చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 8 బంతులు ఎదుర్కొన్న గిల్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బంగ్లా పేసర్లు ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ శుబ్‌మన్.. ఆఖరికి హసన్ మహమూద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన మహ్మద్ బౌలింగ్‌లో ఫుల్ డెలివరీని డౌన్‌ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ లిట్టన్ దాస్ చేతికి వెళ్లింది. దీంతో గిల్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.
గిల్ చెత్త రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో డకౌటైన గిల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు డకౌటైన ఆరో భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్ ఉన్నాడు.
1983లో అమర్‌నాథ్ ఏకంగా 5 సార్లు డకౌటయ్యాడు. అతడి తర్వాత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (1969), దిలీప్ వెంగ్‌సర్కార్ (1979), వినోద్ కాంబ్లీ (1994), విరాట్ కోహ్లి(2021), గిల్(2024) ఉన్నారు. వీరిందరూ మూడు సార్లు ఓ క్యాలెండర్ ఈయర్‌లో డకౌటయ్యారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు టీబ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(56) హాఫ్ సెంచరీతో మెరిశాడు.
చదవండి: 147 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి.. గావస్కర్‌ను అధిగమించి..
Comments
Please login to add a commentAdd a comment