అడ్వర్టైజింగ్ పరిశ్రమ అనుభవజ్ఞుడు, మాడిసన్ వరల్డ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సామ్ బల్సారా అరుదైన ఘనతకు దక్కించుకున్నారు. మీడియా ,అడ్వర్టైజింగ్ రంగంలో చేసిన సేవలకుగానూ ఎక్స్ఛేంజ్4మీడియా గ్రూపు ఆయనకు 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్'ని ఇచ్చి సత్కరించింది. ఎక్స్ఛేంజ్4మీడియా గ్రూప్ మీడియా ఏస్ అవార్డ్స్ 2023 వేడుకలను ఈ నెల (నవంబరు 2) ముంబైలో నిర్వహించింది. దీంతో పలువురు ఇండస్ట్రీ పెద్దలు, ఇతర బిజినెస్ వర్గాలు ఆయనకు అభినందనలు తెలిపాయి.
ఎవరీ సామ్ బల్సారా
గుజరాత్‌లోని వల్సాద్ అని పిలిచే బల్సార్‌లో జన్మించారు. తండ్రి ఫారెస్ట్ కాంట్రాక్టర్ కావడంతో బల్సారా కుటుంబం బెంగళూరుకు మారింది. బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి డిగ్రీని, 1970లో ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తరువాత క్యాడ్‌బరీకి, అడ్వర్టైజింగ్ ఎట్ కాంట్రాక్ట్ (WPP) ముద్రకు లాంటి సంస్థలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. సారాభాయ్‌లో తన కరియర్‌ను ప్రారంభించిన బల్సారా మార్కెటింగ్ రంగంలో 50ఏళ్ల అనుభవజ్ఞుడు.
మాడిసన్ ఆవిర్భావం
1988లో అడ్వర్టైజింగ్ కంపెనీగా మాడిసన్‌ను ప్రారంభించారు. అంచలంచెలుగా ఎదిగిన సంస్థ ఇపుడు 26 యూనిట్లతో విభిన్న కమ్యూనికేషన్‌ల సమూహంగా అవతరించింది. మాడిసన్ వరల్డ్ ... అడ్వర్టైజింగ్, మీడియా ప్లానింగ్ అండ్ బైయింగ్, బిజినెస్ అనలిటిక్స్, OOH, PR, రూరల్, రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్, మొబైల్, ఈవెంట్స్, యాక్టివేషన్స,స్పోర్ట్స్ లాంటి 11 విభాగాల్లో తన సేవల్ని అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment