నలుగురు క్రికెటర్లపై నిషేధం
జోహన్నెస్బర్గ్: మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిన నలుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు(సీఎస్ఏ)నిషేధం విధించింది. గతేడాది దక్షిణాఫ్రికాలో జరిగిన దేశవాళీ మ్యాచ్ల్లో అంతర్జాతీయ మాజీ క్రికెటర్ థామి సోలెకైల్తో పాటు యువ క్రికెటర్లు సీన్ సైమ్స్, ఎథీ ఎంబలాటీ, పుమేలా మ్యాట్షైక్వేలు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డారు. సదరు క్రికెటర్లపై వచ్చిన ఆరోపణలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన అనంతరం వారిపై ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తూ సీఎస్ఏ నిర్ణయం తీసుకుంది.
2015లో రామ్ స్లామ్ టీ 20 సిరీస్ సందర్భంగా వారంతా మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు రుజువు కావడంతో నిషేధం విధిస్తున్నట్లు సీఎస్ఏ పేర్కొంది. ఎంబలాటీ, పుమేలా మ్యాట్షైక్వేలపై పది సంవత్సరాల పాటు నిషేధం విధించగా, సైమ్స్పై ఏడు సంవత్సరాల నిషేధం పడింది. దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపరైన సోలైక్పై 12 సంవత్సరాల నిషేధం విధించింది. కాగా, మరో ఇద్దరు క్రికెటర్లపై విచారణ కొనసాగుతోంది.