సౌతాఫ్రికాతో ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లకు ఇంగ్లండ్‌ జట్ల ప్రకటన | England Women Team Announced For All Format Tour Of South Africa | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాతో ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లకు ఇంగ్లండ్‌ జట్ల ప్రకటన

Published Fri, Nov 8 2024 6:58 PM | Last Updated on Fri, Nov 8 2024 7:06 PM

England Women Team Announced For All Format Tour Of South Africa

నవంబర్‌ 24 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్లను ఇవాళ (నవంబర్‌ 8) ప్రకటించారు. ఈ సిరీస్‌లలో తొలుత టీ20లు, తర్వాత వన్డేలు, ఆతర్వాత ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనుంది. మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్‌ జట్టుకు హీథర్‌ నైట్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. 

ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం  ఆల్‌రౌండర్‌ పైజ్ స్కోల్‌ఫీల్డ్‌ను టీ20 జట్టుకు ఎంపిక చేశారు. ఫాస్ట్‌ బౌలర్‌ లారెన్ ఫైలర్ మూడు ఫార్మాట్ల జట్లలో చోటు దక్కించుకుంది. 19 ఏళ్ల యంగ్‌ ప్రామిసింగ్‌ క్రికెటర్‌ ఫ్రేయా కెంప్‌ తొలిసారి టెస్ట్‌ జట్టులో చోటు దక్కించుకుంది. మైయా బౌచియర్ ఈ సిరీస్‌లో తన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. తొలుత టీ20 జట్టు నవంబర్‌ 16న సౌతాఫ్రికాకు బయల్దేరుతుంది. ఆ తర్వాత నవంబర్‌ 27న వన్డే, టెస్ట్‌ జట్లు టీ20 జట్టుతో కలుస్తాయి.

షెడ్యూల్‌..
నవంబర్‌ 24- తొలి టీ20 (ఈస్ట్‌ లండన్‌)
నవంబర్‌ 27- రెండో టీ20 (బెనోని)
నవంబర్‌ 30- మూడో టీ20 (సెంచూరియన్‌)

డిసెంబర్‌ 4- తొలి వన్డే (కింబర్లీ)
డిసెంబర్‌ 8- రెండో వన్డే (డర్బన్‌)
డిసెంబర్‌ 11- మూడో వన్డే (పోచెఫ్‌స్రూమ్‌)

డిసెంబర్‌ 15 నుంచి 18 వరకు- ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ (బ్లోంఫోంటెయిన్‌)

ఇంగ్లండ్ మహిళల టీ20 జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మైయా బౌచియర్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, పైజ్ స్కోల్‌ఫీల్డ్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డాని వ్యాట్‌ హాడ్జ్

ఇంగ్లండ్ మహిళల వన్డే జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, అలిస్ క్యాప్సే, కేట్ క్రాస్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, డాని వ్యాట్ హాడ్జ్

ఇంగ్లండ్ మహిళల టెస్టు జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, కేట్ క్రాస్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, డాని వ్యాట్ హాడ్జ్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement