Michigan State University Gunfire Few Killed Several Injured - Sakshi
Sakshi News home page

అమెరికా మిచిగాన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి..

Published Tue, Feb 14 2023 11:23 AM | Last Updated on Tue, Feb 14 2023 1:22 PM

Michigan State University Gunfire Few Killed Several Injured - Sakshi

నిందితుడు

వాషింగ్టన్‌: అమెరికా మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు జరగడం కలకలం రేపింది. సోమవారం రాత్రి ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. యూనివర్సిటీ అకాడెమీ బిల్డింగ్‌తో పాటు యూనియన్‌ బిల్డింగ్ వద్ద కాల్పులకు తెగబడాడు. ఈ రెండు చోట్ల జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితుడు ఇంకా దొరకలేదని పోలసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాల్పులు జరిగిన వెంటనే పలు క్యాంపస్ బిల్డింగ్‌లను అధికారులు ఖాళీ చేయించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

నిందితుడికి సంబంధించిన ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతను మాస్కు ధరించి ఉన్నాడు. కాల్పుల అనంతరం యూనివర్సిటీ యూనియను బిల్డింగ్ నుంచి అతడు నడుచుకుంటూ వెళ్లిపోవడం సీసీటీవీలో రికార్డు అయింది.
చదవండి: సౌదీ స్పేస్ మిషన్‌లో లింగ సమానత్వం.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి మహిళా వ్యోమగామి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement