
కాకినాడ రూరల్: ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య జరిగిన చర్చల్లో సమస్యలు సానుకూలంగా పరిష్కారమవడం సంతోషకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఉద్యోగులతో ఎప్పుడూ ఫ్రెండ్లీ సీఎంగానే ఉన్నారన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని, వారితో కలిసి పని చేయాలని ఆయన ఉద్దేశమన్నారు. కొందరు సీఎంను కించపరిచారని, అవేవీ పట్టించుకోకుండా ఉద్యోగులకు అండగా నిలచి, వారి డిమాండ్లను నెరవేర్చారన్నారు.