Madison
-
మాడిసన్ వరల్డ్ ఫౌండర్ సామ్ బల్సారాకు అరుదైన గౌరవం
అడ్వర్టైజింగ్ పరిశ్రమ అనుభవజ్ఞుడు, మాడిసన్ వరల్డ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సామ్ బల్సారా అరుదైన ఘనతకు దక్కించుకున్నారు. మీడియా ,అడ్వర్టైజింగ్ రంగంలో చేసిన సేవలకుగానూ ఎక్స్ఛేంజ్4మీడియా గ్రూపు ఆయనకు 'లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్'ని ఇచ్చి సత్కరించింది. ఎక్స్ఛేంజ్4మీడియా గ్రూప్ మీడియా ఏస్ అవార్డ్స్ 2023 వేడుకలను ఈ నెల (నవంబరు 2) ముంబైలో నిర్వహించింది. దీంతో పలువురు ఇండస్ట్రీ పెద్దలు, ఇతర బిజినెస్ వర్గాలు ఆయనకు అభినందనలు తెలిపాయి. ఎవరీ సామ్ బల్సారా గుజరాత్‌లోని వల్సాద్ అని పిలిచే బల్సార్‌లో జన్మించారు. తండ్రి ఫారెస్ట్ కాంట్రాక్టర్ కావడంతో బల్సారా కుటుంబం బెంగళూరుకు మారింది. బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి డిగ్రీని, 1970లో ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తరువాత క్యాడ్‌బరీకి, అడ్వర్టైజింగ్ ఎట్ కాంట్రాక్ట్ (WPP) ముద్రకు లాంటి సంస్థలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. సారాభాయ్‌లో తన కరియర్‌ను ప్రారంభించిన బల్సారా మార్కెటింగ్ రంగంలో 50ఏళ్ల అనుభవజ్ఞుడు. మాడిసన్ ఆవిర్భావం 1988లో అడ్వర్టైజింగ్ కంపెనీగా మాడిసన్‌ను ప్రారంభించారు. అంచలంచెలుగా ఎదిగిన సంస్థ ఇపుడు 26 యూనిట్లతో విభిన్న కమ్యూనికేషన్ల సమూహంగా అవతరించింది. మాడిసన్ వరల్డ్ ... అడ్వర్టైజింగ్, మీడియా ప్లానింగ్ అండ్ బైయింగ్, బిజినెస్ అనలిటిక్స్, OOH, PR, రూరల్, రిటైల్, ఎంటర్టైన్మెంట్, మొబైల్, ఈవెంట్స్, యాక్టివేషన్స,స్పోర్ట్స్ లాంటి 11 విభాగాల్లో తన సేవల్ని అందిస్తోంది. -
ఆ వీడియోలు తీయబోతే.. తిక్క కుదిరింది!
వాషింగ్టన్ : మహిళలపై వేధింపులకు షాపింగ్ మాల్స్, బాత్రూముల్లో కెమెరాలు అమర్చి ఎంతోమంది ఆకతాయిలు అడ్డంగా బుక్కవుతూ ఉంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన కీచక తెలివితేటలను ప్రయోగించబోయి అడ్డంగా బుక్కయ్యాడు. అతడి వల్ల ఏ తప్పిదం జరగకపోవడంతో, మరోసారి పిచ్చి చేష్టలు చేయవద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చి పంపించివేశారు. విస్కాన్సిన్ రాష్ట్రం మాడిసన్ నగరానికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి మహిళల అశ్లీల వీడియోలు, ఫొటోలను తెలివిగా తీయాలనుకున్నాడు. షూకు కెమెరాను అమర్చి రద్దీ ప్రాంతాల్లో నడుస్తూ పొట్టి దుస్తులు వేసుకున్న మహిళలను కింది నుంచి వీడియోలు చిత్రీకరించాలన్నది అతడి దురాలోచన. ఇందుకోసం ఓ వీడియో కెమెరాను కొనుగోలు చేశాడు. మొదట అది పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు తన ఇంట్లో పరీక్షించాలనుకున్నాడు. కాలికి ఓ షూ కట్టుకుని, దానికి సీక్రెట్ కెమెరాను అమర్చి అటూఇటూ నడుస్తుండగా ఒక్కసారిగా ఆ పరికరం పేలిపోయిందని మాడిసన్ పోలీస్ చీఫ్ మైఖెల్ కోవల్ తెలిపారు. కెమెరా బ్యాటరీ కారణంగా పేలుడు సంభవించిందని, అయితే ఈ ఘటనలో ఆ వ్యక్తి కాలుకు గాయాలుకాగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్‌కు వెళ్లి సీక్రెట్ కెమెరాతో అశ్లీల వీడియోలు తీయాలన్న ఆలోచనను మానుకోవాలని హెచ్చరించారు. గతంలో ఎలాంటి వీడియోలు తీయలేదని నిర్ధారించుకున్న తర్వాత మాడిసన్ పోలీసులు అతడిని ఇంటికి పంపించారు. నేరానికి పాల్పడ్లు తేలితే మాత్రం జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని, కఠిన చర్యలకు సిద్దం కావాల్సి ఉంటుందని ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చారు. -
అమెరికాలో మేయర్ రేసులో తెలుగువాడు
న్యూయార్క్: అమెరికాలోని అలబామా రాష్ట్రం, మేడిసన్ నగర మేయర్ పదవికి ఓ తెలుగువాడు పోటీ పడుతున్నాడు. అమెరికాలో వ్యాపారుడిగా స్థిరపడిన తెలుగువాడు హను కర్లపాలెం(51), మేడిసన్‌లో జరగనున్న ఓ కార్యక్రమంలో హను తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కర్లపాలెంలో జన్మించిన హను ప్రస్తుతం అలబామా రాష్ట్రంలోని విన్హమ్జ్ ప్రాంతంలో నెట్వర్క్ సొల్యూషన్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ‘అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో అలబామా ఒకటి. అందులో చిన్న నగరమైన మేడిసన్‌కు నాయకత్వం వహించగలనన్న నమ్మకం నాకుంది. మొత్తం అమెరికాలోనే మేడిసన్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్నది నా లక్ష్యం. ఈ ఎన్నికలు మేడిసన్‌కు మాత్రమే కాదు.. అలబామా రాష్ట్రంలోనే చరిత్రాత్మకమవుతాయి’ అని హను అన్నారు. ప్రస్తుత మేయర్ ట్రాయ్ ట్రలాక్ కంటే తనకు నగరంపై సమగ్రమైన దార్శనికత ఉందని.. అమెరికాలోని విద్యావంతమైన, మేధో నగరాల్లో మేడిసన్ ఒకటని ఆయన అన్నారు.