రేపు జరుగబోయే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కనుంది. భారత క్రికెట్‌కు శాస్త్రి చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డును అందించనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఆటగాడిగా, హెడ్ కోచ్‌గా భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన శాస్త్రి ప్రస్తుతం టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
శాస్త్రి హయాంలో (2017-2021) అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ జట్టుగా విరాజిల్లింది. భారత జట్టుకు దూకుడు నేర్పిన కోచ్‌గా శాస్త్రికి పేరుంది. 61 ఏళ్ల రవిశాస్త్రి 1981-92 మధ్యలో 80 టెస్ట్‌లు, 150 వన్డేలు ఆడి దాదాపు 7000 పరుగులు చేసి 280 వికెట్లు పడగొట్టాడు. రవిశాస్త్రి తన కెరీర్‌లో 15సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు. రేపు జరుగబోయే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముంబైకు చెందిన యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, షమ్స్ ములానీలకు అవార్డులు దక్కనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment