CSA
-
డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా క్వింటన్ డికాక్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 10న ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ లీగ్‌కు సంబంధించిన వేలంను కూడా క్రికెట్ సౌతాఫ్రికా పూర్తి చేసింది. అదే విధంగా ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. డర్బన్ సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డి కాక్‌ను ఎంపిక చేసింది. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్ ప్రకటించింది. కాగా డర్బన్ ఫ్రాంచైజీనీ ఐపీఎల్‌కు చెందిన లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు డికాక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో డర్బన్ సూపర్ జెయింట్స్ సారథిగా డికాక్ ఎంపికయ్యాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన వేలంలో జాసన్ హోల్డర్, డ్వైన్ ప్రిటోరియస్ వంటి స్టార్ ఆటగాళ్లను డర్బన్ సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Durban's Super Giants (@durbanssupergiants) డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు: క్వింటన్ డి కాక్, ప్రేనెలన్ సుబ్రాయెన్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రీస్ టోప్లీ, డ్వైన్ ప్రిటోరియస్, హెన్రిచ్ క్లాసెన్, కీమో పాల్, కేశవ్ మహరాజ్, కైల్ అబాట్, జూనియర్ డాలా, దిల్షన్ మధుశంక, జాన్సన్ చార్లెస్, మాథ్యూ బ్రీట్జ్కేర్, క్రిస్టియన్ జోంకర్ వియాన్ ముల్డర్, సైమన్ హార్మర్ చదవండి: FIFA World Cup 2022: సెర్బియాకు చుక్కలు చూపించిన ఆఫ్రికా జట్టు.. మ్యాచ్ 'డ్రా' -
దక్షిణాఫ్రికా టీ20 లీగ్.. వేలంలో 500 మందికి పైగా ఆటగాళ్లు!
దక్షిణాఫ్రికా సరికొత్త టీ20 టోర్నీ (ఎస్ఏ20 లీగ్) వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ టోర్నీ వేలంలో 18 దేశాలకు చెందిన 500 మంది పైగా ఆటగాళ్లు తమ పేర్లును నమోదు చేసుకున్నారు. ఈ ఎస్ఏ20కు సంబంధించిన వేలం సెప్టెంబర్ 19న జరగనుంది. అదే విధంగా ఈ వేలంలో సౌతాఫ్రికా నుంచి మొత్తం 17 మంది తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. కాగా టోర్నీ నిభందనల ప్రకారం ప్రతీ ఫ్రాంచైజీ 10 మంది ప్రోటీస్ ఆటగాళ్లతో పాటు 7 మంది విదేశీ ప్లేయర్స్‌తో ఒప్పందం కుదర్చుకోవాలి. అదే విధంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎడుగురు స్థానికఆటగాళ్లతో పాటు నలుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలి. ఇక ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి. అయితే మొత్తం ఆరు జట్లును ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ ఫ్రాంఛైజీలను ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకున్నాయి. చదవండి: IPL 2023: సన్‌రైజర్స్ బాటలోనే పంజాబ్.. కొత్త కోచ్ ఎంపిక ఖరారు -
ప్రేక్షకుల్లేకుండానే... భారత్, దక్షిణాఫ్రికా సిరీస్
జొహన్నెస్‌బర్గ్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించడం లేదని ప్రకటించింది. ఆదివారం నుంచి మొదలయ్యే తొలి టెస్టు సహా మున్ముందు జరిగే ఇతర మ్యాచ్‌లకు కూడా అభిమానుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచడం లేదని సీఎస్ఏ వెల్లడించింది. ఇరు జట్ల మధ్య పోరులో భాగంగా 3 టెస్టులు, 3 వన్డేలు జరగనున్నాయి. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న అభిమాలను గరిష్టంగా 2 వేల మంది వరకు అనుమతించే అవకాశం ఉన్నా... ఆటగాళ్ల భద్రత, బయో బబుల్‌ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎస్ఏ, బీసీసీఐ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల తమ దేశంలో శ్రీలంక, పాకిస్తాన్లతో జరిగిన సిరీస్‌లను కూడా ప్రేక్షకుల్లేకుండానే సీఎస్ఏ నిర్వహించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా ‘ఫోర్త్ వేవ్’ కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ రోజుకు సుమారు 17 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇందులో ఎక్కువ భాగం రెండు టెస్టులకు వేదికలైన సెంచూరియన్, జొహన్నెస్‌బర్గ్ నగరాలు ఉన్న గ్వాటంగ్ ప్రొవిన్స్‌లో ఉన్నాయి. -
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ల రాజీనామా
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. మొత్తం పది మంది డైరెక్టర్లు ఉండగా... ఆరుగురు సభ్యులు ఆదివారమే సీఎస్ఏ నుంచి వైదొలగగా... మిగిలిన నలుగురు సోమవారం తప్పుకున్నారు. ఈ విషయాన్ని సీఎస్ఏ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. గతంలో బోర్డుపై అవినీతి, జాతి వివక్ష, పరిపాల దుర్వినియోగం, ఆటగాళ్ల జీతాల చెల్లింపుల్లో అవకతవకలు వంటి ఆరోపణలు రావడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆ దేశపు క్రీడా మంత్రి నాతి మెథ్వా స్వయంగా రంగంలోకి దిగారు. అయితే బోర్డు డైరెక్టర్ల నుంచి çసహకారం అందకపోవడంతో ఆగ్రహించిన మెథ్వా... తాను ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలిపేలా ఈ నెల 27లోపు వాదనలు వినిపించాలని సీఎస్ఏ డైరెక్టర్లను ఆదేశించారు. అంతేకాకుండా బోర్డును రద్దు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. దాంతో ఆదివారం సమావేశమైన సీఎస్ఏ డైరెక్టర్లు... తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాలో క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడానికి రిహాన్ రిచర్డ్స్‌ను నియమించిన దక్షిణాఫ్రికా స్పోర్ట్స్ కాన్ఫడరేషన్, ఒలింపిక్ కమిటీ (ఎస్ఏఎస్సీఓసీ)... త్వరలోనే సీఎస్ఏ స్థానంలో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని నియమిస్తామని ప్రకటించింది. -
బీటీ పత్తి.. ఓ సాగు వైఫల్యం
సాక్షి, హైదరాబాద్: బీటీ పత్తి.. ఓ సాగు వైఫల్యమని ప్రపంచ స్థాయి వ్యవ సాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ తొలి జన్యు మార్పిడి బీటీ పత్తి పంట దేశ పరిస్థితులకు అనుగుణంగా లేదని వారు పేర్కొంటున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ), జతన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో దేశంలో 18 ఏళ్ల బీటీ పత్తి సాగుపై సాక్ష్యాలతో కూడిన సమీక్ష చేపట్టారు. ఈ వెబినార్‌లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ పాల్ గుటిఎరేజ్, కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ మాజీ డైరెక్టర్ డాక్టర్ కేశవ్ క్రాంతి, ఎఫ్ఏవో మాజీ ప్రతినిధి డాక్టర్ పీటర్ కెన్మోర్లతో పాటు 500 మంది వరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1960, 70లలో కాలిఫోర్నియాలో పురుగు మందులను వాడటం వల్ల తెగుళ్లు ప్రబలాయని, దీని నుంచి భారతదేశం గుణపాఠం నేర్చుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానిం చారు. 2005లో 11.5 శాతం, 2006లో 37.8 శాతం, 2011లో దాదాపు అత్యధిక విస్తీర్ణానికి బీటీ పత్తి సాగు పెరిగినా పురుగు మందుల వాడకంలో నియంత్రణ రాలేదని, దిగుబడి పెంపులో కూడా ఎలాంటి మార్పు బీటీతో సాధ్యం కాలేదన్నారు. పురుగు మందుల వాడకం, తెగుళ్ల నియం త్రణలో భాగంగా పర్యావరణ సమ స్యలు తీవ్రంగా తలెత్తుతున్నాయని, దీని వల్ల రైతులు కూడా ఇతర విత్తనాల వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు. ఈ వెబినార్ నిర్వహణకు అలయన్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చ రల్ (ఆషా), ఇండియా ఫర్ సేఫ్ ఫుడ్ సంస్థలు సహకారం అందించాయి. -
గ్రేమ్ స్మిత్.. మరో రెండేళ్లు!
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) డైరెక్టర్‌గా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. గతేడాది డిసెంబర్లో సీఎస్ఏ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించబడ్డ స్మిత్‌ను రెండేళ్ల పాటు పూర్తిస్థాయిలో కొనసాగించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా నిర్ణయం తీసుకుంది. స్మిత్‌ను తాత్కాలిక డైరక్టర్‌గా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వరకే నియమించారు. కాగా, సీఎస్ఏ డైరక్టర్‌గా 2022, మార్చి నెల వరకూ స్మిత్ కొనసాగనున్నట్లు తాజా ప్రకటనలో తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జాక్వస్ ఫాల్ తెలిపారు. ‘ స్మిత్ మా క్రికెట్‌కు మూలస్తంభం. దక్షిణాఫ్రికా క్రికెట్లో పరివర్తనకు స్మిత్ గేమ్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతోంది. (నీలాగ దేశాన్ని అమ్మేయలేదు..!) తాత్కాలిక పదవీ కాలంలో స్మిత్ అద్భుతంగా పనిచేశాడని, మెరుగైన ప్రణాళికలతో ముందుండి నడిపించాడు.అలాగే తాత్కాలిక జాతీయ సెలెక్టర్‌గా లిండా జోండి సహా అనేక వ్యూహాత్మక నియామకాలు చేపట్టాడని, అందుకే స్మిత్‌కు పూర్తిస్థాయి క్రికెట్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించినట్లు జాక్వస్ ఫాల్ తెలిపాడు. ఇక తన పదవీ కాలం పొడిగించడంపై స్మిత్ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు మరో రెండేళ్లు పొడిగించడంతో రోడ్ మ్యాప్‌పై ప్లానింగ్ అనేది సులభం అవుతుంది. జాక్వస్ ఫాల్ చెప్పినట్లు నా ముందు చాలా పెద్ద బాధ్యత ఉంది. కేవలం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ను మెరుగుపరచడమే కాకుండా కిందిస్థాయి(దేశవాళీ) క్రికెట్‌ను పటిష్టం చేసుకుంటూ రావాలి’ అని స్మిత్ స్పష్టం చేశాడు. (ఏయ్ కోహ్లి.. చౌకా మార్!) -
రబడా ‘మరో’ రికార్డు!
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా ప్రధాన పేసర్ కగిసో రబడా అవార్డుల్లో మరోసారి రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) అందజేసిన తాజా అవార్డుల్లో రబడా అత్యధికంగా ఆరు అవార్డులను గెలుచుకోవడం ద్వారా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఫాన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, డెలివరీ ఆఫ్ ద ఇయర్ అవార్డులను రబడా కైవసం చేసుకున్నాడు. 2016లో అత్యధికంగా ఆరు అవార్డులు గెలుచుకుని ఐదు, అంతకంటే ఎక్కువ అవార్డులు గెలిచిన ఏకైక దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా నిలిచిన రబడా.. మరోసారి అవార్డుల్లో దుమ్మురేపాడు. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న రబడా రెండు సార్లు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల గెలుచుకున్న సఫారీ ఆటగాళ్ల జాబితాలో సైతం చేరిపోయాడు. అంతకుముందు రెండుసార్లు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న వారిలో హషీమ్ ఆమ్లా, జాక్వస్ కల్లిస్, ఎన్తిని, ఏబీ డివిలియర్స్‌లు ఉండగా, వారి సరసన రబడా నిలిచాడు. కాగా, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఏబీ డివిలియర్స్‌కు టీ 20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. -
సఫారీ గడ్డపై మరో టి20 లీగ్
దుబాయ్: దక్షిణాఫ్రికా మరో టి20 టోర్నీకి వేదికవుతోంది. ఇప్పటికే ఆరు జట్లతో జరుగుతున్న వార్షిక దేశవాళీ టి20 ఈవెంట్‌తో పాటు సరికొత్త హంగులతో ఎనిమిది జట్లతో ఈ ఏడాది చివర్లో ఈ గ్లోబల్ టోర్నీని నిర్వహించాలని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ టోర్నీలో ప్రపంచ దేశాలకు చెందిన మేటి క్రికెటర్లను భాగస్వామ్యం చేయాలని సీఎస్ఏ భావిస్తోంది. -
అల్విరో పీటర్సన్ మ్యాచ్ ఫిక్సర్
దర్యాప్తు సాగుతుందన్న దక్షిణాఫ్రికా బోర్డు జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అల్విరో పీటర్సన్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) వెల్లడించింది. 35 ఏళ్ల పీటర్సన్పై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. దేశవాళీ ఫ్రాంచైజీ టోర్నీలో హైవెల్డ్ లయన్సకు కెప్టెన్‌గా వ్యవహరించిన పీటర్సన్ మ్యాచ్ ఫిక్సర్ అని... 2015లో జరిగిన రామ్‌స్లామ్ టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని సీఎస్ఏ తెలిపింది. అతనిపై ప్రొవిజనల్ సస్పెన్షన్ విధించామని, 14 రోజుల్లోగా స్పందించాలని నోటీసు కూడా జారీ చేశామని సీఎస్ఏ తెలిపింది. 2015లో పీటర్సన్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిక్సింగ్పై కఠినంగా వ్యవహరిస్తోన్న సీఎస్ఏ ఇప్పటికే గులామ్ బొడి, జియాన్ సైమ్స్, మత్సిక్వె, ఎతీ ఎంబలాటి, సొలెకిలేలపై నిషేధం విధించింది. వీరంతా రామ్ స్లామ్ టోర్నీలో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలొచ్చారుు. -
నలుగురు క్రికెటర్లపై నిషేధం
జోహన్నెస్‌బర్గ్: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన నలుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు(సీఎస్ఏ)నిషేధం విధించింది. గతేడాది దక్షిణాఫ్రికాలో జరిగిన దేశవాళీ మ్యాచ్‌ల్లో అంతర్జాతీయ మాజీ క్రికెటర్ థామి సోలెకైల్తో పాటు యువ క్రికెటర్లు సీన్ సైమ్స్, ఎథీ ఎంబలాటీ, పుమేలా మ్యాట్షైక్వేలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. సదరు క్రికెటర్లపై వచ్చిన ఆరోపణలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన అనంతరం వారిపై ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తూ సీఎస్ఏ నిర్ణయం తీసుకుంది. 2015లో రామ్ స్లామ్ టీ 20 సిరీస్ సందర్భంగా వారంతా మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు రుజువు కావడంతో నిషేధం విధిస్తున్నట్లు సీఎస్ఏ పేర్కొంది. ఎంబలాటీ, పుమేలా మ్యాట్షైక్వేలపై పది సంవత్సరాల పాటు నిషేధం విధించగా, సైమ్స్పై ఏడు సంవత్సరాల నిషేధం పడింది. దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపరైన సోలైక్పై 12 సంవత్సరాల నిషేధం విధించింది. కాగా, మరో ఇద్దరు క్రికెటర్లపై విచారణ కొనసాగుతోంది. -
భారత్ వల్లే మళ్లీ క్రికెట్లోకి..
జొహెనెస్‌బర్గ్: జాతి వివక్ష కారణంగా దాదాపు నాలుగు దశాబ్దాలు పాటు బహిష్కరణకు గురైన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మళ్లీ తిరిగి పునరాగమనం చేయడంలో భారత్ పాత్ర వెలకట్టలేనిదంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు సీఎస్ఏ ప్రశంసించింది. దక్షిణాఫ్రికా క్రికెట్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా భారత్ పోషించిన పాత్రను కొనియాడింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన 'జయ హో' గీతానికి వేదికపై కళాకారులు నృత్యం చేస్తున్న సమయంలో భారత దేశం వల్లే తాము మళ్లీ క్రికెట్ లో అడుగపెట్టామని, మా పట్ల విశాల హృదయంతో వ్యవహరించిన ఆ దేశానికి కృతజ్ఞతలు అంటూ సీఎస్ఏ వీడియో సందేశంలో పేర్కొంది. జాతి వివక్ష కారణంగా 40 ఏళ్లు నిషేధం ఎదుర్కొన్న తరువాత క్లైవ్ రైస్ సారథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి భారత్‌లో పర్యటించిన చారిత్రాత్మక ఘట్టాన్ని సీఎస్ఏ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. అంతకుముందు జాతుల వారిగా క్రికెట్ సంఘాలు విడిపోయి దేశంలో ఆటపై నిషేధం పడిన తరుణంలో భారత్ చేసిన సుదీర్ఘ కృషి అమోఘమని సీఎస్ఏ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు అలీ బషర్ అన్నారు. జాతి వివక్ష కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లతో మాత్రమే క్రికెట్ ఆడేవాళ్లమని, ఆ తరువాత అంతర్జాతీయ స్థాయిలో అందరితో ఆడే స్వతంత్రం సీఏకు లభించిదన్నారు. -
ఏబీ డివిలియర్స్‌కు నాలుగు అవార్డులు
జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఈ ఏడాదికిగాను ఆ దేశపు మేటి క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. గురువారం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) ప్రకటించిన అవార్డుల్లో డివిలియర్స్ నాలుగు అవార్డుల్ని దక్కించుకున్నాడు. ఐదు అవార్డులకు నామినేట్ అయిన డివిలియర్స్.. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాలతోపాటు సహచర ఆటగాళ్ల చాయిస్‌గా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతోపాటు దక్షిణాఫ్రికా ప్రజలు, అభిమానులతో నిర్వహించిన ఓటింగ్‌లో ఫ్యాన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా డివిలియర్స్నే వరించింది. వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఒక్కటే డివిలియర్స్‌కు కాకుండా క్వింటన్ డి కాక్కు దక్కింది. ఈ సమీక్ష నిర్వహించే సమయానికి మూడు ఇన్నింగ్స్ ల్లో నాలుగు సెంచరీలతో ఆకట్టుకున్న డి కాక్ కు ఈ అవార్డు లభించింది. ఇదిలా ఉండగా, ఇమ్రాన్ తహీర్ కు ట్వంటీ 20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించగా, డేల్ స్టెయిన్ కు డెలివరీ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది.