Gunfire: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి.. | South Africa Birthday Party Mass Shooting Several Killed | Sakshi
Sakshi News home page

Mass Shooting: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి..

Published Mon, Jan 30 2023 1:47 PM | Last Updated on Mon, Jan 30 2023 1:47 PM

South Africa Birthday Party Mass Shooting Several Killed - Sakshi

దక్షిణాఫ్రికా ఈస్టర్న్‌ కేప్ రాష్ట్రంలో దుండగులు తుపాకీతో రెచ్చిపోయారు. ఓ ఇంట్లో నిర్వహిస్తున్న బర్త్ డే పార్టీకి వచ్చినవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. క్వాజకీలే ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

కాల్పులు జరిపిన అనంతరం ఇద్దరు దుండగులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. అయితే వీరి దాడి వెనుక ఉద్దేశంపై మాత్రం స్పష్టత లేదు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.

దక్షిణాఫ్రికాలో గతేడాది జులైలో కూడా మాస్ షూటింగ్ ఘటన జరిగింది. గంటల వ్యవధిలో పలుచోట్ల తుపాకులతో విధ్వంసం సృష్టించారు దుండగులు. 19 మంది చనిపోయిన ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
చదవండి: పోలాండ్‌లో భారతీయ యువకుడి హత్య..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement