
టీమిండియా వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammad Shami) చెత్త రికార్డు నమోదు చేశాడు. పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్‌లో ఆరంభ ఓవర్లోనే ఏకంగా ఐదు వైడ్‌బాల్స్(Five Wides) వేశాడు. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లోనే అత్యధికంగా ఐదు అదనపు పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు.
విజయంతో ఆరంభం
అంతేకాదు.. వన్డేల్లో భారత్ తరఫున ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ పేరిట ఉన్న మరో చెత్త రికార్డును షమీ సమం చేశాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో దుబాయ్‌లో తమ తొలి మ్యాచ్ ఆడిన టీమిండియా విజయంతో ఈ మెగా టోర్నీని ఆరంభించింది.
డాట్ బాల్స్, వైడ్‌లు
తాజాగా అదే వేదికపై చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత ఫీల్డింగ్ చేయగా.. వెటరన్ పేసర్ షమీ బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. అయితే, తొలి బంతిని బాగానే వేసిన ఈ రైటార్మ్ పేసర్ రెండో బంతిని వైడ్‌గా వేశాడు.
అనంతరం పరుగు ఇవ్వని షమీ.. ఆ తర్వాత మళ్లీ వరుసగా రెండు వైడ్లు వేశాడు. ఆ మరుసటి బంతికి పరుగులేమీ ఇవ్వని షమీ.. అనంతరం ఒక పరుగు ఇచ్చి.. మళ్లీ డాట్ బాల్ వేశాడు.
కానీ ఆ తర్వాత మళ్లీ రెండు రెండు వైడ్లు వేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త అసహనానికి గురయ్యాడు. అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం షమీని ఉత్సాహపరుస్తూ మరేం పర్లేదు అన్నట్లుగా ఊరటకలిగించాడు. ఇక ఆఖరి బంతిని డాట్ బాల్‌గా వేసిన షమీ తొలి ఓవర్లో వరుసగా 0 Wd 0 Wd Wd 0 1 0 Wd Wd 0 నమోదు చేశాడు. అలా మొత్తంగా పదకొండు బాల్స్ వేశాడు.

అత్యధిక వైడ్ బాల్స్ వేసిన క్రికెటర్ల జాబితాలో
తద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇలా ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అత్యధిక వైడ్ బాల్స్ వేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. షమీ పాక్‌తో మ్యాచ్‌లో ఐదు వైడ్‌బాల్స్ వేయగా.. అంతకు ముందు జింబాబ్వే క్రికెటర్ టినాషే పన్యంగర 2004లో బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఏకంగా ఏడు వైడ్ బాల్స్ వేసి ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వన్డేల్లో తొలి ఓవర్లో టీమిండియా తరఫున అత్యధిక బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో షమీ ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ సరసన చేరాడు.
ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌లో భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. ఆరంభంలోనే షమీ కాస్త నిరాశపరిచినా ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మరోవైపు.. యువ పేసర్ హర్షిత్ రాణా, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నారు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.
పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి కేవలం 52 పరుగులే చేసింది. ఇందులో బాబర్ ఆజం(23) రూపంలో హార్దిక్ పాండ్యా కీలక వికెట్ తీయగా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ డైరెక్ట్ త్రో కారణంగా వికెట్ సమర్పించుకుని పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్లో ఐదు వైడ్ బాల్స్ వేయడం ద్వారా షమీ పేరిట నమోదైన చెత్త రికార్డులు
👉చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లో అత్యధిక వైడ్‌లు వేసిన రెండో బౌలర్.
👉వన్డేల్లో వైడ్స్, నో బాల్స్‌తో కలిపి తొలి ఓవర్లోనే అత్యధిక బంతులు బౌల్ చేసిన మూడో బౌలర్. ఈ జాబితాలో జహీర్ ఖాన్ వాంఖడే వేదికగా 2003లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పదకొండు బంతులు వేసి ముందు వరుసలో ఉండగా.. ఇర్ఫాన్ పఠాన్ వెస్టిండీస్‌తో 2006లో కింగ్‌స్టన్ వేదికగా ఈ చెత్త గణాంకాలు నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment