Alabama State
-
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అలబామాలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలబామాలోని బర్మింగ్‌హామ్‌లోని ఫైవ్ పాయింట్స్ సౌత్ ప్రాంతంలో శనివారం రాత్రి 11 గంటలకు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులో ఇద్దరు పురుషులు, మహిళ తుపాకీ గాయాలతో మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. బర్మింగ్‌హామ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలంలో చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో పలువురు గుర్తుతెలియని షూటర్లు కాల్పులు జరిపినటట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం అలబామా విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉండగా.. ఇక్కడి రెస్టారెంట్లు, బార్లతో జనాలు రద్దీగా ఉంటారని పోలీసులు తెలిపారు. రద్దీ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకొని దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అమెరికాలో మరో భారతీయుడి హత్య
వాషింగ్టన్: అమెరికాలో భారతీయుల వరస మరణాలు అక్కడి భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. కాలిఫోరి్నయా రాష్ట్రంలో కేరళ కుటుంబం మొత్తం సొంతింట్లో మరణించిన వార్త మరువకముందే మరో హత్యోదంతం అమెరికాలో వెలుగుచూసింది. అలబామా రాష్ట్రంలో రహదారి వెంట హోటల్‌ను నడుపుకుంటున్న 76 ఏళ్ల ప్రవీణ్ రావూజీభాయ్ పటేల్‌ను అద్దె గది కోసం వచి్చన ఒక కస్టమర్ కాల్చి చంపారు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జరిగిన ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలను షెఫీల్డ్ పట్టణ పోలీస్ ఉన్నతాధికారి రిక్కీ టెర్రీ గురువారం వెల్లడించారు. షెఫీల్డ్ పట్టణంలో హిల్‌క్రెస్ట్ మోటెల్ పేరుతో ఒక హోటల్‌ను ప్రవీణ్ సొంతంగా నిర్వహిస్తున్నారు. ఆ హోటల్‌కు 35 ఏళ్ల విలియం జెరిమీ మోరే అనే వ్యక్తి వచ్చి రూమ్ కావాలని ప్రవీణ్‌ను అడిగాడు. కొద్దిసేపటికే విలియం, ప్రవీణ్ మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. వెంటనే విలియం తన వద్ద ఉన్న గన్‌తో ప్రవీణ్‌ను కాలి్చచంపాడు. అక్కడి నుంచి పారిపోయి దగ్గర్లోని ఇంట్లో చొరబడేందుకు ప్రయతి్నస్తుండగా పోలీసులు అరెస్ట్‌చేశారు. మూడు సార్లు తుపాకీ శబ్దం విన్నానని అక్కడే ఉన్న ఒక సాక్షి చెప్పారు. అసలు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. -
నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు
అట్మోర్(అమెరికా): మూడు దశాబ్దాల క్రితం వేయి డాలర్ల సుపారీ తీసుకుని ఒక మహిళను హత్యచేసిన కేసులో దోషికి అమెరికా నూతన పద్ధతిలో మరణశిక్షను అమలుచేసింది. 58 ఏళ్ల కెన్నెత్ ఎజీన్ స్మిత్ స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలాచేసి మరణశిక్షను అమలుచేసింది. ఇలా నైట్రోజన్గ్యాస్ను వాడి దోషికి మరణశిక్షను అమలుచేయడం ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఈ శిక్షను స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి అమలుచేశారు. అమెరికాలో 1982 ఏడాది నుంచి విషం ఇంజెక్షన్‌తో దోషులకు మరణశిక్షను అమలుచేయం మొదలెట్టాక మరో నూతన శిక్షా విధానాన్ని అమల్లోకి తేవడం ఇదే తొలిసారి. ఎలా అమలుచేశారు?: అట్మోర్ నగరంలోని హోల్మ్యాన్ కరెక్షన్ ఫెసిలిటీలో నైట్రోజన్ హైపోక్సియా శిక్ష అమలు ప్రక్రియను ఐదుగురు మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి చూపించారు. నైట్రోజన్ గ్యాస్ నింపిన సిలిండర్ పైపును దోషి స్మిత్ ముక్కుకు బిగించిన మాస్క్ ద్వారా శరీరంలోకి పంపించారు. స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ అనేది ప్రాణాధారమైన ఆక్సీజన్‌ను శరీరకణాలకు అందకుండా చేస్తుంది. దీంతో కణాలు ఆక్సీజన్ లేక క్షణాల్లోని మృతిచెందుతాయి. దీంతో మరణం సంభవిస్తుంది. రాత్రి 7.53 గంటలకు గ్యాస్‌ను పంపించారు. 8.25 గంటలలోపు అతను మరణించినట్లు ప్రకటించారు. ఏమిటీ కేసు?: చార్లెస్ సెన్సెట్ అనే మతాధికారి 1980లలో భారీగా అప్పులుచేశాడు. భార్యను చంపేస్తే బీమా సొమ్ము వస్తుందని ఆమె హత్యకు పథకం వేశాడు. చార్లెస్ నుంచి సుపారీ తీçసుకుని జాన్ ఫారెస్ట్ పార్కర్, స్మిత్ ఆయన భార్య ఎలిజబెత్‌ను చంపేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చాత్తాపంతో చార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2010లో పార్కర్‌కు అమలు శిక్షను అమలుచేయగా తాను నిర్దోషినంటూ ఇన్నాళ్లూ స్మిత్ కోర్టుల చుట్టూ తిరిగారు. జ్యూరీ జీవితఖైదు సిఫార్సుచేయగా జడ్జి ఏకంగా మరణశిక్ష విధించారు. ఇంతవరకూ లేని కొత్త విధానంలో శిక్ష అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. దీనిపై గురువారం అమెరికా సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఇంతవరకు వాడని, క్రూరమైన, అసాధారణ శిక్షా విధానాన్ని ఎలా అమలుచేస్తారని స్మిత్ లాయర్లు వాదించినా శిక్ష అమలుకే కోర్టు పచ్చజెండా ఊపింది. -
ఈరోజు స్పెషల్: బ్రదర్స్ డే.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: మే 24వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫాదర్స్, మదర్స్ డే, లవర్స్ డే మాదిరి బ్రదర్స్ డేగా ప్రపంచ దేశాలు నిర్వహించుకుంటున్నాయి. సోదరుడు అంటే అన్నాతమ్ముడు ఎవరైనా కావొచ్చు. మనతో ఆత్మీయంగా స్నేహితుడి మాదిరి ఉండే వ్యక్తి సోదరుడు. సోదరులు ఉంటే రక్త సంబంధమే కాదు. మనతో ఆత్మీయంగా ఉండే స్నేహితులను కూడా సోదరులుగా భావించవచ్చు. వారికి కూడా విషెస్ చెప్పొచ్చు. ఈ బ్రదర్స్ డే గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకోండి. 2005 నుంచి సోదరుల దినోత్సవం చేసుకోవడం మొదలైంది. అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన శిల్పి, రచయిత సి డేనియర్ రోడ్స్ బ్రదర్స్ డేను తొలిసారిగా చేసుకున్నాడు. అప్పటి నుంచి సోదరుల దినోత్సవం చేసుకోవడం మొదలైంది. మొదట బ్రదర్స్ డేను కేవలం అమెరికాలో చేసుకునేవారు. తర్వాతర్వాత అన్ని దేశాల్లో మొదలైంది. ఈ రోజున సోదరులు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొన్ని దేశాల్లో వారి సోదరులకు ఇష్టమైనవి వంటకాలు చేసి కలిసి భుజిస్తారు. బ్రదర్స్ డేకు కొన్ని దేశాల్లో సెలవు దినం (Public Holiday) కూడా ప్రకటించారు. అన్నాదమ్ములు పరస్పరం తమపై ప్రేమ చాటుకునేందుకు ఉద్దేశించినదే ‘ప్రపంచ సోదరుల దినోత్సవం’. -
కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపిన మైనర్..
వాషింగ్టన్ : ఓ మైనర్ బాలుడు కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అలబామాలో నివాసముంటున్న ఐదుగురు కుటుంబ సభ్యుల్ని ఇంటి వద్దనే 14 ఏళ్ల మైనర్ బాలుడు తుపాకీతో కాల్చి హతమార్చాడు. అనంతరం తానే పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు. ఈ విషయాన్నిపోలీసులు మంగళవారం మీడియా ముందు వెల్లడించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రమాద స్థలంలోనే మరణించగా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. బాలుడు కాల్పుల్లో ఉపయోగించిన తుపాకీ నూతన టెక్నాలజీతో తయారు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, విచారణలో నేరం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని వెల్లడించారు. అయితే అతనికి ఆ తుపాకీ ఎలా చేరిందని, కుటుంబాన్ని చంపడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. కాగా అమెరికాలో జరుగుతున్న వరుస కాల్పులు ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత వారం టెక్సాస్ నగరంలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా 22 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. అంతేగాక గత నెలలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. -
అమెరికాలో టోర్నెడో బీభత్సం
-
అమెరికాలో టోర్నెడో.. 23 మంది మృతి
బ్యూరీగార్డ్: అమెరికాలోని అలబామా రాష్ట్రాన్ని టోర్నెడో వణికిస్తోంది. ఆగ్నేయ అలబామాలో టోర్నెడో ధాటికి 23 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. తుపాను ధాటికి జార్జియా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. డ్రోన్ల సాయంతో ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించి కాపాడుతున్నామని చెప్పారు. గాయపడిన చాలా మందిని ఆస్పత్రులకు తరలించారు. టోర్నెడోల ప్రభావం అలబామాలో ఎక్కువగా ఉంది. టోర్నెడో ధాటికి పలు చోట్ల ఇళ్లు నేలకూలాయి. వందల సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. టోర్నెడో కారణంగా గంటకు 170 మైళ్ల వేగంతో గాలులు వీచాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. సహాయక కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీయిచ్చారని అలబామా గవర్నర్ తెలిపారు. టోర్నెడో బీభత్సం -
అమెరికాలో మేయర్ రేసులో తెలుగువాడు
న్యూయార్క్: అమెరికాలోని అలబామా రాష్ట్రం, మేడిసన్ నగర మేయర్ పదవికి ఓ తెలుగువాడు పోటీ పడుతున్నాడు. అమెరికాలో వ్యాపారుడిగా స్థిరపడిన తెలుగువాడు హను కర్లపాలెం(51), మేడిసన్‌లో జరగనున్న ఓ కార్యక్రమంలో హను తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కర్లపాలెంలో జన్మించిన హను ప్రస్తుతం అలబామా రాష్ట్రంలోని విన్హమ్జ్ ప్రాంతంలో నెట్వర్క్ సొల్యూషన్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ‘అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో అలబామా ఒకటి. అందులో చిన్న నగరమైన మేడిసన్‌కు నాయకత్వం వహించగలనన్న నమ్మకం నాకుంది. మొత్తం అమెరికాలోనే మేడిసన్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్నది నా లక్ష్యం. ఈ ఎన్నికలు మేడిసన్‌కు మాత్రమే కాదు.. అలబామా రాష్ట్రంలోనే చరిత్రాత్మకమవుతాయి’ అని హను అన్నారు. ప్రస్తుత మేయర్ ట్రాయ్ ట్రలాక్ కంటే తనకు నగరంపై సమగ్రమైన దార్శనికత ఉందని.. అమెరికాలోని విద్యావంతమైన, మేధో నగరాల్లో మేడిసన్ ఒకటని ఆయన అన్నారు.