సాక్షి, అమరావతి : తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీయడంలో ధర్మాడి సత్యం, అతని బృందం విశేషంగా కృషి చేసిన సంగతి తెలిసిందే. బోటును వెలికితీయడంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ.. దానిని ఒడ్డుకు చేర్చేందుకు సత్యం కనబరిచిన పట్టుదలపై పలువురు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ధర్మాడి సత్యం చేసిన కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతన్ని విశేష పురస్కారంతో సత్కరించేందుకు సిద్ధమైంది.
ధర్మాడి సత్యంకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బోటు ప్రమాదాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, వివిధ రంగాల్లో ప్రజా సేవలు అందించిన ప్రతిభావంతులకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ఇవాల్వని సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని మంత్రిమండలి బుధవారం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment