క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా శుభ్‌మన్‌ గిల్‌..! | Shubman Gill Set To Win Indian Cricketer Of The Year Award At BCCI Awards | Sakshi
Sakshi News home page

BCCI Awards 2024:క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా శుభ్‌మన్‌ గిల్‌..!

Published Mon, Jan 22 2024 7:38 PM | Last Updated on Mon, Jan 22 2024 7:53 PM

Shubman Gill Set To Win Indian Cricketer Of The Year Award At BCCI Awards - Sakshi

టీమిండియా అప్‌ కమింగ్‌ స్టార్‌ శుభ్‌మన్‌ గిల్‌ను క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు వరించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లో రేపు జరుగబోయే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో గిల్‌కు ఈ అవార్డు అందించనున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. వన్డేల్లో గతేడంతా అద్భుతమైన ప్రదర్శన కనబర్చినందుకు గాను గిల్‌కు ఈ అవార్డు దక్కనుందని సమాచారం​. గిల్‌ వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును అందుకున్నాడు.

ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన గిల్‌.. 6 సెంచరీలు, 13 హాఫ్‌ సెంచరీల సాయంతో 2271 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో, టీ20ల్లో అంత ఆశాజనకమైన ప్రదర్శనలు నమోదు చేయని గిల్‌.. ఈ రెండు ఫార్మాట్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో సరిపెట్టాడు. 20 టెస్ట్‌లు ఆడిన గిల్‌.. 2 సెంచరీలు, 4 అర్ధసెంచరీల సాయంతో 1040 పరుగులు.. 14 టీ20ల్లో సెంచరీ, అర్ధసెంచరీ సాయంతో 335 పరుగులు సాధించాడు.

హైదరాబాద్‌లో రేపు జరగబోయే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి భారత క్రికెట్‌ జట్టు సభ్యులతో పాటు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కూడా హాజరుకానున్నారని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకోనున్నాడు. భారత క్రికెట్‌కు శాస్త్రి చేసిన సేవలకు గుర్తుగా బీసీసీఐ ఈ అవార్డుతో సత్కరించనుంది.

ఇదే సందర్భంగా మరో ఇద్దరు యువ ఆటగాళ్లకు అవార్డులు దక్కనున్నాయని తెలుస్తుంది. ముంబై క్రికెటర్లు సర్ఫరాజ్‌ అహ్మద్‌, షమ్స్‌ ములానీలకు యంగ్‌ అచీవర్స్‌ అవార్డులు దక్కనున్నట్లు సమాచారం. కాగా, బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం 2019 తర్వాత మళ్లీ ఈ ఏడాదే తొలిసారి జరుగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement