mass shooting
-
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అలబామాలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలబామాలోని బర్మింగ్‌హామ్‌లోని ఫైవ్ పాయింట్స్ సౌత్ ప్రాంతంలో శనివారం రాత్రి 11 గంటలకు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులో ఇద్దరు పురుషులు, మహిళ తుపాకీ గాయాలతో మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. బర్మింగ్‌హామ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలంలో చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో పలువురు గుర్తుతెలియని షూటర్లు కాల్పులు జరిపినటట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం అలబామా విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉండగా.. ఇక్కడి రెస్టారెంట్లు, బార్లతో జనాలు రద్దీగా ఉంటారని పోలీసులు తెలిపారు. రద్దీ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకొని దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
టెక్సాస్ కాల్పుల ఘటనపై ఏపీ ప్రభుత్వం ఆందోళన: రత్నాకర్
అమెరికా టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువతి ఐశ్వర్య మరణించడంపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా దక్షిణాది రాష్ట్రమైన టెక్సాస్‌లో చాలా మంది భారతీయులు, అందులోనూ తెలుగు వారు నివసిస్తున్నారు. డల్లాస్ లో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని, తెలుగు యువతి తాటికొండ ఐశ్వర్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అన్నారు. డల్లాస్ అల్లెన్ ప్రీమియం మాల్ ఘటనలో ఎనిమిది మంది మరణించినట్టుగా తెలిసిందని, ఐశ్వర్య ఇందులో ఉన్నారని, గాయపడ్డ వారిలో మరో ఇద్దరు కూడా తెలుగు వారున్నారని, వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రత్నాకర్ తెలిపారు. అమెరికాలో ఉంటోన్న ప్రవాసాంధ్రులు నిత్యం జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని కోరారు. ఈ జాగ్రత్తలు పాటించండి ఇటీవల చోటు చేసుకుంటోన్న కాల్పుల ఘటనలు, ఇతర దాడుల నేపథ్యంలో అక్కడ ఉంటున్న తెలుగువారికి, భారతీయులకు తగినన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ► కాల్పుల తరహలో ఏవైనా ఘటనలు లాంటివి జరిగినపుడు వీలైనంత వరకు బయటకు రావొద్దు ► ఎదుటి వారికి కనిపించేలా పరుగులు తీయొద్దు, మన ఆచూకీ తెలియనివ్వకుండా నక్కి ఉండండి ► కాల్పుల శబ్దం విన్నప్పుడు, అది మరీ దగ్గరగా ఉంటే పూర్తిగా నేలపైనే పడుకుని ఉండండి. పైకి కనిపించొద్దు. ► ఆందోళనకు గురి కావొద్దు, హడావిడిగా అటు, ఇటు పరుగులు తీయొద్దు ► బయట సమూహాల్లో కలుసుకునే సందర్భాల్లో వీలైనంత వరకు ఇంగ్లీషులోనే మాట్లాడాలి, మాతృభాషను తక్కువగా వాడాలి ► చుట్టుపక్కల అనుమానస్పద కదలికలపై, వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచండి ► ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని అనుమానం వస్తే, ఎక్కడైనా ట్రాప్ అయ్యామని అనిపిస్తే వెంటనే అలర్ట్ కండి. 911కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి ► ఎవరితోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ వాదనలకు దిగొద్దు ► బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవపడొద్దు ► చాలామంది రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు, ఆ సమయంలో సాధ్యమైనంతవరకు ఆంగ్ల భాషలోనే మాట్లాడండి, సున్నితంగా అక్కడి నుంచి తప్పుకోండి. ► మనుషుల కదలిక తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదు ► 911 నంబర్‌కు ఫోన్ చేసేందుకు అస్సలు సంకోచించవద్దు, పైగా పోలీసులతో పాటు వైద్యంతో పాటు ఏ రకమైన సాయమైనా క్షణాల్లో దొరుకుతుంది ► అమెరికాలో పరిస్థితులు చాలా వరకు సురక్షితమే. అయితే ఒకటో, రెండో నేర ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ► ఎవరికి వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి
నేరేడుచర్ల/హుడా కాంప్లెక్స్ (హైదరాబాద్): అమెరికాలోని టెక్సాస్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాటికొండ ఐశ్వర్య (27) మృతి చెందింది. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఆమె.. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసింది. కొన్ని నెలల కిందే అక్కడ ఉద్యోగంలో చేరింది. ఇంతలోనే ఆమె కన్నుమూయడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. షాపింగ్ కోసమని వెళ్లి..: ఐశ్వర్య కుటుంబం స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడుచర్ల. తాత రామనర్సింహారెడ్డి గతంలో ఎంపీపీగా పనిచేశారు. తండ్రి తాటికొండ నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులోని ఆర్థిక వివాదాల పరిష్కారాల కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. వీరు చాలా ఏళ్ల కిందటే హైదరా బాద్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం సరూర్‌నగర్ హుడాకాలనీలో ఉంటున్నారు. హైదరాబాద్‌లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఐశ్వర్య.. 2019 జనవరిలో ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లారు. టెక్సాస్ వర్సిటీలో ఎంఎస్ పూర్తిచేశాక.. అక్కడే పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా ఉద్యోగంలో చేరారు. శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున) టెక్సాస్‌లోని డాలస్‌లో ఓ ఫ్రెండ్‌తో కలసి షాపింగ్‌కు వెళ్లింది. ఆ సమయంలో షాపింగ్ మాల్‌లోకి వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడిక్కడే మృతిచెందారు. కాల్పుల్లో ఐశ్వర్య ముఖం ఛిద్రం కావడంతో తొలుత ఆమె ఎవరనేది తెలియలేదు. పోలీసులు వేలిముద్రల ఆధారంగా ఐశ్వర్యను గుర్తించి సోమవారం ఉదయం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఐశ్వర్య మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు మూడు రోజులు పట్టవచ్చని ఆమె సోదరుడు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. చదవండి: ఆస్ట్రేలియా తీరంలో వింతచేప.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు.. నా చిట్టి తల్లి ఇంకా ఫోన్ చేయలేదా? అల్లారుముద్దుగా చూసుకున్న ఐశ్వర్య ఇక లేదనే విషయం తెలిసి ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కొన్ని నెలల కిందే హైదరాబాద్‌కు వచ్చి వెళ్లిన ఆమెను గుర్తు చేసుకుంటూ తండ్రి తాటికొండ నర్సిరెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. ‘‘నన్ను, అమ్మను వెంట తీసుకెళతానంది. తనతోపాటు నేను కూడా అక్కడే ఉండాలన్నది. నా చిట్టి తల్లి ఇంకా ఫోన్ చేయలేదా?’’ అంటూ ఆయన తీవ్రంగా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. (చదవండి : అమెరికాలో ఉన్న వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?) రోజూ ఫోన్ చేసి మాట్లాడేదని, వేళకు మందులు వేసుకోవాలని చెప్పేదని, ఇంతలోనే తమకు శాశ్వతంగా దూరమైందంటూ ఐశ్వర్య తల్లి విలపించింది. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన తన మనవరాలు దుండగుడి కాల్పుల్లో మృతిచెందడం దురదృష్టకరమని ఐశ్వర్య తాత తాటికొండ రామనర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: బంగారు గనిలో ప్రమాదం.. 27 మంది మృతి -
అమెరికాలో కాల్పుల కలకలం.. మాజీ భార్య, కాబోయే భార్యపై కూడా!
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిసిసిప్పీ రాష్ట్రంలో శుక్రవారం మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మూడు చోట్ల కాల్పులకు పాల్పడింది ఒక్కడే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడ్ని ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. అర్కబుట్ల, టాటె కౌంటీల్లోని ఓ స్టోర్, రెండు ఇళ్లలో కాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడ్ని రిచర్ డేల్ క్రమ్(52)గా గుర్తించారు. అయితే ఇతడు మొదట తన మాజీ భార్య, ఇతర కుటుంబసభ్యులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తనకు కాబోయే భార్యను కాల్చి చంపినట్లు సమాచారం. అంతకుముందే ఓ స్టోర్‌లోనూ తుపాకీతో దాడి చేశాడు. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అతడు ఎందుకు ఈ దాడులు చేశాడో ఇంకా తెలియదని పోలీసులు చెప్పారు. అతడ్ని విచారించాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. అర్కబుట్లలో నిందితుడు ఓ ఇంట్లోకి వెళ్లి కాల్పులు జరపడం పొరిగింటి మహిళ ప్రత్యక్షంగా చూసింది. అతి తక్కువ మంది నివసించే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల తీవ్ర భయాందోళన వ్యక్తం చేసింది. నిందితుడు లోపలికి వెళ్లాక కాల్పుల శబ్దం వినిపించిందని, తాను బయటకు చూసే సరికి అతడు తుపాకీతో నడుచుకుంటూ వెళ్తున్నాడని వివరించింది. కాల్పులు జరిగిన ఇంట్లోకి వెళ్లి చూస్తే ఓ వ్యక్తి బుల్లెట్ గాయాలతో చనిపోయి ఉన్నట్లు వివరించింది. చదవండి: 75 ఏళ్లు దాటితే యోగ్యతా పరీక్షలు పెట్టాలి: నిక్కీ హేలీ -
US Gunfire: అమెరికా మిచిగాన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం..
వాషింగ్టన్: అమెరికా మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు జరగడం కలకలం రేపింది. సోమవారం రాత్రి ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. యూనివర్సిటీ అకాడెమీ బిల్డింగ్‌తో పాటు యూనియన్ బిల్డింగ్ వద్ద కాల్పులకు తెగబడాడు. ఈ రెండు చోట్ల జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితుడు ఇంకా దొరకలేదని పోలసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాల్పులు జరిగిన వెంటనే పలు క్యాంపస్ బిల్డింగ్‌లను అధికారులు ఖాళీ చేయించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. నిందితుడికి సంబంధించిన ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతను మాస్కు ధరించి ఉన్నాడు. కాల్పుల అనంతరం యూనివర్సిటీ యూనియను బిల్డింగ్ నుంచి అతడు నడుచుకుంటూ వెళ్లిపోవడం సీసీటీవీలో రికార్డు అయింది. చదవండి: సౌదీ స్పేస్ మిషన్‌లో లింగ సమానత్వం.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి మహిళా వ్యోమగామి -
Gunfire: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి..
దక్షిణాఫ్రికా ఈస్టర్న్ కేప్ రాష్ట్రంలో దుండగులు తుపాకీతో రెచ్చిపోయారు. ఓ ఇంట్లో నిర్వహిస్తున్న బర్త్ డే పార్టీకి వచ్చినవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. క్వాజకీలే ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం ఇద్దరు దుండగులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. అయితే వీరి దాడి వెనుక ఉద్దేశంపై మాత్రం స్పష్టత లేదు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. దక్షిణాఫ్రికాలో గతేడాది జులైలో కూడా మాస్ షూటింగ్ ఘటన జరిగింది. గంటల వ్యవధిలో పలుచోట్ల తుపాకులతో విధ్వంసం సృష్టించారు దుండగులు. 19 మంది చనిపోయిన ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చదవండి: పోలాండ్‌లో భారతీయ యువకుడి హత్య.. -
కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి..
అమెరికా కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల మోతమోగింది. సోమవారం రెండు వేరు చోట్ల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాన్ మటేవో కౌంటీలోని హాల్ఫ్ మూన్ బే ప్రాంతంలో ఈ ఘటనలు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ పుట్టగొడుగుల ఫామ్‌లోని ఇంట్లోకి ప్రవేశించి దుండగుడు కాల్పులు జరిపాడు. మొత్తం నలుగురిని హతమార్చాడు. ఆ తర్వాత కాసేపటికి ఓ ట్రక్కు కంపెనీ షెడ్డు వద్ద మరో ముగ్గుర్ని కాల్చి చంపాడు. ఇంకొకరికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రం 5 గంటల్లోగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీకి తరలించి విచారిస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఇటీవల మాస్ షూటింగ్ ఘటనలు తరచూ జరగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. రెండు రోజుల క్రితమే చైనీస్ న్యూ ఇయర్ వేడుకపై ఓ దుండగుడు దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు కూడా ఘటనా స్థలంలోనే తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: అల్లాడుతున్న పాకిస్తాన్ ప్రజలు.. దేశవ్యాప్తంగా కరెంట్ కట్! -
వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో తుపాకీ మరోసారి గర్జించింది. వర్జీనియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఓ సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తుపాకీతో స్టోర్‌లోకి వెళ్లిన వ్యక్తి కన్పించినవారిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. అతను వాల్‌మార్ట్‌లో పనిచేసే ఉద్యోగా? కాదా? తెలియాల్సి ఉందన్నారు. నిందితుడు కూడా స్టోర్ లోపలే చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. అయితే పోలీసులే నిందితుడ్ని కాల్పి చంపి ఉంటారని స్థానిక మీడియా చెప్పింది. కానీ తాము కాల్పులు జరపలేదని పోలీసు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడే తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. 38 మంది సజీవదహనం -
బార్లోకి చొరబడి కాల్పులు.. 12 మంది మృతి!
మెక్సికో సిటీ: గుర్తు తెలియని కొందరు దుండగులు బారులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన సెంట్రల్ మెక్సికో ఇరాపుటో నగరంలో శనివారం రాత్రి జరిగింది. గ్వానాజువాటో రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలోనే కాల్పుల ఘటన జరగటం ఇది రెండోది కావటం గమనార్హం. ఈ దాడిలో ముగ్గురు గాయపడినట్లు సిటీ ప్రభుత్వం తెలిపింది. నరమేధానికి పాల్పడిన దుండగుల కోసం భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. బార్లోకి చొరబడి కాల్పులు జరిపేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. గ్వానాజువాటో ప్రధానంగా ప్రపంచస్థాయి కార్ మేకర్స్‌కు తయారీ హబ్‌గా ఉంది. అయితే.. కొద్ది సంవత్సరాలుగా డ్రగ్స్ గ్యాంగ్స్ మధ్య భీకర పోరు జరుగుతుండటంతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 21న గ్వానాజువాటోలోని ఓ బార్లో కాల్పులు జరగటం వల్ల 10 మంది మరణించారు. 2018లో అధికారం చేపట్టిన అధ్యక్షుడు అండ్రెస్ మన్యూయెల్ లోపేజ్ ఒబ్రేడర్.. గ్యాంగ్ హింసలను తగ్గించారు. అయితే.. డ్రగ్స్ ముఠాలను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. ఇదీ చదవండి: రష్యా సైనిక శిక్షణ కేంద్రంపై కాల్పులు.. 11 మంది మృతి -
డ్రగ్స్ ముఠా కాల్పులు.. మేయర్ సహా 18 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో మరోసారి తుపాకీ మోతలతో అట్టుడికింది. శాన్ మిగ్యుల్ టోటోలాపాన్ పట్టణంలోని సిటీ హాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పట్టణ మేయర్ కాన్రాడో మెండోజా, ఆయన తండ్రి జువాన్ కూడా ఉన్నారని స్థానిక మీడియాలు తెలిపాయి. కాల్పుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మేయర్ హత్య కోసమే.. కాల్పులకు పాల్పడి దుండగులు ‘లాస్ టెకిలెరోస్’ డ్రగ్స్ ముఠాకు చెందినవారిగా అధికారులు భావిస్తున్నారు. మేయర్‌ను హతమార్చాలనే లక్ష్యంతోనే వారు భవనం లోపలికి ప్రవేశించి, ముందస్తు ప్రణాళిక ప్రకారం వరుస దాడులు చేసినట్లు పేర్కొన్నారు. భద్రతా బలగాలు నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకుగానూ అంతకుముందే భారీ వాహనాలతో రహదారులను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. మేయర్ మృతిపై గెరెరో గవర్నర్ ఎవెలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఆర్డీ పార్టీ సైతం ఈ ఘటనను ఖండించింది. పిరికిపంద చర్యగా అభివర్ణించింది. మరోవైపు.. నిందితులను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వం సైన్యాన్ని దించింది. ఇదీ చదవండి: రష్యాకు షాక్.. విలీన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంటున్న ఉక్రెయిన్! -
రక్తమోడిన శిశు సంరక్షణాలయం
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో మాజీ పోలీసు జరిపిన కాల్పులతో శిశు సంరక్షణాలయం రక్తసిక్తమైంది. ఈశాన్య థాయ్‌లాండ్‌లోని నోంగ్బూ లాంఫూ నగరంలోని డే కేర్ సెంటర్‌పై పన్యా కామ్రాప్(34) విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అభంశుభం తెలియని 24 మంది చిన్నారులు సహా మొత్తంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజన విరామం సమయంలో అతను డే కేర్ సెంటర్‌కి వచ్చి మొదట ఐదుగురు సిబ్బందిని హతమార్చాడు. తర్వాత ఒక గదిలో నిద్రిస్తున్న చిన్నారులపైకి బుల్లెట్ల వర్షం కురిపించాడు. దాంతో పరుపులన్నీ రక్తంతో నిండి ఘటనాస్థలి భీతావహంగా మారింది. డే కేర్ సెంటర్లో ఎనిమిది నెలల గర్భిణిని సైతం అతడు చంపేశాడు. ఆ తర్వాత కారులో అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ రహదారి వెంట ఉన్న వారిపైనా తూటాల వర్షం కురిపించాడు. దీంతో ఒక చిన్నారిసహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న అతను తన కొడుకును, భార్యను సైతం చంపేసి చివరకు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. శిశు సంరక్షణాలయంలో చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. దాడికి అతను పిస్టల్, షాట్‌గన్‌తోపాటు పదునైన కత్తిని వాడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఏడాది తొలినాళ్లలో ఒక మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అతడిని పోలీసు విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. థాయ్‌లాండ్ చరిత్రలో పాఠశాలలో కాల్పుల ఘటనలో ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. వాస్తవానికి థాయ్‌లాండ్‌లో ఆయుధాలతో దాడి ఘటనలు అరుదు. ఆయుధాలతో దాడి ఘటనల్లో బ్రెజిల్లో ప్రతి లక్షలమందికి 23 మంది చనిపోతే థాయ్‌లాండ్‌లో నలుగురే మరణించారు. ఇదీ చదవండి: 650 కోరికలు.. యూఎస్ ప్రో రెజ్లర్ జాన్ సేనా గిన్నిస్ రికార్డు -
కుటుంబంతో గొడవ.. ఆగ్రహంతో 11 మందిని కాల్చిచంపిన వ్యక్తి
ఆగ్నేయ ఐరోపా దేశం మెంటెనెగ్రోలో మాస్ షూటింగ్ ఘటన కలకలం రేపింది. శుక్రవారం ఓ సాయుధుడు తుపాకీతో విధ్వంసం సృష్టించాడు. తన చుట్టుపక్కల ఉన్నవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. అయితే సెటింజేకు చెందిన వ్యక్తి కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడని, ఆ తర్వాత ఇరుగుపొరుగువారిపై తుపాకీతో తూటాల వర్షం కురిపించాడని స్థానిక మీడియా తెలిపింది. ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్పిచంపారు. మాంటెనెగ్రో అంతర్గత వ్యవహారాల శాఖ కూడా ఈఘటనపై స్పందించలేదు. పర్యాటకంగా మంచి గుర్తింపు పొందిన ఈ దేశంలో ఇలాంటి భయానక ఘటన జరగడం దశాబ్దాల్లోనే ఇదే తొలిసారి. చుట్టూ పర్వతాలుండే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రపంచదేశాల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు. అక్కడి పర్యటక రంగానికి ఇదే మంచి సీజన్. ఎక్కువ మంది సందర్శకులు వచ్చే సమయంలో మాస్ షూటింగ్ జరగడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. చదవండి: వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి -
బార్లో అర్ధరాత్రి కాల్పులు.. 14 మంది మృతి..
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని సొవెటె టౌన్ షిప్లో దుండగుల ముఠా రెచ్చి పోయింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బార్‌పై తుపాకులతో కాల్పుల మోత మోగించింది. ఈ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ముఠా మినీబస్ ట్యాక్సీలో వచ్చి బార్లో ఒక్కసారిగా కాల్పులు జరిపిందని పోలీసులు తెలిపారు. ప్రాణ భయంతో అక్కడున్న వారు పరుగులు తీశారని పేర్కొన్నారు. మొదట 12 మంది మృతదేహాలు లభించాయని, ఆ తర్వాత మరో ఇద్దరు తీవ్ర గాయాల కారణంగా చనిపోయారని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. బార్లో ఉన్నవారు ఉల్లాసంగా పార్టీ చేసుకుంటుండగా.. దుండగులు విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ ముఠాలో ఎంతమంది ఉన్నారు? ఈ దాడి చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణముందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
బుసకొట్టిన జాతి విద్వేషం
బఫెలో/షికాగో(యూఎస్): అమెరికాలో జాతి విద్వేషం మరోసారి బుసలు కొట్టింది. నల్లజాతి ప్రజలే లక్ష్యంగా 18 ఏళ్ల శ్వేతజాతి యువకుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది బలయ్యారు. ముగ్గురు గాయపడ్డారు. బఫెలో నగరంలోని టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్లో శనివారం ఈ దారుణం జరిగింది. ఇది జాతి విద్వేషపూరిత హింసాత్మక తీవ్రవాదమేనని పోలీసు అధికారులు అన్నారు. టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్లో ప్రధానంగా నల్ల జాతీయులు షాపింగ్ చేస్తుంటారు. ఇందులో పనిచేసే వారంతా నల్లజాతి కార్మికులే. సైనిక దుస్తులు, తూటా కవచం, హెల్మెట్ కెమెరా ధరించి వచ్చిన యువకుడు మార్కెట్ బయట హఠాత్తుగా రైఫిల్‌తో నలుగురిపై కాల్పులు జరిపాడు. లోపలికి వెళ్లి కనిపించినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఎదురు కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డునూ కాల్చేశాడు. ఇదంతా ‘ట్విచ్’ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ప్రత్యక్ష ప్రసారమైంది! పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 11 మంది నల్ల జాతీయులపై, ఇద్దరు శ్వేత జాతీయులపై కాల్పులు జరిపాడని చెప్పారు. అతడిని న్యూయార్క్‌లోని కాంక్లిన్‌కు చెందిన పేటన్ గెన్డ్రాన్గా గుర్తించారు. హత్య కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. శ్వేతజాతి అహంకారంతో అమాయకులను బలితీసుకున్న వ్యక్తి జీవితాంతం జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నట్లు స్థానిక గవర్నర్ కాథీ హోచుల్ చెప్పారు. ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. షికాగో కాల్పుల్లో బాలుడి మృతి అమెరికాలో షికాగోలోనూ దారుణం జరిగింది. మిలీనియం పార్కులో శనివారం దుండగుడి కాల్పుల్లో 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇద్దరు అనుమానితులను పట్టుకుని రెండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. -
జర్మనీలో కాల్పుల కలకలం..
-
జర్మనీలో కాల్పులు.. 8 మంది మృతి
బెర్లిన్: జర్మనీలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో దాదాపు 8 మంది మృతిచెందారు. బుధవారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రెండు చోట్ల దుండగులు కాల్పులకు తెగబడ్డారని.. వారి గురించి ఇంతవరకు ఎటువంటి సమాచారం తెలియరాలేదన్నారు. హనావులోని హుక్కా లాంజ్లే లక్ష్యంగా కాల్పులు జరిపారని.. ఈ ఘటనలో 8 మంది మృతిచెందినట్లు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా తేలాల్సిఉందన్నారు. ఘటనాస్థలిలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు వెల్లడించారు. కాగా నైరుతి జర్మనీలోని హనావు పట్టణంలో దాదాపు లక్ష మంది జనాభా ఉంటారు. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక నాలుగు రోజుల క్రితం బెర్లిన్‌లో కూడా దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. టెంపోడ్రమ్లో కామెడీ షో జరుగుతున్న సమయంలో దాడి చేసి... ఓ వ్యక్తిని హతమార్చారు. చదవండి: కోవిడ్ మృతులు 2 వేలు -
షాపింగ్ సెంటర్ వద్ద కాల్పులు.. 12 మంది మృతి..!
బ్యాంకాక్ : థాయ్‌లాండ్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 12 మంది అమాయకులు ప్రాణాలు విడిచారు. మరికొంత మంద్రి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఈశాన్య థాయ్‌లాండ్‌లోని కోరట్ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. అయితే, మృతులకు సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాల్పులకు తెగబడిన వ్యక్తి ఆర్మీలో పనిచేసే సార్జెంట్ మేజర్ జక్రఫంత్ థోమాగా గుర్తించారు. నిందితుడు ఆర్మీ వాహనాన్ని దొంగిలించడమే కాకుండా.. టెర్మినల్ 21 షాపింగ్ సెంటర్ ప్రాంతంలో కాల్పుల అనంతరం ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇక తుపాకీ గుళ్ల వర్షంతో ఘటనాస్థలం యుద్ధభూమిని తలపించింది. మృతులు, క్షతగాత్రులతో భయానకంగా మారింది. ఆర్మీ క్యాంపు నుంచి దొంగిలించిన మెషీన్ గన్‌తో అఘాయిత్యానికి పాల్పడ్డ జక్రఫంత్ షాపింగ్ మాల్‌లోకి చొరబడి దాక్కున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన టెర్మినల్ 21 షాపింగ్ సెంటర్ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. నిందితున్ని పట్టుకునేందుకు అన్ని వైపులా బలగాలను మోహరించామని తెలిపారు. పెద్ద సంఖ్యలో లైసెన్డ్స్ గన్లు కలిగిన ఉన్న దేశాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌లో.. భద్రతా సిబ్బంది కాల్పులకు దిగడం అరుదు. -
ట్రంప్ థమ్సప్ ఫోజు.. ఓ వివాదం
పరిస్థితులకు తగ్గట్లు ప్రవర్తించడం నా డిక్షనరీలోనే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా ట్రంప్ భార్య మెలానియా ట్విటర్లో పోస్టు చేసిన ఓ ఫోటో వివాదాస్పదమైంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలుడిని మెలానియా ఎత్తుకొనగా ట్రంప్ థమ్సప్ ఫోజు ఇచ్చారు. దీంతో ట్రంప్‌పై సోషల్‌మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. గతవారం అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 32మంది వరకు మరణించారు. ఈ కాల్పుల్లో రెండునెలల బాలుడి తల్లిదండ్రులు చనిపోయారు. బాలుడికి సైతం బుల్లెట్ తగిలి రెండు చేతి వేళ్లు తెగిపోయాయి. అయితే ఈ ప్రాంతాన్ని ఇటీవలే సందర్శించిన ట్రంప్ దంపతులు ఆ బాలుడిని ఎత్తుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇంతవరకు ఓకే కానీ, ట్రంప్ థమ్సప్ ఫోజుతో చీర్స్ అన్నట్లుగా ఫోజు ఇవ్వడం పలువురి ఆగ్రహానికి కారణం అయింది. దీనిపై డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఓ నాయకుడు ‘ఎలాంటి సానుభూతి లేని ఓ వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అయ్యాడని’ ఘాటుగా స్పందించారు. ట్రంప్ టెక్సాస్ పర్యటనకు మీడియాను అనుమతించలేదు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఈ ఫోటోలను ట్విటర్లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ట్రంప్‌పై వస్తున్న విమర్శలపై ఆయన సానుభూతిపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో కూడా తప్పులు వెతికి రాజకీయం చేస్తున్నారంటే నైతికత లేనిది మీకేనని ఎదురుదాడి చేస్తున్నారు. కాగా ట్రంప్ పక్కనే నిలబడిన వ్యక్తి ఆ బాలుడి అంకుల్. పనిలో పనిగా అతను ట్రంప్ భుజాలపై చేయి వేసి నవ్వుతూ ఫోటోకు ఫోజు ఇచ్చేయడంపై ‘ట్రంప్ పక్కన ఉంటే ట్రంప్‌లాగే ఉంటారనడానికి చక్కటి ఉదాహరణ’ ఇదేనని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. -
వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు; కారణం అదే..!
టెక్సాస్ : ఎల్ పాసోలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో శనివారం ఓ ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. తుపాకీతో స్టోర్‌లోకి ప్రవేశించిన పాట్రిక్ క్రూజియాజ్ (21) విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 20 మంది చనిపోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. వర్ణ వివక్ష కారణంగానే నిందితుడు ఈ మారణహోమానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు 19 నిముషాల క్రితం నిందితుడు విడుదల చేసిన వీడియోలో విస్తుగొలిపే విషయాలు వెల్లడైనట్టు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. దాని ప్రకారం.. వర్ణం ఆధారంగా అమెరికాను విభజించాలని.. తెల్లవారి స్థానంలో బయటి వ్యక్తులు అవకాశాలు తన్నుకుపోతున్నారని ఉన్మాది ఆగ్రహం వ్యక్తం చేశాడు. (చదవండి : అమెరికాలో కాల్పుల కలకలం.. 20 మంది మృతి) 51 మంది ప్రాణాలు బలిగొన్న న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ ఉన్మాదిని క్రూజియాజ్ ప్రశంసించాడు. అతని స్పూర్తిగానే కాల్పులకు తెగబడుటున్నట్టు చెప్పాడు. వర్ణ సంకరణం అమెరికా జన్యు విధానాన్ని నాశనం చేస్తోందని ‘ది ఇన్‌కన్వినెంట్ ట్రూత్’ పేరుతో అతను విడుదల చేసిన వర్ణ వివక్ష మేనిఫెస్టోపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు బ్లాక్ డ్రెస్‌లో ఉన్నట్టు సీసీ కెమెరాల ఆధారంగా బయటపడింది. 2017లో టెక్సాస్‌లోని చర్చిలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత ఇదే పెద్దది. ఇదిలా ఉండగా.. ఓహియోలో మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్ఘారత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.16 మంది గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు మట్టుబెట్టారు. -
కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
టొరంటో : కెనడాలో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. టొరంటోలో ఓ రెస్టారెంట్లో ఆకస్మాత్తుగా దుండగుడు జనంపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతొ ఒక్కసారిగా ఉలిక్కపడ్డ జనాలు పరుగుల తీశారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది నిందితుడిని మట్టుబెట్టారు. ఈ ఘటనలో 13 మంది గాయపడగా ఓ మహిళ మృతి చెందిందని టొరంటో పోలీసులు ప్రకటించారు. వీరిలో ఓ 9 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందని తెలిపారు. ఫేమస్ రెస్టారెంట్ అయిన టొరంటో ఈట్స్ రెస్టారెంట్లో రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుపు రంగు దుస్తుల్లో వచ్చిన దుండగుడు విచక్షణా రహితంగా 25 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
అనుభవం లేకుంటే వేల ప్రాణాలు గాల్లో...
న్యూయార్క్ : ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రవాదుల దాడి అనుభవం వల్లే లాస్వేగాస్లో వేల ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడిందని అమెరికా పోలీసు అధికారి చెప్పారు. ఆ అనుభవంతోనే తాము శత్రువును అత్యంత శీఘ్రంగా మట్టుపెట్టగలిగామని లేదంటే వేల ప్రాణాలు పోయేవని ఆందోళన వ్యక్తం చేశారు. లాస్ వేగాస్‌లో స్టీఫెన్ పెడ్డాక్(64) అనే ఉన్మాది విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58మంది ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే. 500మందికి పైగా గాయాలపాలయ్యారు కూడా. అయితే, అతడిని మట్టుబెట్టడంలో జోసెఫ్ లాంబోర్డ్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఆయనన లాస్ వేగాస్ మెట్రోపాలిటన్ పోలీసు డిపార్ట్మెంట్లో షెరిఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన ముంబయిలో దాడి జరిగినప్పుడు అమెరికన్లు కూడా చనిపోయిన నేపథ్యంలో ఆ దాడి పూర్వపరాలు తెలుసుకున్నారు. అలాగే, ముంబయి పోలీసులు, భారత ఆర్మీ ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టారో తెలుసుకున్నారు. అలాంటి సంఘటనే తమ వద్ద జరిగితే ఎలా స్పందించాలనే విషయంలో ప్రత్యేకంగా తమ వద్ద ఉన్న పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆరోజు సంగీత విభావరిపై కాల్పులు జరుగుతుండగా వెంటనే స్పందించి పోలీసులు నేరుగా ఉన్మాది గదిలోకి దూసుకెళ్లి అతడు హతమయ్యేలా చేశారు. లేదంటే ఆ రోజు వేల ప్రాణాలు పోయేవి. దీనికి సంబంధించి లాండోర్డ్ మాట్లాడుతూ.. 'భారత్‌లోని ముంబయిలో పాక్ ఉగ్రవాదులు చేసిన దాడి మాకు ఓ అనుభవం. దాని ద్వారానే మేం వేల ప్రాణాలు రక్షించుకోగలిగాం. ఈ విషయాన్ని అమెరికన్లు అర్ధం చేసుకోవాలి. సంగీత విభావరిలో దాదాపు 22 వేల మంది ప్రేక్షకులు ఉన్నారు. అతడు విచక్షణ రహితంగా వారిపై కాల్పులు మొదలుపెట్టాడు. శీఘ్రంగా స్పందించిన మా టీం అతడి గదికి వెళ్లి అంతమయ్యేలా చేసింది. ఆ హోటల్ గది నిండా ఆయుధాలు, షార్ప్ విపన్స్, పెద్ద మొత్తంలో గన్ పౌడర్స్ ఉన్నాయి. ఒక ఆయుధ మార్కెట్‌లాగా ఆ ఉన్మాది ఉన్న గది కనిపించింది. భారీ విధ్వంసం సృష్టించగల 24 అత్యాధునిక మెషిన్ గన్లు, తుపాకులు, రాకెట్ లాంచర్లు ఉన్నాయి. ఆ గది నుంచి వేర్వేరు ప్రాంతాలు అతడు ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టాడు. మూడు మానిటర్లు కూడా సిద్ధం చేసుకొని ఉన్నాడు. వాటన్నింటిని ఉపయోగించినట్లేయితే కచ్చితంగా వేల ప్రాణాలు పోయేవి. కానీ, దానిని నిలువరించగలిగాం' అని వివరించారు. -
ఆ షూటర్ లక్ష డాలర్లు ఎవరికి పంపాడు..?
లాస్ వెగాస్ : లాస్ వెగాస్‌లో అనూహ్య దాడితో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ కేసు అంతు తేల్చేందుకు అధికారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్పులు జరిపిన ఉన్మాది స్టీఫెన్ పెడాక్ (64) ఎందుకు ఆ విధంగా చేసి ఉంటాడనే గుట్టు తెలుసుకునేందుకు పోలీసుల మధ్య ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తాజాగా అతడు కాల్పులు జరపడానికి ముందు రోజుల్లో దాదాపు లక్ష డాలర్లను పిలిప్పీన్స్కు బదిలీ చేశాడని గుర్తించారు. ప్రస్తుతం అక్కడ అతడి గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే ఉంటుంది. అయితే, ఆ డబ్బు ఆమెకే పంపించాడా లేక మరింకెవరికైనా పంపించాడా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే, సంపన్నుడైన పెడాక్ రోజుకు కనీసం పది వేల డాలర్లను జూదంలో వెచ్చించేవాడని పోలీసులు తెలుసుకున్నారు. ఇలాఎలా సాధ్యం అయిందనే దిశగా కూడా తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం పిలిప్పీన్స్‌లో ఉంటున్న అతడి గర్ల్‌ఫ్రెండ్ మారిలౌ డాన్లీ (62)ని పోలీసులు తీరిగి బుధవారం అమెరికాకు రప్పించాలనుకుంటున్నారు. ఆమెను ప్రశ్నించడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని వారు భావిస్తున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పక్కా ప్లాన్ ప్రకరమే అతడు ఈ దారుణకాండకు తెగించాడని తెలుస్తోంది. అతడు అద్దెకు తీసుకున్న హోటల్లోని 32అంతస్తులో ప్రత్యేకంగా బయటా లోపల సెక్యూరిటీ కెమెరాలు కూడా అమర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం ఎవరైనా వస్తే వారిని గుర్తించేందుకు పోలీసులైతే తప్పించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నాడట. మరోపక్క, ఐసిస్ కూడా తామే ఈ దాడికి కారణం అని ప్రకటించగా అలా అయ్యే చాన్స్ లేదని పోలీసులు కొట్టి పారేస్తున్నారు. విచారణ పూర్తయితేగాని తాము క్లారిటీ ఇవ్వలేమంటున్నారు. ఉన్మాది గర్ల్‌ఫ్రెండ్ గురించి ప్రశ్నించినప్పటికీ నేరుగా సమాధానాలు చెప్పేందుకు పోలీసులు ఆసక్తి చూపడం లేదు. ఉన్మాది నిజంగానే ముస్లిం మతంలోకి మారాడా? మారాకా ఐసిస్‌లో చేరాడా? తానే ఉన్మాదిలా మారి ఈ కాల్పులకు తెగబడ్డాడా? ఈ చర్యకు దిగే ముందు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఈ విషయం చెప్పాడా? ఈ విషయం అతడి గర్ల్‌ఫ్రెండ్‌కు ముందే తెలుసా? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంది. లాస్‌వెగాస్‌లో ఆహ్లాదంగా సాగుతున్న మ్యూజిక్ కన్సర్ట్ (సంగీత విభావరి)పై విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. కన్సర్ట్ వేదిక పక్కనున్న హోటల్లోని 32వ అంతస్తునుంచి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. -
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
లాస్ ఏంజెలిస్: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. లాస్ ఏంజెలిస్‌లోని ఓ రెస్టారెంట్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడ్డారు. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వెస్ట్ ఆడమ్స్ జిల్లాలోని ఓ రెస్టారెంట్లో 50 మంది ఉన్నారు. రెస్టారెంట్ నుంచి ముగ్గురు వ్యక్తులు బయటకు వెళ్లి ఆయుధాలతో తిరిగి వచ్చారు. ఈ ముగ్గురూ మరో గ్రూపుపై కాల్పులు జరిపారు. దీంతో వేరే వర్గం వారు కూడా కాల్పులకు దిగారు. ఇరు వర్గాలవారు పరస్పరం కాల్పులు జరపడంతో రెస్టారెంట్ దద్దరిల్లింది. పోలీసులు అక్కడికి వెళ్లే సరికి నిందితులు పరారయ్యారు. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. -
ఆర్లెండోలో పర్యటించనున్న ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఒబామా గురువారం ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లెండోలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటన చేసింది. ఆర్లెండో నగరంలో ఆదివారం తెల్లవారుజామున నైట్ క్లబ్లో జరిగిన నరమేధంలో 49మంది మృతి చెందగా, సుమారు 50మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో మృతి చెందినవారికి సంతాపంతో పాటు, వారి కుటుంబాలను ఒబామా పరామర్శించనున్నారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఒబామా విస్కాన్సిన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి మద్దతుగా ఆయన వచ్చేవారం న్యూ మెక్సికో, కాలిఫోర్నియాలోని ఎన్నికల క్యాంపెన్లో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనిపై వైట్‌హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు కాల్పుల నేపథ్యంలో ఒబామా భద్రతా అధికారులతో, ఉగ్రవాద నిరోధక విభాగాలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాగా ఆర్లెండో ఉగ్రఘటనకు పాల్పడిన ఉగ్రవాది మతిన్ ఐసిస్ సభ్యుడు కాదని.. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐసిస్ ఉగ్ర సాహిత్యంతో ప్రభావితుడై ఈ ఘటనకు పాల్పడ్డాడని ఒబామా వెల్లడించారు. ఈ ఘటన దేశీయంగా పెరుగుతున్న ఉగ్రవాద ఉన్మాదానికి ఉదాహరణ అని అన్నారు. -
ఓర్లాండో నరమేధం: ఫేస్ బుక్ స్పెషల్ ఫీచర్
వాషింగ్టన్ : అమెరికాలోని ఓర్లాండో నరమేధం అనంతరం ఫేస్ బుక్ తన యూజర్ల భద్రతపై మరింత దృష్టిసారించింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన స్పెషల్ ఫీచర్ 'భద్రతా తనిఖీ ఫీచర్' ను ఆదివారం నుంచి అమెరికాలో యాక్టివేట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా స్నేహితులు ఆపదలో ఉంటే వారిని యూజర్లు గుర్తించి, వారిని భద్రతాప్రాంతంలో ఉంచేలా సహకరించనుంది. 'ఐయామ్ సేఫ్' అనే బటన్ ను నొక్కగానే వారి స్నేహితులకు, ఆప్తులకు, ఆపదకు గురైన యూజర్లు ఆ ప్రమాదంనుంచి బయటపడినట్టు, క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. స్నేహితులు భద్రంగా ఉన్నారో లేదో యూజర్లు కూడా తెలుసుకునేలా ఈ ఫీచర్ ను రూపొందించారు. ఫేస్ బుక్ ఈ భద్రతా తనిఖీ ఫీచర్ ను 2014 అక్టోబర్ లోనే ఆవిష్కరించింది. పారిస్ లో తీవ్రవాదుల అటాక్స్ వంటి సందర్భాల్లో ఈ ఫీచర్ యూజర్లకు ఎంతో సహకరించింది. ఫోర్లిడా రాష్ట్రంలోని పల్స్ గే నైట్ క్లబ్ లో జరిగిన ఓ ఉన్మాది విచక్షణా రహిత కాల్పుల్లో 50 మందికి పైగా చనిపోగా.. మరో 52 గాయపడిన సంగతి తెలిసిందే. ఆ ఉన్మాదిని అఫ్గాన్ సంతతికి చెందిన ఒమర్ మతీన్(29)గా పోలీసులు గుర్తించారు. కాల్పుల విషయం తెలియగానే క్లబ్‌ను చుట్టుముట్టిన పోలీసులు ఉన్మాదిని మట్టుబెట్టారు. క్లబ్ నుంచి 30 మంది బందీలను రక్షించారు. ఇది ఉగ్రవాద చర్యేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. అయితే ఈ ఉన్మాది అమెరికా పౌరుడేనని, టెర్రరిజం వాచ్ లిస్ట్ లో ఇతను లేడని బీబీసీ రిపోర్టు నివేదించింది. నేరపూరిత చర్యతో సంబంధంలేని దానిలో అతనిపై విచారణ కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ అమెరికా ప్రజలకు ఈ భద్రత తనిఖీ ఫీచర్ ను యాక్టివేట్ చేసింది.