కేప్‌టౌన్: స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే, టి20 సిరీస్‌లకు సన్నద్ధమవుతున్న సమయంలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును కరోనా తాకింది. జట్టులో సభ్యుడొకరు కోవిడ్–19 పాజిటివ్‌గా తేలాడు. దాంతో అతడిని బయో బబుల్‌నుంచి బయటకు పంపించివేశారు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరు క్రికెటర్లకు వైరస్ లక్షణాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు తరలించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఆ ముగ్గురి స్థానాలను ఇతర క్రికెటర్లతో భర్తీ చేయబోమని చెప్పింది. (భారత్ కంటే ఆస్ట్రేలియా మెరుగు)
మరో వైపు తాజా సిరీస్‌లో మోకాలిపై కూర్చొని నల్లజాతివారికి సంఘీభావం తెలిపే కార్యక్రమానికి తాము దూరంగా ఉంటున్నామని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు. తమ దేశంలో ఈ మొత్తం ఉద్యమంలో కీలకంగా ఉన్న జట్టు సభ్యుడు లుంగీ ఇన్‌గిడితో తాను మాట్లాడానని... కొన్నాళ్ల క్రితం జరిగిన 3టీసీ మ్యాచ్‌లో ఇలా చేశాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదని వివరించినట్లు బౌచర్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment