ఏబీ డివిలియర్స్‌కు నాలుగు అవార్డులు | AB de Villiers named S African Cricketer of the Year | Sakshi
Sakshi News home page

ఏబీ డివిలియర్స్‌కు నాలుగు అవార్డులు

Published Thu, Jun 5 2014 8:01 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

ఏబీ డివిలియర్స్‌కు నాలుగు అవార్డులు

ఏబీ డివిలియర్స్‌కు నాలుగు అవార్డులు

జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఈ ఏడాదికిగాను ఆ దేశపు మేటి క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. గురువారం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) ప్రకటించిన అవార్డుల్లో డివిలియర్స్ నాలుగు అవార్డుల్ని దక్కించుకున్నాడు. ఐదు అవార్డులకు నామినేట్ అయిన డివిలియర్స్.. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాలతోపాటు సహచర ఆటగాళ్ల చాయిస్‌గా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.

 

దీంతోపాటు దక్షిణాఫ్రికా ప్రజలు, అభిమానులతో నిర్వహించిన ఓటింగ్‌లో ఫ్యాన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా డివిలియర్స్‌నే వరించింది. వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఒక్కటే డివిలియర్స్‌కు కాకుండా క్వింటన్ డి కాక్‌కు దక్కింది. ఈ సమీక్ష నిర్వహించే సమయానికి మూడు ఇన్నింగ్స్ ల్లో  నాలుగు సెంచరీలతో ఆకట్టుకున్న డి కాక్ కు ఈ అవార్డు లభించింది. ఇదిలా ఉండగా, ఇమ్రాన్ తహీర్ కు ట్వంటీ 20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించగా, డేల్ స్టెయిన్ కు డెలివరీ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement