cricketer of the year
-
క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా శుభ్‌మన్ గిల్..!
టీమిండియా అప్ కమింగ్ స్టార్ శుభ్‌మన్ గిల్‌ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు వరించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లో రేపు జరుగబోయే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో గిల్‌కు ఈ అవార్డు అందించనున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. వన్డేల్లో గతేడంతా అద్భుతమైన ప్రదర్శన కనబర్చినందుకు గాను గిల్‌కు ఈ అవార్డు దక్కనుందని సమాచారం. గిల్ వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును అందుకున్నాడు. ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన గిల్.. 6 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 2271 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో, టీ20ల్లో అంత ఆశాజనకమైన ప్రదర్శనలు నమోదు చేయని గిల్.. ఈ రెండు ఫార్మాట్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో సరిపెట్టాడు. 20 టెస్ట్‌లు ఆడిన గిల్.. 2 సెంచరీలు, 4 అర్ధసెంచరీల సాయంతో 1040 పరుగులు.. 14 టీ20ల్లో సెంచరీ, అర్ధసెంచరీ సాయంతో 335 పరుగులు సాధించాడు. Shubman Gill to be conferred with "Cricketer of the Year" award at BCCI Annual Awards Function in Hyderabad. pic.twitter.com/DowU5amRRJ — Press Trust of India (@PTI_News) January 22, 2024 హైదరాబాద్‌లో రేపు జరగబోయే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి భారత క్రికెట్ జట్టు సభ్యులతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా హాజరుకానున్నారని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోనున్నాడు. భారత క్రికెట్‌కు శాస్త్రి చేసిన సేవలకు గుర్తుగా బీసీసీఐ ఈ అవార్డుతో సత్కరించనుంది. ఇదే సందర్భంగా మరో ఇద్దరు యువ ఆటగాళ్లకు అవార్డులు దక్కనున్నాయని తెలుస్తుంది. ముంబై క్రికెటర్లు సర్ఫరాజ్ అహ్మద్, షమ్స్ ములానీలకు యంగ్ అచీవర్స్ అవార్డులు దక్కనున్నట్లు సమాచారం. కాగా, బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం 2019 తర్వాత మళ్లీ ఈ ఏడాదే తొలిసారి జరుగనుంది. -
2022 ఐసీసీ అవార్డు విన్నర్ల మొత్తం జాబితా ఇదే..
2022 సంవత్సరానికి గానూ ఐసీసీ పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల జాబితాను దశల వారీగా విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022: బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) వుమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: నతాలీ సీవర్ (ఇంగ్లండ్) టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: సూర్యకుమార్ యాదవ్ (భారత్) వుమెన్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: తహీల మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) వుమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: నతాలీ సీవర్ (ఇంగ్లండ్) టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: మార్కో జన్సెన్ (సౌతాఫ్రికా) ఎమర్జింగ్ వుమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: రేణుకా సింగ్ (భారత్) అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: గెర్హార్డ్ ఎరాస్మస్ (నమీబియా) వుమెన్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: ఈషా ఓజా (యూఏఈ) వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, షాయ్ హోప్, శ్రేయస్ అయ్యర్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, మెహిది హసన్ మీరజ్, అల్జరీ జోసఫ్, మహ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా వుమెన్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అలైసా హీలీ (వికెట్‌కీపర్), స్మృతి మంధన, లారా వోల్వార్డ్ట్, నతాలీ సీవర్, బెత్ మూనీ, అమేలియా కెర్ర్, సోఫీ ఎక్లెస్టోన్, అయబోంగా ఖాకా, రేణుకా సింగ్, షబ్నిమ్ ఇస్మాయిల్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికందర్ రజా, హార్ధిక్ పాండ్యా, సామ్ కర్రన్, వనిందు హసరంగ, హరీస్ రౌఫ్, జోష్ లిటిల్ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: సోఫీ డివైన్ (కెప్టెన్), స్మృతి మంధన, బెత్ మూనీ, యాశ్ గార్డ్నర్, తహిల మెక్‌గ్రాత్, నిదా దార్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, ఇనోకా రణవీర, రేణుకా సింగ్ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్: బెన్ స్టోక్స్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఉస్మాన్ ఖ్వాజా, క్రెయిగ్ బ్రాత్‌వైట్, మార్నస్ లబూషేన్, బాబర్ ఆజమ్, జానీ బెయిర్‌స్టో, పాట్ కమిన్స్, కగిసో రబాడ, నాథన్ లయోన్, జేమ్స్ ఆండర్సన్ అంపైర్ ఆఫ్ ద ఇయర్: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్) -
అద్భుత ప్రదర్శన.. ప్రతిష్టాత్మక అవార్డు రేసులో స్మృతి మంధాన
ICC T20 Cricketer Of The Year Award: మహిళల విభాగంలో గతేడాది ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు నామినేట్ అయిన భారత ఓపెనర్ స్మృతి మంధాన ఈ ఏడాదీ రేసులో నిలిచింది. తాజా 2022 తుది జాబితాలో నిదా దార్ (పాకిస్తాన్), సోఫీ డివైన్ (న్యూజిలాండ్), తాహ్లియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)లతో స్మృతి పోటీ పడుతుంది. ఈ ఏడాది స్మృతి 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించడంతో వేగవంతమైన అర్ధసెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా ఘనత వహించింది. ఈ సీజన్లోనూ తన జోరును కొనసాగించిన ఆమె ఈ ఫార్మాట్ కెరీర్లో 2500 పరుగుల్ని పూర్తి చేసుకుంది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్, టి20 ఆసియా కప్ ఈవెంట్లలోనూ మెరుపులు మెరిపించింది. ఇటీవల ఆస్ట్రేలియా అమ్మాయిలతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో సూపర్ ఓవర్ విజయాన్ని అందించింది. ముందుగా 188 పరుగుల లక్ష్యఛేదనలో మంధాన (49 బంతుల్లో 79) మెరుపు ఆరంభం వల్లే ఆసీస్ 187 స్కోరును భారత్ సమం చేయగలిగింది. సూపర్ ఓవర్లోనూ కీలకమైన 13 (4, 6, 3) పరుగుల వల్లే భారత్ 20/1 స్కోరు చేసింది. తర్వాత ఆసీస్ 16/1 స్కోరుకే పరిమితమైంది. ఇక పురుషుల టీ20 క్రికెట్ విభాగంలో డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచాడు. చదవండి: Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం.. Rishabh Pant: క్రికెటర్ రిషభ్ పంత్‌కు ఘోర ప్రమాదం.. తీవ్ర గాయాలు ICC Award: టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో సూర్య -
టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో సూర్య
టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్ ఈ ఏడాది అత్యద్భుత ప్రదర్శనతో మెరిశాడు. ముఖ్యంగా టి20ల్లో అతను చెలరేగిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. టి20 వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్ వరకు రావడంలో సూర్యకుమార్‌ది కీలకపాత్ర. కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్ విధ్వంసకర ఆటతీరుతో రెచ్చిపోయాడు. ఈ విధ్వంసమే అతన్ని తాజాగా ఐసీసీ అవార్డుకు నామినేట్ అయ్యేలా చేసింది. ఈ ఏడాది టి20 క్రికెట్లో అద్భుత ఫామ్ కొనసాగించిన ఆటగాళ్లను ఐసీసీ అవార్డులతో సత్కరించనుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ మెన్స్ 2022 టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ ఆటగాళ్ల జాబితాను ఐసీసీ గురువారం ప్రకటించింది. అవార్డు రేసులో నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా నుంచి సూర్యకుమార్‌తో పాటు ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్, పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజాలు పోటీ పడుతున్నారు. సూర్యకుమార్: ఇక టి20 వరల్డ్ కప్‌లో ఈ నలుగురు ప్లేయర్స్ తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. టి20ల్లో ఈ ఏడాది సూర్యకుమార్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 31 మ్యాచ్‌ల్లో 187.43 స్ట్రైక్ రేటుతో 1,164 పరుగులు చేశాడు. అంతేకాదు పొట్టి క్రికెట్లో సూర్య అత్యధికంగా 68 సిక్స్‌లు కొట్టాడు. భీకర ఫామ్ కొనసాగించిన అతను రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు.న్యూజిలాండ్ సిరీస్‌లోనూ సూర్య చెలరేగి ఆడి కెరీర్లో రెండో టి20 సెంచరీ నమోదు చేశాడు. సామ్ కరన్: టి20 వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ అందుకోవడంలో సామ్ కరన్‌ది కీలకపాత్ర. డెత్ ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్ట్ అయిన సామ్ ప్రత్యర్థులను దడ పుట్టించాడు. తన ప్రదర్శనతో అదరగొట్టిన సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడు ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ ఏడాది సామ్ కరన్ 19 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ రిజ్వాన్: పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టి20ల్లో చాలా డేంజరస్ ఆటగాడు. ఒక్కసారి క్రీజులో నిలదొక్కకుంటే అతన్ని ఔట్ చేయడం అంత ఈజీ కాదు. ఈసారి వరల్డ్‌కప్‌లో అంతగా మెరవనప్పటికి ఏడాది ప్రదర్శన మాత్రం అద్భుతంగానే ఉందని చెప్పొచ్చు.ఇక రిజ్వాన్ ఈ ఏడాది 25 మ్యాచ్‌ల్లో 996 పరుగులతో పాటు కీపర్‌గా తొమ్మిది క్యాచ్‌లు, మూడు స్టంపింగ్స్ చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సికందర్ రజా: ఈ ఏడాది వెలుగులోకి వచ్చిన మరో ఆటగాడు జింబాబ్వే సంచలనం.. పాకిస్తాన్ మూలాలున్న ఆల్‌రౌండర్ సికందర్ రజా. జట్టు ఓటమిపాలైనప్పటికి తన ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించాడు. మొత్తంగా 24 మ్యాచ్‌ల్లో 735 పరుగులతో పాటు 25 వికెట్లు తీశాడు. ఇక మహిళల విభాగంలో టీమిండియా నుంచి స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వుమెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయింది. మందానతో పాటు పాకిస్తాన్ నుంచి నిదా దార్, న్యూజిలాండ్ నుంచి సోఫీ డివైన్, ఆస్ట్రేలియా నుంచి తాహిలా మెక్‌గ్రాత్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. చదవండి: WTC: పోతే పోయింది.. మనకు మాత్రం మేలు చేసింది -
దక్షిణాఫ్రికా ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా డికాక్
జొహాన్నెస్‌బర్గ్: క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) వార్షిక అవార్డుల్లో సఫారీ జట్టు వన్డే, టి20 జట్టు కెప్టెన్ క్వింటన్ డికాక్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాడు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో పురుషుల విభాగంలో డికాక్, మహిళల కేటగిరీలో లారా వోల్వార్ట్ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్నారు. తన ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో డికాక్ ఇప్పటివరకు 47 టెస్టుల్లో, 121 వన్డేల్లో, 44 టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు డికాక్ కెప్టెన్సీలో ఎనిమిది వన్డేలు ఆడిన దక్షిణాఫ్రికా నాలుగింటిలో గెలిచి, మూడింటిలో ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. టి20ల్లో డికాక్ నేతృత్వంలో దక్షిణాఫ్రికా ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. మూడింటిలో గెలిచి, ఐదింటిలో ఓటమి చవిచూసింది. ఈ అవార్డును రెండోసారి గెలుచుకున్న డికాక్ (2017)... జాక్వెస్ కలిస్ (2004, 2011), మఖాయ ఎన్తిని (2005, 2006), హషీమ్ ఆమ్లా (2010, 2013), ఏబీ డివిలియర్స్ (2014, 2015), కగిసో రబడ (2016, 2018)ల సరసన చేరాడు. దీంతోపాటు 27 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ డికాక్ ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్నీ సొంతం చేసుకున్నాడు. పేసర్ లుంగీ ఇన్‌గిడి ‘వన్డే, టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెలుచుకోగా... డేవిడ్ మిల్లర్ ‘ఫేవరెట్ ప్లేయర్’గా నిలిచాడు. -
‘న్యూజిలాండ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా రాస్ టేలర్
వెల్లింగ్టన్: ప్రతిష్టాత్మక ‘న్యూజిలాండ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు వెటరన్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ ఎంపికయ్యాడు. జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలోనూ విశేషంగా రాణించిన టేలర్ శుక్రవారం ‘సర్ రిచర్డ్ హాడ్లీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. 36 ఏళ్ల టేలర్ ఈ అవార్డును అందుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. గత సీజన్లో అద్భుతంగా ఆడిన టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 1389 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు (7238) చేసిన ఆటగాడిగా నిలిచిన టేలర్... మూడు ఫార్మాట్లలో 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ సందర్భంగా టేలర్ మాట్లాడుతూ తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాల తర్వాత ఈ స్థాయికి చేరుకున్నానని అన్నాడు. -
టీమిండియా ప్లేయర్లకు నిరాశ
దుబాయ్: ఐసీసీ వార్షిక అవార్డుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు మెరిశారు. టీమిండియా ప్లేయర్లకు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాప్ లో నిలిచాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. 2015 సంవత్సరానికి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన స్మిత్ ప్రతిష్టాత్మక సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ పురస్కారం అందుకోనున్నాడు. ఈ అవార్డుకు ఎంపికైన నాలుగో ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్. అంతకుముందు రికీ పాంటింగ్, మిచెల్ జాన్సన్, మైఖేల్ క్లార్క్ ఈ పురస్కారం అందుకున్నారు. దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైయ్యాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ ద్వారా అవార్డులు ప్రకటించారు. ఇతర పురస్కారాలు టి20 పెర్ ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్: డూ ప్లెసిస్(దక్షిణాఫ్రికా) ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: జోష్ హాజిల్ వుడ్(ఆస్టేలియా) స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డ్: బ్రెండన్ మెక్ కల్లమ్(న్యూజిలాండ్) అంపైర్ ఆఫ్ ది ఇయర్: రిచర్డ్ కెటెల్ బారో వుమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: మెగ్ లానింగ్(ఆస్ట్రేలియా కెప్టెన్) వుమెన్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: స్టాఫానీ టేలర్(వెస్టిండీస్ కెప్టెన్) -
ఇంగ్లండ్ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ రూట్
బ్యాట్స్‌మన్ జో రూట్ 2014-15 సీజన్‌కు ఇంగ్లండ్ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎన్నికయ్యాడు. అండర్సన్, మోయిన్ అలీ, గ్యారీ బ్యాలన్స్లతో గట్టి పోటీ ఎదుర్కొన్నా... రూట్ కే అవార్డు దక్కింది. మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా వరుసగా రెండో ఏడాది చార్లెట్ ఎడ్వర్డ్స్ ఎన్నికైంది. బ్రిటిష్ స్పోర్ట్స్ జర్నలిస్ట్‌లు అవార్డీలను ఎన్నుకున్నారు. -
ఏబీ డివిలియర్స్‌కు నాలుగు అవార్డులు
జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఈ ఏడాదికిగాను ఆ దేశపు మేటి క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. గురువారం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) ప్రకటించిన అవార్డుల్లో డివిలియర్స్ నాలుగు అవార్డుల్ని దక్కించుకున్నాడు. ఐదు అవార్డులకు నామినేట్ అయిన డివిలియర్స్.. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాలతోపాటు సహచర ఆటగాళ్ల చాయిస్‌గా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతోపాటు దక్షిణాఫ్రికా ప్రజలు, అభిమానులతో నిర్వహించిన ఓటింగ్‌లో ఫ్యాన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా డివిలియర్స్నే వరించింది. వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఒక్కటే డివిలియర్స్‌కు కాకుండా క్వింటన్ డి కాక్కు దక్కింది. ఈ సమీక్ష నిర్వహించే సమయానికి మూడు ఇన్నింగ్స్ ల్లో నాలుగు సెంచరీలతో ఆకట్టుకున్న డి కాక్ కు ఈ అవార్డు లభించింది. ఇదిలా ఉండగా, ఇమ్రాన్ తహీర్ కు ట్వంటీ 20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించగా, డేల్ స్టెయిన్ కు డెలివరీ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. -
'క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' రేసులో ధోని
ముంబై: క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ పేరు మీద ఐసీసీ అందించే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కు స్థానం లభించింది. వన్డే ఆటగాళ్ల జాబితాలో ధోనితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు అషిమ్ ఆమ్లా, జేమ్స్ అండర్సన్(ఇంగ్లండ్), మైఖేల్ క్లార్క్(ఆసీస్), అలిస్టర్ కుక్(ఇంగ్లండ్), కుమార సంగక్కారా(శ్రీలంక) పేర్లను చేర్చారు. భారత్ తరుపున నిలకడగా ఆడుతున్న ధోని ఒక్క్డడే ఈ రేసులో ఉండటం గమనార్హం. ఇండియా నుంచి శిఖర్ థావన్, రవీంద్ర జడేజాల పేర్లు ప్రస్తావనకు వచ్చినా, వీరి పక్కకు నెట్టిన ధోని అవార్డు రేసులో స్థానం సంపాదించాడు. టెస్టు ఆటగాళ్ల జాబితాలో భారత్ నుంచి ఆఫ్ స్పిన్నర్ రవీంద్ర అశ్విన్, బ్యాట్స్‌మెన్ చటేశ్వరా పుజారాకు చోటు లభించింది. అషిమ్ ఆమ్లా, అండర్సన్, మైఖేల్ క్లార్క్‌లు ఇటు వన్డే జాబితాలోనూ, టెస్టు జాబితాలోనూ స్థానం సంపాదించడం విశేషం. దీనికి సంబంధించి మంగళవారం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్స్న్ వివరాలను వెల్లడించారు. 32 మందితో కూడిన ఐసీసీ ప్యానెల్ విజేతలను ఎంపిక చేస్తుందన్నారు.