సైఫ్ బర్త్ డే పార్టీలో మెరిసిన కరీనా.. | Pregnant Heroine spotted at Husband's Birthday | Sakshi
Sakshi News home page

సైఫ్ బర్త్ డే పార్టీలో మెరిసిన కరీనా..

Aug 16 2016 8:04 PM | Updated on Sep 4 2017 9:31 AM

సైఫ్ బర్త్ డే పార్టీలో మెరిసిన కరీనా..

సైఫ్ బర్త్ డే పార్టీలో మెరిసిన కరీనా..

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పుట్టినరోజు వేడుకలో అతిధుల కళ్లన్నీ కరీనాపైనే నిలిచాయి.

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పుట్టినరోజు వేడుకలో అతిధుల కళ్లన్నీ కరీనాపైనే నిలిచాయి. సోమవారం రాత్రే మొదలైన సైఫ్ పుట్టిన రోజు వేడుకలో ఆయన భార్య కరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కరీనా త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో కెమెరాకు చిక్కకుండా ఉన్న కరీనా సైఫ్ బర్త్ డే వేడుకలో మెరిసి ఫొటోలకు దొరికేసింది. బిగ్ సైజ్ ఔట్ ఫిట్లో ఆమె మరింత అందంగా కనిపించింది.

డిసెంబర్లో ఈ దంపతులు తమ మొదటి బిడ్డను ఆహ్వానించనుండగా.. ఈలోగా తను సైన్ చేసిన ప్రాజెక్టులను పూర్తిచేయాలని చూస్తోంది కరీనా. సైఫ్.. తల్లి షర్మిలా ఠాగూర్, సోదరి సోహా అలీఖాన్, కుమారుడు ఇబ్రహీం అలీఖాన్, కరిష్మా కపూర్ తదితరుల సమక్షంలో మరికొందరు ఆత్మీయ అతిధుల మధ్య బాంద్రాలోని తన ఇంట్లో పుట్టినరోజు వేడుకను చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement