లండన్: ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టును బౌలర్లు శాసిస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా మొదలైన మూడో టెస్టులో ఒక్క మూడో రోజు ఆటలోనే 17 వికెట్లు కూలాయి. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 36.2 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. జాన్సెన్ (30; 4 ఫోర్లు), జొండో (23; 1 ఫోర్, 1 సిక్స్) కాసేపు ఆడారు. మిగిలిన వారిని రాబిన్సన్ (5/49), స్టువర్ట్ బ్రాడ్ (4/41) జంటగా పడగొట్టేశారు.
తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 33.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఒలీ పోప్ (67; 13 ఫోర్లు) రాణించడంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 36 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. జాన్సెన్ 4, రబడ 2 వికెట్లు తీశాడు. తొలి రోజు ఆట వర్షార్పణం కాగా... రెండో రోజు క్వీన్ ఎలిజబెత్–2 మృతికి సంతాప సూచకంగా ఆటను రద్దు చేశారు. మూడో రోజు ఉదయం ఇరు జట్ల ఆటగాళ్లు బ్రిటన్ రాణికి నివాళులు అర్పించాకే ఆట మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment