BCCI awards program
-
ఇక్కడ కూడా కోహ్లిదే రికార్డు..!
2023 బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇవాళ (జనవరి 23) హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు, యువ ఆటగాళ్లు, మాజీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రతిష్టాత్మకమైన కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నాడు. గత నాలుగేళ్లుగా ఈ అవార్డుల కార్యక్రమం వివిధ కారణాల చేత జరగకపోవడంతో అన్ని అవార్డులను ఒకేసారి ప్రకటించారు. దీంతో చాలా మంది క్రికెటర్లు వివిధ విభాగాల్లో అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియా అప్ కమింగ్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డైన పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడి అవార్డును అందుకున్నాడు. 2022-23 సంవత్సరానికి గానూ గిల్‌కు ఈ అవార్డు దక్కింది. ఇదే అవార్డును జస్ప్రీత్ బుమ్రా 2021-22 సంవత్సరానికి గాను, రవిచంద్రన్ అశ్విన్ 2020-21 ఏడాదికి, మొహమ్మద్ షమీ 2019-20 సంవత్సరానికి గాను అందుకున్నారు. అశ్విన్, బుమ్రాలు పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడి అవార్డును అందుకోవడం ఇది రెండోసారి. వీరిద్దరికి ముందు సచిన్ టెండూల్కర్ (2), విరాట్ కోహ్లి మత్రమే ఈ అవార్డును రెండు అంతకంటే ఎక్కువ సార్లు దక్కించుకున్నారు. ఈ అవార్డును అత్యధిక సార్లు అందుకున్న రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి ఈ అవార్డును అందరికంటే ఎక్కువగా ఐదుసార్లు కైవసం చేసుకున్నాడు. గిల్, షమీ, సెహ్వాగ్, గంభీర్, ద్రవిడ్, భువనేశ్వర్ కుమార్ పాలీ ఉమ్రిగర్ అవార్డును ఒక్కోసారి దక్కించుకున్నారు. కోహ్లి ఈ అవార్డును అత్యధిక సార్లు గెలుచుకున్నాడన్న విషయం తెలిసి అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లిది ఇక్కడ కూడా రికార్డే అని సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. చదవండి: బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం.. సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు -
బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం.. సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు
NAMAN AWARDS 2024: బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇవాళ (జనవరి 23) హైదరాబాద్‌లో కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లు సందడి చేశారు. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లతో పలువురు భారత మాజీలు కూడా హాజరయ్యారు. Ravi Shastri won the lifetime achievement award. - One of the greatest Indian coach ever. pic.twitter.com/D3oiLmMSCv — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Farokh Engineer said "This Indian team is the finest Indian team I have ever seen. Well done Rohit, Dravid & Ravi Shastri". pic.twitter.com/kSzpNToT0d — Johns. (@CricCrazyJohns) January 23, 2024 ఈ కార్యక్రమంలో భారత పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు, యువ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. గత నాలుగేళ్ల కాలంలో వివిధ విభాగాల్లో సత్తా చాటిన వారికి ఈ సందర్భంగా అవార్డులను అందజేశారు. అలాగే పలువురు మాజీ క్రికెటర్లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. Shubman Gill won the best Indian Men's cricketer for 2022-23 Season. pic.twitter.com/PkKUbnAyki — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Jasprit Bumrah won the Poly Umrigar Award for 2021-22 Season. pic.twitter.com/o0TF83przw — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Ravichandran Ashwin won the Poly Umrigar Award for 2020-21 Season. pic.twitter.com/yDI2Ja4Q43 — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Mohammed Shami won the Poly Umrigar Award for 2019-20 Season. - The legend. 🫡 pic.twitter.com/h7XVrC2Qg9 — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Jaiswal said "It's incredible to bat with Rohit Bhai - it's a proud moment to learn from him". pic.twitter.com/ecpVkELaGe — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Mumbai won the best performance in BCCI domestics in 2019-20. - Rohit Sharma received the award on behalf of Mumbai. pic.twitter.com/rKk2epWGtA — Johns. (@CricCrazyJohns) January 23, 2024 అవార్డులు అందుకున్న వారి వివరాలు.. రవిశాస్త్రి: కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫారూక్ ఇంజనీర్: కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు (2019-20) శుభ్‌మన్ గిల్: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2022-23) జస్ప్రీత్ బుమ్రా: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2021-22) రవిచంద్రన్ అశ్విన్: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2020-21) మొహమ్మద్ షమీ: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2019-20) స్మృతి మంధన: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ (2020-21, 2021-22) దీప్తి శర్మ: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ (2019-20, 2022-23) Riyan Parag won the Lala Amarnath Award for best all-rounder in domestic limited overs. - Riyan recieved the award from Rohit Sharma. pic.twitter.com/Bap4wmooLo — Johns. (@CricCrazyJohns) January 23, 2024 అంతర్జాతీయ క్రికెట్లో ఉత్తమ అరంగేట్రం (పురుషులు).. 2019-20: మయాంక్ అగర్వాల్ 2020-21: అక్షర్ పటేల్ 2021-22: శ్రేయస్ అయ్యర్ 2022-23: యశస్వి జైస్వాల్ Sarfaraz Khan's father recieved the award from Rahul Dravid behalf of his son for scoring highest run getter in Ranji Trophy 2021-22. pic.twitter.com/V5wVJfB0AV — Johns. (@CricCrazyJohns) January 23, 2024 అంతర్జాతీయ క్రికెట్లో ఉత్తమ అరంగేట్రం అవార్డులు.. ప్రియా పూనియా: 2019-20 షఫాలీ వర్మ: 2020-21 సబ్బినేని మేఘన: 2021-22 అమన్‌జోత్ కౌర్: 2022-23 BCCI President said "I would like to congratulate Rohit & Rahul for the fantastic run in World Cup - you made us proud". pic.twitter.com/dq4zSjp6s7 — Johns. (@CricCrazyJohns) January 23, 2024 దిలీప్ సర్దేశాయ్ అవార్డులు.. అశ్విన్ (2022-23 భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు) యశస్వి జైస్వాల్ (2022-23 భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్‌లో అత్యధిక పరుగులు) Indian team in BCCI awards. 🇮🇳 - Picture of the day. pic.twitter.com/e5fbz1VzR4 — Johns. (@CricCrazyJohns) January 23, 2024 వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్లు.. పూనమ్ యాదవ్: 2019-20 ఝులన్ గోస్వామి: 2020-21 రాజేశ్వరి గైక్వాడ్: 2021-22 దేవిక వైద్య: 2022-23 Captain Rohit Sharma has arrived in BCCI awards. pic.twitter.com/T4nt1HRA2i — Johns. (@CricCrazyJohns) January 23, 2024 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్లు.. పూనమ్ రౌత్: 2019-20 మిథాలీ రాజ్: 2020-21 హర్మన్‌ప్రీత్ కౌర్: 2021-22 జెమీమా రోడ్రిగెజ్: 2022-23 BCCI awards start at 6 pm IST today. - Live on Sports 18 & JioCinema...!!!! pic.twitter.com/9Ddmg8IICA — Johns. (@CricCrazyJohns) January 23, 2024 దేశవాలీ క్రికెట్లో ఉత్తమ అంపైర్లు.. అనంత పద్మనాభన్: 2019-20 వ్రిందా రతి: 2020-21 జయరామన్ మదన్ గోపాల్: 2021-22 రోహన్ పండిట్: 2022-23 దేశవాలీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు.. ముంబై: 2019-20 మధ్యప్రదేశ్: 2021-22 సౌరాష్ట్ర: 2022-23 లాలా అమర్నాథ్ అవార్డు (ఆల్‌రౌండర్ పరిమిత ఓవర్ల క్రికెట్).. బాబా అపరాజిత్: 2019-20 రిషి ధవన్: 2020-21, 2021-22 రియాన్ పరాగ్: 2022-23 లాలా అమర్నాథ్ అవార్డు (ఆల్‌రౌండర్ రంజీ ట్రోఫీ).. ముర సింగ్: 2019-20 షమ్స్ ములానీ: 2021-22 సరాన్ష్ జైన్: 2022-23 మాధవరావ్ సింధియా అవార్డులు (రంజీల్లో అత్యధిక వికెట్లు).. జయదేవ్ ఉనద్కత్: 2019-20 షమ్స్ ములానీ: 2021-22 జలజ్ సక్సేనా: 2022-23 మాధవరావ్ సింధియా అవార్డులు (రంజీల్లో అత్యధిక పరుగులు).. రాహుల్ దలాల్: 2019-20 సర్ఫరాజ్ ఖాన్: 2021-22 మయాంక్ అగర్వాల్: 2022-23 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా శుభ్‌మన్ గిల్..!
టీమిండియా అప్ కమింగ్ స్టార్ శుభ్‌మన్ గిల్‌ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు వరించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లో రేపు జరుగబోయే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో గిల్‌కు ఈ అవార్డు అందించనున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. వన్డేల్లో గతేడంతా అద్భుతమైన ప్రదర్శన కనబర్చినందుకు గాను గిల్‌కు ఈ అవార్డు దక్కనుందని సమాచారం. గిల్ వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును అందుకున్నాడు. ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన గిల్.. 6 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 2271 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో, టీ20ల్లో అంత ఆశాజనకమైన ప్రదర్శనలు నమోదు చేయని గిల్.. ఈ రెండు ఫార్మాట్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో సరిపెట్టాడు. 20 టెస్ట్‌లు ఆడిన గిల్.. 2 సెంచరీలు, 4 అర్ధసెంచరీల సాయంతో 1040 పరుగులు.. 14 టీ20ల్లో సెంచరీ, అర్ధసెంచరీ సాయంతో 335 పరుగులు సాధించాడు. Shubman Gill to be conferred with "Cricketer of the Year" award at BCCI Annual Awards Function in Hyderabad. pic.twitter.com/DowU5amRRJ — Press Trust of India (@PTI_News) January 22, 2024 హైదరాబాద్‌లో రేపు జరగబోయే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి భారత క్రికెట్ జట్టు సభ్యులతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా హాజరుకానున్నారని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోనున్నాడు. భారత క్రికెట్‌కు శాస్త్రి చేసిన సేవలకు గుర్తుగా బీసీసీఐ ఈ అవార్డుతో సత్కరించనుంది. ఇదే సందర్భంగా మరో ఇద్దరు యువ ఆటగాళ్లకు అవార్డులు దక్కనున్నాయని తెలుస్తుంది. ముంబై క్రికెటర్లు సర్ఫరాజ్ అహ్మద్, షమ్స్ ములానీలకు యంగ్ అచీవర్స్ అవార్డులు దక్కనున్నట్లు సమాచారం. కాగా, బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం 2019 తర్వాత మళ్లీ ఈ ఏడాదే తొలిసారి జరుగనుంది. -
BCCI Awards 2024: రవిశాస్త్రికి బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు
రేపు జరుగబోయే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కనుంది. భారత క్రికెట్‌కు శాస్త్రి చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డును అందించనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఆటగాడిగా, హెడ్ కోచ్‌గా భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన శాస్త్రి ప్రస్తుతం టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. శాస్త్రి హయాంలో (2017-2021) అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ జట్టుగా విరాజిల్లింది. భారత జట్టుకు దూకుడు నేర్పిన కోచ్‌గా శాస్త్రికి పేరుంది. 61 ఏళ్ల రవిశాస్త్రి 1981-92 మధ్యలో 80 టెస్ట్‌లు, 150 వన్డేలు ఆడి దాదాపు 7000 పరుగులు చేసి 280 వికెట్లు పడగొట్టాడు. రవిశాస్త్రి తన కెరీర్లో 15సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు. రేపు జరుగబోయే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముంబైకు చెందిన యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, షమ్స్ ములానీలకు అవార్డులు దక్కనున్నాయి. -
వైభవంగా అవార్డుల ప్రదానం
ముంబై: బీసీసీఐ అవార్డుల కార్యక్రమం శుక్రవారం రాత్రి కన్నులపండుగగా జరిగింది. అవార్డులు అందుకున్న వారిలో ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అందుకున్నారు. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు శివ్లాల్ యాదవ్ ఈ అవార్డును అందించారు. 58 ఏళ్ల వెంగ్‌సర్కార్ 116 టెస్టులు, 129 వన్డేలు ఆడారు. ఈ అవార్డుతో దిగ్గజాల సరసన తనను చేర్చినందుకు బీసీసీఐకి వెంగీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మీడియం పేసర్ భువనేశ్వర్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డు (రూ.5 లక్షల నగదు బహుమతి), వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మకు ప్రత్యేక అవార్డును ఇచ్చారు. రంజీల్లో ఉత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు ఇచ్చే లాలా అమర్నాథ్ అవార్డు (రూ.2.5 లక్షలు) పర్వేజ్ రసూల్, రంజీల్లో అత్యధిక పరుగులు సాధించినందుకు మాధవ్‌రావ్ సింధియా అవార్డు (రూ.2.5 లక్షలు) కేదార్ జాదవ్ (1223 పరుగులు)కు అందించారు. హైదరాబాద్‌కు చెందిన అండర్-19 క్రికెటర్ బి.అనిరుధ్‌కు ఎంఏ చిదంబరం ట్రోఫీ (రూ. 50 వేలు) అందించారు.