అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి | Mass shooting in USA's Alabama state | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి

Published Sun, Sep 22 2024 12:45 PM | Last Updated on Sun, Sep 22 2024 12:55 PM

Mass shooting in USA's Alabama state

న్యూయార్క్‌: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అలబామాలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలబామాలోని బర్మింగ్‌హామ్‌లోని ఫైవ్ పాయింట్స్ సౌత్ ప్రాంతంలో శనివారం రాత్రి 11 గంటలకు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులో ఇద్దరు పురుషులు, మహిళ తుపాకీ గాయాలతో మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. 

బర్మింగ్‌హామ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలంలో చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో పలువురు గుర్తుతెలియని షూటర్లు కాల్పులు జరిపినటట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం అలబామా విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉండగా.. ఇక్కడి రెస్టారెంట్లు, బార్లతో జనాలు రద్దీగా ఉంటారని పోలీసులు తెలిపారు. రద్దీ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకొని దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొ​న్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement