ఇక్కడ కూడా కోహ్లిదే రికార్డు..! | Virat Kohli Won Most Men's BCCI Cricketer Of The Year Awards | Sakshi
Sakshi News home page

ఇక్కడ కూడా కోహ్లిదే రికార్డు..!

Published Tue, Jan 23 2024 9:08 PM | Last Updated on Wed, Jan 24 2024 9:39 AM

Virat Kohli Won Most Mens BCCI Cricketer Of The Year Awards - Sakshi

2023 బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇవాళ (జనవరి 23) హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు, యువ ఆటగాళ్లు, మాజీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ప్రతిష్టాత్మకమైన కల్నల్‌ సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నాడు. గత నాలుగేళ్లుగా ఈ అవార్డుల కార్యక్రమం వివిధ కారణాల చేత జరగకపోవడంతో అన్ని అవార్డులను ఒకేసారి ప్రకటించారు. దీంతో చాలా మంది క్రికెటర్లు వివిధ విభాగాల్లో అవార్డులను అందుకున్నారు. 

ఈ సందర్భంగా టీమిండియా అప్‌ కమింగ్‌ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డైన పాలీ ఉమ్రిగర్‌ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడి అవార్డును అందుకున్నాడు. 2022-23 సంవత్సరానికి గానూ గిల్‌కు ఈ అవార్డు దక్కింది. ఇదే అవార్డును జస్ప్రీత్‌ బుమ్రా 2021-22 సంవత్సరానికి గాను, రవిచంద్రన్‌ అశ్విన్‌ 2020-21 ఏడాది​కి, మొహమ్మద్‌ షమీ 2019-20 సంవత్సరానికి గాను అందుకున్నారు.

అశ్విన్‌, బుమ్రాలు పాలీ ఉమ్రిగర్‌ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడి అవార్డును  అందుకోవడం ఇది రెండోసారి. వీరిద్దరికి ముందు సచిన్‌ టెండూల్కర్‌ (2), విరాట్‌ కోహ్లి మత్రమే ఈ అవార్డును రెండు అంతకంటే ఎక్కువ సార్లు దక్కించుకున్నారు. ఈ అవార్డును అత్యధిక సార్లు అందుకున్న రికార్డు విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి ఈ అవార్డును అందరికంటే ఎక్కువగా ఐదుసార్లు కైవసం చేసుకున్నాడు.

గిల్‌, షమీ, సెహ్వాగ్‌, గంభీర్‌, ద్రవిడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ పాలీ ఉమ్రిగర్‌ అవార్డును ఒక్కోసారి దక్కించుకున్నారు. కోహ్లి ఈ అవార్డును అత్యధిక సార్లు గెలుచుకున్నాడన్న విషయం తెలిసి అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లిది ఇక్కడ కూడా రికార్డే అని సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. 

చదవండి: బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం.. సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement