరినీ పిలిపించి వేర్వేరుగా మాట్లాడారు. రాజకీయంగా బలపడాలంటే చేరికలపై దృష్టి పెట్టేవారిని చూశానని, పారీ్టలో ఉన్నవారిని బయటకు పంపే నేతను చూడలేదని భరత్‌ను చంద్రబాబు హెచ్చరించినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 50 ఓట్లు ఉన్న వ్యక్తి కూడా మనకు ముఖ్యమేనని, సర్దుకుని పోవాలని సూచించారు. పైగా భరత్, టీజీ వెంకటేశ్ వేర్వేరు పార్టీలో ఉండటంతో టీడీపీ నియోజకవర్గంలో నష్టపోయిందని, ఇద్దరూ ఒకే పారీ్టలో ఉంటేనే టిక్కెట్ ఇచ్చే ఆలోచన చేస్తామని.. లేదంటే పార్టీ ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బలం నిరూపించునే ప్రయత్నంలో తన బర్త్‌డే వేడుకను అవకాశంగా తీసుకున్నాడు భరత్. అయితే ఈ వేడుకపై ఇటు ప్రజల్లో, రాజకీయ పారీ్టల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బర్త్‌డే వేడుకల్లో భరత్ కొత్త సంప్రదాయానికి తెర తీశాడని, ప్రతీ అంశాన్ని రాజకీయంగా చూడటం సరికాదని చర్చకు దారితీసింది. -
ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!
చైల్ట్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోన్న భామ నిత్యాశెట్టి. దేవుళ్లు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించింది హైదరాబాద్‌కు చెందిన నిత్యాశెట్టి. ఓ పిట్టకథ, నువ్వు తోపు రా, పడేశావే, వాంటెడ్ పండు గాడ్, అవరట్టం, కాదల్ కాలం లాంటి చిత్రాల్లో మెప్పించింది. పలు టీవీ షోల్లో మెరిసింది. అయితే తాజాగా తన ఫ్రెండ్ బర్త్ డేకు హాజరైన ముద్దుగుమ్మ ఫుల్‌గా చిల్ అవుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? తెలుగులో చేసింది ఒకటే సినిమా!) సెలబ్రీటీలు అన్నాక పార్టీలు, పబ్‌లకు వెళ్లడం సర్వసాధారణమే. అలా తన ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీకి వెళ్లిన నిత్యా శెట్టి ఫుల్‌గా మందుకొడుతూ కనిపించింది. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోల్లో ఎంచక్కా షాట్స్ (ఆల్కహాల్) తాగుతూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తన ఫ్రెండ్‌కు విష్ చేసిన నిత్యా శెట్టి మందు తాగుతూ కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) View this post on Instagram A post shared by Nitya Shetty (@nityashettyoffl) -
బర్త్‌డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టూ జుట్టూ పట్టుకున్న యువతులు!
ఘనంగా బర్త్‌డే పార్టీ చేసుకుందామనుకున్న అమ్మాయిల బృందం ఒక హోటల్‌కు వెళ్లింది. అయితే బిల్లు చెల్లించే విషయంలో వారి మధ్య వివాదం తలెత్తింది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిలో ఆ యువతులు ఎలా గొడవ పడ్డానేది కనిపిస్తోంది. ఈ ఉదంతం అమెరికాలో చోటుచేసుకుంది. ఈ వీడియోను విక్టర్ క్రిస్టియన్ పేరుతో టిక్‌టాక్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎంతో ఫన్నీగా కనిపిస్తున్న ఈ వీడియో నెటిజన్ల మధ్య చర్చకు తావిస్తోంది. కొంతమంది యువతులు భోజనం టేబుల్ వద్ద గొడవపడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్‌వైటీ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన బర్త్‌డే సందర్భంగా స్నేహితురాళ్లకు డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే బిల్లు రూ. 3 లక్షలు($4,600) దాటడంతో ఆ స్నేహితురాళ్ల మధ్య వివాదం చెలరేగింది. ఇంతలో ఒక యువతి ఈ భారీ బిల్లును సమానంగా పంచుకుని, ఎవరి పేమెంట్ వారు చేసుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చింది. అయితే ఈ సూచన మిగిలిన స్నేహితురాళ్లకు ఏమాత్రం నచ్చలేదు. ఈ యువతుల వివాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన 28 ఏళ్ల విక్టర్ కూడా ఆ పార్టీలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే మా స్నేహం మునుపటిలా లేదు. అయితే త్వరలోనే ఇది సమసిపోతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. పార్టీలో తాను స్ప్రైట్, కలామారి ఆర్డర్ చేశానని, వాటి ధర 25 డాలర్ల కన్నా తక్కువేనని, పార్టీలోని మిగిలినవారు ఖరీదైన ఆహార పదార్థాలు ఆర్డర్ చేశారని తెలిపింది. తాను బిల్లు షేర్ చేసేందుకు ఇష్టపడలేదని, ఎందుకంటే తాను తక్కువ ఆహారపదార్థాలనే ఆర్డర్ చేశానని తెలిపింది. ఇతరుల బిల్లు నేనెందుకు చెల్లించాలని ఆమె ప్రశ్నించింది. ఎవరు బర్త్‌డే పార్టీ ఇచ్చారో వారే బిల్లు చెల్లించాలని విక్టర్ డిమాండ్ చేసింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిని ప్రాంక్ అని అంటున్నారు. కొందరు ఆహారం ఆర్డర్ చేసేముందే బ్లిలు గురించి ఆలోచించాలని అంటుండగా, మరికొందరు డైనింగ్ టేబుల్‌ను క్రీడల మైదానంగా చేశారని కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి I went to a birthday dinner — and fought over splitting the $4.6K bill https://t.co/48P3UB3oAs pic.twitter.com/LPdjcBE55i — New York Post (@nypost) July 19, 2023 -
టీన్ బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం..నలుగురు మృతి
ఒక టీనేజర్ బర్త్‌డే పార్టీ వేడుకలో కాల్పుల కలకలం జరిగింది. దాదాపు 20 మందికి పైగా కాల్పులకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున దక్షిణ యూఎస్‌లోని అలబామా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఒక టీనేజర్ 16వ పుట్టిన రోజు వేడుకలు జరిగినట్లు తెలిపారు. ఆ వేడుకలో తలెత్తిన వివాదం ఈ కాల్పులకు దారితీసినట్టుగా షెరీఫ్ కార్యాలయం అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పార్టీ జరిగిన భవనం చుట్టూ భద్రత బలగాలుల గట్టిగా మోహరించినట్లు పేర్కొన్నారు. ఐతే ఈ ఘటనలో నలుగురు మృతి చెందారని, పలువురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు..ఆ ప్రమాదంలో అనేకమంది గాయపడ్డారని, వారిలో అధికంగా యువకులే ఉన్నారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. (చదవండి: ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎగిసిన నిరసన జ్వాల..వీధుల్లోకి వేలాదిమంది ప్రజలు) -
ఆరేళ్ల ప్రేమ.. ప్రేయసి పుట్టిన రోజు, రూమ్‌లో పార్టీ చేసుకుందామని పిలిచి..
కర్ణాటక: ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన ప్రియుని ఉదంతం బెంగళూరు రాజగోపాలనగర పరిధిలో జరిగింది. హోంశాఖ ఆఫీసులో క్లర్క్‌గా పని చేస్తున్న నవ్య (24) హతురాలు. ఆమె రామనగర జిల్లా కనకపుర తాలూకా తామసంద్రకు చెందినవారుకాగా, కోరమంగళలో నివాసం ఉంటూ ఉద్యోగం చేసేది. ఒకే ఊరు, దూరపు బంధువు అయిన ప్రశాంత్ బెంగళూరు లగ్గేరి రాజేశ్‌నగరలో ఉంటూ, పీణ్యలో ఫ్యాక్టరీలో ఆపరేటర్గాపని చేస్తున్నాడు. ఇద్దరూ ఆరేళ్ల నుంచి ప్రేమించుకొంటున్నారు. మంగళవారం నవ్య పుట్టిన రోజు. శుక్రవారం పార్టీ చేసుకుందామని ప్రశాంత్ ఆమెను తన రూంకు పిలిచాడు. చాటింగ్‌పై గొడవ జరిగి మధ్యాహ్నం మూడు గంటలకు కేక్ కట్‌చేశారు. కొంతసేపటికి నవ్య మొబైల్లో చాటింగ్ చేయడం చూసిన ప్రశాంత్ అనుమానంతో ప్రశ్నించగా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఉన్మాదిగా మారిన ప్రశాంత కేక్ కోసిన కత్తితోనే నవ్య గొంతు కోశాడు. తీవ్ర రక్తసావంతో ఆమె అక్కడికక్కడే విలవిలలాడుతూ ప్రాణాలు వదిలింది. ఏమి చేయాలో దిక్కుతోచని ప్రశాంత్ ఆమె శరీర భాగాలను కత్తిరించి గోనె సంచిలో పెట్టి దూరంగా పడేయాలని ప్లాన్ వేశాడు. ఆదీ సాధ్యంకాకపోవడంతో గదిలోనే శవంతో పాటు సాయంత్రం వరకు ఉన్నాడు, తరువాత స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. పోలీసులు నవ్య తల్లి నాగరత్నకు ఫోన్లో చెప్పి పిలిపించారు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
బర్త్‌డే రోజు రామ్ చరణ్‌కు రాజమౌళి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 38వ పుట్టిన రోజును మార్చి 27న గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన ఈ పార్టీకి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖలు హాజరై సందడి చేశారు. ఇక హీరోలతో ఫ్రెండ్లీగా ఉండే రాజమౌళి కూడా తన ఫ్యామిలీతో కలిసి చరణ్ బర్త్‌డే పార్టీకి వెళ్లాడు. అయితే ఎవరి బర్త్‌డే పార్టీకి వెళ్లినా ఓ బహుమతి ఇవ్వడం జక్కన్నకు అలవాటు. ఇక తన హీరో చరణ్‌కి కూడా రాజమౌళి ఓ సర్ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చాడు. రోజ్ వుడ్‌తో చేసిన ఓ యూనిక్ హ్యాండ్ మెడ్ లారీతో పాటు రోజ్‌వుడ్‌తో చేసిన ఓ ప్రతిమను బహుమతిగా అందించారు. కాగా,రాజమౌళి ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. మగధీర సినిమాతో ఇరు కుటుంబాల మధ్య స్నేహం ఏర్పడింది. ఇక ఆర్ఆర్ఆర్తో ఆ బంధం మరింత బలపడింది. రామ్‌చరణ్ బర్త్‌డే వేడుకల్లోనే ‘నాటు నాటు’కు ఆస్కార్ వరించినందుకుగాను ఆర్ఆర్ఆర్ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. That’s one grand party! #Rajamouli with his family was seen entering Ram Charan’s birthday celebrations in Hyderabad#upasana #upasanakonidela #ramcharan #ramcharanbirthday #hbdramcharan #upasanakamineni #nagarjuna #Telugu #Tollywood #ssrajamouli #saidharamtej #ranadaggubati pic.twitter.com/vWXBUNjkBc — BTown Ki Billi South Cinema (@bkbsouthcinema) March 28, 2023 -
అమితాబ్ తనయ శ్వేతా బచ్చన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Gunfire: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి..
దక్షిణాఫ్రికా ఈస్టర్న్ కేప్ రాష్ట్రంలో దుండగులు తుపాకీతో రెచ్చిపోయారు. ఓ ఇంట్లో నిర్వహిస్తున్న బర్త్ డే పార్టీకి వచ్చినవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. క్వాజకీలే ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం ఇద్దరు దుండగులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. అయితే వీరి దాడి వెనుక ఉద్దేశంపై మాత్రం స్పష్టత లేదు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. దక్షిణాఫ్రికాలో గతేడాది జులైలో కూడా మాస్ షూటింగ్ ఘటన జరిగింది. గంటల వ్యవధిలో పలుచోట్ల తుపాకులతో విధ్వంసం సృష్టించారు దుండగులు. 19 మంది చనిపోయిన ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చదవండి: పోలాండ్‌లో భారతీయ యువకుడి హత్య.. -
సల్మాన్ బర్త్‌డే పార్టీకి హాజరైన షారుక్‌ఖాన్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ 57వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సందర్భంగా ఆయన సోదరి అర్పితా ఖాన్ గతరాత్రి తన నివాసంలో గ్రాండ్‌గా సల్మాన్ బర్త్‌డే పార్టీ నిర్వహించింది. ఈ వేడుకల్లో బాద్షా షారుక్ ఖాన్ సందడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఫోటోలను ఫోజులిచ్చారు. సల్మాన్-షారుక్‌ను ఒకే ఫ్రేములో చూసి ఫ్యాన్స్ తెగ సండర పడిపోతున్నారు. ఇక ఈ పార్టీకి జాన్వీకపూర్,పూజా హెగ్డే, టబు, సునీల్ శెట్టి, రితేశ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, కార్తీక్ఆర్యన్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా మైనే ప్యార్ కియా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఖాన్ ఆ తర్వాత హమ్ ఆప్కే హై కౌన్,బీవీ నెం.1, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమాలతో స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు హోస్ట్ గానూ కొనసాగుతున్నారు. The way they hug each other , there is so much love & brotherhood ♥️#HappyBirthdaySalmanKhan pic.twitter.com/JTfXYZXhMa — Shah Rukh Khan Fc - Pune ( SRK Fc Pune ) (@SRKFC_PUNE) December 27, 2022 -
హార్దిక్ పాండ్యాతో కలిసి డ్యాన్స్ చేసిన ధోని.. వీడియో వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ భర్త్‌డే పార్టీలో సందడి చేశాడు. దుబాయ్‌లో తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరైన ధోని.. భారత ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ తో కలిసి డ్యాన్స్ చేశాడు. ర్యాపర్ బాద్షా పాట పాడుతుంటే హార్ధిక్ పాండ్యా, కిషన్‌తో కలిసి ధోని స్టెప్పులు వేశాడు. ధోని, పాండ్యా మంచి స్టైలిస్ లూక్లో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యాకు వన్డే సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా టీ20 సిరీస్‌లో భాగంగా ఉన్న కిషన్‌కు వన్డే జట్టులోకి చోటు దక్కలేదు. ఈ క్రమంలో నేరుగా హార్దిక్, కిషన్ నేరుగా న్యూజిలాండ్ నుంచి దుబాయ్‌కు చేరుకున్నారు. ఇక ధోని విషయానికి వస్తే.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. భారత తరపున ధోని 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. మిస్టర్ కూల్ సారథ్యంలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలను కైవసం చేసుకుంది. View this post on Instagram A post shared by RANCHI BIGGEST FAN CLUB (160K) (@maahi7.7.81) చదవండి: IND VS NZ 2nd ODI: అందుకే సంజూ శాంసన్‌ను ఆడించలేదు.. టీమిండియా కెప్టెన్ -
రెస్టారెంట్ సిబ్బంది నిర్వాకం...వాటర్ బాటిళ్లలో యాసిడ్ అందించి...
పుట్లిన రోజు, పెళ్లి వేడుక లేక మనం ఆనందంగా ఉన్నప్పుడూ సరదాగా రెస్టారెంట్‌కి వెళ్లి స్నేహితులకు ట్రీట్ ఇచ్చి సెలబ్రెట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడూ ఈ విచిత్రమైన సంఘటన గురించి వింటే రెస్టారెంట్‌కి వెళ్లాలంటేనే జంకుతారు. ఇక్కడొక కుటుంబం పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు రెస్టారెంట్‌కి వెళ్లి ఘోరమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని ఒక రెస్టారెంట్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పాకిస్తాన్‌లోని ప్రముఖ ఇక్బాల్ పార్క్‌లోని పోయిట్ రెస్టారెంట్లో ఒక కుటుంబం పుట్టిన రోజుల వేడుకలు జరుపుకుంది. ఐతే ఆ రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్షపూరిత ధోరణితో సదరు కస్టమర్లకు భోజనంలో వాటర్ బాటిళ్లలో యాసిడ్‌ని సర్వ్ చేశారు. దీంతో ఆ బాటిల్‌ని ఉపయోగించి ఇద్దరి చిన్నారుల్లో ఒకరు చేతులు కడుక్కోగా, మరోకరు తాగారు. అంతే కొద్దిసేపటికి ఒకరు మంట మంట అని ఏడవడం, మరోకరు వాంతులు చేసుకుని అశ్వస్థకు గురవ్వడం జరిగిందని చిన్నారులు కుటుంబసభ్యలు చెబుతున్నారు. ఈ మేరకు బాధితుల కుటుంబం సభ్యుడు మహ్మద్ ఆదిల్ మాట్లాడుతూ తన మేనకోడలు రెండేళ్ల వాజిహ, మేనల్లుడు అహ్మద్, రెస్టారెంట్ సిబ్బంది అందించిన వాటర్ బాటిల్లోని యాసిడ్ కారణంగా తీవ్ర అశ్వస్థకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఐతే మేనకోడలు వాజిహ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు. భాదితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరుకు పోలీసులు సదరు రెస్టారెంట్ మేజర్ మహ్మద్ జావెద్ తోపాటు ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే దర్యాప్తు పూర్తయ్యే వరకు రెస్టరెంట్‌ని మూసేశారు. ఈ మేరకు పోలీస్ అధికారి తాహిర్ వాకస్ మాట్లాడుతూ..ఇది చాలా విచిత్రమైన సంఘటన అని, తాము ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. (చదవండి: యూఎస్‌లో ఎనిమిదేళ్ల చిన్నారితో సహ భారత సంతతి కుటుంబం కిడ్నాప్) -
అప్పటివరకు హుషారుగా డ్యాన్స్.. అంతలోనే
వైరల్: మనిషి జీవితం నీటి బుడగలాగా మారిపోయింది. ఎప్పుడు.. ఎలా ముగుస్తుందో చెప్పని పరిస్థితులు నెలకొన్నాయి. మారుతున్న లైఫ్ స్టయిల్‌కు తగ్గట్లే రకరకాల రోగాలు.. కొత్త కొత్త వైరస్లు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ్. ముఖ్యంగా సడన్ స్ట్రోక్‌లతో ప్రాణాలు పోతున్న ఘటనలు మన కళ్లముందే జరుగుతున్నాయ్. తాజాగా అలాంటి ఓ షాకింగ్ ఘటన.. వేడుకలో విషాదం నింపింది. ప్రభాత్ ప్రేమి (45).. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఆయన తన స్నేహితుడు మనీష్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యాడు. ఉత్తర ప్రదేశ్ బరేలీ ఓ హోటల్లో పార్టీ నిర్వహించారు. మంచి డ్యాన్సర్ అయిన ప్రభాత్.. హుషారుగా బాలీవుడ్ సాంగ్స్‌కు స్టెప్పులేశాడు. అది చూసి అంతా విజిల్స్, గోలతో ఆయన్ని ఎంకరేజ్ చేశారు. అయితే.. ఉన్నట్లుండి ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. बरेली: खुश दिल इंसान की पल भर में मौत.... ◆डांस करते-करते शख्स अचानक गिरा नीचे, डॉक्टरों ने मृत घोषित किया pic.twitter.com/AIOle7W9BA — News24 (@news24tvchannel) September 2, 2022 అలా కుప్పకూలిపోయి ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో చాలామంది ఆయనకు సీపీఆర్ లాంటి చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కుప్పకూలిన ప్రభాత్ దగ్గరకు వెళ్లి పైకి లేపేందుకు ప్రయత్నించారు అంతా. కానీ ఆయనలో చలనం లేదు. పార్టీలో ఉన్న మనీష్ మరో స్నేహితుడు డాక్టర్ వినోద్ పగ్రానీ.. ప్రభాత్‌కు సీపీఆర్, కార్డియాక్ ప్రెజర్ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. చివరకు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే కార్డియక్ అరెస్ట్‌తో ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇదీ చదవండి: నిప్పుతో గేమ్స్.. బెడిసి కొట్టడంతో చివరకు.. -
వెర్రి తలకెక్కి.. శ్మశానంలో బర్త్‌డే పార్టీ.. చివరికి ట్విస్ట్
అమలాపురం రూరల్(కోనసీమ జిల్లా): ఆ ఐదుగురూ స్నేహితులు.. వారిలో ఒకరి పుట్టిన రోజు.. వెర్రి తలకెక్కిన వారు.. ఆ వేడుకలను వెరైటీగా వల్లకాటిలో ఏర్పాటు చేసుకున్నారు. పూటుగా తాగారు. కేక్ కట్ చేసి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మాటామాటా పెరిగింది. తన్నులాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నలుగురు మిత్రులు కలిసి మరొకరిని చాకుతో తీవ్రంగా గాయపరిచారు. చదవండి: రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా? అమలాపురం రూరల్ మండలం కామనగరువులో గురువారం రాత్రి జరిగిన ఈ ఘర్షణ వివరాలను పట్టణ సీఐ ఎస్‌సీహెచ్ కొండలరావు శుక్రవారం తెలిపారు. కామనగరువుకు చెందిన పందిరి శివశంకర్, బొంతు నవీన్, మరో ముగ్గురు స్నేహితులు. నవీన్ పుట్టిన రోజు వేడుకలను అమలాపురం నల్ల వంతెన సమీపంలోని శ్మశానంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసుకున్నారు. మద్యం తాగి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మొదలైన వాగ్వాదం.. తీవ్ర రూపు దాల్చింది. శ్మశానంలోనే కొద్దిపాటి ఘర్షణకు దిగిన వారు.. తరువాత ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. శివశంకర్ కామనగరువులోని తన ఇంటికి వెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. ఇంతలో మిగిలిన నలుగురు స్నేహితులూ అతడి ఇంటికి వచ్చి, శివశంకర్‌ను బయటకు తీసుకు వెళ్లి దాడి చేశారు. అతడి శరీరంపై పలుచోట్ల చాకుతో పొడిచి, పరారయ్యారు. గాయపడిన శివశంకర్ కేకలు వేయడంతో అక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బొంతు నవీన్‌తో పాటు మిగిలిన ముగ్గురు స్నేహితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ కొండలరావు తెలిపారు. -
మరోసారి తెరపైకి వరుణ్ తేజ్-లావణ్య డేటింగ్ రూమర్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు ఈ వార్తలపై అటు వరుణ్ కానీ, లావణ్య కానీ స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఒకే బర్త్‌డే పార్టీలో సందడి చేయడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఓ కామన్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి సహా నితిన్ ఆయన భార్య షాలినీ, సాయి ధరమ్ తేజ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యరు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా వరుణ్, లావణ్య ఇద్దరూ 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీరి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
విషాదం: బర్త్‌డే వేడుకలకు వెళ్లివస్తూ.. వ్యవసాయ బావిలో పడ్డ కారు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ చౌరస్తా వద్ద గొల్లపల్లి–జగిత్యాల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న వ్యవసాయ బావిలో శనివారం రాత్రి సుమారు 11.45గంటల సమయంలో కారు అదుపుతప్పి పడిపోయింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. ఇందులో ఒకరు గల్లంతవగా, నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని మల్యాలకు చెందిన సామల్ల కిశోర్, మరోనలుగురు యువకులు కలిసి కిశోర్ అక్క కూతురు జన్మదిన వేడుకల కోసం గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెకు వెళ్లారు. వేడుకల్లో పాల్గొని రాత్రి కారులో తిరిగి వస్తున్నారు. రోదిస్తున్న కుటుంబసభ్యులు ఈక్రమంలో లక్ష్మీపూర్ శివారులోని నల్లగుట్ట కమాన్ వద్ద రోడ్డును ఆనుకుని ఉన్న వ్యవసాయబావిలో కారు అదుపుతప్పి పడిపోయింది. కారుతోపాటు సామల్ల కిశోర్, ఈశ్వర్, సాయిరఘు, గడీల సందీప్, చందు బావిలో పడిపోయారు. సాయిరఘు, సందీప్, చందు, ఈశ్వర్ సురక్షితంగా బయటపడ్డారు. కిశోర్ బావిలో గల్లంతయ్యాడు. నీటిని తోడేస్తున్న అగ్నిమాపక సిబ్బంది బావినుంచి బయటకు వచ్చిన నలుగురు యువకులు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పైపుల ద్వారా నీటిని తోడేస్తూనే క్రేన్ సాయంతో కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, గల్లంతైన కిశోర్(22) కోసం కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీ, ఒకే రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, విజయ్
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బుధవారం(మే 25న) 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోహీరోయన్లు షారుక్ ఖాన్ కుటుంబంతో హాజరు కాగా.. కొత్త జంటలు కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్, రణ్‌బీర్-ఆలియా భట్లు సందడి చేశారు. చదవండి: పార్టీ టైమ్: ప్రియురాలితో హృతిక్, ప్రియుడితో హీరో మాజీ భార్య అలాగే కృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్, గౌరీ ఖాన్ తదితరులు హజరు కాగా.. దక్షిణాది నుంచి పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాలు హాజరయ్యారు. ఈ పార్టీలో రష్మిక బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఈ పార్టీలో రష్మిక బ్లాక్ డ్రెస్‌లో అక్కడి రెడ్ కార్పెట్‌పై హోయలు పోతూ నడుస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రష్మిక స్టన్నింగ్ లుక్కు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే ఈ పార్టీలో విజయ్ సైతం బ్లాక్‌డ్రెస్‌లో రాగా తమన్నా పింక్ కలర్ సూట్లో దర్శనమచ్చింది. చదవండి: విడాకుల తర్వాత కలిసి పార్టీకెళ్లిన మాజీ దంపతులు కాగా మొదట కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీతా గోవిందం, భీష్మ, డియర్ కామ్రెడ్, పష్ప వంటి చిత్రాలతో సక్సెస్ అందుకుంది. తక్కవ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన రష్మికకు ఆ వెంటనే హిందీలో ఆఫర్ వచ్చింది. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేసిన ఆమె రణ్‌బీర్ కపూర్ సరసన ఎనియమల్లో నటిస్తోంది. అలాగే తెలుగులో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీతో పాటు తమిళ హీరో విజయ్‌తో ఓ సినిమ చేస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Gossip Girl💋👑 (@bolly_newzz) -
ముంబైలో కరణ్ బర్త్‌డే పార్టీ.. విజయ్, రష్మికలకు మాత్రమే ఆహ్వానం!
ముంబైలో జరిగే ఓ గ్రాండ్ పార్టీలో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ రోజు(మే 25) బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పుట్టిన రోజు. నేటితో ఆయన 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా నేడు(బుధవారం) సాయంత్రం తన నివాసంలో గ్రాండ్ పార్టీని నిర్వహించాడు కరణ్. ఈ సందర్భంగా బాలీవుడ్‌కు చెందిన తారలతో పాటు లైగర్ టీం కూడా ఈ బర్త్‌డే పార్టీలో సందడి చేసింది. ఈ పార్టీకి లైగర్ హీరో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ రష్మిక మందన్నాకు కూడా హాజరైంది. అయితే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి కేవలం విజయ్ దేవరకొండకు మాత్రమే ఇన్విటేషన్ అందడం గమనార్హం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ పార్టీకి బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరి ఖాన్, మలైకా ఆరోరా, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, సారా అలీ ఖాన్ రణ్‌బీర్ కపూర్, ఆయాన్ ముఖర్జీ, మనీశ్ మల్హోత్రా, రణ్వీర్ సింగ్, అనన్య పాండే పాల్గొన్నారు. చదవండి: లండన్‌లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన అలియా, కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్‌లో ఉన్న దీపికా పదుకొనెలు నేడు ముంబై చేరుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది నుంచి విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్నాకు ఆహ్వానం అందింది. ఇదిలా ఉంటే రష్మిక, విజయ్ దేవరకొండలు రిలేషన్లో ఉన్నారంటూ కొద్ది రోజుల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా విజయ్ హీరో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్లో కరణ్ జోహార్ నిర్మించాడు. (చదవండి: డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్) -
ఎన్టీఆర్ ఇంట్లో రామ్‌చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు లీక్
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' మేనియా నడుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను చూపించిన తీరుకు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న రామ్‌చరణ్‌కి ఆర్ఆర్ఆర్ బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆదివారం(మార్చి27)న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా చరణ్‌కి తారక్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. తన ఇంట్లో చెర్రీ కోసం గ్రాండ్‌గా బర్త్‌డే పార్టీని నిర్వహించాడు. ఈ వేడుకకి రాజమౌళి, అఖిల్ అక్కినేనితో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా రామ్‌చరణ్- ఎన్టీఆర్ మధ్య ఎన్నో ఏళ్లుగా స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. -
ఇదేం ఎక్స్పోజింగ్.. హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఈ బ్యూటీ లైగర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా అనన్య నటిస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే రీసెంట్గా ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పార్టీకి హాజరైన అనన్య ప్రస్తుతం ట్రోలింగ్ బారిన పడింది. చదవండి: పార్టీలో హీరోయిన్‌తో విజయ్ ముచ్చట్లు.. వీడియో తీసిన చార్మీ ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించిన ఈ బర్త్‌డే పార్టీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్, అనన్య, చార్మీ, పూరి జగన్నాథ్‌లు కూడా పార్టీలో తళుక్కున మెరిశారు. అయితే అనన్య వేసుకున్న డ్రెస్‌ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాను కాపీ కొడుతున్నావా ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: స్టార్ హీరో తమ్ముడితో లైగర్ భామ డేటింగ్, కన్ఫర్మ్ చేసిన తల్లి! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
తల్వార్‌తో కేక్ కట్ చేసిన రామ్ గోపాల్ వర్మ
-
బిల్‌గేట్స్, బెజోస్పై విమర్శలు: ‘మాకు నీతులు చెప్పి.. మీరేమో ఇలా’
వాషింగ్టన్: సామాన్యులు అంటే పర్లేదు కానీ.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తమ నోటి వెంట వచ్చే మాటకు కట్టుబడి ఉండాలి. చేసేవాటినే చెప్పాలి.. చెప్పిన వాటిని ఆచరించాలి. అలా కాదని ప్రజలకు నీతి వ్యాఖ్యలు బోధించి.. వారు మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. జనాలు కూడా ఊరుకోరు. ఎడాపెడా చీవాట్లు పెడతారు. తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రపంచ కుబేరులు బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్. వీరిద్దరిపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు నెటిజనులు. ఈ కుబేరులు ఇంతలా విమర్శలపాలు కావడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవండి. కొద్ది రోజుల క్రితమే బిల్‌గేట్స్ తన 66వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జరుపుకున్నారు. కేవలం 50 మంది మాత్రమే ఈ బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. వేడుకలు టర్కీ సముద్ర తీరంలో.. ఓ లగ్జరీ పడవలో నిర్వహించారు. ఈ పార్టీకి హాజరుకావడం కోసం బెజోస్ హెలికాప్టర్లో 120 మైళ్ల దూరం ప్రయాణించి.. అక్కడకు చేరుకున్నాడు. ఈ బర్త్‌డే వేడుకల సందర్భంగా వెల్లడైన కార్బన్‌డైయాక్సైడ్ మోతాదుపై తాజాగా విపరీతమైన చర్చ నడుస్తోంది. కేవలం నాలుగు గంటల పాటు సాగిన బర్త్‌డే పార్టీ జరిగిన పడవ నుంచి 19 టన్నులు, బెజోస్ హెలికాప్టర్ ప్రయాణంలో 215 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్ వెల్లడయినట్లు తెలిసింది. (చదవండి: ఆయన గెలుపు కంటే.. ఈయన వెటకారమే ఎక్కువైంది) ఈ క్రమంలో పలువురు నెటిజనులు బిల్‌గేట్స్, బెజోస్పై విమర్శలు కురిపిస్తున్నారు. ఓ వైపు ఈ ఇద్దరు మానవతావాదులు పర్యావరణ పరిరక్షణ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. మరోవైపు వీరి ఆడంబరాలు.. మరింత కార్బన్ ఉద్గారాలను వెల్లడిస్తుంటాయి. జనాలకేమో ఆఫీసుకు వెళ్లడానికి వ్యక్తిగత వాహనాల బదులు.. ప్రజా రవాణ వ్యవస్థను వినియోగించుకొండి అని నీతులు చెబుతూ.. మీరు మాత్రం మీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయండి అని విమర్శిస్తున్నారు. (చదవండి: బిల్‌గేట్స్‌నే బకరా చేసిన బిల్డప్ బాబాయ్) బిల్‌గేట్స్ బర్త్‌డే పార్టీ జరిగిన పడవ సూపర్యాచ్ని లానా అని పిలుస్తారు. ప్రముఖ వ్యాపార దినపత్రిక ప్రకారం, గేట్స్ వారానికి 1.8 మిలియన్ పౌండ్లకు దీనిని అద్దెకు తీసుకున్నారు. గేట్స్ అతిథులు మెగా-యాచ్ నుంచి సీ మీ బీచ్ అని పిలువబడే ఫెతియే నగరంలోని ఏకాంత బీచ్‌కి వెళ్లినట్లు తెలిసింది. చదవండి: ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం -
ఐఫోన్‌తో కేక్ కట్ చేసి.. ఎమ్మెల్యే కొడుకు బర్త్‌డే వేడుకలు: వైరల్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ఓ జీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఐఫోన్‌తో బర్త్‌డే కేక్‌లను కట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివకాల్లోకి వెళితే.. కనకగిరి ఎమ్మెల్యే బసవరాజ్ దడేసుగూర్ కొడుకు పుట్టిన రోజు వేడుకలో కేక్‌ను తన ఐఫోన్‌తో కట్ చేశాడు. అతడు పుట్టినరోజును బళ్లారి జిల్లా హోసపేటలో జరుపుకోవడానికి తన స్నేహితులతో కలిసి బీఎండబ్ల్యూలో చేరుకున్నాడు. చదవండి: రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్ కాగా ఈ వీడియోలో మొత్తం 8 కేకులను ఐఫోన్‌తో కట్ చేసి జరుపుకున్నాడు. అయితే దీనిపై అతడి తండ్రి ఎమ్మెల్యే బసవరాజ్ స్పందిస్తూ.. ‘‘నా కొడుకు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ డబ్బుతో కొన్న ఐఫోన్‌తో కేక్ కట్ చేశాడు. ఇందులో తప్పేముంది? కోవిడ్-19 వల్ల చేతులకు బదులు ఐఫోన్ ఉపయోగించాడు’’ అంటూ వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘2018 ఎన్నికలకు ముందు ఎన్నికల ఖర్చుల కోసం ఆయన నియోజకవర్గంలో ప్రజలు డబ్బులు చందాలు వేసుకుని గెలిపించారు. ఆ విధంగా గెలిచిన ఈ ఎమ్మెల్యే ప్రస్తుతం ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈ డబ్బు ఎలా వచ్చింది?’’ అంటూ ప్రశ్నించారు. A Karnataka BJP MLA’s son has stirred a controversy by cutting his birthday cake(s) using his iPhone pic.twitter.com/zht6HhD12X — Soumya Chatterjee (@Csoumya21) September 3, 2021 -
ఆ వీడియోలోని వ్యక్తి నేను కాదు.. జో బైడెన్ మీద ఒట్టు!: వర్మ
Ram Gopal Varma Dance Video: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల బిగ్‌బాస్ భామలు ఆరియాన, అషురెడ్డిలతో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఆరియానతో బోల్డ్ ఇంటర్య్వూ చేశాడు, అషురెడ్డిని డిఫరెంట్ యాంగిల్లో ఫొటో తీసి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా మరో అమ్మాయితో బర్త్‌డే పార్టీలో హంగామా చేసి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అయ్యాడు. ఇందులో ఆర్జీవీ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. దీంతో ‘ఇది ఆయనకేం కొత్త కాదుగా, అమ్మాయిలు, హీరోయిన్లతో రచ్చ చేయడం ఆయనకు మామూలే’ అని నెటిజన్లు చర్చించుకుంటున్న నేపథ్యంగా వర్మ అలాంటి వీడియో మరోకటి తన ట్వీటర్లో షేర్ చేసి షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి.. ‘మీ అందరికి ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నేను కాదు. ఆ రెడ్డ్రెస్లో ఉన్న అమ్మాయి ఇనయా సుల్తానా అసలే కాదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీద ఒట్టు’ అంటూ తనదైన స్టైల్లో ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. కాగా ఈ వీడియోలో వర్మ రంగీలా మూవీలోని పాటకు ఇనయాతో కలిసి స్టెప్పులు వేశాడు. అంతేగాక మధ్యలో ఆమె కాళ్లు పట్టుకుని విచిత్రంగా వ్యవహరించాడు. కాగా ఇనయా సుల్తానా ఆర్జీవీ కొత్త సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఆమె ధన్ రాజ్ హీరోగా వస్తోన్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ‘బుజ్జి ఇలా రా’ యూనిట్ శనివారం ఆమె బర్త్ డే వేడుకను సెలెబ్రేట్ చేశారు. ఇందులో భాగంగా మద్యం సేవించిన ఆర్జీవీ ఆమెతో ఇలా డ్యాన్స్ చేశాడు. చదవండి: బర్త్‌డే పార్టీలో అమ్మాయితో ఆర్జీవీ రచ్చ, వీడియో వైరల్ I once again want to clarify that the guy in this video is not me and the Girl in Red is not @inaya_sultana and I swear this on American President JOE BIDEN pic.twitter.com/K8nNera7Rc — Ram Gopal Varma (@RGVzoomin) August 22, 2021 -
చుక్కేసి.. చిందేసీ..! కలకలం రేపిన బర్త్ డే పార్టీ
పట్నంబజారు: జన్మదిన వేడుకల్లో జరిగిన అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐపై సస్పెçన్షన్ వేటు పడింది. సేకరించిన సమాచారం ప్రకారం... గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించటంతో పాటు, విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులతో అసభ్య నృత్యాలు కూడా జరిగాయి. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కోవిడ్ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేసి, స్వంత పూచీకత్తులపై పంపించి చేశారు. అయితే జరిగిన పార్టీకి అర్బన్ సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా హాజరయ్యారు. ఒకేసారి ఆరుగురు యువతులు, 19 మంది యువకులను తీసుకుని రావటంతో రేవ్‌పార్టీ జరిగిదంటూ కలకలం రేగింది. అయితే దీనిపై స్పందించి పట్టాభిపురం పీఎస్ సీఐ ఎస్వీ రాజశేఖర రెడ్డి ఎటువంటి రేవ్ పార్టీలు జరగలేదని స్పష్టం చేశారు. తాము అక్కడ జరిగిన తంతుని వీడియో చిత్రీకరించామని, ఎటువంటి అశ్లీల నృత్యాలు జరగలేదని తెలిపారు. సమాచారం వచ్చిన వెంటనే దాడి చేయటం జరిగిందని వివరించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేసినట్లు వివరించారు. సీఐపై సస్పెన్షన్ వేటు రెస్టారెంట్లో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లుపై సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ తివిక్రమ వర్మ ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఇటువంటి వ్యవహారాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగిన అసభ్య నృత్యాలు, మద్యం పార్టీలో సీఐ పాల్గొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అయితే సీఐ వెంకటేశ్వర్లు పార్టీ జరిగిన సమయంలో పోలీసులే తప్పించారనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు దాడి చేసే సమయానికే సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారా.. లేక పోలీసులే తప్పించారా అనే కోణాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. -
నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిల దాడి
-
బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగం.. బాలీవుడ్ నటి అరెస్ట్
ముంబై: బాలీవుడ్ యువ నటి నైరా నేహాల్ షాతోపాటు ఆమె స్నేహితుడు అశిక్ సాజిద్ హుస్సేన్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖరీదైన హోటల్లో నటి తన స్నేహితులతో కలిసి జరుపుకున్న బర్త్‌డే పార్టీలో మాదక ద్రవ్యాలు ఉపయోగించారన్న ఆరోపణలతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. పార్టీ నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతాక్రూజ్ పోలీసుల ప్రకారం.. జుహులోని ఫైవ్ స్టార్ హోటల్లో నటి నేహాల్ షా తన బర్త్ డే సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈ వేడుకకు గోవాకు చెందిన తన స్నేహితుడు ఆశిక్ హుస్సేన్ హాజరయ్యాడు. వీరిద్దరూ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో తెల్లవారుజామున 3.30 నిమిషాల సమయంలో హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన నటి నైరా, ఆమె స్నేహితుడు ఆశిక్ ఇద్దరూ చారస్ తినేవారని పోలీసులు గుర్తించారు. పశ్చిమ అంధేరిలోని కూపర్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలో ఇద్దరూ పాజిటివ్ పరీక్షలు చేయించుకున్న తరువాత వీరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చగా ఇద్దరికీ బెయిల్ లభించిందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంపై విచారణ జరుపుతున్నారు. అలాగే వీరికి మాదకద్రవ్యాల్ని సరఫరా చేసిన వారికి కోసం గాలిస్తున్నారు. నేహాల్ షా పలు బాలీవుడ్ చిత్రలతో పాటు రెండు తెలుగు చిత్రాల్లోనూ నటించింది. చదవండి: ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? Sushant Singh: ఆ నవ్వులు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి -
ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ: 64 మందిపై కేసు
కడ్తాల్: లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న బర్త్‌డే పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. నిర్వాహకులతోపాటు మరో 64 మంది యువతీయువకులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో శనివారం రాత్రి జరిగింది. ఇందుకు సబంధించిన వివరాలను ఆదివారం ఎస్ఐ సుందరయ్య వెల్లడించారు. ► కడ్తాల్ మండల కేంద్రం సమీపంలో బాక్స్ ఫాంహౌస్‌లో హైదరాబాద్ నగరానికి చెందిన వరుణ్‌గౌడ్ శనివారం రాత్రి తన బర్త్‌డే వేడుకలను నిర్వహించాడు. వేడుకల్లో ఆయ న మిత్రులైన నగరానికి చెందిన 60 మందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు. యువతీయువకులు మద్యం సేవించి డీజే సౌండ్‌తో నృత్యాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. ► విశ్వసనీయ సమాచారంతో శనివారం రాత్రి 11 గంటలకు ఎస్ఓటీ సిబ్బంది, కడ్తాల్ పోలీసులు కలిసి ఫాంహౌస్‌పై దాడులు చేశారు. 47 మద్యం సీసాలతో పాటు, డీజే సౌండ్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ► బర్త్‌డే వేడుకలు జరుపుకొంటున్న వరుణ్‌గౌడ్ పరారీలో ఉన్నాడని, అతడితోపాటు ఈవెంట్ నిర్వాహకులు భరత్, జీషాన్ అలీఖాన్, అన్వేష్‌తో పాటు వేడుకల్లో పాల్గొన్న 43 మంది యువకులు, 21 మంది యువతులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, సొంత పూచీకత్తుపై విడిచిపెట్టినట్లు తెలిపారు. చదవండి: మెసేజ్ కొట్టు.. గుట్కా పట్టు.. సరిహద్దులో జోరుగా సాగుతున్న దందా.. -
తల్వార్లతో నృత్యాలు: 9 మంది రిమాండ్
నాంపల్లి: మల్లేపల్లి డివిజన్ మాన్గార్ బస్తీలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో తల్వార్లతో నృత్యం చేసిన తొమ్మిది మందిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించామని బీబ్నగర్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్ తెలిపారు. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. మాన్గార్ బస్తీలో సాయిరామ్ యాదవ్ అలియాస్ రాజు యాదవ్, అర్జున్‌లు బుధవారం రాత్రి తమ పుట్టిన రోజు వేడుకలను సుమారు 40 మంది అనుచరులతో కలిసి రోడ్డుపై జరుపుకున్నారు. వీరంతా తాగి నృత్యం చేయగా, వీరిలో 9 మంది యువకులు తల్వార్లతో నృత్యం చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్వార్లు పట్టుకుని నృత్యాలు చేసిన వారిని అరెస్టు చేశారు. వీరిపై ఆయుధాల చట్టం యాక్టు కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు -
పార్టీ పేరుతో రచ్చ..150 మంది అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డ్రైయన్ లోపెజ్ తన 17వ పుట్టిన రోజుకు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. వెంటనే సోషల్ మీడియాలో “అడ్రియన్స్ కిక్‌బ్యాక్” పేరుతో ఆహ్వానాన్ని షేర్ చేశాడు. అయితే స్కూల్ మిత్రుల కోసం పంపిన ఆహ్వానాన్ని లోపెజ్ స్నేహితుడు యాహిర్ హెర్నాండెజ్ (16) తన స్నాప్‌చాట్, టిక్‌టాక్ ఖాతాలలో పోస్ట్ చేశాడు. దీన్ని కొందరు సోషల్ మీడియా సెలబ్రెటీలు షేర్ చేశారు. దీంతో 280 మిలియన్ల నెటిజన్లు “అడ్రియన్స్ కిక్‌బ్యాక్”ను వీక్షించారు. దీంతో దాదాపు 2500 మంది రావడంతో పార్టీని హంటింగ్టన్ బీచ్ నుంచి లాస్ ఏంజల్స్‌లో మరో చోటుకు మార్చారు. అయితే “అడ్రియన్స్ కిక్‌బ్యాక్”లో డబ్బులు పెట్టి టికెన్ కొన్న వారు ఈ విషయం తెలియక అక్కడకు వచ్చి పాటలు పెట్టుకుని..రోడ్డు పై వెళ్లే వాహనాలపై సీసాలు విసరడం మొదలుపెట్టారు. దాంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు లాస్ ఏంజిల్స్‌లో రాత్రిపూట అత్యవసర కర్ఫ్యూ విధించారు. ఆ పార్టీ ప్రారంభించక ముందే పోలీసులు అక్కడికి వచ్చి దాన్ని మూసివేశారు. దీంతో గుంపులోని నుంచి పోలీసుల పై కాల్పులు జరిపారు. కాగా పోలీసులు పార్టీకి వచ్చిన దాదాపు 150 మందిని అరెస్ట్ చేశారు. (చదవండి: Kamal Nath: ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు!) -
లవర్ ఆహ్వానంపై అసంతృప్తి, ఆరుగురిని చంపిన ప్రియుడు
వాషింగ్టన్: తన కుటుంబంలో జరగాల్సిన బర్త్‌డే వేడుకుల్లో పాల్గొనాలంటూ పంపిన ప్రియురాలి ఆహ్వానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియుడు బాధితురాలి కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. అమెరికా కొలరాడో పోలీసులు కథనం ప్రకారం.. మే 9న కొలరాడోలో సాండ్రా అనే యువతి ఇంట్లో బర్త్‌డే పార్టీ జరగాల్సి ఉంది. అయితే ఆ బర్త్‌డే పార్టీకి ఆమె ప్రియుడు మాకియాస్ను ఆహ్వానించింది. కానీ, ప్రియురాలు అందించిన ఆహ్వానంపై అసహనం వ్యక్తం చేసిన మాకియాస్ బాధితురాలి బంధువులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సాండ్రాతో పాటు మెల్విన్ పెరెజ్(30) పెరెజ్ (33) జోనా క్రజ్(52),జోస్ గుటిరెజ్(21) జోస్ ఇబ్రారా(26) దుర్మరణం పాలయ్యారు. అయితే ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలరాడో పోలీస్ అధికారి నిస్కి మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో యువతి సాండ్రా, ప్రియుడు మాకియాస్లు సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వారిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో సాండ్రా ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు పంపిన ఆహ్వానంపై నిందితుడు కోపానికి గురై కాల్పులు జరిపినట్లు తేలింది. గతంలో నిందితుడిపై ఎలాంటి నేర చరిత్రలేదు. నిందితుడు మాకియాస్ ఈ కాల్పులు ఎందుకు జరిపాడు? నిందితుడు వద్ద ఉన్న 15 రౌండ్ల మ్యాగజైన్ ఎక్కడిది? ప్రియురాలి ఆహ్వానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కాల్పులు జరిపాడా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు నిస్కి మీడియా సమావేశంలో వెల్లడించారు. -
గుడ్‌న్యూస్ చెప్పిన వర్ష, ఆ వెంటనే గిఫ్ట్‌తో పార్టీకి!
నటి, యాంకర్ వర్ష కరోనాను జయించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్ష ఈజ్ బ్యాక్ అంటూ సంతోషంగా కామెంట్లు చేస్తున్నారు. అలా కోవిడ్ నుంచి బయటపడిందో లేదో అప్పుడే సందడి మొదలు పెట్టేసింది వర్ష. తన సోదరి కుసుమ పుట్టినరోజు పురస్కరించుకుని ఓ స్పెషల్ గిఫ్ట్‌ను తీసుకెళ్లి ఆమెను సర్ప్రైజ్ చేసింది. ఈ మేరకు పలు ఫొటోలను, చిన్నపాటి వీడియోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. కానీ బర్త్‌డే ఫంక్షన్లో తన సోదరితో దిగిన ఫొటోలను మాత్రం చూపించలేదు. ఏం గిఫ్ట్ ఇచ్చిందనేది కూడా సస్పెన్స్‌గా ఉంచింది. ఏదేమైనా పది రోజుల్లోనే ఆ మహమ్మారి బారి నుంచి వర్ష బయటపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తను షూటింగ్స్‌లో పాల్గొనుండటంతో బుల్లితెర మీద ఆమె సందడి చూసేందుకు ఎదురు చూస్తున్నామంటున్నారు. చదవండి: ఆరోగ్యం బాగోలేదు, కరోనా సోకింది: జబర్దస్త్ వర్ష -
పూజా హెగ్డే ఇంట్లో స్పెషల్ నైట్ పార్టీ
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. తాజాగా ఈ భామ రాత్రిపూట ఓ పార్టీని ఏర్పాటు చేసింది. అదీ తనను పెంచి పెద్ద చేసిన తండ్రి కోసం. పూజా తండ్రి మంజునాథ్ 60వ వడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రిని సర్ప్రైజ్ చేస్తూ ఇంట్లోని ఓ గదిని అంతా బెలూన్లతో అలంకరించింది. పూజా స్వయంగా చేసిన ఈ అలంకరణలను చూసి ఆమె తండ్రి సంతోషం వ్యక్తం చేసి పూజను ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఇక పనిలో పనిగా ఫ్యామిలీ కోసం కచేరీ కూడా పెట్టించిందీ భామ. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. మొత్తానికి బర్త్‌డే పార్టీలో ఫ్యామిలీ అంతా ఓ రేంజ్లో రచ్చ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా వుంటే తెలుగులో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న బుట్టబొమ్మ ప్రస్తుతం 'రాధేశ్యామ్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'ఆచార్య' చిత్రాల్లో నటిస్తోంది. తమిళ హీరో విజయ్ 65వ సినిమాలో కూడా పూజా హీరోయిన్గా కనిపించనుంది. హిందీలో రణ్వీర్ సింగ్ డబుల్ యాక్షన్ చేస్తున్న 'సర్కస్'లోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. చదవండి: విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ అలా మొదలవుతుంది -
వైరల్ వీడియో: బర్త్‌డే పార్టీలో అపశ్రుతి..
‘పుట్టినరోజు’.. ఇది ప్రతి ఒక్కరి జీవితంతో ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఆరోజు గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకుంటాం. అయితే ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న ఓ వ్యక్తి బర్త్‌డే పార్టీలో అపశ్రుతి చోటుచేసుకుంది. మహరాష్ట్రలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఈ నెల ప్రారంభంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. అయితే కేక్ కటింగ్ సమయంలో స్ప్రే చల్లుతుండగా వెలుగుతున్న క్యాండిల్ కారణఃగా ప్రమాదవశాస్తు ముఖానికి మంట అంటుకుంది. వెంటనే అప్రమత్తమైన వ్యక్తి కంగారుగా వెనకకు పరిగెత్తాడు. భయాందోళనకు గురైన అతని స్నేహితులు మంటను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన వల్ల ఆ వ్యక్తి పుట్టిన రోజు వేడుక విషాదంగా మారింది. ఇదంతా అక్కడున్న వ్యక్తి వీడియో తీస్తుండగా రికార్డయ్యింది. ఒళ్లు జలదరించే ఈ వీడియోను పునేట్రావెల్క్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. పార్టీల సందర్భంగా చల్లే ఫోమ్స్పట్ల జాగ్రత్తగా ఉండాలని అందులో పేర్కొన్నారు ‘పుట్టినరోజు స్నో ఫోమ్ ఉపయోగించవద్దు. దాని నురుగు కంటికి మంచిగానే కనిపిస్తుంది కానీ రసాయనాలను కలిగి ఉంటుంది. మండే గుణం ఉండటం వల్ల కంటికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంతేగాక ఫోమ్ మంటగా ఉంటుంది. ఇక చాలా స్ప్రే బాటిల్స్‌పై హెచ్చరిక సంకేతాలు ఉంటాయి. అందులో మంటల వద్ద స్పే చేయవద్దని సూచిస్తుంది. అయినప్పటికీ పుట్టిన రోజు వంటి వేడుకల్లో కొవ్వుత్తులు మండుతుండగా స్నో ఫోమ్స్‌ను స్ప్రె చేస్తుంటారు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి.’ అని పేర్కొన్నాడు. మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. ఆ బర్త్‌డే బాయ్‌కు పెద్ద ప్రమాదం జరుగలేదని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. View this post on Instagram A post shared by Pune travel Blogger (@punetravelx) -
బర్త్‌డే పార్టీలో అల్లు అర్జున్ హంగామా
చావు కబురు చల్లగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శరత్ చంద్ర నాయుడు బర్త్‌డే వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తళుక్కున మెరిశాడు. సోమవారం అతడి పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు హాజరైన బన్నీ దగ్గరుండి కేక్ కట్ చేయించాడు. అనంతరం అతడికి ఆప్యాయంగా కేక్ తినిపించాడు. ఈ పార్టీలో నిర్మాత అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతున్నాయి. ఇందులో బన్నీ లుక్ సరికొత్తగా ఉండటంతో 'అన్న మళ్లీ లుక్ మార్చాడురోయ్..' అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. 'స్టైల్ నీ డీఎన్ఏలోనే ఉంది', 'స్టైలిష్ స్టార్లు ఊరికే అయిపోరు మరి..' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా శరత్ చంద్ర.. బన్నీకి కుడి భుజంలా ఉంటూ అతడి వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఇదే విషయాన్ని బన్నీ 'చావు కబురు చల్లగా' ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ప్రస్తావిస్తూ అతడిపై ప్రశంసలు కురిపించాడు. తనకన్నీ శరతే అని, అతడు తన ఫ్యామిలీ మెంబర్ అని పేర్కొన్నాడు. చదవండి: ఏం సక్కగున్నావ్రో.. అందరి కళ్లు బన్నీ పైనే! అల్లు అర్జున్ను కలిసి ‘కేజీఎఫ్’ డైరెక్టర్.. ఫొటో వైరల్ -
అలాంటివంటే నాకు తెగ సిగ్గు: నటి
2005లో 'యహాన్' సినిమాతో చిత్రసీమలో తెరంగ్రేటం చేసింది మినీషా లంబా. పలు సినిమాలతో పాటు బుల్లితెర మీద కూడా సందడి చేసిన ఆమె నేడు 36వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఎంచక్కా నచ్చిన ప్రదేశంలో బర్త్‌డే జరుపుకోవచ్చు అనుకుంది కానీ కరోనా వల్ల ఆమె తన ప్లాన్లను రద్దు చేసుకుని ఇంటికే పరిమితమైంది. ఈ క్రమంలో ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలను, బాలీవుడ్లో తన ప్రయాణాన్ని ఓసారి నెమరు వేసుకుంది. 'ముందుగా నేను ఎదగడానికి దోహదపడ్డ నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్తున్నా. ప్రతి బర్త్‌డే పార్టీకి నాకు బోలెడన్ని బహుమతులు వచ్చేవి. అప్పుడు అమ్మ ఎవరెవరు ఏమేం ఇచ్చారో వివరంగా రాసిపెట్టేది. ఎందుకంటే దాన్నిబట్టే కదా! మనం కూడా వాళ్ల పుట్టినరోజుకు గిఫ్ట్‌లు ఇవ్వాలి. నా చిన్నప్పుడు అయితే పుస్తకాలు, బట్టలు గిఫ్ట్ ఇస్తే అసలు నచ్చేదే కాదు. కానీ ఇప్పుడు పెద్దయ్యాక అవే బహుమతులు ఇతరులకు పంచుతుంటే సంతోషంగా ఉంటుంది. కాలం అన్నింటినీ మార్చేస్తుంది. ఇప్పటివరకు వచ్చిన బహుమతుల్లో నాకు అత్యంత విలువైనది ఈ బుక్ రీడర్. ఎందుకంటే దాన్ని నేను ఎంచక్కా ఎక్కడకు వెళ్లినా నా వెంట తీసుకువెళ్లొచ్చు. ఇక బాల్యంలో బర్త్‌డేలు అంటే తెగ సంబరపడేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం సిగ్గేస్తుంది. పార్టీలో 50 మంది కన్నా ఎక్కువ ఉంటే నాకు అసలు సౌకర్యవంతంగానే అనిపించదు' అని పేర్కొంది. (చదవండి: ధనుష్‌తో మరోసారి జోడి కడుతున్న తమన్నా) సినిమాల్లో అవకాశాలు... 'ఎందుకో తెలీట్లేదు కానీ కొన్నేళ్లుగా నాకు మంచి ఆఫర్లు రాడం లేదు. అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్ వచ్చాక బోలెడంత స్పేస్ దొరికింది. కంటెంట్ బాగుంటే అందరూ ఆదరిస్తారు. నేను త్వరలో కుతుబ్ మినార్ చిత్రం ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనున్నాను. వేసవిలోగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజవుతుంది' అని మినీషా చెప్పుకొచ్చింది. కాగా హిందీ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొన్న మినీషా నటి పూజా బేడీ సోదరుడు రియాన్‌ను 2015లో వివాహం చేసుకుంది. కానీ తర్వాత ఏమైందో ఏమో కానీ 2020లో వీళ్లిద్దరూ విడిపోయారు. (చదవండి: ఎక్కడికో ఈ అడుగు) -
కత్తి సరిపోలేదని ఖడ్గంతో కోశాడు.. దాంతో
నాగ్‌పూర్ : పుట్టినరోజు వేడుక అంటే అందరితో కలిసి సంతోషంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం తమ పుట్టినరోజును మరిచిపోలేని మధురానుభూతిగా మలుచుకోవాలని అతిగా ప్రవర్తిస్తుంటారు. ఆ అతి ప్రవర్తనే వారిని అందరిముందు అబాసుపాలయ్యేలా చేస్తుంది.(చదవండి : బాణాసంచా పేలి ఐదుగురు సజీవ దహనం) తాజాగా నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల నిఖిల్ పటేల్ అక్టోబర్ 21న తన పుట్టినరోజు పురస్కరించుకొని అందరిని పిలిచి ఘనంగా వేడుకలు నిర్వహించాడు. పార్టీ మధ్యలో వచ్చిన నిఖిల్ స్నేహితులు నాలుగు పెద్ద కేక్‌లను అరేంజ్ చేశారు. సాధారణంగా అయితే ఆ కేకులను కత్తితో కట్‌చేస్తే సరిపోయేది.. కానీ నిఖిల్ ఇక్కడే కాస్త అతిగా ప్రవర్తించాడు. ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్న తాను కేక్‌ను కత్తితో కట్‌చేస్తే మజా ఎలా ఉంటుందని చెప్పి లోపలికి వెళ్లి ఖడ్గం తెచ్చి కేక్‌ను కట్ చేశాడు. నిఖిల్ చేసిన పనిని అతని స్నేహితులు ఫోటోలు తీసి వాట్సప్‌లో షేర్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోలు పోలీసుల దృష్టిలో పడ్డాయి. వెంటనే నిఖిల్ ఇంటికి చేరుకున్న పోలీసులు అతన్ని మారణాయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. -
స్నేహితులే చంపేశారా..?
-
జిల్లాలో పెరుగుతున్న తల్వార్ల సంస్కృతి
మంచిర్యాలక్రైం: జిల్లాలో రోజురోజుకూ తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోతోంది. జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు అర్ధరాత్రి నగరం నడిబొడ్డున కేక్ కట్ చేయడం హంగామా సృష్టించడం జిల్లాలో పరిపాటిగా మారింది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మంగళవారం అర్ధరాత్రి అధికార పార్టీకి చెంది న యవజన విభాగం పట్టణ అధ్యక్షుడు గడప రాకేష్ (జిమ్ రాకేష్) జన్మదిన వేడుకల పేరిట హంగామా సృష్టించారు. వేడుకల్లో ఆయన అనుచరులు తల్వార్ తిప్పుతున్న వీడియో వాట్సాప్‌లో వైరల్ కావడం గమనార్హం. సుమారు 20 రోజుల క్రితం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే అనుచరుడు బెల్లంపల్లిలో అర్ధరాత్రి నడిరోడ్డుపై తల్వార్‌తో కేక్ కట్ చేసిన వీడియో, ఫొటోలు వాట్సాప్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జిల్లాలో అధికార పార్టీ నాయకులకు రాజకీయ నాయకుల అండదండలు, అధికారబలం, పోలీసుల అండదండలు మెండుగా ఉన్నట్లు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తల్వార్లతో కేక్ కట్ చేసిన తాలూకూ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో జన్మదిన వేడుకల్లో తల్వార్లతో కేక్ కట్ చేయడమేంటని జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వారితోనే యువతలో విషసంస్కృతి సంతరించుకుంటుందని, ఇలాంటి ఘటనలపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గడప రాకేష్ అనుచర వర్గంపై కేసు జన్మదిన వేడుకల్లో తల్వార్ తిప్పిన వీడియో వాట్సాప్‌లో వైరల్ కావడంతో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పందించి, మంచిర్యాల పోలీస్ స్టేషన్ సందర్శించారు. జన్మదిన వేడుకలపై ఆరాతీశారు. రాకేష్‌తో పాటు ఆయనకు సంబంధించిన అనుచర వర్గాన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వార్నింగ్‌తో పాటు 9మందిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సీఐ ముత్తి లింగయ్య తెలిపారు. చట్టవ్యతిరేక పనులు సహించం చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. మంచిర్యాలలో గడప రాకేష్ అనే వ్యక్తి నిబంధనలకు వ్యతిరేకంగా బర్త్‌డే పార్టీ అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం, పైగా ఆయన అనుచర వర్గం తల్వార్‌తో హంగామా సృష్టించడం నేరంగా పరిగణించి కేసు నమోదు చేశాం. – సత్యనారాయణ, సీపీ -
స్టేషన్లో పోలీసుల విందు.. మత్తులో చిందులు
పలమనేరు: అసలే కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న తరుణంలో బాధ్యత కలిగిన పోలీసు కానిస్టేబుళ్లు స్టేషన్లోనే పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. మద్యం మత్తులో అర్ధనగ్నంగా నృత్యాలు చేశారు. విచారించిన ఎస్పీ నలుగురిని బదిలీచేశారు. బైరెడ్డిపల్లి పీఎస్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బైరెడ్డిపల్లి పోలీసుస్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ బలరాం పుట్టిన రోజు సందర్భంగా సిబ్బంది స్టేషన్లోనే పార్టీ చేసుకున్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కర్ణాటక మద్యంతో జల్సా చేసుకున్నారు. అంతటితో ఆగక బట్టలు విప్పుకుంటూ నృత్యం చేశారు. వాటిని తమ స్మార్ట్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియోలను కానిస్టేబుళ్ల గ్రూపులో పోస్ట్ చేశారు. స్టేషన్లో కానిస్టేబుళ్ల అరుపులు, కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారమచ్చారు. దీనికితోడు వీడియోలు వైరల్ అయి పోలీసు ఉన్నతాధికారులకు చేరాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ వెంటనే వివారణ జరిపి నివేదిక సమర్పించాలని పలమనేరు డీఎస్పీ అరీఫుల్లాను ఆదేశించారు. ఆయన పంపిన నివేదిక ఆధారంగా కానిస్టేబుళ్లలో బలరాంను మదనపల్లెకి, కార్తీక్‌ను ఐరాలకు, లోకేష్‌ను కేవీబీ పురానికి, హెడ్‌కానిస్టేబుల్ రెడ్డిశేఖర్‌ను సత్యవేడుకు బదిలీచేస్తూ ఎస్పీ సెంథిల్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. -
కరోనా విస్తరణ కేంద్రాలుగా బర్త్‌డే పార్టీలు
-
క‘రోనా’ పార్టీ: ఇద్దరు మంత్రులు హాజరు?
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం ఏ క్వార్టర్స్‌లో ఉండే కిరాణా వ్యాపారి ఏప్రిల్‌లో తన కుమార్తె బర్త్‌డే వేడుకలు నిర్వహించగా, దీనికి హాజరైన 28 మంది వైరస్ బారినపడ్డారు. అదే కుటుంబంలోని తండ్రి, కొడుకు మృతి చెందారు. మలక్‌పేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగి మే నెలలో తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. దీనికి హాజరైన పిల్లల ద్వారా అదే అపార్ట్మెంట్లోని 52 మందికి వైరస్ సోకింది. పçహాడీషరీప్‌కి చెందిన మటన్ వ్యాపారి భార్య తరపు బంధువులంతా మే మూడో వారంలో ఒకేచోట చేరారు. మూడు నాలుగు రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండి, సామూహిక భోజనాలు, ఆటపాటలతో గడిపారు. ఈ ఘటనలో 30 మందికి కరోనా సోకింది. ఇంత జరుగుతున్నా కొందరు మారడం లేదు. ఆరోగ్యంపై అంతో ఇంతో అవగాహన ఉన్న వారు కూడా వేడుకల పేరుతో విందు వినోదాల్లో మునిగితేలుతున్నారు. తద్వారా పలువురికి వైరస్ సోకడంతో పాటు మరణాలూ చోటుచేసుకుంటున్నాయి. అందుకు ఈ తాజా ఉదంతమే నిదర్శనం. నగరంలోని ప్రముఖ బంగారు, వజ్రాల వ్యాపారి కుటుంబం హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్–5లో నివసిస్తోంది. వ్యాపారి 63వ పుట్టిన రోజు వేడుకలను జూన్ 22న కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇద్దరు మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జువెలరీ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖులు.. దాదాపు 150 మంది వరకు హాజరయ్యారు. వీరంతా సామూహిక విందులో పాల్గొన్నారు. అనంతరం రెండ్రోజులకే వ్యాపారి దగ్గు, ఆయాసంతో బాధపడుతూ మాసబ్‌ట్యాంక్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. తాత్కాలికంగా మందులు రాసి, ఎందుకైనా మంచిదని, కరోనా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచించారు. మందులు వేసుకున్నా దగ్గు, ఆయాసం తగ్గకపోవడంతో ఐదు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరగా, ఆ మర్నాడే మృతి చెందారు. ఈ వేడుకలకు హాజరైన జువెలరీ అసోసియేషన్ ప్రతినిధి కూడా కరోనా బారినపడి ఐదు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆ తర్వాత వేడుకలకు హాజరైన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. దీంతో ఈ పార్టీకి హాజరైన ఇతర ప్రముఖులంతా హడలెత్తుతున్నారు. వైద్యుల ట్రేసింగ్‌కు చిక్కకుండా.. వీరంతా మారుపేర్లతో పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలిసింది. -
కరోనా ఎఫెక్ట్; ప్రధానికి ఫైన్
బర్త్‌డే పార్టీని మించిన ఈవెంట్ ఉండదు లోకంలో. ఎవరికి వారే కింగ్ / క్వీన్ ఆ రోజు. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. మరి ఆల్రెడీ కింగ్‌లో, క్వీన్‌లో అయినవాళ్లు బర్త్‌డే రోజు ఏమౌతారు? రొమేనియా ప్రధాని లుడోవిక్ వొర్బన్ మాత్రం అపరాధి అయ్యాడు! 52 వేల రూపాయల ఫైన్ కట్టాడు. మే 25న ఆఫీసులో ఆయన తన బర్త్ డే పార్టీ ఇచ్చారు. ముఖ్యులైన కేబినెట్ సభ్యులు కొందరు పార్టీకి హాజరు అయ్యారు. తాగారు. తిన్నారు. ఆనందించారు. ఆ ఫొటోలు బయటికి వచ్చాయి. మాస్కులు కట్టుకోకుండా, దూరం పాటించకుండా కరోనా ఆంక్షలు ఉల్లంఘించినందుకు, తలుపులు మూసి ఉంచిన గదిలో సిగరెట్ తాగినందుకు ప్రధాని సహా అందరూ అపరాధ రుసుము చెల్లించవలసి వచ్చింది. -
హైదరాబాద్‌లో మళ్లీ విజృంభిస్తుంది
కరోనా వైరస్ గ్రేటర్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకు సగటున 30 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదలకు జనం నిర్లక్ష్యమే కారణంగా చెప్పొచ్చు. ఏమాత్రం భయం లేకుండా కొంతమంది విచ్చలవిడిగా విందులు, వినోదాలకు తెరతీయడంతోనే కోవిడ్ ముప్పు పెరిగింది. వనస్థలిపురం, మలక్‌పేట్, తాజాగా పహడీషరీఫ్ ఉదంతాలే ఇందుకు నిదర్శనం. లాక్డౌన్ సడలింపులను ఆసరాగా చేసుకుని పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి రావడం, భౌతిక దూరం, మాస్కులు ధరించడం మర్చిపోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ త్వరగా విస్తరిస్తోంది. మార్చి మాసంలో 64 పాజిటివ్ కేసులు నమోదు కాగా..ఏప్రిల్‌లో 537, మేలో మంగళవారం వరకు 712 కరోనా కేసులు నమోదవడం గమనించాల్సిన అంశం. (గుమిగూడితే.. చెప్పేస్తుంది) సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ సిటిజన్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చాపకింది నీరులా విస్తరిస్తున్న వైరస్ ఇప్పటికే 200కిపైగా కుటుంబాలను చుట్టేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1991 పాజిటివ్ కేసులు నమోదు కాగా... గ్రేటర్ హైదరాబాద్‌లోనే 1313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 57 మంది మృతి చెందగా.. వీరిలో 50 మంది సిటిజనులే. కేవలం 26 రోజుల్లో 29 మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు రోజుకు సగటున 30 పాజిటివ్ కేసులు నమోదవుతుండగా..మరో వైపు సిటిజన్లు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. చాలా మంది ముఖానికి మాస్క్ ధరించడం లేదు. (ఏమరుపాటు వద్దు!) భౌతికదూరం పాటించక పోగా, పుట్టిన రోజులు, ఇతర వేడుకల పేరుతో పెద్ద సంఖ్యలో ఒకే చోట చేరుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరించి కుటుంబ సభ్యులతో పాటు మొత్తం బంధు వర్గమే..అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది. వనస్థలిపురం, మలక్‌పేట్, తాజాగా పహడీషరీఫ్ ఉదంతాలే ఇందుకు నిదర్శనం. కేవలం ఈ మూడు వేడుకల్లోనే వంద మందికి వైరస్ సోకడం విశేషం. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసింది. ఈ సమయంలో వైరస్ తగ్గినట్లే తగ్గి..ఆంక్షల సడలింపుతో ప్రస్తుతం మళ్లీ విజృంభిస్తుంది. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా నగరంలో బుధవారం మరికొన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో నాలుగు అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కొత్తగా పది మంది అనుమానితులు అడ్మిటయ్యారు. వీరి నుంచి స్వాబ్స్ సేకరించి, పరీక్షలకు పంపారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన 17 మందిని డిశ్చార్జి చేశారు. ఆయుర్వేద ఆస్పత్రిలో 19 మంది అనుమానితులు ఉన్నారు. వీరి రిపోర్టులు కూడా రావాల్సి ఉంది. ఇక కింగ్‌కోఠి ఆస్పత్రిలో 84 మంది అనుమానితులు ఉన్నారు. వీరి రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. ముంబై నుంచి వచ్చిన యువతికి పాజిటివ్ హఫీజ్‌పేట్ : ఇటీవల ముంబై నుంచి వచ్చిన యువతికి (18) కరోనా పాజిటివ్ వచ్చింది. మియాపూర్‌లోని టీఎన్‌నగర్‌కు చెందిన కుటుంబం మూడేళ్ల క్రితం కూలీ పనుల కోసం ముంబై వెళ్లింది. లాక్డౌన్ సడలించడంతో ఈ నెల 23న నగరానికి తిరిగివచ్చారు. స్థానికుల సమాచారంతో అధికారులు సదరు కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా యువతికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె తల్లిదండ్రులను వైద్య పరీక్షల కోసం కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. టీఎన్ నగర్‌ను కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ముషీరాబాద్‌లో ఇద్దరికి పాజిటివ్ ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో బుధవారం మరో రెండు పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. భోలక్‌పూర్ డివిజన్, గుల్షన్నగర్కు చెందిన మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నారాయణగూడలో టైలర్‌షాపు నిర్వహిస్తూ బాగ్‌లింగంపల్లి ఎల్ఐజీ క్వార్టర్స్‌లో ఉంటున్న వ్యక్తి(56) కూడా కరోనా బారిన పడటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గోషామహల్లో మరో ఇద్దరికి.. అబిడ్స్: గోషామహాల్ జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ పరిధిలో బుధవారం మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గంగాబౌలికి చెందిన కళాకారుడు (52)కి పాజిటివ్ రావడంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులు 10 మందిని హోం క్వారంటైన్ చేశారు. టక్కర్వాడికి చెందిన వ్యక్తి (56)కు కరోనా బారిన పడటంతో అతడి కుటుంబసభ్యులు 9 మందిని హోం క్వారంటైన్ చేశారు. కరోనాతో వృద్ధురాలి మృతి స్వచ్ఛందంగా హోం క్వారంటైన్లో 50 కుటుంబాలు అల్వాల్: కరోనాతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు బుధవారం మృతి చెందింది. అదిలాబాద్‌కు చెందిన వృద్ధురాలు (65) కాలికి చికిత్స చేయించుకునేందుకుగాను కొద్ది రోజుల క్రితం అల్వాల్ పాకాలకుంటలో ఉంటున్న కుమారుడి ఇంటికి వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఆమెకు జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. అపార్ట్మెంట్లో ఉంటున్న 50 కుటుంబాలు స్వచ్ఛందంగా హోం క్వారంటైన్లో ఉంటున్నారు. కింగ్‌కోఠి ఆసుపత్రిలో మరొకరు.. సుల్తాన్‌బజార్: కరోనాతో బాధపడుతూ బుధవారంఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..చందానగర్‌కు చెదిన వ్యక్తి(57) గత కొంతకాలంగా హైపర్‌టెన్షన్, బీపీతో బాధపడుతున్నాడు. కొద్ది రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్న అతను మంగళవారం కింగ్‌కోఠి ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. నలుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్ కరోనా వైరస్ జిల్లాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మహమ్మారి.. జిల్లా అంతటా విస్తరిస్తోంది. నందిగామ, రాజేంద్రనగర్, బాలాపూర్, శేరిలింగంపల్లి, వనస్థలిపురం, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించిన కరోనా.. ప్రస్తుతం షాద్‌నగర్, శంకర్పల్లి, మొయినాబాద్, మహేశ్వరం ప్రాంతాల్లో పంజా విసురుతోంది. బుధవారం మరో 9 కొత్త కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న నలుగురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరు నార్సింగి, మదీనాగూడ, మణికొండ, శంకర్‌పల్లికి చెందినవారు. మిగిలిన ఐదుగురిలో మొయినాబాద్, మణికొండ, మియాపూర్‌కు చెందిన వారు ఒకరుచొప్పున ఉండగా ఇద్దరు షాద్‌నగర్ వాసులు. ఈ నేపథ్యంలో గచ్చిబౌళిలోని సైబరాబాద్ కమిషనరేట్‌ను శానిటైజ్ చేశారు. కమిసనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను శానిటైజేషన్ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
25 మందికి వైరస్ పంచిన చిరు పార్టీ
సాక్షి, హైదరాబాద్: ఒక చిన్న బర్త్‌డే పార్టీ.. రెండు కుటుంబాల్లోని మొత్తం 25 మందిని రిస్క్‌లోకి నెట్టేసింది. వారందరికీ కరోనా వైరస్ సోకింది. వీరిలో ఇద్దరు ఇప్పటికే మృతి చెందగా, మిగిలినవారు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మలక్‌పేట్‌గంజ్‌లో పల్లినూనె వ్యాపారం చేసే వ్యక్తి (52) ద్వారా ఆయన భార్య సహా వనస్థలిపురంలో ఉంటున్న తల్లిదండ్రులకు, సోదరుడికి, ఆయన భార్యకు, వారి ఇద్దరి పిల్లలకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయం తెలియక పల్లినూనె వ్యాపారి సోదరుడు ఏప్రిల్ 23న ఇంటి వద్దే తన బిడ్డ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. (కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్!) హుడా సాయి నగర్‌లోని ఐటీ ఉద్యోగి తల్లి సహా బీఎన్‌రెడ్డిలోని ఎస్కేడీనగర్ లోని సోదరి కుటుంబ సభ్యులు సహా పలువురు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇలా ఒక చిన్న బర్త్‌డే పార్టీ.. ఆ రెండు కుటుంబ సభ్యులందరినీ ఇబ్బందు ల్లో పడేసింది. వీరిలో పల్లినూనె వ్యాపారి తండ్రి సహా రెండో కుమారుడు కూడా ఇప్పటికే మృతి చెందారు. ఇక మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి ద్వారా మొత్తం 13 మందికి వైరస్ సోకింది. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు ఆయన ఇంటి పక్కన ఉండే కార్పెంటర్ కుటుంబానికి కూడా కరోనా వచ్చింది. (కరోనాకు ధూమపానం మంచిదేనట!) -
ప్రియుడు రాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, చెన్నై: తాను ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీకి ప్రియుడు రాలేదన్న కోపంతో మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. విల్లుపురానికి చెందిన శివ కుమార్తె శరణ్య (22) రైల్వే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ పెరంబూరు రైల్వే క్వార్టర్స్‌లో ఉంటోంది. ప్రస్తుతం కరోనా భద్రత నిమిత్తం ఎస్ ప్లనేడు పోలీసుస్టేషన్లో విధులు కేటాయించారు. సాయుధ బలగాల విభాగంలో పనిచేస్తున్న ఏలుమలైతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం ఏలుమలై బర్త్‌డే కావడంతో శరణ్య విధుల్నిత్వరగా ముగించుకుని ప్రియుడి బర్త్‌డే వేడుకలకు సిద్ధం చేసింది. సాయంత్రం ఆరు గంటల్లోపు క్వార్టర్స్‌కు రావాలని ఏలుమలైకు ఆమె సూచించింది. అయితే, ఏలుమలైకుపేదలకు ఆహారం అందించే ప్రాంతాల్లో భద్రతా విధులు కేటాయించారు. దీంతో శరణ్య చెప్పిన సమయానికి వెళ్లకపోవడంతో విషయం వివరించడానికి రాత్రి తొమ్మిది గంటల సమయంలో శరణ్యకు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించక పోవడంతో అదే క్వార్టర్స్‌లో ఉన్న ఆమె మిత్రురాలు రాజేశ్వరికి సమాచారం ఇచ్చాడు. తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆమె వెళ్లి చూడగా శరణ్య అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతుండడంతో ఓట్టేరి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
లాక్డౌన్ ఉల్లంఘించి.. ఎమ్మెల్యే బర్త్‌డే పార్టీ
బెంగళూరు : దేశంలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తున్నా.. మరోవైపు నిబంధనలను అతిక్రమిస్తూనే ఉన్నారు. పని ఉన్నా లేకున్నా అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరుగుతూ. నానా హంగామా చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం నొక్కి చెబుతునప్పటికీ ప్రజలు చెవినకెక్కించుకోవడం లేదు. లాక్డౌన్ కాలంలో ప్రజలు గుమిగూడి వివాహాలు, వేడుకలు, వినోదాలకు దూరంగా ఉన్నాలని ప్రభుత్వం తెలియజేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. సాధారణ ప్రజలతోపాటు ఈ జాబితాలోకి రాజకీయ నాయకులు కూడా చేరిపోయారు. తాజాగా కర్ణాటకలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే తన పుట్టినరోజును అనేకమంది గ్రామస్తుల సమక్షంలో జరుపుకున్నారు. (కరోనాపై పోరులో చిరంజీవి తల్లి ) తుమకూరు జిల్లా తురువెకెరె నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం జయరామ్ గుబ్బి ప్రాంతంలో శుక్రవారం పుట్టిన రోజును జరుపుకున్నారు. స్థానికుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకకు కరోనాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. అంతేగాక అందరి సమక్షంలో కేక్ కట్ చేసి, అనంతరం వారికి బిర్యానీతో విందును ఏర్పాటు చేశారు. దీంతో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనలు పాటించని బీజేపీ ఎమ్మెల్యే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కర్ణాటకలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సైతం ఓ పెళ్లికి హాజరై విమర్శలు ఎదుర్కొన్నారు. (‘అమెరికా పౌరులను అడ్డుకుంటే చర్యలు తప్పవు’) ప్రస్తుతం కర్ణాటకలో 200కు పైగా కరోనా కేసులు నమోదవ్వగా.. ఆరుగురు మరణించారు. కాగా మూడు వారాలపాటు విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే అంతిమ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీని సంప్రదించిన తర్వాతే ముఖ్యమంత్రి యడియూరప్ప ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక దేశంలో మొత్తం కరోనా కేసులు 6761కు చేరగా.. 206 మంది మృత్యువాత పడ్డారు. (కరోనా: ఒకే ఇంట్లో ఐదుగురికి సోకిన వైరస్ ) -
మరికొద్ది గంటల్లో బర్త్‌డే వేడుకలు.. అంతలోనే
గుహవాటి : మరికొద్ది గంటల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న ఘటన గుహవాటిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుహావటికి చెందిన తుషార్ శివసాగర్‌లో జియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. కాగా తన భార్య శిల్సి గోస్వామి, పిల్లలు ఇషాన్(7), ఇవాన్(4)లతో కలిసి బైస్తాపూర్‌లో ఒక డూప్లెక్స్‌లో నివసిస్తున్నారు. కాగా గురువారం ఇవాన్ గోస్వామి పుట్టిన రోజు కావడంతో అతని బర్త్‌డే పార్టీని ఘనంగా నిర్వహించాలనుకున్నారు. శిల్పి గోస్వామి, తుషార్ తల్లి ఇంటి గ్రౌండ్ ప్లోర్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమవగా, ఇవాన్,ఇషాన్‌లు ఇంటి మొదటి అంతస్తులో ఆడుకుంటున్నారు. ఇంతలో మొదటి అంతస్తు మంటల్లో చిక్కుకోవడంతో శిల్పి గోస్వామి పైకి వెళ్లి చూశారు. అప్పటికే ఇద్దరు మంటల్లో కాలిపోవడం చూసి ఆపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెకు కూడా మంటలంటుకున్నాయి. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇళ్లు మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారమందించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వారందరిని గుహవాటి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ఇవాన్, ఇషాన్‌లు చనిపోయారని వెల్లడించారు. కాగా శిల్సి గోస్వామి, తుషార్ తల్లికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే విషయమై గుహవాటి పోలీస్ కమిషనర్ ఎంపి గుప్తా మాట్లాడుతూ.. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అవడంతో మొదటి అంతస్తు మంటల్లో చిక్కుకుందని తెలిపారు. కాగా తమ ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్‌తో గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో ఇళ్లు మొత్తం అంటుకుందని పేర్కొన్నారు. కాగా తుషార్‌కు ప్రమాదంపై సమాచారం ఇచ్చామని, అతను బయలుదేరినట్లు గుప్తా వెల్లడించారు. ఈ ఘటనపై అస్సాం సీఎం శరబనంద సోనోవాల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వెంటనే విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. -
పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువతి..
మేడ్చల్: స్నేహితురాలి బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కండ్లకోయలో ఉంటున్న అనుషా(17)శనివారం ఉదయం కొంపల్లిలో ఉంటున్న తన స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకలకు బయలుదేరి వెళ్లింది. సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో మహిళ.. బొల్లారం: కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరుమలగిరి, పెద్ద కమేళా ప్రాంతంలో ఉంటున్న కణక్రామ్కు నలుగురు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అతని నాలుగో కుమార్తె అనిత(35) టైలరింగ్ చేసేది. గత కొద్ది రోజులుగా పెళ్లి విషయమై తండ్రి,కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 10న పని ఉందని బయటికి వెళ్లిన అనిత ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం ఆమె తండ్రి కణక్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇకపై బర్త్‌డే రోజు అలా చేస్తే అరెస్టే!
అహ్మదాబాద్ : పుట్టిన రోజు స్నేహితులతో కలిసి రోడ్లపై రచ్చ చేసే ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు గుజరాత్ పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.వేడుకల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో కేకు పూయడం, ఫోమ్ స్ప్రే చేయడం వంటివి ఇకపై అరెస్టు చేస్తామంటూ సూరత్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. బర్త్‌డే పేరిట ఒక వ్యక్తిని గాయపరచడం, తీవ్రంగా కొట్టడం, అర్ధరాత్రి రోడ్లపై సంచరించడం వంటివి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయం గురించి సూరత్ పోలీసు కమిషనర్ సతీశ్ శర్మ మాట్లాడుతూ.. రోడ్లపై బర్త్‌డే పార్టీలు చేసుకునే క్రమంలో కొంతమంది న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని తమకు ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఆకతాయిల కారణంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయనే ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో పాదచారుల అసౌకర్యాన్ని దూరం చేసేందుకు ఈ రకమైన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. వీటిని ఉల్లంఘించిన వారిని సీఆర్పీసీ సెక్షన్ 144 ప్రకారం అరెస్టు చేసే వీలుంటుందని పేర్కొన్నారు. కాగా గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే పబ్జీ గేమ్, పబ్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక బర్త్‌డే బంప్‌ల కారణంగా రెండు నెలల క్రితం ఐఎమ్ఎమ్ విద్యార్థి తీవ్రంగా గాయపడి తుదిశ్వాస విడిచిన ఘటన కలకలం రేపింది. బర్త్‌డే సందర్భంగా అతడు స్నేహితులకు పార్టీ ఇవ్వగా.. వేడుకలో భాగంగా వాళ్లు అతడిని చితక్కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ బర్త్‌డే బాయ్ మరుసటి రోజు తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనల నేపథ్యంలో సూరత్ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. To summarize, it's an order against public nuisance which can harm those involved. Detailed summary in pic. Cake smearing is a tiny part. Bulk is against public celebration and usage of chemicals, tape & foam directly applied to the face. pic.twitter.com/sKOe1C38Nu — Harshal Modi (@grondmaster) May 15, 2019 -
ఇంటిప్స్
బర్త్‌డే పార్టీల్లో కొవ్వొత్తులు వెలిగించిన తరవాత, అందరూ వచ్చి కేక్ కట్ చేసేలోపే కరిగిపోతుంటాయి. క్యాండిల్ ఎక్కువ సేపు వెలగాలంటే... ఒక రోజంతా కొవ్వొత్తులను ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఫ్రీజర్‌లో గట్టిపడిపోయిన క్యాండిల్ మెల్లగా కరుగుతూ ఎక్కువ సేపు వెలుగుతుంది. మైనం కరిగి కేక్ మీద పడుతుందేమోననే ఆందోళన ఉండదు. బాత్రూమ్లోని అద్దం నీటి ఆవిరితో మసకబారుతుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే... వారానికోసారి అద్దాన్ని సబ్బు (డ్రై సోప్ బార్) తో రుద్ది ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. పట్టుచీరలకు నూనె మరకలంటితే... మరక మీద మొక్క జొన్న పిండి (కార్న్‌ఫ్లోర్) చల్లి కొద్దిసేపు అలా ఉంచేయాలి. నూనెను పిండి పీల్చుకున్న తర్వాత పొడిరాలిపోయేటట్లు విదిలించాలి. స్నానానికి వాడిన సబ్బు అరిగి చిన్నదైన తర్వాత దానిని వేడినీటిలో వేసి కొద్దిగా గ్లిజరిన్ కలిపి ఒక బాటిల్లో పోసి బాగా కదిలించాలి. ఈ లిక్విడ్‌ని హ్యాండ్వాష్గా వాడుకోవచ్చు. -
వెన్నెల్లో.. ఇసుక తిన్నెల్లో..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ స్టార్ నిక్ జోనాస్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రియాంక, నిక్‌లు నోరు మెదపకపోయినా వరుస టూర్లు, పార్టీలతో ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ప్రియాంక పుట్టిన రోజు కోసం నిక్ భారీగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఈ నెల 18న ప్రియాంక తన 36వ ఏట అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ప్రియాంకకు ఇష్టమైన ఓ బీచ్‌లో సెలబ్రేషన్స్ చేయాలని నిక్ ప్లాన్ చేశారట. నిక్కు ముందుగా అనుకున్న కమిట్మెంట్స్ ఉండటం వల్ల అమెరికాను దాటి వెళ్లడానికి కుదరడం లేదని తెలిసింది. దాంతో వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో పుట్టిన రోజు వేడుక జరిపి ప్రియాంకపై తనకు ఉన్న ప్రేమను తెలిపేందుకు నిక్ సిద్ధమవుతున్నారట. -
రైనా కుమార్తె పుట్టిన రోజు వేడుకల్లో చెన్నై అటగాళ్ల సందడి
-
గ్రేసియా పుట్టినరోజు.. చెన్నై సందడి..
న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా కుమార్తె గ్రేసియా పుట్టిన రోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు ధోనీ, బ్రావో, హర్భజన్ సింగ్‌లు హాజరై ఆటపాటలతో అలరించారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్విటర్ నుంచి ఓ వీడియోను విడుదల చేసింది. లీగ్ మ్యాచ్‌లలో భాగంగా మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో చెన్నై తలపడనుంది. రైనా గారాలపట్టి వేడుకకు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వేడుకల సందర్భంగా ఆటగాళ్లు సందడి చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. Here is your midnight dose of cuteness to begin a super happy Wednesday! #WhistlePodu #GraciaTurns2 @ImRaina @_PriyankaCRaina @msdhoni @DJBravo47 @Geeta_Basra 🦁💛 pic.twitter.com/UbIRi7m0F6 — Chennai Super Kings (@ChennaiIPL) 15 May 2018 -
‘అర్జున్‌రెడ్డి’ బర్త్‌డే.. వినూత్న ఆలోచన!
సాక్షి, హైదరాబాద్: ఇండస్ట్రీలో తనకంటూ గాడ్ ఫాదర్స్ లేకున్నా స్వయంకృషితో రాణిస్తోన్న నటుడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’తో సక్సెస్ అందుకున్న హీరో విజయ్.. ఆపై ‘అర్జున్‌రెడ్డి’తో మరోసారి నిరూపించుకున్నాడు. ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఆలోచించే నటుడు విజయ్ పుట్టినరోజు నేడు(మే 9). అయితే తన బర్త్‌డే సందర్భంగా బర్త్‌డే ట్రక్‌లను ఏర్పాటు చేశాడు ‘అర్జున్‌రెడ్డి’. హైదరాబాద్ నగరవాసులకు ఐస్‌క్రీమ్స్ అందిస్తూ బర్త్‌డే పార్టీ చేసుకుంటున్నాడు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశాడు విజయ్. ఈ నటుడు చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘ వేసవి ఎండల్లోనూ కొన్ని రోజులు షూటింగ్ చేశాక నాకు ఈ ఆలోచన వచ్చింది. మూడు ఐస్‌క్రీమ్ ట్రక్కులను తీసుకున్నా. ట్రక్కులు హైదరాబాద్ సిటీలో తిరుగుతూ ట్రాఫిక్ పోలీసులు, చిరువ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అందరికీ ఉచితంగా ఐస్‌క్రీమ్స్ అందిస్తాయి. మీకు ఎక్కడైనా నా బర్త్‌డే ట్రక్ కనిపిస్తే ఏం సిగ్గుపడకుండా ఐస్‌క్రీమ్ తీసుకోండి. హాయిగా ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను నాకు షేర్ చేయండి. మీకు ముఖాల్లో ఆనందాన్ని చూస్తే నేను హ్యాపీగా ఫీలవుతానంటూ’ హీరో విజయ్ తన ట్వీట్లలో రాసుకొచ్చారు. A few days of shooting in the Sun made me think of this. What if I got 3 ice cream trucks to drive around the city and give out free ice cream to everyone going about their day in the heat. The traffic cops, the street vendors, students, employees. pic.twitter.com/tisrb8Ot6m — Vijay Deverakonda (@TheDeverakonda) 9 May 2018 So say Hi to the #TheDeverakondaBirthdayTruck I am throwing the city a party, these trucks will be travelling through most of #Hyderabad. We will be giving away IceCream to as many as possible nd If you spot them, don't be shy just go and take some IceCream:) smile and enjoy it. — Vijay Deverakonda (@TheDeverakonda) 9 May 2018 -
‘మత్తు’లో మహిళా డ్యాన్సర్లతో అసభ్య ప్రవర్తన
సాక్షి, శంషాబాద్: ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో మద్యం మత్తులో ఉన్న యువకులు డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆటో డ్రైవర్‌ను చితకబాదిన ఘటనలో ఆర్జీఐఏ పోలీసులు పాతబస్తీకి చెందిన 11 మందిని రిమాండ్‌కు తరలించారు. గురువారం ఆర్జీఐఏ ఠాణాలో ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. పాతబస్తీ వట్టెపల్లి ప్రాంతానికి చెందిన చిరువ్యాపారి పర్వేజ్ మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా శంషాబాద్–మామిడిపల్లి రహదారిలో హసీబుద్దీన్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో వేడుకలకు ఏర్పాటు చేశాడు. పర్వేజ్‌తో పాటు మహ్మద్ రహమాన్, ముక్రముద్దీన్, సయ్యద్ బుర్హాన్, సయ్యద్ నసీర్ పాషా, మహ్మద్జుబేరుద్దీన్, సోహెల్షాఖాన్, కరీముద్దీన్, షహబాజ్ అలీ, ఇమ్రాన్, సయ్యద్ అస్గర్ అహ్మద్, సల్మాన్, అస్లాం పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిళా డ్యాన్సర్లను మొఘల్‌పురా నుంచి రాత్రి 10 గంటలకు ఫాంహౌస్‌కు తీసుకొచ్చారు. మద్యం మత్తులో జోగుతున్న వీరు హుక్కాను కూడా సేవించారు. వీరిలో కొందరు డ్యాన్సర్లతో అసభ్యకరంగా ప్రవర్తించడమేగాక నగ్నంగా డ్యాన్స్‌లు చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో భయపడిన డ్యాన్సర్లు ఆటోడ్రైవర్ అజ్జు సహకారంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా సదరు యువకులు వారిని వెంబడించి ఆటోను అటకాయించి డ్రైవర్‌పై దాడి చేశారు. గస్తీలో ఉన్న పహాడీషరీఫ్ పోలీసులు దీనిని గమనించి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధిత యువతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్నోవా కారు, బైక్‌లను స్వాధీనం చేసుకుని 11 మందిని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఆర్జీఐఏ సీఐ మహేష్, అడ్మిన్ ఎస్ఐ రమేష్‌నాయక్ పాల్గొన్నారు. -
రాశీఖన్నా బర్త్‌డే పార్టీలో సినీ తారలు
-
స్నేహితుడిని పార్టీకి పిలిచి రివాల్వర్‌తో కాల్పులు
-
బర్త్‌డే.. బుల్లెట్స్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లి కింగ్స్‌కాలనీ (శాస్త్రీపురం జిల్లెలగుట్ట)లో శనివారం తెల్లవారుజామున కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. తన వ్యాపారాలపై ఆదాయపన్ను శాఖకు సమాచారమిచ్చాడనే అనుమానంతో జుబేర్ అనే రియల్టర్ ముస్తఫా అనే తన స్నేహితుడిని తుపాకీతో కాల్చాడు. పుట్టినరోజు పార్టీకి పిలిచి.. ఆ పార్టీ అయిపోయిన తర్వాత తుపాకీతో రెండు రౌండ్లు కాల్చాడు. అనంతరం ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. కాల్పులు జరిపినట్లుగా భావిస్తున్న జుబేర్ ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఎంఐఎం నేత, రియల్ఎస్టేట్ వ్యాపారి షానవాజ్ కుమారుడు. వ్యాపార లావాదేవీలు, అప్పుల వివాదంతోపాటు ఐటీకి సమాచారమిచ్చాడనే అనుమానాలు ఈ కాల్పుల ఘటనకు కారణాలని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన అనంతరం గాలింపు చేపట్టిన పోలీసులు జుబేర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. పుట్టినరోజు పార్టీలో.. మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ముస్తాఫా (35). శుక్రవారం రాత్రి ఓ పుట్టినరోజు పార్టీ కోసం కింగ్స్కాలనీలోని తన స్నేహితుడు, వ్యాపారి జుబేర్ వద్దకు వచ్చారు. పార్టీ చేసుకున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ముస్తాఫాపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముస్తాఫా ఛాతీలో బుల్లెట్ దిగడంతో కుప్పకూలిపోయాడు. అనంతరం జుబేర్‌తో పాటు తోటి స్నేహితులు ఆయనను వెంటనే బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ముస్తాఫాకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఒక బుల్లెట్‌ను వెలికితీశారని మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ వెల్లడించారు. ప్రస్తుతం ముస్తాఫా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కోలుకున్న తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్పుల ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జుబేర్‌కు గతంలో నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు. అతడికి, ముస్తాఫాకు మధ్య రియల్ ఎస్టేట్ గొడవలు కూడా ఉన్నట్లు తెలిసింది. తనను జుబేర్ బెదిరిస్తున్నాడని గతంలోనే ముస్తాఫా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు. వారి మధ్య లావాదేవీలు, వివాదాలను తేల్చేందుకు శాస్త్రీపురం జిల్లెలగుట్ట (శాస్త్రీపురం గుట్ట)పై ఉన్న జుబేర్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో సోదాలు చేశారు. కింగ్స్ కాలనీ, శాస్త్రీపురం ప్రధాన రహదారి, జుబేర్ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. జుబేర్, ఆయన తండ్రి షానవాజ్‌లు ఇద్దరికీ లైసెన్స్ రివాల్వర్లు ఉన్నాయి. అయితే ముస్తాఫాపై కాల్పులు జరిపింది ఈ లైసెన్స్ రివాల్వర్తోనేనా..? ఇంకేదైనా రివాల్వర్‌తో కాల్పులు జరిపారా అన్నది తేల్చాల్సి ఉంది. ఎవరీ జుబేర్, ముస్తాఫా? ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఎంఐఎం నేత, రియల్ఎస్టేట్ వ్యాపారి షానవాజ్ కుమారుడు జుబేర్. జుబేర్ కూడా కొన్నేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఇక మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన ముస్తాఫా గతంలో చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారి. తర్వాతి కాలంలో జుబేర్‌తో స్నేహం ఏర్పడింది. అనంతరం ముస్తాఫా కొంతకాలంలోనే పెద్ద రియల్టర్‌గా ఎదిగారు. అప్పటినుంచి జుబేర్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నాడని, ఆయన వ్యాపారాల్లో భాగస్వామిగా కూడా ఉన్నారని సమాచారం. అయితే కొంతకాలం కింద జుబేర్ కార్యాలయం, ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఐటీ శాఖకు సమాచారమిచ్చింది ముస్తాఫాయేనని జుబేర్ అనుమానించడంతో.. వారి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది.