
అమెరికాలో మేయర్ రేసులో తెలుగువాడు
న్యూయార్క్: అమెరికాలోని అలబామా రాష్ట్రం, మేడిసన్ నగర మేయర్ పదవికి ఓ తెలుగువాడు పోటీ పడుతున్నాడు. అమెరికాలో వ్యాపారుడిగా స్థిరపడిన తెలుగువాడు హను కర్లపాలెం(51), మేడిసన్‌లో జరగనున్న ఓ కార్యక్రమంలో హను తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కర్లపాలెంలో జన్మించిన హను ప్రస్తుతం అలబామా రాష్ట్రంలోని విన్‌హమ్జ్ ప్రాంతంలో నెట్‌వర్క్ సొల్యూషన్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ‘అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో అలబామా ఒకటి. అందులో చిన్న నగరమైన మేడిసన్‌కు నాయకత్వం వహించగలనన్న నమ్మకం నాకుంది.
మొత్తం అమెరికాలోనే మేడిసన్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్నది నా లక్ష్యం. ఈ ఎన్నికలు మేడిసన్‌కు మాత్రమే కాదు.. అలబామా రాష్ట్రంలోనే చరిత్రాత్మకమవుతాయి’ అని హను అన్నారు. ప్రస్తుత మేయర్ ట్రాయ్ ట్రలాక్ కంటే తనకు నగరంపై సమగ్రమైన దార్శనికత ఉందని.. అమెరికాలోని విద్యావంతమైన, మేధో నగరాల్లో మేడిసన్ ఒకటని ఆయన అన్నారు.