Life Time Achievement Award
-
సాహితీ ధృవతార ఖమర్
మదనపల్లె సిటీ: రాయలసీమ ఉర్దూ సాహిత్యంలో ఖమర్ అమీని అలియాస్ ఖమర్ హజరత్ అంటే తెలియని వారుండరంటే అతిశయోశక్తి కాదు. సాహితీ ప్రపంచంలో ధృవతార ఆయన. 80 ఏళ్ల వయస్సులోనూ మాతృభాషలైన ఉర్దూ, జాతీయ భాషలైనా హిందీలకు సేవలందిస్తున్నారు. ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు, కవితా సంపుటాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించాయి. మైనార్టీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉర్దూ అకాడమీ 2023 ఏడాదికి ఖమర్‌కు జీవిత సాఫల్య అవార్డు రాష్ట్ర సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన రచనలు గురించి కథనం. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం దేవళంవీధిలో నివసిస్తున్న ఈయన ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయుడు. అసలు పేరు బాబా ఫకృద్దీన్. కలం పేరు ఖమర్ అమీని. 22 ఏళ్ల పాటు ఉర్దూ ఉపాధ్యాయునిగా , 18 ఏళ్లు హిందీ ఉపాధ్యాయునిగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేసి పదవీ విరమణ అనంతరం మదనపల్లెలో స్థిరపడ్డారు. 1954లో మొదట కవిత్వం రాయం ప్రారంభించిన అమీని ఇప్పటి వరకు వేలాది కవిత్వాలు రాశారు. ఆయన రాసిన ‘అమ్మకు ఓ అక్షరం(మా)’ అను కవితకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించింది. ఆయన ప్రసిద్ది చెందిన కడప పెద్ద దర్గాలో 30 సంవత్సరాలు సాహితీ సేవలు అందించారు. ఆయన రచించిన కవితలు ప్రఖ్యాత గాయకులు పంకజ్ఉదాస్, విఠల్‌రావు, అశోక్ఖోస్లాతో పాటు పలువురు ప్రసిద్ద ఖవ్వాల్లు పాడారు. ఖమర్అమీని రచించిన కవితల పుస్తకాలు గుల్దస్తే, తవాఫే–గజల్, నాత్కీ అంజుమన్,కష్కోల్–ఏ–ఖల్బ్–ఓ–నజర్, ఇర్తెకాజ్–ఏ–అప్కార్,కష్కోల్–కరమ్ బిరుదులు: అనీస్–ఉస్–షోరా, నఖీబ్–ఉష్–షోరా ప్రశంసలు: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ,మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్, ప్రముఖ గేయరచయిత సీ నారాయణరెడ్డిలచే పలు ప్రశంసలు అందుకున్నారు. సాహితీ సేవకు వయస్సు అడ్డురాదు సాహితీ సేవకు వయస్సు అడ్డంకి కారాదు. నాకు గుర్తింపునిచ్చిన భాష సేవకే జీవితాన్ని అంకితమిస్తున్నాను. ఊపిరి ఉన్నంతవరకు సాహితీ సేవలందిస్తాను. ఇప్పటివరకు వందలాది మంది శిష్యులను తీర్చిదిద్దాను. –ఖమర్ అమీని, ప్రముఖ ఉర్దూ రచయిత -
BCCI Awards 2024: రవిశాస్త్రికి బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు
రేపు జరుగబోయే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కనుంది. భారత క్రికెట్‌కు శాస్త్రి చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డును అందించనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఆటగాడిగా, హెడ్ కోచ్‌గా భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన శాస్త్రి ప్రస్తుతం టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. శాస్త్రి హయాంలో (2017-2021) అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ జట్టుగా విరాజిల్లింది. భారత జట్టుకు దూకుడు నేర్పిన కోచ్‌గా శాస్త్రికి పేరుంది. 61 ఏళ్ల రవిశాస్త్రి 1981-92 మధ్యలో 80 టెస్ట్‌లు, 150 వన్డేలు ఆడి దాదాపు 7000 పరుగులు చేసి 280 వికెట్లు పడగొట్టాడు. రవిశాస్త్రి తన కెరీర్లో 15సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు. రేపు జరుగబోయే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముంబైకు చెందిన యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, షమ్స్ ములానీలకు అవార్డులు దక్కనున్నాయి. -
మాడిసన్ వరల్డ్ ఫౌండర్ సామ్ బల్సారాకు అరుదైన గౌరవం
అడ్వర్టైజింగ్ పరిశ్రమ అనుభవజ్ఞుడు, మాడిసన్ వరల్డ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సామ్ బల్సారా అరుదైన ఘనతకు దక్కించుకున్నారు. మీడియా ,అడ్వర్టైజింగ్ రంగంలో చేసిన సేవలకుగానూ ఎక్స్ఛేంజ్4మీడియా గ్రూపు ఆయనకు 'లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్'ని ఇచ్చి సత్కరించింది. ఎక్స్ఛేంజ్4మీడియా గ్రూప్ మీడియా ఏస్ అవార్డ్స్ 2023 వేడుకలను ఈ నెల (నవంబరు 2) ముంబైలో నిర్వహించింది. దీంతో పలువురు ఇండస్ట్రీ పెద్దలు, ఇతర బిజినెస్ వర్గాలు ఆయనకు అభినందనలు తెలిపాయి. ఎవరీ సామ్ బల్సారా గుజరాత్‌లోని వల్సాద్ అని పిలిచే బల్సార్‌లో జన్మించారు. తండ్రి ఫారెస్ట్ కాంట్రాక్టర్ కావడంతో బల్సారా కుటుంబం బెంగళూరుకు మారింది. బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి డిగ్రీని, 1970లో ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తరువాత క్యాడ్‌బరీకి, అడ్వర్టైజింగ్ ఎట్ కాంట్రాక్ట్ (WPP) ముద్రకు లాంటి సంస్థలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. సారాభాయ్‌లో తన కరియర్‌ను ప్రారంభించిన బల్సారా మార్కెటింగ్ రంగంలో 50ఏళ్ల అనుభవజ్ఞుడు. మాడిసన్ ఆవిర్భావం 1988లో అడ్వర్టైజింగ్ కంపెనీగా మాడిసన్‌ను ప్రారంభించారు. అంచలంచెలుగా ఎదిగిన సంస్థ ఇపుడు 26 యూనిట్లతో విభిన్న కమ్యూనికేషన్ల సమూహంగా అవతరించింది. మాడిసన్ వరల్డ్ ... అడ్వర్టైజింగ్, మీడియా ప్లానింగ్ అండ్ బైయింగ్, బిజినెస్ అనలిటిక్స్, OOH, PR, రూరల్, రిటైల్, ఎంటర్టైన్మెంట్, మొబైల్, ఈవెంట్స్, యాక్టివేషన్స,స్పోర్ట్స్ లాంటి 11 విభాగాల్లో తన సేవల్ని అందిస్తోంది. -
‘సాక్షి’మీడియా గ్రూప్‌కు ధన్యవాదాలు: కే. విశ్వనాథ్
అగ్ర దర్శకుడు, కళా తపస్వీ కే. విశ్వనాథ్ (92) ఇక లేరనే విషయం తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర వేసిన విశ్వానాథ్.. ఎన్నో రికార్డులను, అవార్డులను సొంతం చేసుకున్నారు. 2015లో ఆయనకు ‘సాక్షి’ మీడియా సంస్థ ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినే ‘సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్’ అవార్డును ప్రధానం చేసింది. (చదవండి: కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్ ఇకలేరు) సినీరంగంలో చేసిన అత్యుత్తమ సేవలను గుర్తించిన సాక్షి సంస్థ 2015 సంవత్సరానికిగానూ ఈ అవార్డును ఆయనకు ప్రధానం చేసింది. సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేతుల మీదుగా కళాతపస్వి విశ్వనాథ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తనను గుర్తుపెట్టుకుని మరీ గౌరవించిన సాక్షి సంస్థకు ధన్యావాదాలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
25వేలకు పైగా పాటలు.. జనార్థన్ మిట్టాకు జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, చెన్నై: వివిధ భాషల్లో 25 వేలకు పైగా పాటలకు సితార వాయిద్య సంగీతాన్ని అందించిన పండిట్ జనార్ధన్ మిట్టాను ఘంటసాల జీవిత సాఫల్య పురస్కారం వరించింది. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తరపున ఆదివారం జరిగిన ఘంటసాల శత జయంతి అంతర్జాల ఉత్సవాల్లో భాగంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈమేరకు చెన్నైలో ఉంటున్న సితార విద్వాంసులు పండిట్ జనార్ధన్ మిట్టాకు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సభ్యులు లేళ్లపల్లి రమేష్, శ్రీదేవి దంపతులతో పాటు మాడభూషి సంపత్ కుమార్, సంగీత కారులు కిడాంబి లక్ష్మీ కాంతం జ్ఞాపిక, ప్రసంసాపత్రం అందించి సన్మానించారు. సమాఖ్య అధ్యక్షుడు రాళ్లపల్లి సుందర రావు, ప్రధాన కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్, మాజీ ఉపరాష్ట్రపతి వి.వి.గిరి కోడలు మోహినీ గిరి ప్రసంగించారు. చివరిగా లేళ్లపల్లి రమేష్, శ్రీదేవి దంపతులు మిట్టా జనార్ధన్‌కు సంగీత చక్రాన్ని బహూకరించారు. -
నటి కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారం
దక్షిణ భారత చలనచిత్ర రంగానికి అందించిన విశేష కృషికి గాను ప్రముఖ నటి, కలైమామణి డాక్టర్ కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా శక్తికి సెల్యూట్ చేస్తూ పక్వాన్ చెన్నై ఆధ్వర్యంలో 5వ వార్షిక రియలిస్టిక్ అవార్డ్స్ 2022 ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. పక్వాన్ చెన్నై నిర్వాహకులు సంజయ్ డాంగి, అనిల్ డాంగి మరియు హితేష్ కొఠారి నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన మహిళల విజయాలను కొనియాడుతూ అవార్డులను అందజేశారు. ముఖ్య అతిథిగా చెన్నై కస్టమ్స్ జోన్ చీఫ్ కమిషనర్ ఎంవిఎస్ చౌదరి (చెన్నాల్ కస్టమ్స్ జోన్) పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో ప్రము ఖ నటి కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. -
ఏబీకేకు ‘వైఎస్సార్ పురస్కారం’
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌కు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ప్రదానం చేశారు. ఏబీకేను శాలువాతో సత్కరించి రూ.10 లక్షల చెక్కు, వైఎస్సార్ జ్ఞాపికను అందజేశారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. గత నవంబర్ 1న విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన డాక్టర్ వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారం ప్రదాన కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల ఏబీకే హాజరుకాలేకపోయారు. అయినప్పటికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీచేసి తనకు ఈ పురస్కారాన్ని అందజేయడంపట్ల ఏబీకే సంతోషం వ్యక్తం చేశారు. ఇది పత్రికారంగంలో పనిచేసిన, చేస్తున్న తన సహచరులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పురస్కారం తన చేతుల మీదుగా ఏబీకేకు అందించడం అదృష్టంగా భావిస్తున్నట్టు అమర్ అన్నారు. ఆయన కాలమ్స్ పాఠకులను ఆలోచింపజేస్తున్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, విశాలాంధ్ర సంపాదకుడు ఆర్వీ రామారావు, చరిత్ర పరిశోధకుడు శివనాగిరెడ్డి, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. -
ప్రకాశ్ పడుకోన్‌కు అరుదైన గౌరవం
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్‌ను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సముచిత రీతిలో గౌరవిస్తూ ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’కు ఎంపిక చేసింది. 1980లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీని గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన మాజీ వరల్డ్ నంబర్‌వన్ ప్రకాశ్ పడుకోన్ ఆ తర్వాత 1983 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించారు. రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా వ్యవహరించడంతో పాటు ఓజీక్యూ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. -
నేడు ‘వైఎస్సార్’ పురస్కారాల ప్రదానం
-
సామాన్యుల్లో అసామాన్యులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులను 2021 ఏడాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంస్థలు, వ్యక్తులకు కలిపి 62 అవార్డులు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు (కమ్యునికేషన్స్), వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు జీవీడీ కృష్ణమోహన్ మీడియా సమావేశంలో అవార్డుల వివరాలను వెల్లడించారు. గత ఏడాది ఈ అవార్డులను ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసి ఈ ఏడాది ప్రకటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పలు రంగాల్లో వివిధ సంస్థలు, వ్యక్తులు సమాజానికి అందించిన సేవలను గుర్తించి పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఈ అవార్డులకు ఎంపిక చేశామని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు.. వివిధ శాఖాధికారులు, పలు సంస్థలు, పలువురు వ్యక్తుల భాగస్వామ్యంతో అవార్డులకు ఎంపిక చేశామని తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. సామాన్యుల్లో అసామాన్యులను గుర్తించి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్ అవార్డులకు ఎంపిక చేశామని పేర్కొన్నారు. సుదీర్ఘ కసరత్తుతో ఎంపిక తెలుగు వారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక రంగాల్లో విశేష సేవలందిస్తున్నారని కృష్ణమోహన్ తెలిపారు. వైఎస్సార్, సీఎం జగన్‌లది పేదవాడికి మేలు చేయాలనే ఫిలాసిఫీ అన్నారు. తెలుగువాడు అంటే నిండైన వ్యక్తిత్వం కలిగిన వారిలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి పేరిట ఇస్తున్న ఈ అవార్డులకు తగిన అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ కొద్ది నెలలుగా విస్తృతమైన కసరత్తు చేసిందన్నారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్ కింద 50 అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ, 62 అవార్డులను ఇస్తోందని చెప్పారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు రూ.10 లక్షలు నగదు, జ్ఞాపిక, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5 లక్షలు నగదు, జ్ఞాపికను అందించనున్నట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆగస్టు 14 లేదా 15వ తేదీన అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుందని అయన పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి(రాజకీయ) ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా ఈ అవార్డులను ఇస్తున్నారని తెలిపారు. 6 కేటగీరీల కింద మొత్తం 62 అవార్డులను ప్రదానం చేయనున్నారని చెప్పారు. సంస్థలు (అన్నింటికీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు) 1) ఎంఎస్ఎన్ ఛారిటీస్ ట్రస్ట్ – కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా 2) సీపీ బ్రౌన్ లైబ్రరీ – వైఎస్సార్ జిల్లా 3) సారస్వత నికేతన్ లైబ్రరీ – వేటపాలెం, ప్రకాశం జిల్లా 4) శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ – అనంతపురం జిల్లా 5) ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ – వైఎస్సార్ జిల్లా 6) రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ – అనంతపురం 7) గౌతమి రీజినల్ లైబ్రరీ – రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా 8) మహారాజాస్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ – మ్యూజిక్ – విజయనగరం రైతులు 1) స్వర్గీయ పల్లా వెంకన్న (లైఫ్ టైమ్) – కడియం నర్సరీల వ్యవస్థాపకుడు 2) మాతోట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ – శ్రీకాకుళం 3) «ఎం.సి.రామకృష్ణారెడ్డి – అనంతపురం 4) కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం 5) విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ – కృష్ణా 6) ఎం.బలరామిరెడ్డి – వైఎస్సార్ జిల్లా 7) ఎస్.రాఘవేంద్ర – చిత్తూరు 8) సెగ్గె కొండల్రావు – విశాఖపట్నం 9) ఆంధ్ర కశ్మీర్ ట్రైబల్ ఫార్మింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ – విశాఖపట్నం 10) వల్లూరు రవికుమార్ – కృష్ణా 11) శివ అభిరామరెడ్డి – నెల్లూరు కళాకారులు 1) పొందూరు వస్త్రాలు – ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం – శ్రీకాకుళం – లైఫ్ టైం 2) జానపద గేయం – దివంగత వంగపండు ప్రసాదరావు– విజయనగరం – లైఫ్ టైం 3) బొబ్బిలి వీణ – బొబ్బిలి వీణ కేంద్రం (అచ్చుత నారాయణ)– విజయనగరం – లైఫ్ టైం 4) రంగస్థలం – పొన్నాల రామసుబ్బారెడ్డి – నెల్లూరు – లైఫ్ టైం 5) సురభి నాటకం – (శ్రీ వినాయక నాట్య మండలి) – సురభి డ్రామా – వైఎస్సార్ జిల్లా – లైఫ్ టైం 6) లెదర్ పప్పెట్రీ – దాలవాయి చలపతి –అనంతపురం – లైఫ్ టైం 7) కూచిపూడి నాట్యం – సిద్ధేంద్రయోగి కళా క్షేత్రం – కూచిపూడి, కృష్ణా జిల్లా – లైఫ్ టైం 8) «ధింసా నృత్యం– కిల్లు జానకమ్మ థింసా నృత్య బృందం – విశాఖపట్నం 9) సవర పెయింటింగ్స్ – సవర రాజు – శ్రీకాకుళం 10) వీధి నాటకం – మజ్జి శ్రీనివాసరావు – విశాఖపట్నం 11) డిజాస్టర్ మేనేజ్మెంట్ – ధర్మాడి సత్యం– తూర్పు గోదావరి 12) హరికథ– సర్వారాయ హరికథా పాఠశాల (మహిళ) – తూర్పు గోదావరి 13) బుర్రకథ– మిరియాల అప్పారావు – పశ్చిమ గోదావరి 14) కొండపల్లి బొమ్మలు – కూరెళ్ల వెంకటాచారి– కృష్ణా 15) డప్పు కళాకారుడు – గోచిపాత గాలేబు–కృష్ణా 16) వెంకటగిరి జమదానీ చీరలు – జి.రమణయ్య– నెల్లూరు 17) కలంకారీ పెయింటింగ్స్– శివప్రసాదరెడ్డి– కర్నూలు 18) ఉడ్ కార్వింగ్స్ – బాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్జిజాన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ – చిత్తూరు 19) నాదస్వరం – డాక్టర్ వి.సత్యనారాయణ – చిత్తూరు 20) కేలిగ్రఫీ – పూసపాటి పరమేశ్వరరాజు – విజయనగరం రచయితలు (అందరికీ లైఫ్ టైం) 1) స్వర్గీయ కాళిపట్నం రామారావు (కారా మాస్టర్)– శ్రీకాకుళం 2) కత్తి పద్మారావు – అభ్యుదయ సాహిత్యం – గుంటూరు 3) రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి– సాహిత్యం – వైఎస్సార్ జిల్లా 4) బండి నారాయణస్వామి – సాహిత్యం– అనంతపురం 5) కేతు విశ్వనాథరెడ్డి – సాహిత్యం – వైఎస్సార్ జిల్లా 6) కొనకలూరి ఇనాక్ – సాహిత్యం, గుంటూరు 7) శ్రీమతి లలితకుమారి (ఓల్గా) – సాహిత్యం– గుంటూరు పాత్రికేయులు (అందరికీ లైఫ్ టైం) 1) పాలగుమ్మి సాయినాథ్ – చెన్నై 2) ఏబీకే ప్రసాద్ – కృష్ణా 3) దివంగత పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు 4) దివంగత షేక్ ఖాజా హుస్సేన్ (దేవీప్రియ) – గుంటూరు 5) దివంగత కె.అమర్నాథ్ – పశ్చిమ గోదావరి 6) సురేంద్ర – కార్టూనిస్ట్ – కడప 7) తెలకపల్లి రవి – కర్నూలు 8) ఇమామ్ – అనంతపురం కోవిడ్ వారియర్స్ 1) డాక్టర్ నీతిచంద్ర – ప్రొఫెసర్ పల్మనాలజీ – నెల్లూరు 2) డాక్టర్ కె.కృష్ణకిషోర్ – ప్రొఫెసర్ ఈఎన్టీ – కాకినాడ 3) లక్ష్మి – స్టాఫ్ నర్స్ – జీజీహెచ్, విజయవాడ 4) కె.జ్యోతిర్మయి – స్టాఫ్ నర్స్ – అనంతపురం 5) తురుబిల్లి తేజస్వి – స్టాఫ్ నర్స్ – విశాఖపట్నం 6) ఎం.యోబు – మేల్ నర్సింగ్ – నెల్లూరు 7) అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ – గుంటూరు 8) ఆర్తి హోమ్స్ – వైఎస్సార్ కడప -
వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య అవార్డుల ప్రకటన
-
వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య అవార్డుల ప్రకటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులను 2021 ఏడాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంస్థలు, వ్యక్తులకు కలిపి 62 అవార్డులు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు (కమ్యునికేషన్స్), వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు జీవీడీ కృష్ణమోహన్ మీడియా సమావేశంలో అవార్డుల వివరాలను వెల్లడించారు. గత ఏడాది ఈ అవార్డులను ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసి ఈ ఏడాది ప్రకటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పలు రంగాల్లో వివిధ సంస్థలు, వ్యక్తులు సమాజానికి అందించిన సేవలను గుర్తించి పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఈ అవార్డులకు ఎంపిక చేశామని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖాధికారులు, పలు సంస్థలు, పలువురు వ్యక్తుల భాగస్వామ్యంతో అవార్డులకు ఎంపిక చేశామని తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. సామాన్యుల్లో అసామాన్యులను గుర్తించి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్ అవార్డులకు ఎంపిక చేశామని పేర్కొన్నారు. సుదీర్ఘ కసరత్తుతో ఎంపిక తెలుగు వారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక రంగాల్లో విశేష సేవలందిస్తున్నారని కృష్ణమోహన్ తెలిపారు. వైఎస్సార్, సీఎం జగన్‌లది పేదవాడికి మేలు చేయాలనే ఫిలాసిఫీ అన్నారు. తెలుగువాడు అంటే నిండైన వ్యక్తిత్వం కలిగిన వారిలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి పేరిట ఇస్తున్న ఈ అవార్డులకు తగిన అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ కొద్ది నెలలుగా విస్తృతమైన కసరత్తు చేసిందన్నారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్ కింద 50 అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ, 62 అవార్డులను ఇస్తోందని చెప్పారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు రూ.10 లక్షలు నగదు, జ్ఞాపిక, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5 లక్షలు నగదు, జ్ఞాపికను అందించనున్నట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆగస్టు 14 లేదా 15వ తేదీన అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుందని అయన పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి(రాజకీయ) ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా ఈ అవార్డులను ఇస్తున్నారని తెలిపారు. 6 కేటగీరీల కింద మొత్తం 62 అవార్డులను ప్రదానం చేయనున్నారని చెప్పారు. సంస్థలు (అన్నింటికీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు) 1) ఎంఎస్ఎన్ ఛారిటీస్ ట్రస్ట్ - కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా 2) సీపీ బ్రౌన్ లైబ్రరీ - వైఎస్సార్ జిల్లా 3) సారస్వత నికేతన్ లైబ్రరీ - వేటపాలెం, ప్రకాశం జిల్లా 4) శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ - అనంతపురం జిల్లా 5) ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ - వైఎస్సార్ జిల్లా 6) రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ - అనంతపురం 7) గౌతమి రీజినల్ లైబ్రరీ - రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా 8) మహారాజాస్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ - మ్యూజిక్ - విజయనగరం --------------------------------------------- రైతులు 1) స్వర్గీయ పల్లా వెంకన్న (లైఫ్ టైమ్) - కడియం నర్సరీల వ్యవస్థాపకుడు 2) మాతోట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ - శ్రీకాకుళం 3) ఎం.సి.రామకృష్ణారెడ్డి - అనంతపురం 4) కొట్యాడ శ్రీనివాసరావు - విజయనగరం 5) విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ - కృష్ణా 6) ఎం.బలరామిరెడ్డి - వైఎస్సార్ జిల్లా 7) ఎస్.రాఘవేంద్ర - చిత్తూరు 8) సెగ్గె కొండల్రావు - విశాఖపట్నం 9) ఆంధ్ర కశ్మీర్ ట్రైబల్ ఫార్మింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ - విశాఖపట్నం 10) వల్లూరు రవికుమార్- కృష్ణా 11) శివ అభిరామరెడ్డి - నెల్లూరు --------------------------------------------- కళాకారులు 1) పొందూరు వస్త్రాలు - ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం - శ్రీకాకుళం - లైఫ్ టైం 2) జానపద గేయం - దివంగత వంగపండు ప్రసాదరావు- విజయనగరం - లైఫ్ టైం 3) బొబ్బిలి వీణ - బొబ్బిలి వీణ కేంద్రం (అచ్చుత నారాయణ)- విజయనగరం - లైఫ్ టైం 4) రంగస్థలం - పొన్నాల రామసుబ్బారెడ్డి - నెల్లూరు - లైఫ్ టైం 5) సురభి నాటకం - (శ్రీ వినాయక నాట్య మండలి) - సురభి డ్రామా - వైఎస్సార్ జిల్లా - లైఫ్ టైం 6) లెదర్ పప్పెట్రీ - దాలవాయి చలపతి -అనంతపురం - లైఫ్ టైం 7) కూచిపూడి నాట్యం - సిద్ధేంద్రయోగి కళా క్షేత్రం - కూచిపూడి, కృష్ణా జిల్లా - లైఫ్ టైం 8) «ధింసా నృత్యం- కిల్లు జానకమ్మ థింసా నృత్య బృందం - విశాఖపట్నం 9) సవర పెయింటింగ్స్ - సవర రాజు - శ్రీకాకుళం 10) వీధి నాటకం - మజ్జి శ్రీనివాసరావు - విశాఖపట్నం 11) డిజాస్టర్ మేనేజ్మెంట్ - ధర్మాడి సత్యం- తూర్పు గోదావరి 12) హరికథ- సర్వారాయ హరికథా పాఠశాల (మహిళ) - తూర్పు గోదావరి 13) బుర్రకథ- మిరియాల అప్పారావు - పశ్చిమ గోదావరి 14) కొండపల్లి బొమ్మలు - కూరెళ్ల వెంకటాచారి- కృష్ణా 15) డప్పు కళాకారుడు - గోచిపాత గాలేబు-కృష్ణా 16) వెంకటగిరి జమదానీ చీరలు - జి.రమణయ్య- నెల్లూరు 17) కలంకారీ పెయింటింగ్స్- శివప్రసాదరెడ్డి- కర్నూలు 18) ఉడ్ కార్వింగ్స్ - బాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్జిజాన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ - చిత్తూరు 19) నాదస్వరం - డాక్టర్ వి.సత్యనారాయణ - చిత్తూరు 20) కేలిగ్రఫీ - పూసపాటి పరమేశ్వరరాజు - విజయనగరం ------------------------------------------------------------------ రచయితలు (అందరికీ లైఫ్ టైం) 1) స్వర్గీయ కాళిపట్నం రామారావు (కారా మాస్టర్)- శ్రీకాకుళం 2) కత్తి పద్మారావు - అభ్యుదయ సాహిత్యం - గుంటూరు 3) రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి- సాహిత్యం - వైఎస్సార్ జిల్లా 4) బండి నారాయణస్వామి - సాహిత్యం- అనంతపురం 5) కేతు విశ్వనాథరెడ్డి - సాహిత్యం - వైఎస్సార్ జిల్లా 6) కొనకలూరి ఇనాక్ - సాహిత్యం, గుంటూరు 7) శ్రీమతి లలితకుమారి (ఓల్గా) - సాహిత్యం- గుంటూరు ---------------------------------------------------------- పాత్రికేయులు (అందరికీ లైఫ్ టైం) 1) పాలగుమ్మి సాయినాథ్ - చెన్నై 2) ఏబీకే ప్రసాద్ - కృష్ణా 3) దివంగత పొత్తూరి వెంకటేశ్వరరావు - గుంటూరు 4) దివంగత షేక్ ఖాజా హుస్సేన్ (దేవీప్రియ) - గుంటూరు 5) దివంగత కె.అమర్నాథ్ - పశ్చిమ గోదావరి 6) సురేంద్ర - కార్టూనిస్ట్ - కడప 7) తెలకపల్లి రవి - కర్నూలు 8) ఇమామ్ - అనంతపురం ------------------------------------------- కోవిడ్ వారియర్స్ 1) డాక్టర్ నీతిచంద్ర - ప్రొఫెసర్ పల్మనాలజీ - నెల్లూరు 2) డాక్టర్ కె.కృష్ణకిషోర్ - ప్రొఫెసర్ ఈఎన్టీ - కాకినాడ 3) లక్ష్మి - స్టాఫ్ నర్స్ - జీజీహెచ్, విజయవాడ 4) కె.జ్యోతిర్మయి - స్టాఫ్ నర్స్ - అనంతపురం 5) తురుబిల్లి తేజస్వి - స్టాఫ్ నర్స్ - విశాఖపట్నం 6) ఎం.యోబు - మేల్ నర్సింగ్ - నెల్లూరు 7) అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ - గుంటూరు 8) ఆర్తి హోమ్స్ - వైఎస్సార్ కడప ఎచివ్‌మెంట్ అవార్డుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నేడు వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డుల ప్రకటన
సాక్షి, అమరావతి: వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు వైఎస్సార్ జీవిత సాఫల్య (లైఫ్‌టైమ్ అచీవ్మెంట్), వైఎస్సార్ సాఫల్య (అచీవ్మెంట్) పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ప్రభుత్వం తరఫున అవార్డుల హై పవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమ్యూనికేషన్ల సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ ఈ నెల 7న వివరాలు వెల్లడించనున్నారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు ఈ అవార్డుల్లో ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్‌తో పాటు అసామాన్య ప్రతిభ కనబరిచిన సామాన్యులకు కూడా ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారానికి రూ.10 లక్షలు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్(జ్ఞాపిక)ను బహూకరించనుంది. వైఎస్సార్ సాఫల్య అవార్డుకు రూ.5 లక్షలు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్(జ్ఞాపిక)ను అందించనుంది. -
రేపు వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య అవార్డుల ప్రకటన
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ఇవ్వనుంది. ఈ నెల 7వ తేదీన అవార్డులు ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమ్యూనికేషన్ల సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ రేపు మధ్యాహ్నం ప్రకటించనున్నారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్ తో పాటు అసామాన్య ప్రతిభ కనబర్చిన సామాన్యులకు కూడా ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్ (జ్ఞాపిక), శాలువ బహుకరిస్తారు. వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ. 5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్ (జ్ఞాపిక), శాలువ బహుకరిస్తారు. -
ఇర్ఫాన్‌ను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చిన కుమారుడు
తండ్రిని తలుచుకుని ఆనందబాష్పాలు రావాలి. అశ్రువులు కాదు. కాని తండ్రి జీవించి ఉంటే ఆనంద బాష్పాలు వచ్చేవే. తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ – 2021 ఫంక్షన్లో తండ్రి ఇర్ఫాన్ ఖాన్‌కు వచ్చిన అవార్డును అతడి తరఫున కుమారుడు బాబిల్ ఖాన్ అందుకుంటూ తండ్రిని తలచుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. ఇటీవల ముంబైలో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ జరిగింది. ఆ వేడుకలో ఇర్ఫాన్ ఖాన్‌ను మరణానంతర ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ ప్రకటించారు. అలాగే ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. దానిని అందుకోవడానికి ఇర్ఫాన్ కుమారుడు బాబిల్‌ను స్టేజ్ మీదకు నటులు ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావ్ పిలిచారు. ఆ సమయంలో ఆయుష్మాన్ మాట్లాడుతూ ‘ఇర్ఫాన్ ఖాన్ నుంచి మేమందరం ఎంతో నేర్చుకున్నాం’ అన్నాడు. అప్పుడు అవార్డు అందుకున్న బాబిల్ తండ్రిని తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అది చూసి రాజ్‌కుమార్ రావ్ కూడా కన్నీరు కార్చాడు. చాలామంది భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేనేమి ప్రత్యేక ఉపన్యాసం తయారు చేసుకుని రాలేదు. నన్ను మీ అందరూ అక్కున చేర్చుకున్నారు. అది చాలు’ అన్నాడు బాబిల్. ఈ ఈవెంట్ ప్రసారం కావాల్సి ఉంది. -
సాక్షి’ కార్టూనిస్టు శంకర్‌కు పురస్కారం
లక్డీకాపూల్: ‘సాక్షి’ దినపత్రిక కార్టూనిస్టు శంకర్ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో శనివారం జరిగిన కార్టూన్ ఫెస్టివల్లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. కార్టూన్ వాచ్ ఆధ్వర్యంలో 2019, 2020 సంవత్సరాలకు గానూ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఎండీసీ సీఎండీ ఎన్.బైజేంద్ర కుమార్ అవార్డులను ప్రదానం చేశారు. 2020 సంవత్సరానికి సాక్షి కార్టూనిస్టు శంకర్, నవ తెలంగాణ కార్టూనిస్టు నర్శిం, నమస్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజయ్‌లకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు. 2019 సంవత్సరానికి గానూ దివంగత సీనియర్ కార్టూనిస్టు మోహన్, సీనియర్ కార్టూనిస్టులు జయదేవ్ బాబు, ఎం.ఎస్.రామకృష్ణ జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. దివంగత సీనియర్ కార్టూనిస్టు మోహన్ తరఫున జర్నలిస్టు ప్రకాష్ ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో కార్టూన్ వాచ్ స్పెషల్ ఎడిషన్‌ను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పాత్రికేయులు కట్టా శేఖర్‌రెడ్డి, వీరయ్య పాల్గొన్నారు. -
అతడికి వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
సాక్షి, అమరావతి : తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీయడంలో ధర్మాడి సత్యం, అతని బృందం విశేషంగా కృషి చేసిన సంగతి తెలిసిందే. బోటును వెలికితీయడంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ.. దానిని ఒడ్డుకు చేర్చేందుకు సత్యం కనబరిచిన పట్టుదలపై పలువురు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ధర్మాడి సత్యం చేసిన కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతన్ని విశేష పురస్కారంతో సత్కరించేందుకు సిద్ధమైంది. ధర్మాడి సత్యంకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బోటు ప్రమాదాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, వివిధ రంగాల్లో ప్రజా సేవలు అందించిన ప్రతిభావంతులకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ఇవాల్వని సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని మంత్రిమండలి బుధవారం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. -
ఆకట్టుకుంటున్న అన్నదమ్ములు
సాక్షి, ధారూరు: అన్నాదమ్ముళ్లిద్దరూ సేవాభావంతో విశే ష సేవలందిస్తున్నారు. డబ్బులకు ప్రాధాన్యత ఇ వ్వకుండా సంపాదించింది చాలు, ప్రజలకు ఎంతోకొంత సేవ చేద్దామన్న తపన వారిలో నాటుకుపోయింది. అన్న తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సలహాదారుగా పనిచేస్తూ సేవలందిస్తున్నారు. తమ్ముడు సర్పంచ్‌గా పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. వారిది వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని కేరెళ్లి గ్రామం. అన్న పెంటారెడ్డి ప్రభుత్వ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ పొంది అమెరికాలో ఉన్న సమయంలో.. సీఎం కేసీఆర్ పిలిపించి కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్య సలహాదారునిగా నియమించారు. ఆయన ప్రాజెక్టు కోసం అహర్నిశలు శ్రమించి అందరి మన్ననలు పొందారు. సీఎం కేసీఆర్ సైతం ఆయనను అభింనందించారు. దీంతో పెంటారెడ్డికి లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు రాగా గురువారం ఇంజినీర్స్డే సందర్భంగా ఆలిండియా ఇంజినీర్స్ అసోషియేషన్ సభ్యులు ఆయనను, ఆయన భార్య మంజులను హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా సన్మానించారు. అవార్డును రాష్ట్రమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అందజేసి సన్మానించారు. తమ్ముడు కె. నర్సింహారెడ్డి ఇక్రిశాట్లో శాస్త్రవేత్తగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన స్వగ్రామంలో సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. కాతా అవార్డును అందుకున్న పెంటారెడ్డిని సోదరులు నర్సింహారెడ్డి, సోమిరెడ్డి, వెంకట్‌రెడ్డిలు అభినందించారు. -
సినీ పరిశ్రమలో సమస్యలు సమసిపోతాయి
సాక్షి, సిటీబ్యూరో: సినీ పరిశ్రమలో ఇటీవల నెలకొన్న సమస్యలన్నీ సమసిపోతాయని, విపత్కర పరిణామాలన్నీ త్వరలోనే సర్దుకొంటాయని ‘మా’ మాజీ అధ్యక్షుడు, నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఒకరు తప్పు చేసినా అందర్నీ అంటారని, అందరికీ ఆ తప్పు అంటుకుంటుందని చెప్పారు. అలా అవకుండా చూడాల్సి బాధ్యత సినీ పరిశ్రమలోని అందరిపై ఉందన్నారు. గురువారం రవీంద్రభారతిలో పద్మమోహన ఆర్ట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, విజయ చాముండేశ్వరి దంపతులకు పద్మమోహన స్వర్ణకంకణం, విశిష్ట దంపతులు పురస్కారం, లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ తల్లిలాంటిదని, అందరూ గౌరవించాలని కోరారు. గాయనీ పద్మప్రియ, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండల్‌రెడ్డితో పాటు పలువురికి ఎక్స్‌లెన్సీ అవార్డులను అందజేశారు. సభలో పాల్గొన పలువురు ప్రముఖులు నటుడు రాజేంద్రప్రసాద్‌కు ప్రభుత్వం పద్మ పురస్కారం ఇచ్చి ఉండాల్సిందన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు బ్రహ్మానందం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు కిషన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు యాదయ్య, సంజీవరావు, కార్యక్రమ నిర్వాహకుడు డి.యాదగిరి గౌడ్ పాల్గొన్నారు. -
చరిత్రను కాపాడే విద్యా విధానం కావాలి
సాక్షి, న్యూఢిల్లీ : మన చరిత్రను కాపాడే విధంగా విద్యావిధానంలో మార్పులు రావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది సంబరాలు, పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో కలసి ప్రముఖ నటుడు జగపతిబాబును అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. అలాగే ఐఎఫ్ఎఫ్సీవో ఎండీ, సీఈవో ఉదయ్‌శంకర్‌కు కూడా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పండుగలు మన సంస్కృతిని భావితరాలకు అందించే వేదికలని, ఉగాది జీవితంలోని వివిధ రకాల అనుభవాలు, అనుభూతులకు ప్రతీక అన్నారు. విదేశీ సంస్కృతిలో పడి తెలుగు భాషను మర్చిపోతున్నారని, తల్లిదండ్రులు ఇంట్లోనైనా తమ పిల్లలతో తెలుగులో మాట్లాడాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఉద్యోగ రత్న అవార్డులను ఉక్కుశాఖ కార్యదర్శి అరుణ శర్మ, మార్గదర్శి గ్రూప్ ఎండీ శైలజా కిరణ్ అందుకున్నారు. మరో 8 మందికి ప్రతిభ భారతి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ మోహన్‌కందా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రవీణ్ ప్రకాశ్, సినీనటి రమ్యకృష్ణ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఎం శ్రీలేఖ, విజయలక్ష్మీ, సాకేత్, రోహిత్, మనీషా ఇరబతినిల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. -
బ్రహ్మానందం, జగపతిబాబులకు సాఫల్య పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: హాస్యనటుడు బ్రహ్మానందం, నటుడు జగపతిబాబుకు ఢిల్లీ తెలుగు అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీ తెలుగు అకాడమీ 29వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలోని మావలాంకర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూ పానందేంద్ర సరస్వతి స్వామీజీ, అకాడమీ చైర్మన్ మోహన్ కందా తదితరులు బ్రహ్మానందానికి అవార్డును అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి జగపతిబాబు హాజరుకాలేకపోయారు. అనంతరం జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఎక్కుడున్నా ఐక్యం గా ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఆయా రాష్ట్రాల వేడుకలు ఢిల్లీలో జరిగితే పెద్ద ఎత్తున హాజరవుతారని, అయితే తెలుగు ప్రజల్లో అది లోపించినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వివిధ రంగాల్లో విశేష సేవ చేసిన వారిని గుర్తించి సత్కరిస్తున్న తెలుగు అకాడమీ కృషిని స్వరూపానందేంద్ర సరస్వతి అభినందించారు. పురస్కారాన్ని స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నట్టు బ్రహ్మానందం పేర్కొన్నారు. భాషను కాపాడితే జాతిని కాపాడినట్టేనని.. తెలుగు జాతి గొప్పదనాన్ని తల్లిదండ్రులు వారి పిల్లలకు అందించాలని వ్యాఖ్యానించారు. అలాగే పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. సినీరంగం నుంచి మురళీమో హన్, సాయికుమార్, తనికెళ్ల భరణి, అలీలకు పురస్కారాలు ప్రదానం చేశారు. సామాజిక సేవ విభాగంలో డాక్టర్ ఆర్.గురుప్రసాద్, విద్యారంగం నుంచి రావూరి వెంకటస్వామి, ఆర్థికశాఖ నుంచి వై.మహేశ్‌రెడ్డిలు పురస్కారాలు అందుకున్నారు. వైద్యరంగంలో దశరథరామిరెడ్డికి.. సాక్షి, హైదరాబాద్: వైద్యరంగంలో యశోద ఆసుపత్రి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ దశరథరామిరెడ్డిని ప్రతిభా భారతి పురస్కారం వరించింది. అస్సాం గవర్నర్ జగదీశ్‌ముఖి, జస్టిస్ ఎన్.వి.రమణలు దశరథరామి రెడ్డికి అవార్డు అందజేసి సత్కరించారు. -
జీఎం రావుకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి.ఎం.రావుకు ఆసియన్ బిజినెస్ లీడర్షిప్ ఫోరం(ఏబీఎల్‌ఎఫ్) నుంచి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఏబీఎల్‌ఎఫ్ ఆరవ ఎడిషన్‌లో జీఎం రావు ఈ అవార్డును అందుకున్నారు. అంతర్జాతీయంగా ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పిన సంస్థలు, వ్యక్తులకు ఏబీఎల్‌ఎఫ్ ఏటా అవార్డులతో సత్కరిస్తోంది. -
ఆర్ఎన్ గల్లాకి లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజ బ్యాటరీస్ చైర్మన్ రామచంద్ర నాయుడు గల్లా (ఆర్ ఎన్ గల్లా)కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. దేశీయ యాసిడ్ బ్యాటరీ రంగంలో చేసిన విశేష కృషికి గాను ఇండియా లెడ్ జింక్ డెవలప్మెంట్ అసోసియేషన్ (ఐఎల్జెడ్ఏ) ఈ అవార్డుతో ఆర్ ఎన్ గల్లాను సత్కరించింది. ఢిల్లీలో ‘ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ లీడ్ అండ్ లెడ్ బ్యాటరీస్-టూవర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ పేరుతో ఐఎల్జెడ్ఏ నిర్వహించిన సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు.