third Test
-
కంగారూలు కసితీరా...
బ్రిస్బేన్‌లో తొలి రోజు వరుణుడు విజృంభిస్తే... రెండో రోజు ఆ్రస్టేలియా బ్యాటర్లు వీర విహారం చేశారు. ట్రావిస్ హెడ్ టీమిండియాపై తన ఆధిపత్యం కొనసాగిస్తూ మరో సెంచరీతో విరుచుకుపడగా... స్టీవ్ స్మిత్ సాధికారిక సెంచరీతో కదంతొక్కాడు. ఫలితంగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు సాధించింది. భారత మేటి పేసర్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... అతనికి సహచర బౌలర్ల నుంచి ఆశించిన సహకారం లభించలేదు. దాంతో ఆ్రస్టేలియా మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశాన్ని సృష్టించుకుంది. మూడో రోజు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్న ఈ పోరులో భారత బ్యాటర్ల ఆటతీరుపైనే టీమిండియా ఆశలు ఆధారపడి ఉన్నాయి.బ్రిస్బేన్: సొంతగడ్డపై ఆ్రస్టేలియా జట్టు అదరగొట్టింది. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు నమోదు చేసింది. గత మ్యాచ్ విజయం ఇచ్చిన స్ఫూర్తితో విజృంభించిన ఆ్రస్టేలియా ఆదివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. భారత్‌తో మ్యాచ్ అంటే చాలు పూనకం వచ్చినట్లు చెలరేగే ట్రావిస్ హెడ్ (160 బంతుల్లో 152; 18 ఫోర్లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారీ శతకంతో విజృంభించగా... చాన్నాళ్లుగా ఫామ్‌లో లేని మాజీ కెపె్టన్ స్టీవ్ స్మిత్ (190 బంతుల్లో 101; 12 ఫోర్లు) రికార్డు సెంచరీతో రాణించాడు. వీరిద్దరి అసమాన ప్రదర్శన ముందు... బుమ్రా (5/72) ఒంటరి పోరాటం చిన్నబోయింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (47 బంతుల్లో 45 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో రెండో రోజు ఆ్రస్టేలియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఓవర్‌నైట్ స్కోరు 28/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ఓవరాల్‌గా రెండో రోజు 377 పరుగులు జతచేయడం విశేషం. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. మూడో రోజు ఆసీస్ ఇంకెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం. తొలి సెషన్ మనదే... వర్ష సూచన మధ్య ప్రారంభమైన రెండో రోజు ఆటలో మొదట మన బౌలర్లు ఆకట్టుకున్నారు. బుమ్రాకు వికెట్ సమరి్పంచుకోకూడదు అనే సంకల్పంతో ముందుకు సాగిన ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (54 బంతుల్లో 21), నాథన్ మెక్‌స్వీనీ (49 బంతుల్లో 9) చివరకు అతడి బౌలింగ్‌లోనే వెనుదిరిగారు. బంతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన బుమ్రా... వరుస ఓవర్లలో వీరిద్దరినీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆ్రస్టేలియా 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో భారత జట్టుకు మెరుగైన ఆరంభమే లభించినట్లు అనిపించింది. లబుషేన్ (55 బంతుల్లో 12)తో పాటు ఆరంభంలో స్మిత్ అతి జాగ్రత్తకు పోవడంతో భారత బౌలర్లదే పైచేయి అయింది. గంటకు పైగా క్రీజులో గడిపినా... ఒక్క షాట్ ఆడలేకపోయిన లబుషేన్ చివరకు ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ 75/3తో నిలిచింది. ఇదే జోరు కొనసాగిస్తే మ్యాచ్‌పై టీమిండియా పట్టు సాధించడం ఖాయమే అనే అంచనాలకు వస్తున్న తరుణంలో... స్మిత్‌తో కలిసి హెడ్ వీరోచితంగా పోరాడాడు. మొత్తానికి తొలి సెషన్ ముగిసేసరికి ఆసీస్ 104/3తో నిలిచింది. 12 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు మూడో సెషన్ ఆరంభలోనూ స్మిత్, హెడ్ జోరు సాగింది. నాలుగో వికెట్‌కు 241 పరుగులు జత చేసిన తర్వాత ఎట్టకేలకు బుమ్రా ఈ జోడీని విడదీశాడు. టెస్టు ఫార్మాట్లో 25 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ నమోదు చేసుకున్న స్మిత్... మూడంకెల స్కోరు చేసిన వెంటనే పెవిలియన్ చేరగా... పేస్ ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ (5) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆఫ్‌స్టంప్ లైన్లో బుమ్రా వేసిన బంతికి మార్ష్ స్లిప్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.అదే ఓవర్లో హెడ్ కూడా ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన ట్రవిస్ వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 12 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో ఇకనైనా ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడుతుందని ఆశిస్తే... వికెట్ కీపర్ అలెక్స్ కేరీ దాన్ని అడ్డుకున్నాడు. కెపె్టన్ ప్యాట్ కమిన్స్ (20)తో కలిసి ధాటిగా ఆడుతూ కీలక పరుగులు జోడించాడు. గాయం కారణంగా కాసేపు మైదానానికి దూరమైన సిరాజ్... ఆఖరికి ఒక వికెట్ పడగొట్టగా... కేరీతో పాటు మిషెల్ స్టార్క్ (7 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. తదుపరి మూడు రోజుల ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న హెచ్చరికల మధ్య ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఆ్రస్టేలియా పటిష్ట స్థితికి చేరింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) పంత్ (బి) బుమ్రా 21; మెక్‌స్వీనీ (సి) కోహ్లి (బి) బుమ్రా 9; లబుషేన్ (సి) కోహ్లి (బి) నితీశ్ రెడ్డి 12; స్మిత్ (సి) రోహిత్ (బి) బుమ్రా 101; హెడ్ (సి) పంత్ (బి) బుమ్రా 152; మార్ష్ (సి) కోహ్లి (బి) బుమ్రా 5; కేరీ (బ్యాటింగ్) 45; కమిన్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; స్టార్క్ (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 33; మొత్తం (101 ఓవర్లలో 7 వికెట్లకు) 405. వికెట్ల పతనం: 1–31, 2–38, 3–75, 4–316, 5–326, 6–327, 7–385. బౌలింగ్: బుమ్రా 25–7–72–5; సిరాజ్ 22.2–4–97–1; ఆకాశ్‌దీప్ సింగ్ 24.4–5–78–0; నితీశ్ కుమార్ రెడ్డి 13–1–65–1; రవీంద్ర జడేజా 16–2–76–0.భారీ భాగస్వామ్యం లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా గేర్ మార్చింది. అప్పటి వరకు రక్షణాత్మక ధోరణిలో ఆడిన ఆసీస్ ప్లేయర్లు... ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టారు. ముఖ్యంగా గత కొంతకాలంగా... టీమిండియాపై మెరుగైన ప్రదర్శన చేస్తూ... మన బౌలింగ్‌కు కొరకరాని కొయ్యలా మారిన హెడ్ అలరించాడు. రెండో సెషన్లో కెపె్టన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ జోడీకి పరోక్షంగా సహకరించాయి. హెడ్ క్రీజులో కుదురుకునే సమయంలో ఫీల్డింగ్ మొహరింపు అనుకూలంగా ఉండటంతో అతడు సునాయాసంగా పరుగులు రాబట్టగలిగాడు. షార్ట్‌బాల్‌ను సరిగ్గా ఆడలేని బలహీనతను సొమ్ము చేసుకునే విధంగా బౌలింగ్ సాగకపోగా... అడపాదడపా జరిగిన ప్రయాత్నాల్లో రోహిత్ థర్డ్ మ్యాన్‌ను మొహరించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బుమ్రా బౌలింగ్‌లో ఆచితూచి ఆడిన హెడ్ ఆ తర్వాత దూసుకెళ్లాడు. మరో ఎండ్ నుంచి స్మిత్ అతడికి చక్కటి సహకారం అందించాడు. టచ్‌లోకి వచ్చాక రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ హెడ్ బౌండరీలతో చెలరేగిపోయాడు. కొత్త బంతితో బౌలింగ్ చేయించేందుకు ప్రధాన పేసర్లను తప్పించడంతో ఆసీస్ జోడీ స్వేచ్ఛగా ముందుకు సాగింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆత్మవిశ్వాసం లేకుండా కనిపించిన స్మిత్... లయ అందుకున్నాక ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో ఇబ్బంది పడినట్లు కనిపించిన స్మిత్... మిగిలిన వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో రెండో సెషన్లో ఆసీస్ జట్టు వికెట్ కోల్పోకుండా 130 పరుగులు చేసింది. 1 అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు (15) చేసిన ప్లేయర్‌గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. ఆసీస్ మాజీ కెపె్టన్ పాంటింగ్ (14) పేరిట ఉన్న ఈ రికార్డును స్మిత్ అధిగమించాడు. జో రూట్ (13) మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియాపై వన్డేల్లో 5 శతకాలు బాదిన స్మిత్, టెస్టుల్లో 10 సెంచరీలు చేశాడు. ఇక భారత్, ఆ్రస్టేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక (10) సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. సచిన్ (11) అగ్రస్థానంలో ఉన్నాడు. 1 టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లపై 10 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా స్టీవ్ స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లండ్‌పై 12 శతకాలు నమోదు చేసిన స్మిత్‌కు భారత్‌పై ఇది పదో సెంచరీ.2 టెస్టుల్లో ఆ్రస్టేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో స్మిత్ (33) రెండో స్థానానికి చేరాడు. బ్రిస్బేన్ మ్యాచ్‌లో శతకంతో స్మిత్... స్టీవ్ వా (32)ను దాటేశాడు. రికీ పాంటింగ్ 41 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. 12 టెస్టు మ్యాచ్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం బుమ్రాకిది 12వ సారి. భారత పేసర్లలో కపిల్‌దేవ్ 16 సార్లు ఈ ఫీట్ నమోదు చేయగా... బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు.10 ఆసియా ఆవలి పిచ్‌లపై బుమ్రా 5 వికెట్లు పడగొట్టడం ఇది పదోసారి. ఈ జాబితాలో కపిల్‌దేవ్ (9)ను అధిగమించి బుమ్రా అగ్రస్థానానికి చేరాడు. -
ఆధిక్యంలోకి వెళతారా!
బ్రిస్బేన్: ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్, ఆ్రస్టేలియా మధ్య నేటి నుంచి బ్రిస్బేన్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో విజయంతో 1–1తో సమఉజ్జీలుగా ఉండగా... పేస్‌కు స్వర్గధామమైన బ్రిస్బేన్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది కీలకంగా మారింది. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో... టీమిండియాకు పరాజయం తప్పకపోగా... ఈ మ్యాచ్‌లో వాటిని అధిగమించి విజయం సాధించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. తొలి టెస్టులో సెంచరీ చేసినప్పటికీ... ఆఫ్‌స్టంప్ అవతల పడుతున్న బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లి నుంచి సాధికారిక ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. ఇక గత కొంత కాలంగా సుదీర్ఘ ఫార్మాట్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న రోహిత్ శర్మ తిరిగి ఓపెనింగ్ చేయడం ఖాయమే. మరోవైపు గత మ్యాచ్‌లో విజయంతో ఆ్రస్టేలియా ఆత్మవిశ్వాసంతో ఉన్నా... స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా పేలవ ఫామ్ ఆసీస్‌ను ఇబ్బంది పెడుతోంది. ఒత్తిడిలో రోహిత్, కోహ్లి కెరీర్లో దాదాపు చివరి ఆ్రస్టేలియా పర్యటనలో ఉన్న భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, కోహ్లి ఒత్తిడిలో కనిపిస్తున్నారు. తొలి టెస్టుకు అందుబాటులో లేని రోహిత్... అడిలైడ్‌లో మిడిలార్డర్లో బరిలోకి దిగి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మరోసారి రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్, సుందర్, జడేజా మధ్య పోటీ ఉన్నా... గతంలో ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపొచ్చు. ఇక మూడో పేసర్‌గా హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్‌దీప్ సింగ్‌కు అవకాశం దక్కవచ్చు. ఆత్మవిశ్వాసంలో ఆ్రస్టేలియా.. సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా అదే జోరులో సిరీస్‌లో ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదురైనా... అడిలైడ్‌లో హెడ్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో కంగారూలు గాడిన పడ్డారు. అయితే స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌తో పాటు ఉస్మాన్ ఖ్వాజా, మెక్‌స్వీనీ, మిషెల్ మార్‡్ష, అలెక్స్ కేరీ రాణించాల్సిన అవసరముంది. లబుషేన్ గత మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్నా... పూర్తి నియంత్రణతో కనిపించలేదు. బౌలింగ్‌లో మాత్రం ఆసీస్‌కు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లి, పంత్, రాహుల్, నితీశ్ రెడ్డి, సుందర్/అశ్విన్, ఆకాశ్‌దీప్, సిరాజ్, బుమ్రా. ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్‡్ష, కారీ, స్టార్క్, లయన్, హాజల్‌వుడ్. పిచ్, వాతావరణం బ్రిస్బేన్ పిచ్ పేస్, బౌన్స్‌కు సహకరించనుంది. ఈ టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. తొలి రోజు ఉదయం వర్షం కురిసే అవకాశముంది. -
IND vs AUS 3rd Test: ఫుల్ ప్రాక్టీస్...
బ్రిస్బేన్: ఆ్రస్టేలియాతో మూడో టెస్టుకు ముందు భారత క్రికెట్ జట్టు కఠోర సాధన చేస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని నిలబెట్టుకోవడంతో పాటు... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడమే లక్ష్యంగా సాగుతున్న టీమిండియా గురువారం బ్రిస్బేన్‌లో చెమటోడ్చింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి 1–1తో సమంగా నిలవగా... శనివారం నుంచి మూడో మ్యాచ్ ప్రారంభం కానుంది. దీని కోసం గురువారమే బ్రిస్బేన్ చేరుకున్న రోహిత్ శర్మ బృందం... రోజంతా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియా... ఈసారి కూడా అదే మ్యాజిక్ కొనసాగిస్తూ ‘హ్యాట్రిక్’ కొట్టాలని భావిస్తోంది. అడిలైడ్‌లో ‘పింక్ బాల్’తో జరిగిన రెండో టెస్టులో పరాజయంతో జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసం లోపించినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో మాజీ కెపె్టన్ విరాట్ కోహ్లి ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. టెస్టు ఫార్మాట్లో రోహిత్ కన్నా ఎక్కువ అనుభవం ఉన్న కోహ్లి... గురువారం ప్రాక్టీస్ సందర్భంగా సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. తిరిగి పుంజుకునే విధంగా యువ ఆటగాళ్లకు కీలక సూచనలు ఇచ్చాడు. బుమ్రా, రోహిత్‌తోనూ కోహ్లి విడిగా చర్చిస్తూ కనిపించాడు. గత మ్యాచ్‌లో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగి విఫలమైన కెపె్టన్ రోహిత్ శర్మ... మూడో టెస్టులో ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ అటు కొత్త బంతితో పాటు... పాత బంతితోనూ సాధన కొనసాగించాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కొత్త బంతితో ప్రాక్టీస్ చేశారు.పచ్చికతో కూడిన గబ్బా పిచ్... పేస్‌కు, బౌన్స్‌కు సహకరించడం ఖాయం కాగా... రోహిత్ ఓపెనర్‌గానే బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీయడమే మేలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీతో గంభీర్ సుదీర్ఘంగా సంభాషిoచాడు. ఆకాశ్‌కు అవకాశం దక్కేనా! నెట్స్‌లో భారత బౌలర్లంతా తీవ్రంగా శ్రమించగా... పేసర్ ఆకాశ్‌దీప్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయినా మూడో టెస్టులో అతడికి అవకాశం దక్కడం కష్టమే. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా రెండో మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఇప్పుడప్పుడే అతడి స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా... ప్రాక్టీస్‌లో ఆకాశ్ బౌలింగ్ చూస్తుంటే హర్షిత్ స్థానంలో అతడికి అవకాశం ఇవ్వడమే మేలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడో టెస్టు జరగనున్న పిచ్ హర్షిత్ బౌలింగ్ శైలికి సహకరించే అవకాశాలున్నాయి. శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకొని దేశవాళీల్లో సత్తాచాటిన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పాల్గొనే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. రంజీ ట్రోఫీతో పాటు ముస్తాక్ అలీ టోర్నీలో షమీ సత్తా చాటినా... టెస్టు మ్యాచ్‌కు అవసరమైన ఫిట్నెస్ అతడు ఇంకా సాధించలేదు. ‘షమీ గాయం నుంచి కోలుకున్నా... ఇంకా మడమ వాపు పూర్తిగా తగ్గలేదు. ఎక్కువ పనిభారం పడితే గాయం తిరగబెట్టే ప్రమాదం ఉంది. అతడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి ముందు ఒక్కో మ్యాచ్‌లో 10 ఓవర్ల పాటు మూడు స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో షమీ బెంగాల్ తరఫున బరిలోకి దిగుతాడు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మూడో టెస్టులోనూ భారత జట్టు ఏకైక స్పిన్నర్‌తోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లో ఎవరికి చాన్స్ దక్కుతుందో చూడాలి. జైస్వాల్ బస్ మిస్.. రెండో టెస్టు ముగిసిన అనంతరం గురువారం అడిలైడ్ నుంచి బ్రిస్బేన్‌కు బయలుదేరే సమయంలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిర్ణీత సమయానికి టీమ్ బస్ వద్దకు చేరుకోలేకపోయాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... జైస్వాల్‌ను అక్కడే వదిలి మిగిలిన జట్టుతో ఎయిర్‌పోర్ట్‌కు పయనమయ్యాడు. జట్టు సభ్యులంతా వచి్చన తర్వాత కూడా జైస్వాల్ అక్కడికి రాకపోవడంతో రోహిత్ అసహనానికి గురయ్యాడు. ఉదయం 10 గంటలకు విమానం ఎక్కాల్సి ఉండటంతో... జట్టు సభ్యులంతా గం 8:30కి హోటల్ నుంచి బయలుదేరగా... జైస్వాల్ సమయానికి రాలేకపోయాడు. దీంతో 20 నిమిషాల అనంతరం హోటల్ సిబ్బంది ప్రత్యేక వాహనంలో జైస్వాల్‌ను విమానాశ్రయానికి చేర్చారు. -
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. నెట్స్‌లో చెమటోడ్చుతున్న భారత ప్లేయర్లు
అడిలైడ్: రెండో టెస్టులో ఆ్రస్టేలియా చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు తిరిగి గాడిన పడటంపై దృష్టి పెట్టింది. భారత్, ఆ్రస్టేలియా మధ్యఅడిలైడ్ వేదికగా ‘గులాబీ బంతి’తో జరిగిన రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగియగా... మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ‘అదనపు సమయాన్ని హోటల్ రూమ్స్‌లో కాకుండా... మైదానంలో గడపండి’ అని మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్న మాటల ప్రభావమో, లేక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలనే తపనో కానీ మంగళవారం భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు.‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. దీని కోసం బుధవారం బ్రిస్బేన్ బయలుదేరనున్న టీమిండియా... మంగళవారం అడిలైడ్‌లో కఠోర సాధన చేసింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘మూడో టెస్టు కోసం సాధన మొదలైంది’ అని రాసుకొచ్చింది. గత 12 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకంతో 142 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ... పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ కనిపించగా... పెర్త్ టెస్టులో సెంచరీ బాదిన కోహ్లి తన ఆఫ్‌స్టంప్ బలహీనతను అధిగమించడంపై దృష్టి పెట్టాడు. హెడ్ కోచ్ గంభీర్ పర్యవేక్షణలో ఆటగాళ్లంతా నెట్స్‌లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు. కేఎల్ రాహుల్ డిఫెన్స్‌పై దృష్టి సారించగా... పంత్ భారీ షాట్లు సాధన చేశాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేసర్లతో బంతులు వేయించుకొని ప్రాక్టీస్ సాగించాడు. హర్షిత్ రాణా, ఆకాశ్‌దీప్, యశ్ దయాళ్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. వీరితో పాటు త్రో డౌన్ స్పెషలిస్ట్‌ల బంతులతో కూడా బ్యాటర్లు సాధన చేశారు. సీనియర్ పేసర్లు బుమ్రా, సిరాజ్‌తో పాటు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 7 టెస్టులు జరిగాయి. ఒక మ్యాచ్‌లో భారత్ నెగ్గగా... ఐదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచింది, మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. -
రసవత్తర స్థితిలో...
ఆఖరి మూడో టెస్టును స్పిన్నే దున్నేస్తోంది. రెండో రోజు 15 వికెట్లు కూలాయి. ఇంతలా గింగిర్లు తిరుగుతున్న పిచ్‌పై రిషభ్ పంత్ టెస్టులో టి20 ఆట ఆడేశాడు. దీంతో తొలి సెషన్లో ఆతిథ్య జట్టు వేగంగా పరుగులు సాధించింది. రెండో సెషన్లో ఎజాజ్ స్పిన్ భారత్‌ను చుట్టేసింది. అయితే మూడో సెషన్లో మన స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్‌లు చెలరేగడంతో భారత్ పట్టు బిగించినట్లు కనిపించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. నామమాత్రమైన ఆఖరి వికెట్ మిగిలుంది. ఇలాంటి కఠిన పిచ్‌పై ఇది కూడా చిన్న లక్ష్యమేమీ కాదు కాబట్టి మూడో రోజూ హోరాహోరీ పోరు ఖాయం. ముంబై: చివరి టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. అటో... ఇటో... ఎవరివైపో కానీ ఈ మ్యాచ్ అయితే మూడు రోజుల్లో ముగియడం ఖాయమైంది. ప్రత్యర్థి స్పిన్‌కు ఎదురీదితే భారత్ 1–2తో సిరీస్‌లో పరువు నిలుపుకుంటుంది. ఉచ్చులో పడితే మాత్రం సొంతగడ్డపై వైట్‌వాష్ అవుతుంది. రెండో రోజు ఆటలో మాత్రం భారత బ్యాటర్లే కాస్త పైచేయి సాధించారని చెప్పొచ్చు. 6 వికెట్లు సమర్పించుకున్న టీమిండియా క్రితం రోజు స్కోరుకు 177 పరుగులు జత చేసింది. శుబ్‌మన్ గిల్ (146 బంతుల్లో 90; 7 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (59 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. ఎజాజ్ పటేల్‌కు 5 వికెట్లు దక్కాయి. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు చేజార్చుకున్న న్యూజిలాండ్ 171 పరుగులు చేసింది. విల్ యంగ్ (100 బంతుల్లో 51; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు. పంత్ ధనాధన్ ఫిఫ్టీ తొలి సెషన్లో భారత బ్యాటర్లు రిషభ్ పంత్, శుబ్‌మన్ నిలకడగా ఆడటంతో కివీస్ బౌలర్ల ఆటలు సాగలేదు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ చాప్మన్ లాంగాన్‌లో గిల్ ఇచ్చిన క్యాచ్‌ను, లాంగాఫ్‌లో పంత్ క్యాచ్‌ను మ్యాట్ హెన్రీ వదిలేశారు. దీన్ని సద్వినియోగం చేసుకొన్న బ్యాటర్లు ఇద్దరూ అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. శనివారం 86/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 59.4 ఓవర్లలో 263 పరుగుల వద్ద ఆలౌటైంది.పంత్, గిల్ కివీస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ పరుగులు సాధించారు. ముఖ్యంగా రిషభ్ టి20 ఫార్మాటల్లే చెలరేగిపోయాడు. ఎజాజ్ పటేల్, ఫిలిప్స్ బౌలింగ్‌లో చూడచక్కని బౌండరీలు, భారీ సిక్సర్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో 29వ ఓవర్లోనే భారత్ స్కోరు 150 పరుగులను దాటింది. మరుసటి ఓవర్లోనే ఇద్దరి ఫిఫ్టీలు పూర్తయ్యాయి.30వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన గిల్ 66 బంతుల్లో, నాలుగో బంతికి పరుగు తీసిన రిషభ్ 36 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. కాసేపటి తర్వాత ఇష్ సోధి... పంత్‌ను ఎల్బీగా అవుట్ చేయడంతో ఐదో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రవీంద్ర జడేజా (14) క్రీజులోకి రాగా, టీమిండియా లంచ్ విరామానికి 195/5 స్కోరు చేసింది. అప్పటికి ఇంకా ఆతిథ్య జట్టు 40 పరుగులు వెనుకబడే ఉంది. ఎజాజ్ దెబ్బ రెండో సెషన్లో ఎజాజ్ పటేల్ స్పిన్ మాయాజాలం మొదలవడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. జట్టు స్కోరు 200 దాటగానే జడేజాను ఫిలిప్స్ అవుట్ చేయగా, స్వల్ప వ్యవధిలో ఎజాజ్... సర్ఫరాజ్ (0), గిల్, అశ్విన్ (6)ల వికెట్లను పడగొట్టడంతో గిల్ 10 పరుగుల దూరంలో సెంచరీ అవకాశాన్ని కోల్పోగా... భారత్ భారీ ఆధిక్యం సాధించలేకపోయింది.ఆకాశ్‌దీప్ (0) రనౌట్ కావడంతో టీ విరామానికి ముందే భారత్ 263 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అయితే వికెట్ పూర్తిగా స్పిన్‌కు అనువుగా మారిపోవడంతో భారత సీనియర్ స్పిన్ ద్వయం అశ్విన్–జడేజా కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్ తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు.మిచెల్ (21; 1 ఫోర్, 1 సిక్స్), ఫిలిప్స్ (26; 1 ఫోర్, 3 సిక్స్‌లు)ల అండతో యంగ్ 95 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 171 పరుగుల వద్ద హెన్రీ (10)ని జడేజా బౌల్డ్ చేయడంతో రెండో రోజు ఆటను ముగించారు. ఆకాశ్‌దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం కివీస్ 143 పరుగుల ముందంజలో ఉంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 235 భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఎజాజ్ 30; రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 18; గిల్ (సి) మిచెల్ (బి) ఎజాజ్ 90; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎజాజ్ 0; కోహ్లి రనౌట్ 4; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సోధి 60; జడేజా (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 14; సర్ఫరాజ్ (సి) బ్లన్‌డెల్ (బి) ఎజాజ్ 0; సుందర్ నాటౌట్ 38; అశ్విన్ (సి) మిచెల్ (బి) ఎజాజ్ 6; ఆకాశ్‌దీప్ రనౌట్ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (59.4 ఓవర్లలో ఆలౌట్) 263. వికెట్ల పతనం: 1–25, 2–78, 3–78, 4–84, 5–180, 6–203, 7–204, 8–227, 9–247, 10–263. బౌలింగ్: మ్యాట్ హెన్రీ 8–1–26–1, విలియమ్ ఓ రూర్కే 2–1–5–0, ఎజాజ్ పటేల్ 21.4–3– 103–5, గ్లెన్ ఫిలిప్స్ 20–0–84–1, రచిన్ రవీంద్ర 1–0–8–0, ఇష్ సోధి 7–0–36–1. న్యూజిలాండ్ రెండోఇన్నింగ్స్: లాథమ్ (బి) ఆకాశ్‌దీప్ 1; కాన్వే (సి) గిల్ (బి) సుందర్ 22; యంగ్ (సి అండ్ బి) అశ్విన్ 51; రచిన్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 4; మిచెల్ (సి) అశ్విన్ (బి) జడేజా 21; బ్లన్‌డెల్ (బి) జడేజా 4; ఫిలిప్స్ (బి) అశ్విన్ 26; ఇష్ సోధి (సి) కోహ్లి (బి) జడేజా 8; హెన్రీ (బి) జడేజా 10; ఎజాజ్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (43.3 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–2, 2–39, 3–44, 4–94, 5–100, 6–131, 7–148, 8–150, 9–171. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 5–0–10–1, వాషింగ్టన్ సుందర్ 10–0–30–1, అశ్విన్ 16–0–63–3, జడేజా 12.3–2–52–4. -
India vs New Zealand: జయమా... పరాభవమా!
పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా... ఇప్పుడు క్లీన్‌స్వీప్ ప్రమాదం ముంగిట నిలిచింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్‌లోనూ క్లీన్‌స్వీప్ కాని భారత జట్టు... ఇప్పుడు న్యూజిలాండ్ తో అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరోవైపు భారత్‌లో భారత్‌పై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని న్యూజిలాండ్... ఆ పని పూర్తి చేసి క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ మ్యాచ్‌లో విజయం అనివార్యం అయిన పరిస్థితుల్లో రోహిత్ బృందం ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం! తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసికట్టుగా కదంతొక్కాలని, భారత్‌ను గెలుపు బాట పట్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు.ముంబై: అనూహ్య తడబాటుతో న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన భారత జట్టు శుక్రవారం నుంచి వాంఖడే మైదానం వేదికగా నామమాత్రమైన మూడో టెస్టు ఆడనుంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా ... కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంటే... తొలిసారి భారత్ లో సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ దాన్ని క్లీన్‌స్వీప్‌గా మలచాలని భావిస్తోంది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో గత 12 సంవత్సరాలుగా భారత జట్టు టెస్టు సిరీస్ ఓడిపోలేదు. అంతేకాకుండా 1984 నుంచి స్వదేశంలో భారత జట్టు ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ మూడు టెస్టుల్లో ఓడిపోలేదు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పేస్ పిచ్‌ను సిద్ధం చేసి... వాతావరణ మార్పుల మధ్య తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో ఘోర పరాజయం మూటగట్టుకున్న రోహిత్ జట్టు... పుణేలో జరిగిన రెండో టెస్టులో స్పిన్ పిచ్‌పై కూడా తడబడింది. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలరనే పేరున్న మన ఆటగాళ్లు పుణే టెస్టులో పార్ట్ టైమ్ స్పిన్నర్ లాంటి సాంట్నర్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేయడం అభిమానులను కలవర పరిచింది. ఈ నేపథ్యంలో వాంఖడే పిచ్‌ను సహజసిద్ధంగా ఉంచామని... జట్టు కోసం పిచ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని భారత సహాయక కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. ఈ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆఖరి మ్యాచ్‌లోనైనా రాణిస్తారా చూడాలి. వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన టీమిండియా... ముచ్చటగా మూడోసారి కూడా తుదిపోరుకు అర్హత సాధించాలంటే మిగిలిన ఆరు టెస్టుల్లో సత్తా చాటాల్సిన అవసరముంది. బ్యాటర్లపైనే భారం! కొట్టిన పిండి లాంటి స్వదేశీ పిచ్‌లపై పరుగులు రాబట్టేందుకు భారత ఆటగాళ్లు ఇబ్బంది పడుతుంటే... న్యూజిలాండ్ బ్యాటర్లు మాత్రం సులువుగా పరుగులు చేస్తున్నారు. 2, 52, 0, 8... ఈ సిరీస్‌లో టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ స్కోర్లివి. టాపార్డర్‌లో ముందుండి ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన రోహిత్ ఇలాంటి ప్రదర్శన చేస్తుండగా... స్టార్ బ్యాటర్ కోహ్లి గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 0, 70, 1, 17 పరుగులు చేశాడు. చాన్నాళ్లుగా జట్టు బాధ్యతలు మోస్తున్న ఈ జంట స్థాయికి ఈ ప్రదర్శన తగినది కాకపోగా... మిగిలిన వాళ్లు కూడా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. యశస్వి జైస్వాల్ మంచి టచ్‌లో ఉండగా... శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్, పంత్ కలిసి కట్టుగా కదం తొక్కితేనే భారీ స్కోరు సాధ్యం. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అశి్వన్, వాషింగ్టన్ సుందర్ కేవలం బౌలింగ్‌పైనే కాకుండా బ్యాటింగ్‌లోనూ తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరముంది. ప్రధానంగా గత టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాళ్లను న్యూజిలాండ్ స్పిన్నర్ సాంట్నర్ వణికించిన చోట... అశ్విన్–జడేజా జోడీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లోపాలను అధిగమించకపోతే టీమిండియా మూడో టెస్టులోనూ పరాభవం మూటగట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కేన్ విలియమ్సన్ వంటి కీలక ఆటగాడు లేకుండానే భారత్‌పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ ఇదే జోరు చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కెపె్టన్ లాథమ్ నిలకడగా రాణిస్తుండగా... ఫిలిప్స్, మిచెల్ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తే న్యూజిలాండ్‌కు ఈ టెస్టులోనూ తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో సౌతీ, ఒరూర్కీ, హెన్రీ, సాంట్నర్ విజృంభిస్తే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు. జోరుగా సాధన తొలి రెండు టెస్టుల్లో ప్రభావం చూపలేకపోయిన టీమిండియా... కివీస్‌తో మూడో టెస్టుకు ముందు జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. వాంఖడే పిచ్ స్పిన్‌కు సహకరించే అవకాశం ఉండటంతో స్పిన్నర్లను ఎదుర్కోవడంపై మన ప్లేయర్లు దృష్టి సారించారు. రోహిత్ శర్మ, కోహ్లితో పాటు ప్లేయర్లందరూ సాధనలో పాల్గొన్నారు. -
మూడో టెస్టుకు హర్షిత్
ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టెస్టు కోసం పేస్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. బుధవారం అతను జట్టుతో చేరతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ట్రావెలింగ్ రిజర్వ్‌లలో ఢిల్లీకి చెందిన హర్షిత్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రధాన జట్టులోకి రానున్నాడని సమాచారం. నవంబర్ 1 నుంచి భారత్, కివీస్ మధ్య మూడో టెస్టు వాంఖెడే మైదానంలో జరుగుతుంది. హర్షిత్‌కు ఇప్పటికే బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఆ్రస్టేలియాకు వెళ్లే భారత టెస్టు టీమ్‌లో చోటు లభించింది. దానికి ముందు ఒక టెస్టులో అతడిని ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.కివీస్‌తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో మూడో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే హర్షిత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టవచ్చు. బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లకు ఎంపికైనా... హర్షిత్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మంగళవారం అస్సాంతో ముగిసిన రంజీ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన హర్షిత్...ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 24.00 సగటుతో రాణా 43 వికెట్లు పడగొట్టాడు. విలియమ్సన్ దూరం వెలింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేని అతను ఇప్పుడు మూడో టెస్టునుంచి తప్పుకున్నాడు. విలియమ్సన్ భారత్‌కు రావడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గాయం నుంచి కోలుకొని అతను ప్రస్తుతం రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్తగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.సంచలన ప్రదర్శనతో కివీస్ ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో హడావిడిగా విలియమ్సన్‌ను బరిలోకి దించరాదని బోర్డు భావించింది. ఈ సిరీస్ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. దాని కోసం విలియమ్సన్ పూర్తి స్థాయిలో ఫిట్‌గా అందుబాటులో ఉండాలనేదే ప్రధాన కారణం. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన తర్వాత స్వదేశానికి వెళ్లిన విలియమ్సన్ గాయం కారణంగా భారత గడ్డపై అడుగు పెట్టనే లేదు. -
సిరీస్ నీదా నాదా!
రావల్పిండి: పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి నుంచి నిర్ణయాత్మక మూడో టెస్టు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గగా... గురువారం నుంచి రావల్పిండిలో మూడో టెస్టు మొదలవుతుంది. పరుగుల వరద పారిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు... స్పిన్‌కు అనుకూలించిన రెండో టెస్టులో పరాజయం పాలైంది. దీంతో మూడో టెస్టు కోసం పాకిస్తాన్ జట్టు మరోసారి స్పిన్ పిచ్‌నే సిద్ధం చేసింది. స్లో బౌలర్లకు సహకరించే విధంగా పొడి వికెట్‌ను తయారు చేసిన పాకిస్తాన్ గత నాలుగు రోజులుగా పిచ్‌ను ఆరబెట్టేందుకు ప్రత్యేకంగా భారీ ఫ్యాన్లు ఏర్పాటు చేసింది. రెండో టెస్టులో పాకిస్తాన్ స్పిన్నర్లు నోమాన్ అలీ, సాజిద్ ఖాన్ ఇద్దరే చెలరేగి ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్ చేసి 20 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్న నేపథ్యంలో... మరోసారి స్పిన్ బలంతోనే పాకిస్తాన్ ఫలితం రాబట్టాలని చూస్తోంది. తొలి రోజు నుంచే బంతి గింగిరాలు తిరిగే అవకాశం ఉండటంతో మరోసారి టాస్ కీలకం కానుంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి... వారి స్థానంలో ఇతర ప్లేయర్లకు అవకాశం ఇచ్చిన తర్వాతే పాకిస్తాన్ రాత మారింది. అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్న కమ్రాన్ గులామ్‌పై అంచనాలు పెరిగిపోగా..కెప్టెన్ షాన్ మసూద్, అబ్దుల్లా షఫీఖ్, సౌద్ షకీల్, రిజ్వాన్ కలిసి కట్టుగా కదం తొక్కాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ అదనపు స్పిన్నర్‌గా లెగ్‌స్పిన్నర్ రేహాన్ అహ్మద్‌ను బరిలోకి దించనుంది. తొలి టెస్టులో ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్‌తో పాటు జో రూట్, ఓలీ పోప్, బెన్ డకెట్, జాక్ క్రాలీ, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. -
ఆడింది ఏడు టెస్ట్‌లే.. దిగ్గజ ఆటగాడి సరసన చోటు
టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం మార్మోగిపోతుంది. క్రికెట్‌కు సంబంధించి ఎక్కడ డిస్కషన్ జరిగినా ఇతగాడి పేరే వినిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాట్లకతీతంగా పరుగుల వరద పారిస్తూ, సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్న యశస్వి.. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో విరుచుకుపడి భారత క్రికెట్ అభిమానుల పాలిట ఆరాధ్య ఆటగాడిగా మారిపోయాడు. ఈ డబుల్‌తో యశస్వి క్రేజ్ ఒక్కసారిగా తారా స్థాయికి చేరింది. భారత క్రికెట్ సర్కిల్స్‌లో ఇతను ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు. అతడు ఆడింది ఏడు టెస్ట్ మ్యాచ్‌లే అయినా.. 100 టెస్ట్‌ల అనంతరం లభించే పేరును సంపాదించాడు. రాజ్‌కోట్ టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చాలా రికార్డులను బద్దలు కొట్టిన యశస్వి.. రెండు భారీ రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్‌కోట్ టెస్ట్‌కు ముందు జరిగిన విశాఖ టెస్ట్‌లోనూ డబుల్ సెంచరీ చేసిన యశస్వి.. దిగ్గజ ఆటగాడు, తన ఆరాధ్య క్రికెటర్ అయిన విరాట్ కోహ్లి సరసన చేరాడు. వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లి తర్వాత వరుస టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అలాగే వినూ మన్కడ్, విరాట్ కోహ్లి తర్వాత ఒకే సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రాజ్‌కోట్ టెస్ట్ డబుల్‌తో యశస్వి సాధించిన మరిన్ని రికార్డులు.. ►టెస్టుల్లో ఇంగ్లండ్‌పై రెండు డబుల్ సెంచరీలు సాధించిన మొదటి భారత బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ►అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ రికార్డును యశస్వి సమం చేశాడు. మూడో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ ఏకంగా 12 సిక్స్‌లు బాదాడు. 1996లో జింబాబ్వేపై వసీం అక్రమ్ కూడా 12 సిక్స్‌లు కొట్టాడు. ►భారత్ తరపున ఒక ఇన్నింగ్స్‌లో 10కిపైగా సిక్స్‌లు బాదిన మొదటి బ్యాటర్‌గా జైశ్వాల్ నిలిచాడు. ►టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాటర్‌గా జైస్వాల్ రికార్డులకెక్కాడు. ►సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ► ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు (545) సాధించిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా రికార్డు. ఇదిలా ఉంటే, రాజ్‌కోట్ టెస్ట్‌లో టీమిండియా 434 పరుగులు భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి అజేయ డబుల్ సెంచరీతో (214 నాటౌట్) విశ్వరూపం ప్రదర్శించాడు. దీనికి ముందు టెస్ట్‌లోనూ యశస్వి డబుల్‌తో చెలరేగాడు. వైజాగ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 209 పరుగులు చేశాడు. రాజ్‌కోట్ టెస్ట్‌లో విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుంది. -
434 పరుగుల తేడాతో...
విరామం తర్వాత మళ్లీ తాజాగా మొదలైన మూడో టెస్టులో యశస్వి జైస్వాల్ విధ్వంసం... కొత్త కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ ప్రతాపం... బౌలింగ్‌లో జడేజా మాయాజాలం... వెరసి భారత్ చరిత్రకెక్కే విజయం సాధించింది. మ్యాచ్ మొదలైన రోజు నుంచీ ప్రతీరోజు భారత్ ఆధిపత్యమే కొనసాగడంతో ఏ మలుపు లేకుండా ఈ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. రాజ్‌కోట్: టీమిండియా బలగం ముందు ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ ఆట కుదేలైంది. మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటర్ల పరుగుల పరాక్రమం, బౌలర్ల వికెట్ల మాయాజాలం ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. మరో రోజు ఆట మిగిలి ఉండగానే ఈ మ్యాచ్‌లో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై బ్రహ్మాండ విజయం నమోదు చేసింది. పరుగుల తేడా పరంగా టెస్టుల్లో భారత జట్టుకిదే అతి పెద్ద విజయం. ఇంతకుముందు భారత జట్టు 2021లో ముంబైలో న్యూజిలాండ్‌పై 372 పరుగుల తేడాతో గెలిచింది. ఆట నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 196/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 98 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్‌కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (5/41), కుల్దీప్ యాదవ్ (2/19), అశ్విన్ (1/19) స్పిన్ దెబ్బకు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. యశస్వి ‘డబుల్’... ఓవర్‌నైట్ బ్యాటర్లు శుబ్‌మన్ గిల్ (91; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుల్దీప్ (27; 3 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. గిల్ రనౌటయ్యాక శనివారం వెన్నునొప్పితో వ్యక్తిగత స్కోరు 104 పరుగులవద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి జైస్వాల్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అదే దూకుడు కొనసాగిస్తూ యశస్వి జైస్వాల్ (236 బంతుల్లో 214 నాటౌట్; 14 ఫోర్లు, 12 సిక్స్‌లు) తన కెరీర్లో రెండో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ (72 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుత టెస్టు క్రికెట్లోనే విశేషానుభవజు్ఞడు అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 85వ ఓవర్లో యశస్వి హ్యాట్రిక్ సిక్సర్లు అతని విధ్వంసానికి మచ్చుతునకలు కాగా... సర్ఫరాజ్ అంతర్జాతీయ టెస్టుకు కొత్తైన... దూకుడు నాకు పాతే అని మరో అర్ధసెంచరీతో నిరూపించుకున్నాడు. 231 బంతుల్లో జైస్వాల్ ద్విశతకాన్ని సాధించాడు. ఇద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 172 జోడించడం విశేషం. స్పిన్ ఉచ్చులో పడి... కొండత లక్ష్యం కావడంతో ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆట చేతులెత్తేసింది. కలిసొచ్చిన స్పిన్ పిచ్‌పై జడేజా పట్టు సాధించాడు. ఆరంభంలోనే డకెట్ (4) రనౌటయ్యాక, క్రాలీ (11)ని బుమ్రా ఎల్బీగా పంపాడు. తర్వాత జడేజా స్పిన్ మాయాజాలంలో పోప్ (3), బెయిర్‌స్టో (4), రూట్ (7) తేలిగ్గానే పడిపోయారు. జట్టు స్కోరు 50 వద్దే రూట్‌తో పాటు స్టోక్స్ (15), రేహాన్ అహ్మద్ (0) అవుటయ్యారు. మార్క్ వుడ్ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ కావడంతో ఇంగ్లండ్ 100 పరుగులు దాటింది. అత్యవసర వ్యక్తిగత కారణాలరీత్యా రెండో రోజు ఆట ముగిశాక చెన్నై వెళ్లిన అశ్విన్ ఆదివారం మైదానంలోకి దిగి ఒక వికెట్ కూడా తీశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 445; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319; భారత్ రెండో ఇన్నింగ్స్: 430/4 డిక్లేర్డ్. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 11. డకెట్ (రనౌట్) 4; పోప్ (సి) రోహిత్ (బి) జడేజా 3; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 7; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 4; స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 15; ఫోక్స్ (సి) జురేల్ (బి) జడేజా 16; రేహన్ (సి) సిరాజ్ (బి) కుల్దీప్ 0; హార్ట్లీ (బి) అశ్విన్ 16; వుడ్ (సి) జైస్వాల్ (బి) జడేజా 33; అండర్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (39.4 ఓవర్లలో ఆలౌట్) 122. వికెట్ల పతనం: 1–15, 2–18, 3–20, 4–28, 5–50, 6–50, 7–50, 8–82, 9–91, 10–122. బౌలింగ్: బుమ్రా 8–1– 18–1, సిరాజ్ 5–2–16–0, జడేజా 12.4–4– 41–5, కుల్దీప్ 8–2–19–2, అశ్విన్ 6–3–19–1. 3 వరుస టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు బాదిన మూడో భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్. ఈ వరుసలో వినోద్ కాంబ్లి (1993లో), కోహ్లి (2017లో) ముందున్నారు. 9 స్వదేశంలో జడేజా అందుకున్న ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుల సంఖ్య. అనిల్ కుంబ్లే (9) పేరిట ఉన్న రికార్డును జడేజా సమం చేశాడు. 12 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా అక్రమ్ (12 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డును జైస్వాల్ సమం చేశాడు. 28 రాజ్‌కోట్ టెస్టులో భారత్ సిక్స్‌ల సంఖ్య. ఒకే టెస్టులో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా 2019లో వైజాగ్‌లో దక్షిణాఫ్రికాపై నమోదు చేసిన రికార్డును భారత్ సవరించింది. 48 ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భారత జట్టు బాదిన సిక్స్‌లు. ఇదో కొత్త రికార్డు. దక్షిణాఫ్రికాపై 2019లో భారత్ 47 సిక్స్‌లు కొట్టింది. -
ఆండర్సన్పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. సెంచరీ అనంతరం నిన్న రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి ఇవాళ తిరిగి బరిలోకి దిగిన యశస్వి మెరుపు వేగంతో పరుగులు సాధిస్తున్నాడు. ప్రస్తుతం 187 పరుగుల వద్ద ఉన్న యశస్వి.. వెటరన్ పేసర్ ఆండర్సన్పై కనికరం లేకుండా విచుకుపడ్డాడు. నాలుగో రోజు ఆటలో లంచ్ విరామం తర్వాత గేర్ మార్చిన అతను.. ఇన్నింగ్స్ 85వ ఓవర్లో ఆండర్సన్‌కు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది 180ల్లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు. 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 సౌరవ్ గంగూలీ తర్వాత మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో 500 పరుగులు దాటిన రెండో భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2007లో స్వదేశంలో పాక్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గంగూలీ 534 పరుగులు సాధించాడు. ఓ ఇన్నింగ్స్‌లో, ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుత ఇన్నింగ్స్‌లో యశస్వి ఇప్పటివరకు 10 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్‌లో అతను 20 సిక్సర్లు కొట్టాడు. యశస్వికి ముందు టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్ శర్మ (19) పేరిట ఉండేది. ఆండర్సన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు బాది ఈ ఘనత సాధించిన ఐదో భారత ప్లేయర్‌గా (2002 తర్వాత) రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి ముందు ధోని (రెండు సార్లు), హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ఈ ఘనత సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. యశస్వికి (194) జతగా సర్ఫరాజ్ ఖాన్ (38) క్రీజ్‌లో ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 378/4గా ఉంది. ప్రస్తుతం టీమిండియా 504 పరుగుల లీడ్‌లో ఉంది. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) -
టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడొచ్చేస్తున్నాడు
టీమిండియాకు గుడ్ న్యూస్. తల్లి అనారోగ్య సమస్య కారణంగా మ్యాచ్ మధ్యలోనే చెన్నైకి వెళ్లిపోయిన రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టులో చేరనున్నాడు. యాష్ ఇవాళ (ఫిబ్రవరి 18) లంచ్ విరామం సమయానికంతా జట్టుతో జతకడతాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. కాగా, తల్లిని చూసేందుకు హుటాహుటిన ఇంటికి బయల్దేరిన అశ్విన్‌కు బీసీసీఐ మద్దతుగా నిలిచింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం తమకెంతో ముఖ్యమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే, మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 383 పరుగుల లీడ్‌లో ఉంది. ఇవాల్టి ఆటలో కుల్దీప్ తప్పిదం కారణంగా శుభ్‌మన్ గిల్ (91) అనవసరంగా రనౌటయ్యాడు. గాయం కారణంగా నిన్న రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి ఇవాళ తిరిగి క్రీజ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం యశస్వి (114), కుల్దీప్ (27) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే వికెట్ తీయడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) భారత్ సెకెండ్ ఇన్నింగ్స్: 257/3 (యశస్వి 115 నాటౌట్) -
IND VS ENG 3rd Test Day 4: రాజ్‌కోట్ టెస్టులో భారత్ ఘన విజయం..
IND VS ENG 3rd Test Day 4 Updates And Highlights: రాజ్‌కోట్ టెస్టులో భారత్ ఘన విజయం.. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల దాటికి.. కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. ఒక్క వికెట్ దూరంలో.. రాజ్‌కోట్ టెస్టులో విజయానికి భారత్ కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. వరుస క్రమంలో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఫోక్స్ ఔట్ కాగా.. అశ్విన్ బౌలింగ్‌లో హార్ట్లీ పెవిలియన్‌కు చేరాడు. ఓటమి దిశగా ఇంగ్లండ్.. ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. రెహాన్ అహ్మద్ రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 53/7 విజయం దిశగా భారత్.. రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా విజయం వైపు అడుగులు వేస్తోంది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ విజయానికి కేవలం 4 వికెట్ల దూరంలో నిలిచింది. ఐదో వికెట్ డౌన్.. జో రూట్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రూట్.. జడేజా బౌలింగ్‌లో రూట్ ఎల్బీగా వెనుదిరిగాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 50/5. క్రీజులో బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జడేజా బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో.. నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 519 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. 20 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఓలీ పోప్.. జడేజా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 24/3 రెండో వికెట్ డౌన్.. జాక్ క్రాలే రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన క్రాలే.. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ బెన్ డకెట్(4) రనౌటయ్యాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు.7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 18/1 ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్ భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను 430/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. టీమిండియా.. ఇంగ్లండ్‌కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ 214, సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులతో అజేయంగా నిలిచారు. మరో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్.. మూడో టెస్ట్‌లో మరో డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ డబుల్‌ను యశస్వి 231 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 411/3గా ఉంది. లీడ్ 537 పరుగులుగా ఉంది. మరో హాఫ్ సెంచరీ చేసిన సర్పరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల వద్ద పొరపాటున రనౌటైన సర్ఫరాజ్ ఖాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 66 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్.. 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో డబుల్ దిశగా దూసుకుపోతున్న యశస్వి భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో డబుల్ సెంచరీ దిశగా దూసకుపోతున్నాడు. నిన్న రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి ఇవాళ తిరిగి బరిలోకి దిగిన యశస్వి.. ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం యశస్వి 182 పరుగుల వద్ద ఉన్నాడు. అతనికి జతగా సర్ఫరాజ్ ఖాన్ (33) క్రీజ్‌లో ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 359/4గా ఉంది. 440 పరుగుల ఆధిక్యంలో టీమిండియా నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా ఆధిక్యం 440 పరగులుగా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (149), సర్ఫరాజ్ ఖాన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 258 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (27) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ (115), సర్ఫరాజ్ ఖాన్ క్రీజ్‌లో ఉన్నారు. 91 పరుగుల వద్ద ఔటైన శుభ్‌మన్ గిల్ శుభ్‌మన్ గిల్ సెంచరీకి చేరువలో (91) రనౌటాయ్యడు. కుల్దీప్ తప్పిదం కారణంగా గిల్ ఔటయ్యాడు. నిన్న రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి (107) క్రీజ్‌లోకి వచ్చాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 192/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (65), కుల్దీప్ యాదవ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 322 పరుగుల లీడ్‌లో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ అద్బుతమైన సెంచరీతో (107) ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ (19), రజత్ పాటిదార్ (0) నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ సెంచరీ అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) -
డకెట్ ధనాధన్...
35 ఓవర్లలో 5.91 రన్‌రేట్‌తో 207 పరుగులు. పిచ్‌ను, ప్రత్యర్థిని లక్ష్య పెట్టకుండా ఇంగ్లండ్ మూడో టెస్టులోనూ తమ ‘బజ్‌బాల్’ మంత్రాన్ని చూపించింది. ఫలితంగా 445 పరుగుల భారీ స్కోరు కూడా భారత్‌కు సురక్షితం కాదనిపిస్తోంది. భారత గడ్డపై ఒక విదేశీ బ్యాటర్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలిచిపోయే శతకంతో ఓపెనర్ బెన్ డకెట్ చెలరేగాడు. దాంతో రెండు రోజుల ఆట తర్వాత రాజ్‌కోట్ టెస్టు సమంగా నిలిచింది. అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడం శుక్రవారం ఆటలో గుర్తుంచుకోదగ్గ మరో హైలైట్. మూడో రోజు ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు ఎలా నిలువరిస్తారన్నదే ఆసక్తికరం. రాజ్‌కోట్: భారత్‌తో మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్ డకెట్ (118 బంతుల్లో 133 బ్యాటింగ్; 21 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో సత్తా చాటాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 326/5తో ఆట కొనసాగించిన భారత్ 445 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ్ జురేల్ (46), అశ్విన్ (37) ఎనిమిదో వికెట్‌కు 77 పరుగులు జత చేశారు. ఇంగ్లండ్ మరో 238 పరుగులు వెనుకబడి ఉంది. కీలక భాగస్వామ్యం... రెండో రోజు ఆరంభంలోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో ఐదు పరుగులు జోడించగానే ఒకే స్కోరు వద్ద కుల్దీప్ (4), జడేజా (112) వెనుదిరిగారు. ఈ దశలో అశ్విన్, జురేల్ భాగస్వామ్యం భారత్‌ను 400 పరుగులు దాటించింది. అశ్విన్ జాగ్రత్తగా ఆడగా, అరంగేట్ర ఆటగాడు జురేల్ కొన్ని దూకుడైన షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో అతను అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ భాగస్వామ్యం తర్వాత చివర్లో బుమ్రా (28 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని విలువైన పరుగులు జోడించాడు. శుక్రవారం 44.5 ఓవర్లు ఆడిన భారత్ మరో 119 పరుగులు జత చేసింది. దూకుడే దూకుడు... ఇన్నింగ్స్ ఆరంభంలో డకెట్ కాస్త తడబడ్డాడు. కానీ బుమ్రా వేసిన ఐదో ఓవర్లో రెండు ఫోర్లతో ధాటిని మొదలు పెట్టిన అతను ఏ బౌలర్‌నూ వదలకుండా చివరి వరకు దూకుడు కొనసాగించాడు. సెంచరీ వరకు కూడా ఒక్క తప్పుడు షాట్ లేకుండా అతని ఇన్నింగ్స్ అద్భుతమైన స్ట్రోక్‌లతో దూసుకెళ్లింది. టీ తర్వాత తొలి ఓవర్‌నుంచి స్పిన్నర్ కుల్దీప్తో బౌలింగ్ వేయించిన ప్రణాళిక ఫలించలేదు. కుల్దీప్ తొలి 4 ఓవర్లలో డకెట్ స్వీప్, రివర్స్ స్వీప్‌లతో 7 ఫోర్లు బాదడం విశేషం. సిరాజ్ ఓవర్లో కొట్టిన రెండు ఫోర్లతో 39 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్‌లో దాదాపు ప్రేక్షక పాత్రకే పరిమితమైన క్రాలీ (15)ని అవుట్ చేసి ఎట్టకేలకు అశ్విన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాత వచ్చి న ఒలీ పోప్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఇంగ్లండ్ జోరును కొనసాగించాడు. అశ్విన్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 కొట్టి 90ల్లోకి చేరుకున్న డకెట్... సిరాజ్ ఓవర్లో బౌండరీతో 88 బంతుల్లోనే కెరీర్లో మూడో శతకాన్ని అందుకున్నాడు. చివరకు సిరాజ్ చక్కటి బంతికి పోప్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఐదు పరుగులు పెనాల్టీ... భారత బ్యాటర్లు నిబంధనలకు విరుద్ధంగా పిచ్‌పై పరుగెత్తడంతో అంపైర్లు చర్య తీసుకున్నారు. తొలి రోజు ఆటలో జడేజాను ఈ విషయంపై అంపైర్లు హెచ్చరించగా... రెండో రోజు అశ్విన్ కూడా అలాగే చేయడంతో భారత ఇన్నింగ్స్ 102వ ఓవర్లో 5 పరుగులు పెనాల్టిగా విధించారు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 5/0తో మొదలైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) రూట్ (బి) వుడ్ 10; రోహిత్ (సి) స్టోక్స్ (బి) వుడ్ 131; గిల్ (సి) ఫోక్స్ (బి) వుడ్ 0; పటిదార్ (సి) డకెట్ (బి) హార్ట్లీ 5; జడేజా (సి) అండ్ (బి) రూట్ 112; సర్ఫరాజ్ (రనౌట్) 62; కుల్దీప్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 4; జురేల్ (సి) ఫోక్స్ (బి) రేహన్ 46; అశ్విన్ (సి) అండర్సన్ (బి) రేహన్ 37; బుమ్రా (ఎల్బీ) (బి) వుడ్ 26; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (130.5 ఓవర్లలో ఆలౌట్) 445. వికెట్ల పతనం: 1–22, 2–24, 3–33, 4–237, 5–314, 6–331, 7–331, 8–408, 9–415, 10–445. బౌలింగ్: అండర్సన్ 25–7–61–1, వుడ్ 27.5–2– 114–4, హార్ట్లీ 40–7–109–1, రూట్ 16–3– 70–1, రేహన్ 22–2–85–2. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాసీ (సి) పటిదార్ (బి) అశ్విన్ 15; డకెట్ (బ్యాటింగ్) 133; పోప్ (ఎల్బీ) (బి) సిరాజ్ 39; రూట్ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (35 ఓవర్లలో 2 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–89, 2–182. బౌలింగ్: బుమ్రా 8–0–34–0, సిరాజ్ 10–1–54–1, కుల్దీప్ యాదవ్ 6–1–42–0, అశ్విన్ 7–0–37–1, జడేజా 4–0–33–0. అశ్విన్ @ 500 ఇంగ్లండ్ ఓపెనర్ క్రాలీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తన 98వ టెస్టులో ఈ ఘనత సాధించిన అశ్విన్... ఓవరాల్‌గా 9వ ఆటగాడిగా, అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. మ్యాచ్‌లు, బంతుల పరంగా చూస్తే... అత్యంత వేగంగా 500 వికెట్ల మార్క్‌ను చేరిన బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో నిలవడం విశేషం. 2011లో విండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన అశ్విన్ ఇప్పటి వరకు ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు 24 సార్లు... ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 34 సార్లు... మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు 8 సార్లు తీశాడు. టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్ రాజ్‌కోట్ టెస్టులో అనూహ్య పరిణామం సంభవించింది. తన కుటుంబంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అశ్విన్ మూడో టెస్టు నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. -
చెత్త రికార్డు.. అనిల్ కుంబ్లేను అధిగమించిన ఆండర్సన్
రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అనవరమైన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా అవతరించాడు. ఈ చెత్త రికార్డును ఆండర్సన్.. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఖాతాలో నుంచి లాగేసుకున్నాడు. 2008లో రిటైరైన కుంబ్లే 132 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 18, 355 పరుగులు సమర్పించుకోగా.. ఆండర్సన్ తన 185వ టెస్ట్‌లో కుంబ్లే రికార్డును అధిగమించాడు (18, 371). ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ మూడో స్థానంలో (133 టెస్ట్‌ల్లో 18180 పరుగులు) ఉండగా.. ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ (17995), ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (16719) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 41 ఏళ్ల ఆండర్సన్ ప్రస్తుతం 696 వికెట్లతో టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇదే మ్యాచ్‌లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు వేసిన ఆండర్సన్ 61 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) అనంతరం ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనితో పాటు జో రూట్ (9) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (15), ఓలీ పోప్ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్ అశ్విన్‌కు దక్కగా.. పోప్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో మెరిశారు. -
శతక్కొట్టిన డకెట్.. భారత్‌కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
రాజ్‌కోట్ టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్.. టీమిండియాకు ధీటుగా బదులిస్తుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. డకెట్‌తో పాటు జో రూట్ (9) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (15), ఓలీ పోప్ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్ అశ్విన్‌కు దక్కగా.. పోప్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఓవర్‌నైట్ స్కోర్ 326/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 119 పరుగులు జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్, సెంచరీ హీరో రవీంద్ర జడేజా తన వ్యక్తిగత స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి 112 పరుగుల వద్ద ఔట్ కాగా.. మరో ఓవర్‌నైట్ ఆటగాడు కుల్దీప్ తన స్కోర్ మరో 3 పరుగులు జోడించి 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇవాళ క్రీజ్‌లో వచ్చిన అరంగేట్ర బ్యాటర్ దృవ్ జురెల్ 46 పరుగులు, అశ్విన్ 37, బుమ్రా 26 పరుగులు చేసి ఔటయ్యారు. సిరాజ్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆఖర్లో బుమ్రా బ్యాట్ ఝులిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4, రెహాన్ అహ్మద్ 2, జేమ్స్ ఆండర్సన్, టామ్ హార్ట్లీ, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఆటలో జాక్ క్రాలేను ఔట్ చేయడం ద్వారా భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్లో చేరాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. -
శతకాలతో శుభారంభం
బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌పై టాస్ గెలిచిన భారత్ ఒక దశలో 33/3 స్కోరు వద్ద నిలిచింది. ఈ స్థితిలో రోహిత్, జడేజా 204 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే గురువారం ఆటలో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆటగాడు మాత్రం సర్ఫరాజ్ ఖాన్. సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ తన అవకాశం కోసం ఎదురు చూస్తున్న అతను ఎట్టకేలకు భావోద్వేగాల నడుమ భారత క్రికెటర్‌గా అరంగేట్రం చేశాడు. అంచనాలకు తగినట్లుగా చూడచక్కటి షాట్లతో అలవోకగా అర్ధ సెంచరీని అందుకున్నాడు. జోరు మీదున్న దశలో దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగినా...తానేంటో అతను నిరూపించుకున్నాడు. ఇక మిగిలిన ఐదు వికెట్లతో రెండో రోజు భారత్ ఇంకా ఎన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం. రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో భారత్‌కు శుభారంభం లభించింది. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (196 బంతుల్లో 131; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (212 బంతుల్లో 110 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించగా... సర్ఫరాజ్ ఖాన్ (66 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. ద్విశతక భాగస్వామ్యం... అండర్సన్ వేసిన మ్యాచ్ తొలి బంతిని యశస్వి (10) ఫోర్‌గా మలచడంలో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అయితే వుడ్ జోరులో భారత్ రెండు పరుగుల తేడాతో యశస్వి, గిల్ (0) వికెట్లు కోల్పోయింది. హార్ట్లీ బంతిని ఆడలేక రజత్ పటిదార్ (5) కూడా సునాయాస క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో సర్ఫరాజ్ వస్తే ఒత్తిడిలో మరో వికెట్ పోయేదేమో! కానీ జట్టు వ్యూహాత్మకంగా కుడి, ఎడమ కాంబినేషన్ కోసం ఐదో స్థానంలో జడేజాను పంపించడం అద్భుతంగా పని చేసింది. రోహిత్, జడేజా కలిసి జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. 29 పరుగుల వద్ద స్లిప్‌లో రూట్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్ లంచ్‌కు ముందు 71 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరామం తర్వాత పూర్తిగా భారత్ హవా సాగింది. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రోహిత్, జడేజా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. 97 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ సెషన్లో భారత్ 27 ఓవర్లలో 92 పరుగులు చేసింది. ఈ జోడీని విడదీయలేక ఇంగ్లండ్ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ సిరీస్‌లో ఒక్క వికెట్ కూడా పడని తొలి సెషన్ ఇదే కావడం విశేషం. టీ తర్వాత తొలి ఓవర్లోనే రోహిత్ 157 బంతుల్లో తన కెరీర్లో 11వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పార్ట్నర్íÙప్ 200 పరుగులు దాటాక ఎట్టకేలకు ఇంగ్లండ్‌కు వికెట్ దక్కింది. షార్ట్ బంతులకు వరుసగా పరుగులు రాబట్టిన రోహిత్ చివరకు అదే షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. సర్ఫరాజ్ రనౌట్... కొత్త ఆటగాడు సర్ఫరాజ్, జడేజా భాగస్వామ్యం జట్టును నడిపించింది. ముఖ్యంగా తన కెరీర్ తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్వీప్, లాఫ్టెడ్ షాట్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. సర్ఫరాజ్ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు జడేజా స్కోరు 84 కాగా... సర్ఫరాజ్ వెనుదిరిగే సమయానికి 99 మాత్రమే! 77 పరుగుల ఈ ఐదో వికెట్ భాగస్వామ్యంలో జడేజా 15 పరుగులు చేయగా, సర్ఫరాజ్ 62 పరుగులు చేశాడంటేనే అతని జోరు అర్థమవుతుంది. 93 పరుగుల వద్ద హార్ట్లీ బంతి జడేజా ప్యాడ్‌ను ముందుగా తగిలినా... ఇంగ్లండ్ బలంగా అప్పీల్ చేయలేదు. రీప్లేలో అతను అవుటయ్యేవాడని తేలింది! ధాటిగా ఆడిన సర్ఫరాజ్ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ జడేజాతో సమన్వయ లోపం అతని ఆటను ముగించింది. జడేజా 99 వద్ద అండర్సన్ బౌలింగ్‌లో సింగిల్ కోసం ముందుకు వచ్చి మళ్లీ వెనక్కి తగ్గాడు. అప్పటికే ముందుకు వెళ్లిన సర్ఫరాజ్ వెనక్కి వచ్చేలోగా వుడ్ డైరెక్ట్ హిట్ వికెట్లను తాకింది. తర్వాతి బంతికే సింగిల్‌తో జడేజా టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తయింది. భావోద్వేగ క్షణాలు... రాజ్‌కోట్ టెస్టు ద్వారా ఇద్దరు ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. సర్ఫరాజ్‌కు అనిల్ కుంబ్లే, జురేల్‌కు దినేశ్ కార్తీక్ టెస్టు క్యాప్‌లు అందించారు. రెండేళ్ల వ్యవధిలో 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల తర్వాత అవకాశం లభించిన వికెట్ కీపర్ జురేల్‌తో పోలిస్తే సర్ఫరాజ్ ప్రస్థానం భావోద్వేగభరితమైంది. అందుకే మ్యాచ్‌కు ముందు మైదానంలో అలాంటి దృశ్యాలు కనిపించాయి. ఎనిమిదేళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో దేశవాళీలో 70 సగటుతో భారీగా పరుగులు సాధించిన సర్ఫరాజ్ భారత్ తరఫున ఆడేందుకు ఎంతో కాలంగా ఎదురు చూశాడు. పలుమార్లు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. అందుకే అరంగేట్రం ఖాయమైన క్షణాన కోచ్, మెంటార్ అయిన తండ్రి నౌషాద్ ఖాన్ తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. చిన్నప్పటినుంచి అన్నీ తానే అయి సర్ఫరాజ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దిన ఆయన టెస్టు క్యాప్‌ను ముద్దాడి తన కొడుకును హత్తుకున్నాడు. సర్ఫరాజ్ అర్ధసెంచరీ పూర్తయినప్పుడు అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. జడేజా కూడా ఆట ముగిసిన తర్వాత రనౌట్‌లో తనదే తప్పంటూ బాధపడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు! స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) రూట్ (బి) వుడ్ 10; రోహిత్ (సి) స్టోక్స్ (బి) వుడ్ 131; గిల్ (సి) ఫోక్స్ (బి) వుడ్ 0; పటిదార్ (సి) డకెట్ (బి) హార్ట్లీ 5; జడేజా (బ్యాటింగ్) 110; సర్ఫరాజ్ (రనౌట్) 62; కుల్దీప్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (86 ఓవర్లలో 5 వికెట్లకు) 326. వికెట్ల పతనం: 1–22, 2–24, 3–33, 4–237, 5–314. బౌలింగ్: అండర్సన్ 19–5–51–0, వుడ్ 17–2–69–3, హార్ట్లీ 23–3–81–1, రూట్ 13–1–68–0, రేహన్ 14–0–53–0. -
రోహిత్, జడ్డూ శతకాలు.. మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న సర్ఫరాజ్
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (110 నాటౌట్) బాధ్యతాయుతమైన సెంచరీలు చేసి భారత జట్టును ఆదుకున్నారు. వీరికి అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్దశతకం తోడైంది. ఈ ముగ్గురు కలిసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులుగా ఉంది. యువ బ్యాటర్లు, రెండో టెస్ట్ హీరోలు యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0) నిరాశపరిచారు. మరో యువ ఆటగాడు రజత్ పాటిదార్ (5) అందివచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నాడు. జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ (1) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, టామ్ హార్ల్టీ ఓ వికెట్ పడగొట్టగా.. సర్ఫరాజ్ ఖాన్ రనౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హిట్‌మ్యాన్ షో.. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన సెంచరీతో ఆదుకున్నాడు. హిట్‌మ్యాన్ 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి ఔటయ్యాడు. రోహిత్ చాలాకాలం తర్వాత టెస్ట్‌ల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికిది 11వ టెస్ట్ సెంచరీ. హిట్‌మ్యాన్ దాదాపు ఏడాది తర్వాత స్వదేశంలో టెస్ట్ సెంచరీ చేశాడు. రోహిత్ ఈ సెంచరీతో భారత్ తరఫున సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన సారధిగా రికార్డుల్లోకెక్కాడు. హిట్‌మ్యాన్ 36 ఏళ్ల 291 రోజుల వయసులో సెంచరీ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సర్ఫరాజ్ .. ఈ మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లోనే మెరుపు అర్దశతకం బాది ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాక ఆరో స్థానంలో బరిలోకి దిగిన సర్ఫరాజ్ కేవలం 48 బంతుల్లోనే అర్దసెంచరీ బాది అభిమానులకు కనువిందు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 7 ఫోర్లు, సిక్సర్ బాదాడు. దేశవాలీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉన్న సర్ఫరాజ్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకుని, తొలి ఇన్నింగ్స్‌లోనే తన మార్కు ప్రభావం చూపాడు. సర్ఫరాజ్‌కు దేశవాలీ క్రికెట్లో చిచ్చరపిడుగుగా పేరుంది. ఆ బిరదును సర్ఫరాజ్ తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే నిజం చేశాడు. సర్ఫరాజ్ క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి ఏమాత్రం బెరుకు లేకుండా షాట్లు ఆడి, అనుభవజ్ఞుడైన ఆటగాళ్లను తలపించాడు. జడ్డూ బాధ్యతాయుతమైన సెంచరీ.. జట్టు కష్టాల్లో (33/3) ఉన్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మతో జతకట్టిన జడ్డూ.. కెరీర్లో నాలుగో సెంచరీతో చెలరేగాడు. 198 బంతుల్లో 7 ఫోర్లు, 2స సిక్సర్ల సాయంతో సెంచరీ మార్కును తాకాడు. జడ్డూ బాధ్యతాయుతమైన సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా పటిష్ట స్థితికి చేరింది. జడ్డూ.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 234 పరుగులు జోడించాడు. పాపం సర్ఫరాజ్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఏ బెదురు లేకుండా యదేచ్చగా షాట్లు ఆడుతూ మెరుపు వేగంతో అర్దసెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్.. జడేజా చేసిన పొరపాటు కారణంగా రనౌటయ్యాడు. జడేజా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు లేని పరుగుకు కోసం సర్ఫరాజ్‌ను పిలిచి రనౌట్ చేయించాడు. సర్ఫరాజ్‌ను అనవసరంగా ఔట్ చేయించానన్న బాధలో జడేజా సెంచరీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. కోపంతో ఊగిపోయిన హిట్‌మ్యాన్.. జడేజా కారణంగా సర్ఫరాజ్ ఖాన్ అనవసరంగా రనౌట్ కావడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. క్యాప్‌ను నేలకేసి కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు. రోహిత్ కోపపడిన విధానాన్ని చూస్తే అతనికి సర్ఫరాజ్‌పై భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం అర్దమవుతుంది. -
భారత జట్టుకు రోహిత్ శర్మనే కెప్టెన్
తొమ్మిది రోజులు...భారత్, ఇంగ్లండ్ రెండో, మూడో టెస్టు మ్యాచ్‌ల మధ్య విరామం! చూస్తుంటే ఒక సిరీస్ 1–1తో ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగా మూడు టెస్టుల సిరీస్ మొదలవుతున్నట్లుగా అనిపిస్తోంది. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో కొత్త ఉత్సాహంతో, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగేందుకు ఇది పనికొచ్చింది. ఇప్పుడు సిరీస్‌లో ఆధిక్యం ప్రదర్శించేందుకు మరో పోరుకు రంగం సిద్ధమైంది. విరామం తర్వాత పైచేయి ఎవరిదనేది ఆసక్తికరం. రాజ్‌కోట్: టెస్టు సిరీస్‌లో 1–1తో సమంగా ఉన్న స్థితిలో మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లేందుకు భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. నేటినుంచి జరిగే మూడో టెస్టులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా...రెండో టెస్టులో భారత్‌కు భారీ విజయం దక్కింది. అయితే గత పర్యటనతో పోలిస్తే ఇంగ్లండ్ కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చగా...భారత్ కోణంలో చూస్తే అనూహ్యంగా గట్టి పోటీ ఎదురైంది. బుధవారం జరిగిన కార్యక్రమంలో రాజ్‌కోట్ మైదానాన్ని ‘నిరంజన్ షా స్టేడియం’గా బీసీసీఐ పేరు పెట్టింది. సర్ఫరాజ్ అరంగేట్రం! రెండో టెస్టుతో పోలిస్తే భారత తుది జట్టులో మార్పులు ఖాయమయ్యాయి. గాయంతో వైజాగ్ టెస్టుకు దూరమైన రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వస్తున్నాడు. తన సొంత మైదానంలో అతడు చెలరేగిపోతే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు. అయ్యర్‌పై వేటు పడటంతో అతని స్థానంలో బ్యాటర్‌గా సర్ఫరాజ్ ఖాన్‌కు తొలి అవకాశం దక్కవచ్చు. వికెట్ కీపర్‌గా ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్‌ను తప్పించి ధ్రువ్ జురేల్‌ను ఎంపిక చేయవచ్చని కూడా తెలుస్తోంది. అయితే జురేల్‌ను ఆడిస్తారా లేక భరత్‌కు చివరి చాన్స్ ఇస్తారా చూడాలి. మిడిలార్డర్లో అనుభవలేమి కనిపిస్తుండటంతో బ్యాటింగ్ భారం ప్రధానంగా టాప్–3పైనే ఉంది. గత మ్యాచ్‌లో జైస్వాల్ తానేంటో నిరూపించుకోగా, గిల్ కూడా కీలక సెంచరీ సాధించాడు. రోహిత్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇప్పుడైనా ఆడాల్సి ఉంది. బౌలింగ్‌లో అశ్విన్, కుల్దీప్లను ఇంగ్లండ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. బుమ్రా స్థాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముకేశ్ స్థానంలో సిరాజ్ వస్తాడు. ఇద్దరు పేసర్లతో... తొలి రెండు టెస్టుల్లో ఒకే ఒక పేసర్కే పరిమితమైన ఇంగ్లండ్ ఈ సారి వ్యూహం మార్చింది. రెండో పేసర్‌గా అండర్సన్‌తో పాటు వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్లలో హార్ట్లీ ఇప్పటికే సత్తా చాటగా, రేహన్ పర్వాలేదనిపించాడు. వుడ్ రాకతో ఆఫ్‌స్పిన్నర్ బషీర్‌పై వేటు పడింది. అయితే రూట్ ఆఫ్ స్పిన్ జట్టుకు అదనపు బలంగా మారింది కాబట్టి సమస్య ఉండకపోవచ్చు. ఓడినా, గెలిచినా ఆ జట్టు బ్యాటింగ్ శైలిలో మార్పు ఉండకపోవచ్చు. ఓపెనర్లు క్రాలీ, డకెట్‌లతో పాటు పాటు పోప్ దూకుడు కొనసాగిస్తున్నాడు. ఇంకా ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడని రూట్, బెయిర్‌స్టో రాణించాల్సి ఉంది. స్టోక్స్ బ్యాటింగ్‌లో ఎలా చెలరేగుతాడో చూడాలి. అతని నాయకత్వ ప్రతిభకు కూడా ఈ మ్యాచ్ పరీక్ష కానుంది. పిచ్, వాతావరణం ఎప్పటిలాగే ఈ పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. పరుగుల వరదకు అవకాశం ఉంది. అయితే జడేజా చెప్పినదాన్ని బట్టి చూస్తే మ్యాచ్ సాగిన కొద్దీ పగుళ్లు ఏర్పడి స్పిన్‌ను అనుకూలిస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. మంచి వాతావరణం, వర్షసూచన లేదు. జట్ల వివరాలు భారత్ (అంచనా): రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, రజత్, సర్ఫరాజ్, జడేజా, భరత్/ జురేల్, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్‌స్టో, ఫోక్స్, రేహన్, హార్ట్లీ, వుడ్, అండర్సన్. 100 500 700 ఈ టెస్టులో పలు ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఇది చిరస్మరణీయ మ్యాచ్ కానుంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెరీర్లో ఇది 100వ టెస్టు మ్యాచ్. ఈ ఘనత సాధించిన 16వ ఇంగ్లండ్ ఆటగాడిగా స్టోక్స్ నిలుస్తాడు. మరో వికెట్ తీస్తే భారత స్పిన్నర్ అశ్విన్ 500 వికెట్ల ఘనతను అందుకుంటాడు. ఈ మైలురాయిని చేరిన 9వ ఆటగాడిగా నిలుస్తాడు. మరో 5 వికెట్లు తీస్తే అండర్సన్ 700 వికెట్ల ఘనతను అందుకుంటాడు. 2024 టి20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. బోర్డు కార్యదర్శి జై షా ఈ విషయాన్ని నిర్ధారించారు. -
IND VS ENG 3rd Test: ఆ ముగ్గురు సహా మరో ఇద్దరికి చాలా ప్రత్యేకం..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ మ్యాచ్ ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారింది. రేపటి మ్యాచ్‌లో భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ తీస్తే టెస్ట్‌ల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండగా.. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మరో ఐదు వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 700 వికెట్ల అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. రేపటి మ్యాచ్ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు 100వ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్ అతనికి చిరకాలం గుర్తిండిపోతుంది. ఈ మూడు ప్రత్యేకతలే కాకుండా రేపటి మ్యాచ్ ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు చిరస్మరణీయంగా మారే అవకాశం ఉంది. రాజ్‌కోట్ టెస్ట్‌తో యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ అహ్మద్, దృవ్ జురెల్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైపోయింది. ఆఖరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప ఈ ఇద్దరి టెస్ట్ అరంగేట్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇలా రేపటి నుంచి ప్రారంభంకాబోయే రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ ఐదుగురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారనుంది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలువగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు సమంగా ఉండటంతో రాజ్‌కోట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యతను పెంచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. టీమిండియాను సీనియర్ల గైర్హాజరీ సమస్య కలవరపెడుతున్నప్పటికీ యువ ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపిస్తూ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచారు. మరోపక్క ఇంగ్లండ్ టీమ్.. భారత్‌ను దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తూ ప్రణాళికలు రచిస్తుంది. మరి రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి. -
సర్ఫరాజ్, జురెల్ అరంగేట్రం!
రాజ్‌కోట్: కీలక ఆటగాళ్లు గాయాల పాలవడం... కోహ్లి విశ్రాంతి కొనసాగిస్తుండటం... యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లకు వరంగా మారనుంది. మూడో టెస్టులో వీరిద్దరు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో వీరిద్దరు మాత్రం గంటల తరబడి చెమటోడ్చడం చూస్తుంటే వారి అరంగేట్రానికి సూచనగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ వారి ప్రాక్టీస్‌ను దగ్గరుండి పరిశీలించాడు. శ్రేయస్ అయ్యర్‌ను మిగతా మూడు టెస్టుల నుంచి తప్పించగా, ఎంపిక చేసిన కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతనూ రాజ్‌కోట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇవన్నీ కూడా సర్ఫరాజ్, జురెల్‌లకు రాచబాటను పరిచింది. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ వరుసగా విఫలమవడం కీపర్ జురెల్‌కు కలిసి రానుంది. గత మ్యాచ్ ఆడిన రజత్ పటిదార్‌తోపాటు సర్ఫరాజ్, జురెల్ మిడిలార్డర్లో బరిలోకి దిగుతారు. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ ప్రాక్టీస్ చేయలేదు. అతని కుడిచేతి చూపుడు వేలు నొప్పి కారణంగా ట్రెయినింగ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే అతని గాయం ఏమాత్రం తీవ్రమైంది కాదని జట్టు వర్గాలు వెల్లడించాయి. ఆల్‌రౌండర్ జడేజా స్పిన్ బౌలింగ్ కంటే బ్యాటింగ్ ప్రాక్టీసే ఎక్కువ చేశాడు. పేసర్లు బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు బౌలింగ్‌లో శ్రమించారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు జరుగుతుంది. -
రాహుల్ అవుట్
రాజ్‌కోట్: భారత సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయంతో అతన్ని రెండో టెస్టు నుంచి తప్పించి... ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్నెస్ సంతరించుకుంటేనే తుది జట్టుకు ఆడతాడని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. తాజాగా అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో మూడో టెస్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కర్ణాటక ఎడంచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఎంపిక చేశారు. ‘రాహుల్ వందశాతం ఫిట్నెస్తో ఉంటేనే తుది జట్టుకు పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం. అతను 90 శాతం కోలుకున్నట్లు తెలియడంతో రాజ్‌కోట్ టెస్టుకూ పక్కన బెట్టాం. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్న రాహుల్ నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు 15 నుంచి రాజ్‌కోట్‌లో జరుగుతుంది. రాజ్‌కోట్‌కు ఇంగ్లండ్ స్వల్ప విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సోమవారం తిరిగి భారత్ చేరుకుంది. వారంపాటు అక్కడ సేదతీరిన పర్యాటక జట్టు మూడో టెస్టు కోసం రాజ్‌కోట్ వేదికకు వచి్చంది. మంగళవారం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) గ్రౌండ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తారని స్థానిక వర్గాలు తెలిపాయి. స్పిన్నర్ జాక్ లీచ్ మోకాలి గాయంతో మిగతా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతను అబుదాబి నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. స్పిన్ త్రయం హార్ట్లీ, రేహాన్ అహ్మద్, బషీర్‌లతో పాటు పార్ట్‌టైమ్ స్పిన్ పాత్ర పోషించే జో రూట్ అందుబాటులో ఉండటంతో లీచ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి అతను తొలిటెస్టు మాత్రమే ఆడాడు. లీచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 2 వికెట్లే తీశాడు. తర్వాతి రెండో టెస్టుకు దూరమయ్యాడు. -
రూట్ ఒక్కడు ఒకవైపు.. టీమిండియా అంతా ఒకవైపు..!
ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాను ఓ అంశం తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. వివిధ కారణంగా చేత సీనియర్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా వైదొలగడంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో అనుభవలేమి కొట్టొచినట్లు కనిపిస్తుంది. వ్యక్తిగత కారణాల చేత 100కు పైగా టెస్ట్‌లు ఆడిన విరాట్ కోహ్లి, ఫిట్నెస్ సమస్య కారణంగా కేఎల్ రాహుల్, గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ మూడో టెస్ట్‌కు దూరమయ్యారు. ఈ ముగ్గురు స్టార్ బ్యాటర్లు దూరం కావడంతో భారత బ్యాటింగ్ లైనప్ గతంలో ఎన్నడూ లేనంత ఢీలాగా కనిపిస్తుంది. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఒక్కడు ఆడినన్ని టెస్ట్‌లు టీమిండియా బ్యాటింగ్ లైనప్ అంతా కలిపి కూడా ఆడలేదు. రూట్ ఇప్పటివరకు 137 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. భారత బ్యాటర్లంతా కలిపి అతను ఆడిన మ్యాచ్‌ల్లో 75 శాతం కూడా ఆడలేదు. భారత బ్యాటింగ్ లైనప్ అంతా కలిపి ఇప్పటివరకు కేవలం 92 టెస్ట్‌లు మాత్రమే ఆడారు. Experience of Indian batters in the 3rd Test vs England: Rohit - 56 Tests. Jaiswal - 6 Tests. Gill - 22 Tests. Patidar - 1 Test. Bharat - 7 Tests. Sarfaraz - Yet to make the debut. Padikkal - Yet to make the debut. Jurel - Yet to make the debut. pic.twitter.com/lcx0HXc0Nw — Johns. (@CricCrazyJohns) February 12, 2024 ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రమే కనీసం 50 టెస్ట్‌లు ఆడిన అనుభవం ఉంది. రోహిత్ తర్వాత శుభ్‌మన్ గిల్ అత్యధికంగా 22 మ్యాచ్‌లు ఆడాడు. జట్టులో నెక్స్ సీనియర్ కేఎస్ భరత్. అతడికి ఏడు మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఆతర్వాత యశిస్వి జైస్వాల్ 6, రజత్ పాటిదార్ ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడారు. దృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ స్థానంలో ఎంపికైన రజత్ పాటిదార్ ఇంకా అరంగేట్రం చేయాల్సి ఉంది. రవీంద్ర జడేజా 69, అశ్విన్ 97 టెస్ట్‌లు ఆడినప్పటికీ వీరిద్దరిని స్పెషలిస్ట్ బ్యాటర్లుగా పరిగణిలేము. ఈ పరిస్థితుల్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎలా నెట్టుకొస్తుందో వేచి చూడాలి. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి. -
టీమిండియాకు మరో భారీ షాక్
ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ మిడిలార్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్ బీసీసీఐ మెడికల్ టీమ్ నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడని సమాచారం. దీంతో రాహుల్ మూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది. మరోవైపు రాహుల్‌తో పాటు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేశాడని సమాచారం. రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా అతని కర్ణాటక సహచరుడు దేవ్‌దత్ పడిక్కల్‌ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో పడిక్కల్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్లో అతను ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 92.67 సగటున 3 సెంచరీల సాయంతో 556 పరుగులు చేశాడు. ఇప్పటికే వివిధ కారణాల చేత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ షమీ సేవలు కోల్పోయిన టీమిండియాకు రాహుల్ గైర్హాజరీ మరింత ఇబ్బందికరంగా పరిగణించబడుతుంది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన రాహుల్ రెండో టెస్ట్ కూడా ఆడలేదు. వారం తర్వాత రాహుల్‌కు మరోసారి ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తారని సమాచారం. సీనియర్లంతా ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవుతుండటంతో టీమిండియా అభిమానులు కలవరపడుతున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నారు. మూడో టెస్ట్ రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే,ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు భారత జట్టును రెండ్రోజుల కింద ప్రకటించారు. జట్టును ప్రకటించే సమయంలోనే ఆటగాళ్లంతా ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంటుందని సెలెక్టర్లు చెప్పారు. గాయాల కారణంగా రెండో టెస్ట్‌కు దూరమైన రాహుల్, జడేజాను దృష్టిలో ఉంచుకునే సెలెక్టర్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. -
ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేసిన పాక్ సంచలన ఆల్‌రౌండర్
ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్‌కు ఓ ఆణిముత్యం లభించింది. ఈ పర్యటనలో తొలి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన 27 ఏళ్ల పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్.. ఆసీస్ గడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 6 వికెట్ల ప్రదర్శనతో (మొత్తంగా 7 వికెట్లు, 10 పరుగులు) చెలరేగిన జమాల్.. ఆ తర్వాత మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్ట్‌లో 5 వికెట్లు, 33 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న జమాల్.. తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు అర్ధ సెంచరీ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించిన జమాల్.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించి (6/69) ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను తునాతునకలు చేశాడు. జమాల్ ప్రదర్శన కారణంగా పాక్ ఈ పర్యటనలో తొలిసారి మ్యాచ్ గెలిచే అవకాశం దక్కించుకుంది. అయితే పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ 68 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జమాల్ అందించిన సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో జమాల్ (0) ఇంకా క్రీజ్‌లోనే ఉండటంతో పాక్ అతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది. అతనికి జతగా రిజ్వాన్ (6) క్రీజ్‌లో ఉన్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జమాల్ సహా రిజ్వాన్ (88), అఘా సల్మాన్ (53) రాణించడంతో పాక్ 313 పరుగులు చేసింది. అనంతరం జమాల్ ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేసిన పాక్ సంచలన ఆల్‌రౌండర్ పాక్ సంచలన ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్.. దిగ్గజ ఆల్‌రౌండర్లైన ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేరాడు. ఆస్ట్రేలియా గడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 125 అంత కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 15 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన పర్యాటక జట్టు ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో బోథమ్, వసీం అక్రమ్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. స్కోర్ వివరాలు.. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 313 ఆలౌట్ (రిజ్వాన్ 88, జమాల్ 82, కమిన్స్ 5/61) ఆస్ట్రేలియా తొల ఇన్నింగ్స్: 299 ఆలౌట్ (లబూషేన్ 60, మిచెల్ మార్ష్ 54, జమాల్ 6/69) పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్: 68/7 (సైమ్ అయూబ్ 33, రిజ్వాన్ 6 నాటౌట్, జమాల్ 0 నాటౌట్, హాజిల్‌వుడ్ 4/9) మూడో రోజు ఆట ముగిసే సమయానికి 82 పరుగుల ఆధిక్యంలో పాక్ మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
టీమిండియాతో పోటీపడిన పాక్.. భారత్ 0/6.. పాక్ 9/6
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తమ చివరి ఆరు వికెట్లు ఒకే స్కోర్ వద్ద (153) కోల్పోయిన ఘటన మరువక ముందే.. దాయాది పాకిస్తాన్ దాదాపుగా ఇలాంటి సీన్‌నే మరోసారి రిపీట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పాక్ తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి, ఏ విషయంలోనైనా వారు భారత్‌నే ఫాలో అవుతారనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల పుణ్యమా అని తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేసింది. ఆరో నంబర్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ (88), ఏడో నంబర్ ఆటగాడు అఘా సల్మాన్ (53), తొమ్మిదో నంబర్ ప్లేయర్ ఆమిర్ జమాల్ (82) అర్ధసెంచరీలు చేసి పాక్‌ను ఆదుకున్నారు. అనంతరం ఆమిర్ జమాల్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో (6/69) తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 299 పరుగులకే పరిమితం చేసి, ప్రస్తుత సిరీస్‌లో పాక్‌కు తొలి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. అయితే పాక్ బ్యాటర్లు ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పాక్.. ఆతర్వాత తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 67/7గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ ఈ మ్యాచ్‌ను కాపాడుకోవడం చాలా కష్టం. సెకెండ్ ఇన్నింగ్స్‌లో హాజిల్‌వుడ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5-2-9-4) పాక్‌ను కష్టాల ఊబిలోకి నెట్టాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన ఆసీస్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పాక్ ఈ మ్యాచ్ కూడా ఓడితే ఆసీస్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. -
ఆసీస్‌తో మూడో టెస్ట్.. పాక్ లోయర్ ఆర్డర్ అద్భుత పోరాటం
సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. 96 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశ నుంచి పాక్ అద్భుతంగా తేరుకుంది. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు మొహమ్మద్ రిజ్వాన్ (88), అఘా సల్మాన్ (53), ఆమిర్ జమాల్ (82) వీరోచితంగా పోరాడి పాక్ పరువు కాపాడారు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్ డకౌట్లు కాగా.. షాన్ మసూద్ (35), బాబర్ ఆజమ్ (26) కాసేపు ఆసీస్ బౌలర్లను నిలువరించారు. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు సౌద్ షకీల్ (5) ఔట్ కావడంతో పాక్ కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్.. అఘా సల్మాన్, ఆమిర్ జమాల్ సహకారంతో పాక్‌కు ఫైటింగ్ టోటల్‌ను అందించాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమిర్ జమాల్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మరోసారి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5/61) చెలరేగి పాక్ వెన్నువిరచగా.. స్టార్క్ (2/75), హాజిల్‌వుడ్ (1/65), లయోన్ (1/74), మార్ష్ (1/27) మిగతా పనిని కానిచ్చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ 6, ఉస్మాన్ ఖ్వాజా 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
Ashes 3rd Test Day 4 Highlight Pics: ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలుపు (ఫొటోలు)
-
యాషెస్ సిరీస్ అంటే మార్ష్‌కు పూనకం వస్తుంది.. చెలరేగిపోతాడు..!
యాషెస్ సిరీస్-2023లో భాగంగా లీడ్స్ వేదికగా నిన్న (జులై 6) మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మెరుపు సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్ష్ సూపర్ సెంచరీతో ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మార్ష్ వచ్చీ రాగానే సెంచరీతో విరుచుకుపడి ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 118 బంతులను ఎదుర్కొన్న మార్ష్.. 17 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మార్ష్ మినహా మిగతావారెవ్వరూ కనీస పరుగులు కూడా చేయలేకపోయారు. ట్రవిస్ హెడ్ (39), స్టీవ్ స్మిత్ (22), లబూషేన్ (21), ఉస్మాన్ ఖ్వాజా (13), టాడ్ మర్ఫీ (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారు సింగిల్ డిజిల్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ ఇన్నింగ్స్‌ను మార్క్ వుడ్ (5/34) నిలువునా కూల్చాడు. మార్క్ వుడ్ సైతం దాదాపు ఏడాది తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చి, చెలరేగిపోయాడు. అతనికి క్రిస్ వోక్స్ (3/73), స్టువర్ట్ బ్రాడ్ (2/58) సహకరించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను పాట్ కమిన్స్ (2/28), మార్ష్ (1/9) దెబ్బకొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 195 పరుగులు వెనుకపడి ఉంది. రూట్ (19), బెయిర్‌స్టో (1) క్రీజ్‌లో ఉన్నారు. యాషెస్ సిరీస్ అంటే మార్ష్‌కు పూనకం వస్తుంది.. చెలరేగిపోతాడు..! దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మార్ష్‌కు యాషెస్ సిరీస్ అంటే పూనకం వస్తుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో అతనికి మంచి రికార్డు ఉంది. యాషెస్‌లో అతను ఆడిన చివరి 7 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 3 సెంచరీలు (118, 24, 17, 101, 29*, 9, 181) చేశాడు. 33 టెస్ట్‌ల కెరీర్లో తాను సాధించిన 3 శతకాలు యాషెస్‌లో సాధించినవే కావడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీతో కదం తొక్కిన మార్ష్.. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. తొలి రోజు తాను వేసిన 3 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమై జాక్ క్రాలే (33) వికెట్ పడగొట్టాడు. -
‘లయన్’ పంజా
మన స్పిన్ కోటలో ప్రత్యర్థి బాగా పాగా వేసింది. మూడో టెస్టులో ఆస్ట్రేలియా పాచిక పారుతుంటే... ఆతిథ్య వేదికపై భారత్ వణుకుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కంటే కాస్త ఎక్కువ స్కోరు చేసిందేమో కానీ... నాథన్ లయన్ (23.3–1–64–8) గర్జనకు తలవంచింది. వికెట్లు రాలిన తీరుతో భారత శిబిరం బిక్కమొహమేసింది. 76 పరుగుల అత్యల్ప లక్ష్యం ఆసీస్ ముందుండగా... మూడో రోజు తొలి సెషన్లోనే మూడో టెస్టు ముగిసే అవకాశముంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టూ 76 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగి ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇండోర్: ఈ సిరీస్‌లో స్పిన్‌తో గెలిచిన భారత్ ఇప్పుడదే స్పిన్‌కు ఉక్కిరిబిక్కిరవుతోంది. తిప్పేసే చోటే (పిచ్) బొక్కబోర్లా పడుతోంది. ఒక ఇన్నింగ్స్ అంటే ఏమో అనుకోవచ్చు... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మన పిచ్‌పై మన బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో టీమిండియా పరాజయం అంచున నిలిచింది. మూడో టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగిసేందుకు సిద్ధమైంది. వికెట్ల పతనంలో రెండో రోజు (16 వికెట్లు) మొదటి రోజు (14)ను మించింది. మూడో రోజు పర్యాటక ఆ్రస్టేలియా ముందు కేవలం 76 పరుగుల లక్ష్యమే ముందుండగా... స్పిన్ బంతులు బొంగరంలా తిరుగుతున్న పిచ్‌పై భారత్‌లో ఏ మూలనో ఆశలు రేపుతోంది. 75 పరుగుల్లోపే 10 వికెట్లు తీస్తే మాత్రం ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కాదు పిచ్‌నే ‘టర్నింగ్’ విన్నర్ అవుతుంది. రెండో రోజు ఆటలో ముందుగా ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్ 76.3 ఓవర్లలో 197 పరుగుల వద్ద ముగిసింది. పర్యాటక జట్టుకు 88 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య భారత్ 60.3 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. 11 పరుగులు... 6 వికెట్లు... ఓవర్‌నైట్ స్కోరు 156/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా ఉదయం గంటకుపైగా బాగానే ఆడింది. హ్యాండ్స్కాంబ్ (19; 1 ఫోర్), కామెరాన్ గ్రీన్ (21; 2 ఫోర్లు) జోడీ 17 ఓవర్లపాటు భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంది. ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటేలా కనిపించింది. అయితే 186 పరుగుల వద్ద హ్యాండ్స్కాంబ్, మరుసటి ఓవర్లో గ్రీన్ అవుట్ కాగానే ఆసీస్ అనూహ్యంగా 11 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లను కోల్పోయింది. 200 స్కోరుకు ముందే 197 పరుగుల వద్దే ఆలౌటైంది. పేస్‌తో ఉమేశ్ (3/12), స్పిన్‌తో అశ్విన్ (3/44) రె చ్చిపోయారు. ఆరు వికెట్లను వీరిద్దరు పంచుకొని ప్రత్యర్థిని పడగొట్టేశారు. లయన్ గర్జన ఆస్ట్రేలియాను అద్భుతంగా కట్టడి చేయడంతో ఇక జాగ్రత్తగా ఆడితే ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కుతుందని అంతా భావించారు. కానీ భారత్ రెండో ఇన్నింగ్స్‌పై లయన్ గర్జనకు చక్కని ఫీల్డింగ్ కూడా తోడు కావడంతో ఆ్రస్టేలియానే పైచేయి సాధించింది. ఓపెనర్లు రోహిత్ (33 బంతుల్లో 12), శుబ్‌మన్ (15 బంతుల్లో 5)లకు ఒక్క బౌండరీ అయిన కొట్టే అవకాశం ఇవ్వకుండా లయన్ ఇద్దరి పని పట్టాడు. కోహ్లి (26 బంతుల్లో 12; 2 ఫోర్లు) వచ్చి ఫోర్లు కొడుతున్నాడులే అనే ఆనందాన్ని కునెమన్ దూరం చేశాడు. 54 పరుగులకే కీలకమైన 3 వికెట్లు పెవిలియన్‌లో కూర్చున్నాయి. ప్రధాన వికెట్లే లయన్ ఉచ్చులో పడినా... పుజారా (142 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జోడీ ఉన్నంత సేపూ జట్టు ధీమాగానే ఉంది. స్టార్క్ బౌలింగ్‌లో ఖాజా కళ్లు చెదిరే క్యాచ్‌కు అయ్యర్ ఆట ముగియగా జట్టు పతనం మొదలైంది. శ్రీకర్ భరత్ (3) మళ్లీ నిరాశపరచగా... స్మిత్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌కు పుజారా ఇన్నింగ్స్ కూడా ముగిసింది. అశ్విన్ (16; 2 ఫోర్లు), అక్షర్ (15 నాటౌట్; 1 సిక్స్) రెండంకెల స్కోర్లు చేశారు. లయన్ 8, స్టార్క్, కునెమన్ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 109; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: హెడ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 9; ఖాజా (సి) గిల్ (బి) జడేజా 60; లబుషేన్ (బి) జడేజా 31; స్మిత్ (సి) భరత్ (బి) జడేజా 26; హ్యాండ్స్కాంబ్ (సి) అయ్యర్ (బి) అశ్విన్ 19; గ్రీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉమేశ్ 21; క్యారీ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 3; స్టార్క్ (బి) ఉమేశ్ 1; లయన్ (బి) అశ్విన్ 5; మర్ఫీ (బి) ఉమేశ్ 0; కునెమన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (76.3 ఓవర్లలో ఆలౌట్) 197. వికెట్ల పతనం: 1–12, 2–108, 3–125, 4–146, 5–186, 6–188, 7– 192, 8–196, 9–197, 10–197. బౌలింగ్: అశ్విన్ 20.3–4–44–3, జడేజా 32–8–78–4, అక్షర్ 13– 1–33–0, ఉమేశ్ 5–0–12–3, సిరాజ్ 6–1– 13–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 12; గిల్ (బి) లయన్ 5; పుజారా (సి) స్మిత్ (బి) లయన్ 59; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) కునెమన్ 13; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 7; అయ్యర్ (సి) ఖాజా (బి) స్టార్క్ 26; భరత్ (బి) లయన్ 3; అశ్విన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 16; అక్షర్ (నాటౌట్) 15; ఉమేశ్ (సి) గ్రీన్ (బి) లయన్ 0; సిరాజ్ (బి) లయన్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (60.3 ఓవర్లలో ఆలౌట్) 163. వికెట్ల పతనం: 1–15, 2–32, 3–54, 4–78, 5–113, 6–118, 7–140, 8–155, 9–155, 10–163. బౌలింగ్: స్టార్క్ 7–1–14–1, కునెమన్ 16–2–60–1, నాథన్ లయన్ 23.3–1–64–8, మర్ఫీ 14–6–18–0. -
రక్తం కారుతున్నా బౌలింగ్ కొనసాగించిన మిచెల్ స్టార్క్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి రోజు భారత్ 109 పరుగులకే ఆలౌట్ కాగా.. 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకే చాపచుట్టేసింది. 88 పరుగుల వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఆదిలోనే గిల్ (5), రోహిత్ శర్మ (12) వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 18 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసిన భారత్.. ఇంకా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 51 పరుగులు వెనుకపడే ఉంది. పుజారా (15), కోహ్లి (1) క్రీజ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే, భారత రెండో ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్ సందర్భంగా టీవీల్లో కనిపించిన కొన్ని దృశ్యాలు ఆట పట్ల ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఉన్న కమిట్మెంట్ను సూచించాయి. తొలి ఓవర్లో ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ ఎడమ చేతి చూపుడు వేలు నుంచి రక్తం కారుతున్నా, ప్యాంట్‌కు తుడుచుకుని బౌలింగ్‌ను కొనసాగించాడు. 2022 డిసెంబర్ నుంచి స్టార్క్‌ను ఈ గాయం వేధిస్తూనే ఉంది. నాటి నుంచి పలు మార్లు ఈ గాయం కారణంగా స్టార్క్ జట్టుకు దూరంగా ఉన్నాడు. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్టార్క్ కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి స్పిన్నర్లకు బంతిని అందించాడు. స్టార్క్‌కు తగిలిన గాయాన్ని హైలైట్ చేస్తూ కొందరు నెటిజన్లు సోషల్‌మీడియాలో హంగామా చేస్తున్నారు. రక్తం కారుతున్నా, ఏ మాత్రం వెరవకుండా బౌలింగ్ చేస్తున్నాడు.. ఆసీస్ ఆటగాళ్ల కమిట్మెంట్పై ఎప్పుడూ డౌట్ పడకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రతిగా కొందరు టీమిండియా హార్డ్ కోర్ అభిమానులు దవడ విరిగినప్పుడు అనిల్ కుంబ్లే బౌలింగ్ చేస్తున్న దృశ్యాలను పోస్ట్ చేస్తున్నారు. ఆ పాటి రెండు రక్తం చుక్కలకే కమిట్మెంట్ అంటే, దీన్ని ఏమనాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మ్యాచ్ సంగతి పక్కకు పెట్టి అభిమానులు ఈ విషయంలో వాదనలకు దిగుతున్నారు. -
తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉండి కూడా నిప్పులు చెరిగిన ఉమేశ్
BGT 2023: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడంతో చివరి నిమిషంలో తుది జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్.. అందివచ్చిన అవకాశాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌లో (13 బంతుల్లో 17; ఫోర్, 2 సిక్సర్లు) అత్యంత కీలకమైన పరుగులను మెరుపు వేగంతో సాధించిన ఉమేశ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో మరింతగా రెచ్చిపోయి స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో కీలకంగా వ్యవహరించాడు. రెండో రోజు తొలి సెషన్లో డ్రింక్స్ తర్వాత బంతిని అందుకున్న ఉమేశ్.. స్పిన్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై నిప్పులు చెరుగుతూ తొలుత గ్రీన్‌ను ఎల్బీడబ్ల్యూగా ఆతర్వాత స్టార్క్‌ను, మర్ఫీలను క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాక ఉమేశ్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. స్టార్క్ వికెట్‌తో ఉమేశ్ స్వదేశంలో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఉమేశ్ మెరుపు వేగంతో సంధించిన బంతుల ధాటికి స్టార్క్, మర్ఫీ వికెట్లు గాల్లో పల్టీలు కొడుతూ నాట్యం చేశాయి. తొలి రోజు ఆటలో కూడా ఉమేశ్ ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్‌ల్లో ఉమేశ్.. యువరాజ్ సింగ్ (22), రవిశాస్త్రి (22)లను అధిగమించి, కోహ్లి సిక్సర్ల రికార్డును (24) సమం చేశాడు. భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉమేశ్.. కోహ్లితో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో నిలిచాడు. ఊహించని విధంగా భారత తుది జట్టులోకి వచ్చి రికార్డులు కొల్లగొట్టడంతో పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉమేశ్.. ఏ పరిస్థితుల్లో ఇలా రాణించాడో తెలిస్తే అతన్ని వ్యతిరేకించే వారు సైతం ప్రశంసించక మానరు. ఉమేశ్ ఫిబ్రవరి 23న తన తండ్రిని కోల్పోయాడు. పుట్టెడు దుఖంలో ఉండి కూడా అతడు రాణించిన తీరు నిజంగా అభినందనీయం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జట్టుకు ఉపయోగపడాలన్న అతని కమిట్మెంట్కు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. తండ్రిని కోల్పోయి కనీసం దినవారాలు కూడా గడవకముందే దేశం కోసం అతను సర్వశక్తులు ఒడ్డి పాటుపడుతున్న తీరును ఎంత పొగిడినా తక్కువే. ఉమేశ్.. ఈ టెస్ట్‌లో మున్ముందు మరింత కీలకంగా మారి టీమిండియాను గెలిపించాలని ఆశిద్దాం. ఇదిలా ఉంటే, 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 75 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
న్యూజిలాండ్‌కు వెళ్లనున్న బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తనను దీర్ఘకాలంగా వేధిస్తున్న వెన్ను సమస్యను పరిష్కరించుకునేందుకు న్యూజిలాండ్‌కు బయలుదేరనున్నాడని తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్, ఎన్సీఏ మేనేజర్లు బుమ్రా వెన్నుకు చికిత్స చేసేందుకు రోవన్ షౌటెన్ అనే న్యూజిలాండ్ సర్జన్‌ను రెకమెండ్ చేసినట్లు సమాచారం. బుమ్రాకు చికిత్స అందించబోయే సర్జన్.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కోలుకోవడంలో కీలకంగా వ్యవహరించాడని, ఈ కారణంగానే బుమ్రాను కూడా అతనికే రెకమెండ్ చేస్తున్నామని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు తెలిపారు. బుమ్రా.. క్రైస్ట్‌చర్చ్ వెళ్లేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించాడు. బుమ్రాకు ఇప్పుడే సర్జరీ అయితే కోలుకునేందుకు 20 నుంచి 24 వారాల సమయం పట్టవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బుమ్రా ఐపీఎల్‌తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ వీలైనంత త్వరగా బుమ్రాకు చికిత్స చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. సర్జరీ జరిగితే ఓవరాల్‌గా ఏడాది కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నట్లవుతుంది. ఇదిలా ఉంటే, బుమ్రా గైర్హాజరీలో బీసీసీఐ ఉమేశ్ యాదవ్‌పై అధికంగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆసీస్‌తో మూడో టెస్ట్‌కు షమీకి విశ్రాంతిని ఇచ్చి మరీ ఉమేశ్‌కు అవకాశం కల్పించినట్లు స్పష్టమవుతోంది. -
IND VS AUS: ముగిసిన రెండో రోజు ఆట.. 163 పరుగులకు టీమిండియా ఆలౌట్
Ind Vs Aus 3rd Test Indore 2nd Day Updates: ముగిసిన రెండో రోజు ఆట 163 పరుగుల వద్ద టీమిండియా రెండో ఇన్నింగ్స్ ముగించింది. ఆస్ట్రేలియా కంటే కేవలం 75 పరుగుల ఆధిక్యం మాత్రమే సంపాదించగలిగింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అత్యధికంగా 8 వికెట్లు తీయగా.. మరో స్పిన్నర్ మథ్యూ కుహ్నెమన్‌కు ఒకటి, పేసర్ స్టార్క్‌కు ఒక వికెట్ దక్కాయి. టీమిండియా బ్యాటర్లలో ఛతేశ్వర్ పుజారా 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 57: టీమిండియా స్కోరు: 155-9. కేవలం 67 పరుగుల ఆధిక్యం 56.4: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా లియోన్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. డకౌట్‌గా వెనుదిరిగాడు. 56.3: ఎనిమిదో వికెట్ డౌన్ లియోన్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పుజారా (59) అవుట్. 54: టీమిండియా స్కోరు: 145/7 48.1: అశ్విన్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా నాథన్ లియోన్ బౌలింగ్‌లో అశ్విన్(16) బౌల్డ్ అయ్యాడు. 40.1: ఆరో వికెట్ కోల్పోయిన భారత్ నాథన్ లియోన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్ బౌల్డ్ అయ్యాడు. మూడు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది.స్కోరు- 118/6 (40.1). పుజారా (46), అశ్విన్ (0) క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 37.2: శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చి అయ్యర్ అవుటయ్యాడు. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానాన్ని వీడాడు. పుజారా, శ్రీకర్ భరత్ క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 115-5(38) జడేజా ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. ఆస్ట్రేలియా స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు తడబడుతున్నారు. క్రీజులో కుదురుకున్నట్లే కన్పించిన ఆల్‌రౌండర్ జడేజా.. లయోన్ బౌలింగ్‌లో ఎల్బీబ్ల్యూగా వెనుదిరిగాడు. 36 బంతులో ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ 78 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్, పుజారా 36(76) ఉన్నారు. విరాట్ కోహ్లి ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్ టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. క్రీజ్‌లో కుదురుకుని టీమిండియాను గట్టెక్కిస్తాడని ఆశించిన విరాట్ కోహ్లి మరోసారి విఫలమై పెవిలియన్‌కు చేరాడు. కుహ్నేమన్ మరోసారి కోహ్లిని (13) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కోహ్లి ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 54/3గా ఉంది. పుజారా (20), జడేజా (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 34 పరుగులు వెనుకపడి ఉంది. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ ఔట్ 32 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. లయోన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (12) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు టీమిండియా ఇంకా 56 పరుగులు వెనుకపడే ఉంది. పుజారా (11), కోహ్లి క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. గిల్ క్లీన్ బౌల్డ్ లంచ్ విరామం తర్వాత లయోన్ వేసిన తొలి ఓవర్లోనే భారత్ వికెట్ కోల్పోయింది, లయోన్ బౌలింగ్‌లో ముందుకు వచ్చి భారీ షాట్ ఆడే క్రమంలో గిల్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లంచ్ సమయానికి భారత్ స్కోర్ 13/0 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 75 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. 197 పరుగులకే ఆలౌటైన ఆసీస్ 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. ఈ రోజు ఆసీస్ కోల్పోయిన 6 వికెట్లలో అశ్విన్, ఉమేశ్ చెరి సగం పంచుకున్నారు. వీరిద్దరు ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌పై ఎదురుదాడికి దిగి వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియాకు 88 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఉమేశ్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. ఇవాళ ఆసీస్ కోల్పోయిన 5 వికెట్లలో ఉమేశ్ ఒక్కడే 3 వికెట్లు పడగొట్టాడు. మర్ఫీని ఉమేశ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 196 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 8వ వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్ అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. వారెవ్వా ఉమేశ్.. స్పిన్ పిచ్‌పై ప్రతాపం చూపిస్తున్నావు..! డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా 3 వికెట్లు కోల్పోయింది. హ్యాండ్స్‌కోంబ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపగా.. గ్రీన్, స్టార్క్‌లను ఉమేశ్ ఔట్ చేశాడు. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఉమేశ్ నిప్పులు చెరుగుతూ వికెట్లు పడగొడుతున్నాడు. గ్రీన్‌ను ఎల్బీడబ్ల్యూ చేసిన ఉమేశ్.. స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 74 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 196/7. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన ఆసీస్ రెండో రోజు చాలా సమయం వరకు నిలకడగా ఆడిన ఆసీస్.. డ్రింక్స్ బ్రేక్ తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. తొలు హ్యాండ్స్‌కోంబ్‌ను యాష్ బోల్తా కొట్టించగా.. మరుసటి ఓవర్లో ఉమేశ్ యాదవ్.. గ్రీన్ (21)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 72 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 188/6గా ఉంది. అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట మొదలయ్యాక చాలా సేపు నిలకడగా ఆడిన హ్యాండ్స్‌కోంబ్‌ను (19) ఎట్టకేలకు అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. 71వ ఓవర్లో షార్ట్ లెగ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి హ్యాండ్స్కోంబ్ వెనుదిరిగాడు. 71 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 186/5గా ఉంది. గ్రీన్ (19), అలెక్స్ క్యారీ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న గ్రీన్, హ్యాండ్స్కోంబ్ ఓవర్‌నైట్ స్కోర్ 156/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతుంది. హ్యాండ్స్కోంబ్ (16), గ్రీన్ (17) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. క్రీజ్‌లో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నారు. 66 ఓవర్లు ముగిసే ఆసీస్ స్కోర్ 177/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 68 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో రోజు ఆట ప్రారంభం.. రవీంద్రుడి మాయాజాలం కొనసాగేనా..? ఓవర్‌నైట్ స్కోర్ 156/4 వద్ద ఆస్ట్రేలియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటైంది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, పీటర్ హ్యాండ్స్కోంబ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ , నాథన్ లియోన్, మార్క్ కుహ్నేమన్ -
IND VS AUS 3rd Test: ఇదెక్కడి పిచ్ రా బాబు.. మరీ ఇంత దారుణమా..?
Matthew Hayden: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు (54 ఓవర్లు) చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, ఊహకందని విధంగా మెలికలు తిరుగుతూ, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న హోల్కర్ మైదానం పిచ్‌పై ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. మ్యాచ్ జరుగుతుండగానే లైవ్‌లో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇదెక్కడి పిచ్ రా బాబు.. మరీ ఇంత దారుణంగా టర్న్ అవుతుందని ధ్వజమెత్తాడు. ఈ పిచ్ జనరేట్ చేస్తున్న టర్న్ చూస్తే భయమేస్తుందని అన్న హేడెన్.. స్పిన్నింగ్ కండీషన్స్‌ను తూర్పారబెట్టాడు. టెస్ట్ క్రికెట్లో తొలి రోజు ఆరో ఓవర్లోనే స్పిన్ బౌలర్ తన ప్రతాపం చూపితే.. మ్యాచ్ ఎన్ని గంటల పాటు సాగుతుందని ప్రశ్నించాడు. ఇలాంటి పిచ్‌లకు తన మద్దతు ఎప్పుడూ ఉండదని అసహనం వ్యక్తం చేశాడు. టెస్ట్ మ్యాచ్‌లకు పిచ్‌లను తొలి రెండు రోజులు బ్యాటర్లకు అనుకూలించేలా తయారు చేయాలని సూచించాడు. తొలి రోజు భారత బ్యాటింగ్ సందర్భంగా కామెంటరీ బాక్స్‌లో ఉన్న హేడెన్ ఈ వ్యాఖ్యలు చేయగా.. పక్కనే ఉన్న టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి రెండే రెండు ముక్కల్లో "హోమ్ కండీషన్స్" అంటూ హేడెన్ కామెంట్స్‌ను బదులిచ్చాడు. కొద్ది సేపు ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయని శాస్త్రి.. ఆతర్వాత మైక్ పట్టుకుని, ఇది హోమ్ కండీషన్స్ కంటే చాలా అధికంగా ఉందని, మున్ముందు మ్యాచ్ మరింత టఫ్‌గా మారుతుందని జోస్యం చెప్పాడు. అయితే ఒక్క మంచి భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పుతుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, 4 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్‌ల్లో టీమిండియా రెండింటిలోనూ విజయాలు సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా ఎలాగైనా గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉండిన రోహిత్ సేనకు తొలి రోజు పిచ్ వ్యవహరించిన తీరు మింగుడుపడని విషయంగా మారింది. -
విరాట్ కోహ్లి రికార్డును సమం చేసిన ఉమేశ్ యాదవ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం మహ్మద్ షమీకి విశ్రాంతినివ్వడంతో జట్టులోకి వచ్చిన ఉమేశ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తాను సద్వినియోగం చేసుకున్న అవకాశం బ్యాట్‌తో అనుకుంటే పొరపాటే. ఉమేశ్.. మూడో టెస్ట్ తొలి రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది తన బ్యాటింగ్ నైపుణ్యంతో. ఈ మ్యాచ్‌లో పదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ఉమేశ్.. 13 బంతుల్లో 2 సిక్సర్లు, బౌండరీ సాయంతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఉమేశ్.. ఓ విషయంలో విరాట్ కోహ్లిని అధిగమించాడు. కోహ్లి తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 24 సిక్సర్లు బాదగా.. ఈ మ్యాచ్‌లో కొట్టిన 2 సిక్సర్లు కలుపుకుని ఉమేశ్ కూడా తన కెరీర్లో అన్నే సిక్సర్లు బాదాడు. విరాట్ సిక్సర్ల రికార్డును సమం చేసే క్రమంలో ఉమేశ్.. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (22 సిక్సర్లు), భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (22)ల రికార్డులను అధిగమించాడు. ఓవరాల్‌గా చూస్తే.. భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (91) పేరిట ఉండగా.. ధోని (78), సచిన్ టెండూల్కర్ (69), రోహిత్ శర్మ (68), కపిల్ దేవ్ (61) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. ఉమేశ్, విరాట్‌తో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. రోహిత్ (12), గిల్ (21), శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), ఉమేశ్ యాదవ్ (17) అతికష్టం మీద రెండంకెల స్కోర్ సాధించగా.. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు (54 ఓవర్లు) చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. -
విరాట్ కోహ్లికి ఏమైంది.. ఎందుకిలా సడన్‌గా ఊగిపోయాడు..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 1) ప్రారంభమైన మూడో టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. రోహిత్ (12), గిల్ (21), శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), ఉమేశ్ యాదవ్ (17) అతికష్టం మీద రెండంకెల స్కోర్ సాధించగా.. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 48.5 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (3), గ్రీన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ఇదిలా ఉంటే, ఆసీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో మైదానంలో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఉన్నట్లుండి ఒక్కసారిగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. 109 పరుగులకే చాపచుట్టేసిందన్న బాధలో టీమిండియా, అభిమానులు ఉంటే కోహ్లి ఇలా చేయడం ఏంటని అంతుచిక్కక ఫ్యాన్స్ జట్టు పీక్కుంటున్నారు. కోహ్లి అసందర్భంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోహ్లి ఏంటి ఇలా చేశాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కోహ్లికి ఏమైనా పిచ్చా.. అసందర్భంగా ఇలా డ్యాన్స్‌లు చేయడమేంటని కామెంట్లు చేస్తున్నారు. గ్రౌండ్లో ఏం జరుగుతుందో సంబంధం లేనట్లు కోహ్లి ప్రవర్తించడం సరికాదని హితవు పలుకుతున్నారు. అయితే, కోహ్లి డ్యాన్స్ చేయడానికి కారణాలు లేకపోలేదని మరికొందరు చర్చించుకుంటున్నారు. కోహ్లి డ్యాన్స్ చేసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. అయితే అప్పటిదాకా బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించని పిచ్.. ఆసీస్ బ్యాటర్లకు తోడ్పాటునందించడం చూసి కోహ్లి అసహనంతో డ్యాన్స్ చేసినట్లు సోషల్‌మీడియాలో సర్కులేట్ అవుతున్న కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది. కోహ్లి పిచ్‌పై అసహనం వ్యక్తం చేస్తూ.. పాపులర్ హిందీ సాంగ్ అయిన బత్తమీజ్ దిల్.. బత్తమీజ్ దిల్‌ను బత్తమీజ్ పిచ్.. బత్తమీజ్ పిచ్ అంటూ పాడుకుంటాడు. -
లబూషేన్ క్లీన్ బౌల్డ్.. తొలిసారి తప్పించుకున్నాడు, రెండోసారి..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 1) ప్రారంభమైన మూడో టెస్ట్‌లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక చతికిలపడింది. కంగారూ స్పిన్నర్ల ధాటికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. రోహిత్ (12), గిల్ (21), శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), ఉమేశ్ యాదవ్ (17) అతికష్టం మీద రెండంకెల స్కోర్ సాధించగా.. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. మూడో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ పరుగు ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉస్మాన్ ఖ్వాజా (53) అజేయమైన హాఫ్‌సెంచరీతో బ్యాటింగ్‌ను కొనసాగిస్తుండగా.. స్టీవ్ స్మిత్ ఇప్పుడే క్రీజ్‌లోకి వచ్చాడు. ఆసీస్ కోల్పోయిన రెండు వికెట్లు రవీంద్ర జడేజా ఖాతాలోకే వెళ్లాయి. జడ్డూ.. ట్రవిస్ హెడ్ (9)ను ఎల్బీగా, లబూషేన్ (31)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలిసారి తప్పించుకున్నా, రెండోసారి అదే తరహాలో.. లబూషేన్‌ను జడేజా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ చేసినప్పటికీ.. ఆ బంతిని అంపైర్లు నోబాల్‌గా ప్రకటించడంతో లబూషేన్ బ్రతికిపోయాడు. అయితే ఇన్నింగ్స్ 35వ ఓవర్లో మాత్రం లబూషేన్‌ను ఏ తప్పిదం కాపాడలేకపోయింది. నో బాల్ బంతికి ఎలా క్లీన్‌బౌల్డ్ అయ్యాడో ఈసారి కూడా అదే రీతిలో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 8 సార్లు లైన్ దాటిన జడేజా.. సాధారణంగా స్పిన్నర్లు క్రీజ్ బయటకు వచ్చి నో బాల్స్ వేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే ఈ సిరీస్ జడ్డూ ఇప్పటివరకు ఏకంగా 8 నో బాల్స్ సంధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇందులో జడ్డూ రెండుసార్లు వికెట్ పడగొట్టినా, నో బాల్ పుణ్యమా అని ప్రత్యిర్ధికి లైఫ్ లభించింది. ఈ మ్యాచ్‌లో లబూషేన్ జడ్డూ తప్పిదం కారణంగా తప్పించుకోగా, తొలి టెస్ట్‌లో స్టీవ్ స్మిత్ జడ్డూ చేసిన ఇదే తప్పిదం కారణంగా బతికిపోయాడు. -
BGT 2023: ఆసీస్‌తో మూడో టెస్ట్.. పలు రికార్డులపై కన్నేసిన రోహిత్, కోహ్లి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇండోర్ వేదికగా రేపటి నుంచి (మార్చి 1) ప్రారంభంకానున్న మూడో టెస్ట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ పలు రికార్డులపై కన్నేశారు. మూడో టెస్ట్‌లో కోహ్లి మరో 77 పరుగులు చేస్తే.. సొంతగడ్డపై 4000 పరుగులు పూర్తి చేసిన ఐదో భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. కోహ్లికి ముందు సచిన్ (7216), ద్రవిడ్ (5598), గవాస్కర్ (5067), సెహ్వాగ్ (4656) స్వదేశంలో 4000 పరుగుల మైలురాయిని క్రాస్ చేశారు. ఈ రికార్డుతో పాటు కోహ్లి మరో భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. మూడో టెస్ట్‌లో కోహ్లి మరో క్యాచ్ అందుకుంటే.. అంతర్జాతీయ క్రికెట్లో 300 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 299 క్యాచ్‌లు అందుకున్న కోహ్లి.. ద్రవిడ్ (334) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. అంతరర్జాతీయ క్రికెట్లో ఓవరాల్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఘనత మహేళ జయవర్ధనే (440) పేరిట నమోదై ఉంది. రోహిత్ శర్మ విషయానికొస్తే.. ఆసీస్‌తో మూడో టెస్ట్‌లో హిట్‌మ్యాన్ మరో 57 పరుగులు చేస్తే స్వదేశంలో టెస్ట్‌ల్లో 2000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఇప్పటివరకు స్వదేశంలో 22 టెస్ట్‌లు ఆడిన కోహ్లి.. 71.96 సగటున 8 సెంచరీలు (ఓ డబుల్ సెంచరీ), 6 హాఫ్ సెంచరీల సాయంతో 1943 పరుగులు చేశాడు. స్వదేశంలో సర్ డాన్ బ్రాడ్‌మన్ (98.22) తర్వాత అత్యధిక సగటు హిట్‌మ్యాన్‌దే కావడం మరో విశేషం. స్టీవ్ స్మిత్ విషయానికొస్తే.. ఆసీస్ తాత్కాలిక సారధి భారత్‌తో జరిగే మూడో టెస్ట్‌లో సెంచరీ చేస్తే.. స్టీవ్ వా, అలెన్ బోర్డర్ రికార్డులను బద్దలు కొడతాడు. స్టీవ్ స్మిత్, స్టీవ్ వా, అలెన్ బోర్డర్లు ఆసీస్ కెప్టెన్లుగా తలో 15 సెంచరీలు బాదారు. మూడో టెస్ట్‌లో స్మిత్ శతక్కొడితే వా, బోర్డర్లను అధిగమిస్తాడు. ఆసీస్ కెప్టెన్‌గా అత్యధిక సెంచరీల రికార్డు రికీ పాంటింగ్ (19) పేరిట ఉంది. -
రూట్, స్మిత్ అదరగొడుతున్నారు.. కేన్ మామ లైన్లోకి వచ్చాడు, కోహ్లి పరిస్థితి ఏంటి..?
BGT 2023 IND VS AUS 3rd Test: ప్రస్తుత క్రికెట్ జనరేషన్లో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ ఫాబ్ ఫోర్ బ్యాటర్లుగా కీర్తించబడుతున్న విషయం తెలిసిందే. ఈ నలుగురిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిది అన్ని విషయాల్లో పైచేయి అన్న విషయంతో (కొద్ది రోజుల ముందు వరకు) దాదాపు అందరూ ఏకీభవించేవారు. అలాంటిది ప్రస్తుతం పరిస్థితి తారుమారైపోయింది. కోహ్లిని ఏ విషయంలో గొప్ప అని చెప్పుకోవాలో టీమిండియా ఫ్యాన్స్‌కు అర్ధం కావట్లేదు. టెక్నిక్, పరుగులు, సెంచరీలు, రికార్డులు ఇలా చెప్పుకుంటు పోతే దాదాపు అన్ని విషయాల్లో సహచరులతో పోలిస్తే కోహ్లి వెనకపడి ఉన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రూట్, స్మిత్, విలియమ్సన్తో పోలిస్తే కాస్త పర్వాలేదనిపించినా.. టెస్ట్‌ల్లో మాత్రం కోహ్లి ప్రదర్శన నానాటికి తీసికట్టుగా మారుతుందన్నది బహిరంగ రహస్యం. 2021 ఆరంభంలో కోహ్లి ఫ్యాబ్ ఫోర్ ఆటగాళ్లలో అందరికంటే అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఉండేవాడు. నాటికి కోహ్లి 27 సెంచరీలు చేసి ఉంటే, స్మిత్ 26, విలియమ్సన్ 24, రూట్ 17 సెంచరీలు మాత్రమే చేశారు. అదే 2023 ఫిబ్రవరి వచ్చే సరికి కోహ్లి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అదే 27 సెంచరీల మార్కు వద్ద మిగిలిపోగా.. స్మిత్ 30, రూట్ 29, విలియమ్సన్ 26 సెంచరీల మార్కును అందుకున్నారు. వీరిలో రూట్ గత రెండేళ్ల కాలంలో ఏకంగా 12 సెంచరీలు బాదగా.. స్మిత్ మధ్యమధ్యలో మూడంకెల ఫిగర్ అందుకున్నాడు. వీరితో పోలిస్తే విలియమ్సన్, కోహ్లి పరిస్థితి దారుణంగా ఉంది. విలియమ్సన్ లేటుగా అయిన రెండేళ్ల తర్వాత.. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సెంచరీ చేయగా.. 2021 జనవరిలో చివరి టెస్ట్ సెంచరీ చేసిన కోహ్లి దాదాపు మూడేళ్లైపోయినా ఇప్పటివరకు శతక్కొట్టలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సెంచరీలు చేసిన కోహ్లి టెస్ట్‌ల్లో మాత్రం ఈ మార్కును అందుకోలేకపోతున్నాడు. ఇదే కొనసాగితే.. విలియమ్సన్ కోహ్లిని దాటిపోయి టెస్ట్‌ల్లో కేవలం 9 సెంచరీలు మాత్రమే కలిగిన బాబర్ ఆజమ్ కూడా కోహ్లిని అధిగమించే ప్రమాదం ఉంది. ఓవరాల్‌గా చూస్తే.. సెంచరీల విషయంలో ఫాబ్ ఫోర్ ఆటగాళ్లలో కోహ్లి 74 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. రూట్ 45, స్మిత్ 42, విలియమ్సన్ 39 సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో కోహ్లి మూడేళ్ల సెంచరీ దాహానికి తెరదించి, ఆసీస్‌తో జరిగే మూడో టెస్ట్‌లో శతక్కొట్టాలని ఆశిద్దాం -
ఆసీస్‌తో మూడో టెస్ట్.. శ్రీకర్ భరత్‌కు ప్రమోషన్
BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇండోర్ వేదికగా రేపటి నుంచి (మార్చి 1) ప్రారంభంకానున్న మూడో టెస్ట్ కోసం సర్వం సిద్ధమైంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకపడిన ఆసీస్‌ను గాయాల బెడద, సారధి అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు వేధిస్తుంటే, తుది జట్టు కూర్పు విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ తలలు పట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు (డ్రా) సజీవంగా ఉంచుకోవాలని ఆసీస్ భావిస్తుంటే.. ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. పిచ్ విషయానికొస్తే.. మూడో టెస్ట్‌కు వేదిక అయిన ఇండోర్‌లోని హోల్కర్ పిచ్ ఎర్ర మట్టితో తయారు చేసిందిగా తెలుస్తోంది. సహజంగా రెడ్ సాయిల్ పిచ్‌లు పేసర్లకు సహకరిస్తాయి. ఈ పిచ్‌లపై బౌన్స్ అధికంగా లభించే అవకాశముండటంతో ఆయా జట్లు అదనపు పేసర్‌కు అవకాశం కల్పిస్తుంటాయి. ఈ క్రమంలో మూడో టెస్ట్‌లో భారత్, ఆసీస్‌లు కూడా అదనపు పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్‌కు సహకరించిన తొలి రెండు టెస్ట్‌ల్లో ఇరు జట్లు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగగా.. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఇరు జట్లు బరిలోకి దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భారత తుది జట్టు కూర్పు విషయానికొస్తే.. టీమిండియా యాజమాన్యాన్ని కేఎల్ రాహుల్ ఫామ్ లేమి సమస్య ప్రధానంగా వేధిస్తుంది. గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా పాతిక పరుగుల మార్కు దాటని రాహుల్‌ను తుది జట్టు నుంచి తప్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఎంపిక జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. పిచ్ ఎలాగూ పేస్‌కు సహకరించే అవకాశం ఉండటంతో రాహుల్‌ను తప్పించి అతని స్థానంలో అదనపు పేసర్‌కు (ఉమేశ్ యాదవ్ లేదా జయదేవ్ ఉనద్కత్) అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. అయితే కెప్టెన్ రోహిత్ మాత్రం కేఎల్ రాహుల్‌కు మద్దతుగా నిలుస్తూ, అతనికి మరో అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ ఒక్క మార్పు మినహా రెండో టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేఎల్ రాహుల్‌ను తప్పిస్తే.. రోహిత్ శర్మతో పాటు శ్రీకర్ భరత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చు. ఇక ఆసీస్ తుది జట్టు విషయానికొస్తే.. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో స్టీవ్ స్మిత్ సారధ్య బాధ్యతలు మోయనున్నాడు. గాయాలు ఇతరత్రా కారణాల చేత జోష్ హాజిల్‌వుడ్, డేవిడ్ వార్నర్, ఆస్టన్ అగర్ స్వదేశానికి బయలుదేరగా.. కెమరూన్ గ్రీన్ రేపటి మ్యాచ్‌కు పూర్తి ఫిట్నెస్ సాధించాడని ఆసీస్ మేనేజ్మెంట్ ప్రకటించింది. అయితే స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ విషయంలో మాత్రం టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రేపటి మ్యాచ్‌లో స్టార్క్ ఆడతాడా లేదా అన్న విషయం సందిగ్ధంగా మారింది. వార్నర్ స్థానంలో మ్యాట్ రెన్షా, కమిన్స్ స్థానంలో గ్రీన్ ఆడటం లాంఛనమే కాగా.. స్పిన్నర్ కన్హేమన్ స్థానంలో స్టార్క్ ఆడతాడా లేదా స్కాట్ బోలండ్, లాన్స్ మోరిస్‌లలో ఒకరికి అవకాశం ఇస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శ్రీకర్ భరత్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్/జయదేవ్ ఉనద్కత్ ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా): మ్యాట్ రెన్షా, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్కోంబ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, టాడ్ మర్ఫీ, నాథన్ లయోన్, మిచెల్ స్టార్క్/స్కాట్ బోలండ్/లాన్స్ మోరిస్ -
BGT 2023: ఇంటిబాట పట్టిన మరో ఆసీస్ ప్లేయర్.. ఈసారి ఆల్‌రౌండర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా టీమిండియాతో జరుగబోయే మూడో టెస్ట్ మ్యాచ్‌కు (మార్చి 1 నుంచి ప్రారంభం) ముందు ఆసీస్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఇంటిబాట పడుతున్నారు. అసలే 0-2 తేడాతో సిరీస్‌లో వెనుకపడిన ఆసీస్‌కు.. ఈ విషయం మరింత ఇబ్బందికరంగా మారింది. గాయాల కారణంగా ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సిరీస్ మొత్తం నుంచే నిష్క్రమించగా, వ్యక్తిగత కారణాల చేత కెప్టెన్ కమిన్స్ పాక్షికంగా లీవ్ తీసుకున్నాడు. తాజాగా మరో ఆటగాడు స్వదేశంలో జరిగే దేశవాలీ టోర్నీల్లో ఆడేందుకు జట్టును వీడాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్.. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ, మార్ష్ కప్ ఫైనల్ ఆడేందుకు స్వదేశానికి బయల్దేరాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో తుది జట్టులో ఆడే అవకాశం దక్కని అగర్‌ను ఆసీస్ యాజమాన్యమే రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా ప్రకటించలేదు. జట్టులో స్పిన్నర్లు అధికంగా ఉండటంతో అగర్‌ను ఉద్దేశపూర్వకంగానే తప్పించినట్లు తెలుస్తోంది. నాథన్ లయోన్, టాడ్ మర్ఫీ రాణిస్తుండటంతో అగర్‌కు తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమని భావించి ఆసీస్ మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు రెండో టెస్ట్‌కు ముందు వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి వెళ్లిన స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ తిరిగి జట్టులో చేరాడు. స్వెప్సన్ గైర్హాజరీలో రెండో టెస్ట్‌లో మాథ్యూ కుహ్నేమన్ ఆడాడు. అరంగేట్రం టెస్ట్‌లోనే కోహ్లి వికెట్ తీసిన కుహ్నేమన్ కూడా పర్వాలేదనిపించాడు. ఒక్కొక్కరుగా ఆటగాళ్లు వైదొలుగుతుండటంతో సిరీస్‌పై ఆశలు వదులుకున్న ఆసీస్‌కు ఓ విషయంలో మాత్రం ఊరట లభించింది. ఫిట్నెస్ సమస్య కారణంగా తొలి రెండు టెస్ట్‌ల్లో ఆడని పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉండనున్నట్లు ఆసీస్ మేనేజ్మెంట్ ప్రకటించింది. గాయం కారణంగా తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సన్నద్ధతపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే.. గాయాలు, ఆటగాళ్ల పేలవ ఫామ్ తదితర సమస్యల కారణంగా ఆసీస్ సిరీస్‌పై ఆశలు వదులుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ కాకుండా కాపాడుకోవడమే ప్రస్తుతం ఆసీస్ ముందున్న లక్ష్యమని అర్ధమవుతుంది. -
BGT 2023: ఆసీస్‌తో చివరి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ప్రకటన
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత-ఆస్ట్రేలియా జట్లు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2 మ్యాచ్‌లు పూర్తి కాగా రెండిటిలో టీమిండియానే గెలుపొందింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి కొనసాగుతోంది. గతంలో మొదటి రెండు టెస్ట్‌లకు మాత్రమే భారత జట్టును ప్రకటించిన సెలెక్టర్లు ఇవాళ (ఫిబ్రవరి 19) మూడు, నాలుగు టెస్ట్‌లతో పాటు తదుపరి జరిగే వన్డే సిరీస్ కోసం కూడా జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి రెండు టెస్ట్‌లకు ప్రకటించిన జట్టునే యధాతథంగా కొనసాగించారు. మూడో టెస్ట్ ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి 5 వరకు జరుగనుండగా.. నాలుగో మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి 13 వరకు జరుగనుంది. ఆసీస్‌తో మూడు, నాలుగు టెస్ట్‌లకు టీమిండియా.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ -
ధర్మశాల టెస్టు వైజాగ్‌లో?
న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టు వేదిక మారనుంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ)కు చెందిన ఈ మైదానంలో అసంపూర్తి పనులవల్ల మ్యాచ్ వేదికను మార్చాల్సి వస్తుందని బీసీసీఐ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ధర్మశాల స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ సహా పిచ్‌పై పచ్చికను కొత్తగా పరిచారు. పిచ్‌ను ఇంకా పరీక్షించలేదు. అక్కడక్కడ పనులు ఇంకా పూర్తవలేదు. ప్యాచ్ వర్క్ అలాగే మిగిలిపోయింది. అందువల్లే ఐదు రోజుల ఆట (టెస్టు మ్యాచ్)ను అసంపూర్ణమైన మైదానంలో నిర్వహించడం సమంజసం కాదని బీసీసీఐ భావిస్తోంది. మూడో టెస్టుకు ప్రత్యామ్నాయ వేదికలుగా వైజాగ్, బెంగళూరు, ఇండోర్, రాజ్కోట్లను బోర్డు పరిశీలిస్తోంది. -
BGT 2023: బిగ్ న్యూస్.. భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ వేదిక మార్పు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి బిగ్ న్యూస్ లీకైంది. సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాల వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ వేదిక మారే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐలోని ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. మార్చి 1 నుంచి 5 వరకు జరగాల్సిన మూడో టెస్ట్ మ్యాచ్ ధర్మశాలలో జరిగేది అనుమానమని తెలుస్తోంది. ధర్మశాల స్టేడియంలో రెనొవేషన్ (పునరుద్ధరణ) పనులు జరుగుతున్నాయని, మార్చి 1 నాటికి అవి పూర్తవుతాయా.. లేదా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారిందని సదరు అధికారి తెలిపాడు. ఈనెల (ఫిబ్రవరి) 3న బీసీసీఐ బృందం నిర్వహించిన తనిఖీల్లో ఔట్ ఫీల్డ్‌తో పాటు పిచ్ సైడ్ ఏరియా పూర్తిగా సిద్ధంగా లేదని తేలిందని వివరించాడు. అయితే టెస్ట్ ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉందని, ఆలోపు పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ) హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. మూడో టెస్ట్‌కు బ్యాకప్‌గా మరో ఐదు స్టేడియాలు ఎంపిక చేసినట్లు వివరించాడు. మూడో టెస్ట్ మొహాలీలో జరిగేందుకు ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నట్లు సదరు అధికారి తెలిపాడు. కాగా, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొద్దిరోజుల క్రితమే ధర్మశాలలో పాత పిచ్‌ను తొలగించి కొత్తది తయారు చేశారు. వర్షం కురిస్తే మ్యాచ్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను కొత్త డ్రైనేజీ వ్యవస్థను అమర్చారు. దీంతో పాటు గ్రౌండ్లో స్ప్రింక్లర్లను కూడా ఫిట్ చేశారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాలలో మూడో టెస్ట్ జరిగేది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
విజయానికి 13 వికెట్ల దూరంలో.. అసాధ్యం మాత్రం కాదు..!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. మూడో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్.. ఆఖరి రోజు లంచ్ విరామం సమయానికి 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఖాయా జోండో (39), తెంబా బవుమా (35) ఓ మోస్తరుగా రాణించగా.. సిమోన్ హార్మర్ (45 నాటౌట్), కేశవ్ మహారాజ్ (49 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 231 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం ఆసీస్ ఆధిపత్యం కనిపిస్తున్నా.. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో రెండు సెషన్ల ఆటలో ఆసీస్ బౌలర్లు మరో 13 వికెట్లు నేలకూల్చగలిగితే.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది అంత సులువు కాదు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్ 475/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. వరుణుడి ఆటంకం, వెలుతురు లేమి సమస్యల కారణంగా తొలి రోజు 47 ఓవర్ల ఆటకు కోత పడగా, రెండో రోజు 14 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజు కూడా వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం రద్దైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఆసీస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఈ క్రమంతో ఉస్మాన్ ఖ్వాజా (195 నాటౌట్) డబుల్ సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా ఆసీస్ కెప్టెన్ సాహసోపేత నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఖ్వాజాతో పాటు స్టీవ్ స్మిత్ (104) సెంచరీలు చేయగా.. లబూషేన్ (79), ట్రవిస్ హెడ్ (70) అర్ధసెంచరీలు సాధించారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. డబుల్ సెంచరీ పూర్తి కాకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్
AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సహచరుడు ఉస్మాన్ ఖ్వాజాకు (195 నాటౌట్) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఖ్వాజా ఒకింత మనస్థాపానికి గురైనా, జట్టు ప్రయోజనాల కోసం చేసేదేమీ లేక సర్దుకుపోవాల్సి వచ్చింది. కమిన్స్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో అతన్ని ఓ రేంజ్లో ఆటాడుకుంటున్నారు. నాలుగో రోజు తొలి సెషన్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనప్పటికీ.. కేవలం ఒక్క ఓవర్ పాటు ఖ్వాజాకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినా డబుల్ సెంచరీ పూర్తి చేసుకునే వాడు కదా అని ఆసీస్ ఓపెనర్‌పై జాలిపడుతున్నారు. 2004లో నాటి భారత కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా కమిన్స్ లాగే.. సహచరుడు సచిన్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఉదంతాన్ని నెటిజన్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్ 475/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వరుణుడి ఆటంకం, వెలుతురు లేమి సమస్యల కారణంగా తొలి రోజు 47 ఓవర్ల ఆటకు కోత పడగా, రెండో రోజు 14 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజైన ఇవాళ (జనవరి 7) కూడా వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం రద్దైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఆసీస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. నాలుగో రోజు 59 ఓవర్లు (ఎటువంటి అంతరాయం కలగకపోతే), ఆఖరి రోజు 98 ఓవర్ల ఆట సాధ్యపడితే ఫలితం (సౌతాఫ్రికాను 2 సార్లు ఆలౌట్ చేయాల్సి ఉంటుంది) తప్పక వస్తుందన్న అంచనాతో కమిన్స్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు తెలుస్తోంది. మెల్బోర్న్ టెస్ట్‌లో ఆసీస్ బౌలర్లు 137.3 ఓవర్లలో సఫారీలను 2 సార్లు ఆలౌట్ చేశారు. ఈ ధీమాతోనే కమిన్స్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (195 నాటౌట్), స్టీవ్ స్మిత్ (104) సెంచరీలు చేయగా.. లబూషేన్ (79), ట్రవిస్ హెడ్ (70) అర్ధసెంచరీలు సాధించారు. కమిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు టీ విరామం సమయానికి (31 ఓవర్లు) 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో శతకొట్టిన స్టీవ్ స్మిత్ (192 బంతుల్లో 104; 11 ఫోర్లు, 2 సిక్సర్లు).. కెరీర్లో 30వ సారి ఈ మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ రికార్డు పేరిట ఉన్న 29 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్ వా (32) రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం స్మిత్.. మాథ్యూ హేడెన్‌తో (30) సమంగా మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లలో రికీ పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం స్మిత్‌తో పాటు మార్నస్ లబూషేన్‌కు మాత్రమే ఉంది. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న లబూషేన్ 33 మ్యాచ్‌ల్లో 59.43 సగటున 10 సెంచరీల సాయంతో 3150 పరుగులు చేశాడు. ఆసీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా ఉన్నప్పటికీ.. వయసు పైబడిన రిత్యా వీరు మరో రెండు, మూడేళ్లకు మించి టెస్ట్‌ల్లో కొనసాగే అవకాశం లేదు. ప్రస్తుతం వార్నర్ ఖాతాలో 25, ఖ్వాజా ఖాతాలో 13 శతకాలు ఉన్నాయి. స్మిత్ శతకం సాధించిన మ్యాచ్‌లోనే ఖ్వాజా తన 13వ సెంచరీ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో మూడో సెషన్ డ్రింక్స్ సమయానికి ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (195) తన కెరీర్ తొలి డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. మధ్యలో ట్రవిస్ హెడ్ (59 బంతుల్లో 70; 8 ఫోర్లు, సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఖ్వాజాకు జతగా మాట్ రెన్షా (5) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు తొలి రోజు డేవిడ్ వార్నర్ (10), లబూషేన్ (79) ఔటయ్యారు. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆసీస్ భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆతిధ్య జట్టు.. రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ సిరీస్ తదుపరి జనవరి 12, 14, 17 తేదీల్లో ఇరు జట్లు 3 వన్డేల సిరీస్‌లో తలపడతాయి. -
శతకాల మోత మోగించిన ఆసీస్ ప్లేయర్లు.. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు
AUS VS SA 3rd Test Day 2: 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నామమాత్రపు మ్యాచ్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. రెండో రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 394 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు ఉస్మాన్ ఖ్వాజా (335 బంతుల్లో 172 నాటౌట్) కెరీర్లో 13 శతకం బాది డబుల్ సెంచరీ దిశగా సాగుతుండగా, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెరీర్లో 30 శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట కేవలం 47 ఓవర్లు మాత్రమే సాగగా.. ఇవాల్టి (జనవరి 5) ఆట షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైంది. టీ విరామం సమయానికి ఖ్వాజాకు జతగా ట్రావిస్ హెడ్ (17) క్రీజ్‌లో ఉన్నాడు. అచొచ్చిన సిడ్నీ గ్రౌండ్లో ఖ్వాజా (ఈ గ్రౌండ్లో ఇదివరకే 3 సెంచరీలు బాదాడు) ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. సఫారీ బౌలర్లకు చుక్కలు కనబడుతున్నాయి. ఖ్వాజా తన టెస్ట్ కెరీర్లో నాలుగోసారి 150 మార్కును క్రాస్ చేయగా.. స్టీవ్ స్మిత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ప్రస్తుత సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆసీస్ భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆసీస్.. తొలి టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ సిరీస్ తదుపరి జనవరి 12, 14, 17 తేదీల్లో ఇరు జట్లు 3 వన్డేల సిరీస్‌లో తలపడతాయి. -
మ్యాచ్ మధ్యలో సిగరెట్ లైటర్ కావాలన్న లబూషేన్
AUS VS SA 3rd Test Day 1: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ ప్లేయర్ మార్నస్ లబూషేన్ సిగరెట్ లైటర్ కావాలంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేశాడు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో మైదానంలో ఉన్న వారితో సహా కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. లబూషేన్ ఎందుకు లైటర్ అడుతున్నాడో తెలియక ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న వారు కూడా కాసేపు తలలు గీకున్నారు. కామెంటేటర్ ఇష గుహ అయితే లబూషేన్ సిగరెట్ కాల్చాలని అనుకుంటున్నాడేమో అంటూ సహచరులతో డిస్కస్ చేశారు. మొత్తానికి లబూషేన్ చేసిన ఈ సంజ్ఞ తొలి రోజు ఆటకు హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో షికార్లు చేస్తుంది. అసలు లబూషేన్ సిగరెట్ లైటర్ ఎందుకు అడిగాడంటే..? అప్పటికే చాలాసేపుగా హెల్మెట్‌తో సమస్యను ఎదుర్కొంటూ పలుసార్లు తీస్తూ, వేసుకున్న లబూషేన్.. దాన్ని రిపేర్ చేసేందుకు గాను సిగరెట్ లైటర్ తేవాలని డ్రెస్సింగ్ రూమ్‌కు మెసేజ్ చేశాడు. లబూషేన్ సైగ చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ సిబ్బందికి కూడా అతనెందుకు లైటర్ అడుతున్నాడో అర్ధం కాలేదు. అయితే కాసేపటి తర్వాత విషయాన్ని గ్రహించి వారు లైటర్‌ను తీసుకెళ్లి లబూషేన్ సమస్యను పరిష్కరించారు. సిబ్బంది లైటర్‌తో లబూషేన్ హెల్మెట్ లోపలి భాగంలో కాలుస్తూ రిపేర్ చేశారు. Running repairs for Marnus Labuschagne! 🚬#AUSvSA pic.twitter.com/IdSl0PqicV — cricket.com.au (@cricketcomau) January 4, 2023 ఇదిలా ఉంటే, వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల పాటు సాగిన తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పాక్షికంగా పైచేయి సాధించింది. ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు), లబూషేన్ (151 బంతుల్లో 79; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆతిధ్య జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (10), లబుషేన్ ఔట్ కాగా.. ఉస్మాన్ ఖ్వాజా, స్టీవ్ స్మిత్ (0) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్, లబూషేన్‌ల వికెట్లు అన్రిచ్ నోర్జే ఖాతాలో పడ్డాయి. కాగా, 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆసీస్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 సీజన్ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య పోటీ నెలకొంది. -
రాణించిన లబూషేన్, ఖ్వాజా.. నిప్పులు చెరిగిన నోర్జే
3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్ని వేదికగా పర్యాటక సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ తొలి రోజు ఆట సాదాసీదాగా సాగింది. వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల పాటు సాగిన ఈ రోజు ఆటలో ఆస్ట్రేలియా పాక్షికంగా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కమిన్స్ సేనను సఫారీ పేసర్ అన్రిచ్ నోర్జే ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ 4 బంతికి వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను అద్భుతమైన బంతితో దొరకబుచ్చుకున్నాడు. 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో కేవలం 10 పరుగులు చేసిన వార్నర్.. మార్కో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లబూషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా సాయంతో ఇన్నింగ్స్‌కు పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 135 పరుగులు జోడించిన అనంతరం.. నోర్జే వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. తొలి రోజు ఆఖరి బంతికి నోర్జే బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి లబూషేన్ (151 బంతుల్లో 79; 13 ఫోర్లు) ఔటయ్యాడు. వెలుతురు లేమి కారణంగా లబూషేన్ ఔట్ అవ్వగానే అంపైర్లు మ్యాచ్‌ను ముగించారు. ఈ సమయానికి ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 54; 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (0) క్రీజ్‌లో ఉన్నారు. తొలి రోజు ఆటలో ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లలో ఆతిధ్య ఆసీస్ భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
PAK VS ENG 3rd Test: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బౌలర్
PAK VS ENG 3rd Test Day 3: కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. పురుషుల క్రికెట్లో అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టిన 18 ఏళ్ల 126 రోజుల వయసున్న రెహాన్.. రెండో ఇన్నింగ్స్‌లో 14.5 ఓవర్లలో 48 పరుగులిచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. Rehan Ahmed becomes the youngest debutant to claim a five-for in Men’s Tests 💪#WTC23 | 📝 https://t.co/y5SkcqY16s pic.twitter.com/LoDZE7Yimd — ICC (@ICC) December 19, 2022 గతంలో ఈ రికార్డు ఆసీస్ టెస్ట్ జట్టు సారధి పాట్ కమిన్స్ పేరిట ఉండేది. కమిన్స్ 18 ఏళ్ల 196 రోజుల వయసులో టెస్ట్‌ల్లో (అరంగేట్రం మ్యాచ్) 5 వికెట్ల ఘనత సాధించాడు. తాజాగా రెహాన్.. చాలాకలంగా పదిలంగా ఉండిన కమిన్స్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రెహాన్ ఈ రికార్డుతో పాటు మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యంత పిన్న వయసులో టెస్ట్ అరంగేట్రం చేసిన ఆటగాడిగా రెహాన్ చరిత్ర సృష్టించాడు. రెహాన్‌కు ముందు ఈ రికార్డు బ్రియాన్ క్లోజ్ పేరిట ఉండేది. క్లోజ్.. 1949లో 18 ఏళ్ల 149 రోజుల వయసులో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెగ్ స్పిన్ బౌలర్ అయిన రెహాన్ పాకిస్తాన్ సంతతికి చెందిన వాడు. రెహాన్ తండ్రి నయీమ్ అహ్మద్ పాకిస్తాన్లో జన్మించి, ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. రెహాన్, అతని సోదరులు ఫర్హాన్, రహీమ్‌లు కూడా క్రికెటర్లే కావడం విశేషం. ఇంగ్లండ్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న రెహాన్.. తన తండ్రి పుట్టిన దేశంపైనే విశ్వరూపం ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు నెగ్గిన ఇంగ్లండ్.. మరో 55 పరుగులు చేస్తే మూడో టెస్ట్‌లోనూ విజయం సాధించి పాకిస్తాన్‌ను వారి స్వదేశంలో క్లీన్ స్వీప్ చేస్తుంది. రెహాన్ ధాటికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధి ముందు167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి విజయానికి అతి సమీపంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో పాటు చేతిలో 8 వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంగా తెలుస్తోంది. -
పాక్‌ను దెబ్బేసిన ఇంగ్లండ్ యువ స్పిన్నర్.. క్లీన్ స్వీప్ దిశగా బాబర్ సేన
PAK VS ENG 3rd Test Day 3: కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు నెగ్గిన ఇంగ్లండ్.. మరో 55 పరుగులు చేస్తే మూడో టెస్ట్‌లోనూ విజయం సాధించి పాకిస్తాన్‌ను వారి స్వదేశంలో క్లీన్ స్వీప్ చేస్తుంది. మూడో రోజు ఆటలో పాకిస్తాన్ మూలాలు ఉన్న ఇంగ్లండ్ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఆతిధ్య దేశాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. రెహాన్ (5/48) ధాటికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధి ముందు167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి విజయానికి అతి సమీపంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో పాటు చేతిలో 8 వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంగా తెలుస్తోంది. రెహాన్‌తో పాటు జాక్ లీచ్ (3/72), జో రూట్ (1/31), మార్క్ వుడ్ (1/25) రాణించడంతో పాక్ రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే చాపచుట్టేసింది. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (54), సౌద్ షకీల్ (53) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో ఎదురుదాడికి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలే (41), బెన్ డకెట్ (50 నాటౌట్) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించిన అనంతరం క్రాలేను అబ్రార్ అహ్మద్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన రెహాన్ అహ్మద్ (10)ను కూడా అబ్రార్ అహ్మదే ఔట్ చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి డకెట్‌కు జతగా స్టోక్స్ (10) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 354 పరుగులు చేసి 50 పరుగుల కీలక ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (111) సెంచరీతో, ఓలీ పోప్ (51), బెన్ ఫోక్స్ (64) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో (తొలి ఇన్నింగ్స్) జాక్ లీచ్ 4, రెహాన్ అహ్మద్ 2, రాబిన్సన్, మార్క్ వుడ్, రూట్ తలో వికెట్ పడగొట్టగా.. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, నౌమాన్ అలీ చెరో 4 వికెట్లు, మహ్మద్ వసీం ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
PAK VS ENG: బ్రూక్ సెంచరీ.. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న మూడో టెస్ట్
కరాచీ వేదికగా పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 7/1 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. హ్యారీ బ్రూక్ (150 బంతుల్లో 111; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో, ఓలీ పోప్ (51), బెన్ ఫోక్స్ (64) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌటై, కీలకమైన 50 పరుగుల ఆధిక్యం సాధించింది. పాక్ స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, నౌమాన్ అలీ చెరో 4 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ వసీం జూనియర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండో రోజు ఆఖర్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. పాక్.. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 29 పరుగులు వెనుకపడి ఉంది. అబ్దుల్లా షఫీక్ (14), షాన్ మసూద్ (3) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాచ్‌లో ఇంకా 3 రోజులు మిగిలి ఉండటంతో ఫలితం రావడం ఖాయమని స్పష్టమవుతుంది. తొలి రోజు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. కెప్టెన్ బాబర్ ఆజమ్ (78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. మిగతా వారంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అరంగేట్రం బౌలర్ రెహాన్ అహ్మద్ 2, రూట్, మార్క్ వుడ్, రాబిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. బజ్ బాల్ టెక్నిక్‌ను అమలు చేసి తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించింది. ఫలితం తేలదనుకున్న తొలి టెస్ట్‌లో 74 పరుగుల తేడాతో విజయం సాధించిన స్టోక్స్ సేన.. ముల్తాన్ టెస్ట్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. -
తిప్పేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు.. పాకిస్తాన్ ఎంతకు ఆలౌటైందంటే..?
PAK VS ENG 3rd Test Day 1: కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్లు అదరగొట్టారు. వీరి ధాటికి పాకిస్తాన్ తొలి రోజే ఆలౌటైంది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. ఓపెనర్ షాన్ మసూద్ (30), అజహార్ అలీ (45) పర్వాలేదనిపించారు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (8), మహ్మద్ రిజ్వాన్ (19), సౌద్ షకీల్ (23), ఫహీమ్ అష్రాఫ్ (4), నౌమాన్ అలీ (20), అబ్రర్ అహ్మద్ (4) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అరంగేట్రం బౌలర్ రెహాన్ అహ్మద్ 2, రూట్, మార్క్ వుడ్, రాబిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఓపెనర్ జాక్ క్రాలేను డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. బెన్ డకెట్ (4), ఓలీ పోప్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పాకిస్తాన్ స్కోర్‌కు ఇంకా 297 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, 17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. బజ్ బాల్ టెక్నిక్‌ను అమలు చేసి తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించింది. ఫలితం తేలదనుకున్న తొలి టెస్ట్‌లో 74 పరుగుల తేడాతో విజయం సాధించిన స్టోక్స్ సేన.. ముల్తాన్ టెస్ట్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. -
ఇంగ్లండ్ క్రికెటర్ రెహాన్ అహ్మద్ అరుదైన రికార్డు
Rehan Ahmed: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో అరంగేట్రం చేయడం ద్వారా ఇంగ్లండ్ క్రికెటర్ రెహాన్ అహ్మద్ అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ తరఫున అత్యంత పిన్న వయసులో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆటగాడిగా రెహాన్ చరిత్ర సృష్టించాడు. రెహాన్.. 18 ఏళ్ల 126 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. రెహాన్‌కు ముందు ఈ రికార్డు బ్రియాన్ క్లోజ్ పేరిట ఉంది. క్లోజ్.. 1949లో 18 ఏళ్ల 149 రోజుల వయసులో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెగ్ స్పిన్ బౌలర్ అయిన రెహాన్ పాకిస్తాన్ సంతతికి చెందిన వాడు. కౌంటీల్లో లీసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రెహాన్.. గత కౌంటీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చి ఇంగ్లండ్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. రెహాన్.. ఇంగ్లండ్ తరఫున ఇదివరకే టీ20 అరంగేట్రం చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఇంగ్లండ్‌తో ఇవాళ (డిసెంబర్ 17) ప్రారంభమైన మూడో టెస్ట్‌ల్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 35 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (8) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. షాన్ మసూద్ (30), అజహార్ అలీ (45) పర్వలేదనిపించారు. బాబర్ ఆజమ్ (43), సౌద్ షకీల్ (18) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్, మార్క్ వుడ్ తలో వికెట్ పడగొట్టగా.. అరంగేట్రం ఆటగాడు రెహాన్ అహ్మద్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
రజత్ పాటిదార్ అజేయ శతకం.. కివీస్ ముందు భారీ టార్గెట్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న మూడో అనధికర టెస్ట్‌లో భారత-ఏ జట్టు పట్టు బిగించింది. రజత్ పాటిదార్ (135 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో, రుతురాజ్ (164 బంతుల్లో 94; 11 ఫోర్లు), కెప్టెన్ ప్రియాంక్ పంచల్ (114 బంతుల్లో 62; 6 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో టీమిండియా కివీస్‌కు 406 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన కివీస్ (రచిన్ రవీంద్ర (12)).. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. కివీస్ గెలవాలంటే మ్యాచ్ ఆఖరి రోజు (నాలుగో రోజు) మరో 396 పరుగులు చేయాల్సి ఉంది. మూడో రోజు ఆటలో పాటిదార్, రుతురాజ్, పంచల్ చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 357 పరుగుల (7 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్ చేసింది. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 3 వికెట్లు, జో వాకర్ 2, సోలియా, కెప్టెన్ టామ్ బ్రూస్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ఆటగాళ్లు చాప్మన్ (92), సోలియా (54) అర్ధ సెంచరీలతో రాణించడంతో కివీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత బౌలర్లలో సౌరభ్ కుమార్ 4, రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ 2, శార్ధూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌటైంది. రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో (127 బంతుల్లో 108; 12 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగగా, వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ (76) అర్ధసెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ 4, జో వాకర్, జాకబ్ డఫీ తలో రెండు వికెట్లు, సోలియా, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇదివరకే జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కివీస్-ఏ భారత్-ఏ జట్ల మధ్య మూడు అనధికార వన్డే మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. -
నిప్పులు చెరిగిన పేసర్లు.. ఒకే రోజు 17 వికెట్లు
లండన్: ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టును బౌలర్లు శాసిస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా మొదలైన మూడో టెస్టులో ఒక్క మూడో రోజు ఆటలోనే 17 వికెట్లు కూలాయి. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 36.2 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. జాన్సెన్ (30; 4 ఫోర్లు), జొండో (23; 1 ఫోర్, 1 సిక్స్) కాసేపు ఆడారు. మిగిలిన వారిని రాబిన్సన్ (5/49), స్టువర్ట్ బ్రాడ్ (4/41) జంటగా పడగొట్టేశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 33.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఒలీ పోప్ (67; 13 ఫోర్లు) రాణించడంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 36 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. జాన్సెన్ 4, రబడ 2 వికెట్లు తీశాడు. తొలి రోజు ఆట వర్షార్పణం కాగా... రెండో రోజు క్వీన్ ఎలిజబెత్–2 మృతికి సంతాప సూచకంగా ఆటను రద్దు చేశారు. మూడో రోజు ఉదయం ఇరు జట్ల ఆటగాళ్లు బ్రిటన్ రాణికి నివాళులు అర్పించాకే ఆట మొదలైంది. -
మరోసారి రెచ్చిపోయిన బెయిర్‌స్టో.. కివీస్‌ను ఊడ్చేసిన ఇంగ్లండ్
లీడ్స్: న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆతిధ్య ఇంగ్లండ్ 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. హెడింగ్లే వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. న్యూజిలాండ్ నిర్ధేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 183/3 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. ఓలీ పోప్ (82) వికెట్‌ను కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జో రూట్ (86 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా, బెయిర్‌స్టో (44 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు, సిక్సర్లు) మరోసారి చెలరేగి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ విధ్వంసకర శతకం (157 బంతుల్లో 162; 24 ఫోర్లు) బాదిన బెయిర్‌స్టో రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్‌కు అపురూప విజయాన్ని అందించాడు. అంతకుముందు రెండో టెస్ట్‌లోనూ బెయిర్‌స్టో ఇదే తరహాలో రెచ్చిపోయాడు. 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీ20 తరహాలో విధ్వంసం (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించి తన జట్టును గెలిపించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 2 ధనాధన్ శతకాలు, ఓ హాఫ్ సెంచరీ బాదిన బెయిర్‌స్టో ఇంగ్లండ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సైతం రెచ్చిపోయాడు. తొలి టెస్ట్‌లో అజేయమైన శతకంతో (115) జట్టును గెలిపించిన రూట్.. రెండో టెస్ట్‌లో (176) భారీ శతకం నమోదు చేశాడు. తాజాగా మూడో టెస్ట్‌లోనూ రూట్ చివరిదాకా క్రీజ్‌లో నిలబడి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్ట్ స్కోర్ వివరాలు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 329 (డారిల్ మిచెల్ 109) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 360 (బెయిర్‌స్టో 162) న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 326 (టామ్ బ్లండెల్ 88) ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 296/3 (54.2 ఓవర్లలో) చదవండి: ENG vs NZ: వారెవ్వా రూట్! రివర్స్ స్కూప్ షాట్! వీడియో వైరల్! -
ఐదేసిన జాక్ లీచ్.. ఇంగ్లండ్ టార్గెట్ 296
హెడింగ్లే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రసకందాయంగా మారింది. 168/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కివీస్ ఇంగ్లండ్‌కు 296 పరుగుల ఊరించే టార్గెట్‌ను నిర్ధేశించింది. కివీస్ బ్యాటర్లలో టామ్ లాథమ్ (76), డారిల్ మిచెల్ (56), టామ్ బ్లండెల్ (88 నాటౌట్) అర్ధశతకాలు సాధించగా.. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 5, మ్యాటీ పాట్స్ 3, జేమీ ఓవర్టన్, జో రూట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఐదేసిన లీచ్.. తాజా ప్రదర్శనతో 10 వికెట్ల ఘనతను నమోదు చేశాడు. అంతకుముందు డారిల్ మిచెల్ (109), టామ్ బ్లండెల్ (55) రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్.. బెయిర్‌స్టో (157 బంతుల్లో 24 ఫోర్ల సాయంతో 162 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్ సాయంతో 360 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఇక, 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్న ఇంగ్లండ్ గత మ్యాచ్ తరహాలోనే వేగంగా పరుగులు సాధించి న్యూజిలాండ్‌పై వరుసగా మూడో టెస్ట్ విజయాన్ని సాధించాలని భావిస్తుంది. ఇంగ్లండ్ బ్యాటర్లు ఆరంభం నుంచి కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి నాలుగో రోజు ఆఖరి సెషన్లో వీలైనన్ని పరుగులు సాధించాలని అనుకుంటారు. రెండో టెస్ట్‌లో బెయిర్‌స్టో (136), స్టోక్స్ (75 నాటౌట్) ఇదే ఫార్ములాను అప్లై చేసి సక్సస్ అయ్యారు. చదవండి: ఇంగ్లండ్ జట్టులోనూ కరోనా కలకలం.. కీలక ఆటగాడికి పాజిటివ్‌గా నిర్ధారణ -
ENG VS NZ 3rd Test: బెన్ స్టోక్స్ ఖాతాలో మరో రికార్డు
Ben Stokes: న్యూజిలాండ్‌తో జరుగతున్న మూడు టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో 100 సిక్సర్లు, 100కు పైగా వికెట్లు పడగొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం స్టోక్స్ ఖాతాలో 100 సిక్సర్లు (151 ఇన్నింగ్స్‌లు), 177 టెస్ట్ వికెట్లు (81 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో (13 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్) సిక్సర్ బాదడం ద్వారా టెస్ట్‌ల్లో సిక్సర్ల సెంచరీని అందుకున్న స్టోక్స్.. 3.29 ఎకానమీతో 177 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య హెడింగ్లే వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు రెండో సెషన్ సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ లాథమ్ (50), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (23) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ 54 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ 360 పరుగులు స్కోర్ చేసి 31 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. మూడో రోజు ఆటను 264/6 స్కోర్ వద్ద ప్రారంభించిన ఇంగ్లండ్.. మరో 96 పరుగులు జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. జేమీ ఓవర్టన్ (136 బంతుల్లో 97; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని మూడు పరుగుల తేడాతో చేజార్చుకోగా.. వేగంగా పరుగులు సాధించే క్రమంలో బెయిర్ స్టో (161), స్టువర్ట్ బ్రాడ్ (42) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4, నీల్ వాగ్నర్ 2, టిమ్ సౌతీ 3, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: టెస్టుల్లో బెన్ స్టోక్స్ అరుదైన ఫీట్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా..! -
తిప్పేసిన లియోన్.. పాక్ గడ్డపై చరిత్ర సృష్టించిన ఆసీస్
3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో పాకిస్థాన్ బొక్క బోర్లా పడింది. 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ 235 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆఖరి టెస్ట్‌లో115 పరుగుల తేడాతో ఓటమిపాలై, 0-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా పాక్ గడ్డపై దాదాపు రెండున్నర దశాబ్దాల (24 ఏళ్లు) చరిత్రను తిరగరాసింది. 1998/99లో మార్క్ టేలర్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు చివరిసారిగా పాక్ గడ్డపై సిరీస్ విజయం (1-0) సాధించింది. ఈ పర్యటనలోని తొలి రెండు టెస్ట్‌లు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, 351 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి రోజు ఆటను 73/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో ప్రారంభించిన పాక్.. ఓ దశలో చారిత్రక విజయం దిశగా సాగింది. అయితే ఆసీస్ బౌలర్లు నాథన్ లియోన్ (5/83), పాట్ కమిన్స్ (3/23) పాక్ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (55), ఇమామ్ ఉల్ హక్ (70) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించగా, మిగతా వారంతా దారుణంగా నిరుత్సాహపరిచారు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు) చెలరేగిన కమిన్స్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవగా, సిరీస్ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఉస్మాన్ ఖవాజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. స్కోరు బోర్డు : ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 391 ఆలౌట్ (ఉస్మాన్ ఖ్వాజా 91, స్టీవ్ స్మిత్ 59, గ్రీన్ 79, అలెక్స్ క్యారీ 67, షాహీన్ అఫ్రిది 4/79, నసీమ్ షా (4/58)) పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 268 ఆలౌట్ (షఫీక్ 81, అజహర్ అలీ 78, బాబర్ ఆజమ్ 67, పాట్ కమిన్స్ 5/56, స్టార్క్ (4/33)) ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్ 227/3 డిక్లేర్డ్ (ఉస్మాన్ ఖ్వాజా 104 నాటౌట్, వార్నర్ 51) పాకిస్థాన్ సెకెండ్ ఇన్నింగ్స్ 235 ఆలౌట్ (ఇమామ్ ఉల్ హాక్ 70, బాబర్ ఆజమ్ 55, నాథన్ లియోన్ (5/83), కమిన్స్ (3/23)) చదవండి: చరిత్రలో రెండోసారి మాత్రమే.. 145 ఏళ్ల రికార్డు బద్దలు -
నిషేధం గండం నుంచి గట్టెక్కిన కోహ్లి అండ్ కో..!
కేప్‌టౌన్ టెస్ట్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ వివాదంలో టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లి, అశ్విన్, కేఎల్ రాహుల్‌లకు ఊరట లభించినట్లు తెలుస్తుంది. మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా నిర్ధేశించిన 212 పరుగల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 60 పరుగుల వద్ద ఎల్గర్‌ను ఫీల్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించడం, ఆ వెంటనే థర్డ్ అంపైర్ జోక్యం చేసుకుని నాటౌట్‌గా ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఈ విషయమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కోహ్లి అండ్ కో(అశ్విన్, కేఎల్ రాహుల్).. దక్షిణాఫ్రికా, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని తప్పుగా వాడి టెస్ట్ సిరీస్‌ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తోందంటూ బహిరంగంగా ఆరోపించడంతో పాటు స్టంప్ మైక్ దగ్గరికి వచ్చి థర్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ గెలవాలనుకుంటే సరైన పద్ధతులు ఎంచుకుంటే బెటర్ అని అశ్విన్ అనగా, మా పదకొండు మందిని ఔట్ చేసేందుకు దేశమంతా కలిసి ఆడుతున్నట్టుందని రాహుల్ కామెంట్ చేశాడు. ఇదే సందర్భంగా కోహ్లి.. అందరూ చూస్తుండగా స్టంప్ మైక్ దగ్గరకు వచ్చి.. కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు, మీ జట్టు మీద కూడా దృష్టి సారించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. థర్డ్ అంపైర్‌ను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను ఐసీసీ ప్రవర్తన నియమావళి 2.8 ప్రకారం కోహ్లి అండ్ కో పై ఓ మ్యాచ్ నిషేధం లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే, ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సీరియస్‌గా తీసుకోకపోవడంతో కోహ్లి అతని సహచరులు నిషేధం ముప్పు నుంచి తప్పించుకున్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోహ్లి అండ్ కో ను ఐసీసీ మందలించినట్లు తెలుస్తోంది. చదవండి: దక్షిణాఫ్రికా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాకు మరో షాక్.. -
పుజారా పర్వాలేదు.. రహానేకైతే మరో అవకాశం ఇవ్వను..!
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేపై భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యాలు చేశాడు. పేలవ ఫామ్‌లో ఉన్న రహానే తప్పనిసరిగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాలని ఆయన సూచించాడు. కేప్‌టౌన్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన రహానేకు తానైతే మరో అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2020-21 ఆసీస్ పర్యటనలో రహానే చివరిసారిగా రాణించడం చూసామని, గతేడాది అతనాడిన 15 మ్యాచ్‌ల్లో 20.25 సగటున కేవలం 547 పరుగులు మాత్రమే చేశాడని, ఇక అతను తిరిగి ఫామ్‌లోకి వస్తాడన్న ఆశలు తనకు లేవని అన్నాడు. రహానేతో పోలిస్తే పుజారా కాస్త బెటర్ అని, అతనికైతే మరో అవకాశం ఇచ్చినా తప్పులేదని అభిప్రాయడ్డాడు. కాగా, దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 136 పరుగులు చేయగా, పూజారా 124 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించి, 3 టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: Virat Kohli: 'ఆ ఇద్దరి' భవిష్యత్తు నిర్ణయించడం నా పని కాదు.. -
Virat Kohli: 'ఆ ఇద్దరి' భవిష్యత్తు నిర్ణయించడం నా పని కాదు..
Virat Kohli On Purane Future: దక్షిణాఫ్రితో టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పరోక్షంగా వెనకేసుకొచ్చాడు. మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం 'పురానే(పుజారా, రహానే)'ల భవిష్యత్తుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు భారత సారధి బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పురానే భవిష్యత్తుని నిర్ణయించడం తన పని కాదని, జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన వారి విషయంలో నా జోక్యం ఏంటని విలేకరులను ఎదురు ప్రశ్నించాడు. సెలక్టర్లు వారిద్దరిని జట్టులో ఎంపిక చేస్తే మాత్రం మా సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని బదులిచ్చాడు. సీనియర్లుగా వారి అనుభవం జట్టుకి చాలా అవసరమని పురానేలకు పరోక్షంగా తన మద్దతు తెలిపాడు. కాగా, గతేడాది కాలంగా పుజారా, రహానేలు వరుసగా విఫలమవుతూ జట్టుకి భారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లో వీరి ప్రదర్శన మరింత దిగజారింది. మూడు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 136 పరుగులు చేయగా, పూజారా 124 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇద్దరు చేసిన పరుగులతో పోలిస్తే.. టీమిండియాకి ఎక్స్‌ట్రాల రూపంలో ఎక్కువ పరుగులు వచ్చాయి. మూడు టెస్ట్‌ల్లో కలిపి దక్షిణాఫ్రికా బౌలర్లు 136 ఎక్స్‌ట్రాలు సమర్పించారు. ఇదిలా ఉంటే, టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. చదవండి: ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు -
ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయంతో చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. Opponents drops Rahane's catch, Pujara drops opponents catch but our management drops neither of them. — Heisenberg ☢ (@internetumpire) January 14, 2022 సీనియర్ల గైర్హాజరీలో యువ జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. అన్నీ రంగాల్లో అద్భుతంగా రాణించి హాట్ ఫేవరెట్ అయిన టీమిండియాకు ఊహించని షాకిచ్చింది. మరోవైపు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత్ మాత్రం ఆశించిన మేరకు రాణించలేక చతికిలబడింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమై, సిరీస్ కోల్పోవడానికి పరోక్ష కారణమైంది. కేఎల్ రాహుల్, పంత్ మినహా ఒక్కరు కూడా సెంచరీ సాధించలేకపోయారు. సీనియర్ ఆటగాళ్లైన పుజారా, రహానేలు కెరీర్లో అత్యంత గడ్డు పరిస్థితులను ఈ సిరీస్‌లోనే ఎదుర్కొన్నారు. Rahane and Pujara are the major reason for India's loss. — Rahul(Astrologer)Contact for 100% wrong prediction (@rahulpassi) January 14, 2022 పేలవ ఫామ్‌లో ఉన్న 'పురానే'కు వరుస అవకాశాలు ఇచ్చిన టీమిండియా యాజమాన్యం తగిన మూల్యమే చెల్లించుకుంది. ఈ ఇద్దరు బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ దారుణంగా నిరాశపరిచారు. కీలక సమయాల్లో సులువైన క్యాచ్‌లను జారవిడిచి జట్టు విజయావకాశాలను దెబ్బకొట్టారు. దీంతో సోషల్‌మీడియా వేదికగా అభిమానులు వీరిపై విరుచుకుపడుతున్నారు. టీమిండియా సిరీస్ కోల్పోవడానికి వీరే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు. #INDvSA High time Rahane and Pujara should be dropped off permanently from the test team squad! Dey got ample amount of chances to prove themselves! Gill, Hanuman Vihari, Shreyas Iyer we have dem waiting since forever! Its high tym now! — Angel Anki 🇮🇳 (@angel_ank1) January 14, 2022 'పురానే'కు వరుస అవకావాలు ఇస్తున్న టీమిండియా మేనేజ్మెంట్ ఇకనైనా మేల్కోవాలని.. పుజారా, రహానేల కథ ముగిసిందని.. శ్రేయస్ అయ్యర్, విహారి, శుభ్‌మన్ గిల్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, కేప్‌టౌన్ టెస్ట్‌లో రహానే రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేయగా.. పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 43,9 పరుగులు చేశాడు. వీరిద్దరూ బ్యాటింగ్‌లో రాణించకపోగా మ్యాచ్ కీలక సమయాల్లో సులువైన క్యాచ్‌లు జారవిడిచారు. చదవండి: లడ్డు లాంటి క్యాచ్ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి -
లడ్డు లాంటి క్యాచ్ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి
Pujara Drops Simple Catch Of Keegan Petersen: దక్షిణాఫ్రికా గడ్డపై తొట్టతొలి టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజేతులా జారవిడిచింది. నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్‌లో పేలవ ఫీల్డింగ్ కారణంగా మ్యాచ్‌ను ప్రత్యర్ధికి వదులుకుంది. ప్రత్యర్ధికి 212 పరుగుల ఫైటింగ్ టార్గెట్ నిర్ధేశించినప్పటికీ సునాయాసమైన క్యాచ్‌లు వదిలేయడం ద్వారా మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. నాలుగో రోజు ఆట కీలక దశలో(126/2) కీగన్ పీటర్సన్ ఇచ్చిన లడ్డు లాంటి క్యాచ్‌ను పుజారా నేలపాలు చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో పీటర్సన్ బ్యాట్ అంచును ముద్దాడిన బంతి, నేరుగా పూజారా చేతుల్లో ల్యాండైంది. అయితే పూజారా వదిలేసాడు. ఇది చూసిన కోహ్లి మిన్నకుండిపోయాడు. కాగా, పుజారా.. పీటర్సన్ క్యాచ్ వదిలేసే సమయానికి దక్షిణాఫ్రికా.. విజయానికి ఇంకా 83 పరుగుల దూరంలో ఉండింది. పీటర్సన్ కీలక ఇన్నింగ్స్(113 బంతుల్లో 10 ఫోర్లతో 82) ఆడి టీమిండియాకు విజయాన్ని దూరం చేశాడు. కాగా, దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్‌లు తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది. సీనియర్ల గైర్హాజరీలో సఫారీ జట్టు అద్భుతంగా రాణించి, టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. చదవండి: IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం..? -
IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం..?
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లిపై నిషేధం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌పై థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చినప్పటికీ.. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లపై నుంచి వెళ్తుందనే కారణంగా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా తేల్చాడు. ఈ సంబంధిత అధికారులతో పాటు ఫీల్డ్ అంపైర్ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అనంతరం థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన కోహ్లి.. స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి నోరుపారేసుకున్నాడు. కోహ్లితో పాటు అశ్విన్, కేఎల్ రాహుల్ సైతం మైక్ వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే అంపైర్‌ను ఉద్దేశించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉండటంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ప్రవర్తన నియమావళి 2.8 ప్రకారం కోహ్లిపై ఓ మ్యాచ్‌లో నిషేధం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ అనంతరం కోహ్లి స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి.. ''కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు, మీ జట్టు మీద దృష్టి సారించండి. అందరిపైనా ఫోకస్ పెట్టండి'' అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 101/2 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. ఓవర్ నైట్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ 82 పరుగుల వద్ద ఔటయ్యాడు. పీటర్సన్ ఔటయ్యే సమయానికి స్కోర్ 155/3గా ఉంది. క్రీజ్‌లో వాన్ డెర్ డస్సెన్(18), బావుమా ఉన్నారు. దక్షిణాఫ్రికా.. తమ లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది. చదవండి: Ind Vs Sa: కోహ్లి మరీ ఇంత చెత్తగా ప్రవర్తిస్తావా.. అసలేం అనుకుంటున్నావు? -
పంత్ వీరోచిత సెంచరీ.. దక్షిణాఫ్రికా గడ్డపై పలు రికార్డులు బద్దలు
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ అద్భుతం చేశాడు. వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన మొట్టమొదటి భారత, ఆసియా వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. 2010లో ధోని చేసిన 90 పరుగులే ఇక్కడ అత్యధికం కాగా, తాజాగా పంత్ దాన్ని అధిగమించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 139 బంతుల్లో 6 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచిన పంత్.. ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా, అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. తద్వారా టీమిండియా.. దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల ఫైటింగ్ టార్గెట్‌ను ఉంచగలిగింది. కెరీర్లో మూడో సెంచరీ సాధించిన పంత్.. అన్నింటినీ పేసర్లకు అనుకూలించే పిచ్‌లపైనే సాధించడం విశేషం. 2018లో ఇంగ్లండ్‌లో (114), అదే ఏడాది ఆస్ట్రేలియాలో (159), తాజాగా దక్షిణాఫ్రికాపై పంత్ శతకాలు బాదాడు. పంత్‌కు ముందు సాహా(వెస్టిండీస్‌లో 104 పరుగులు), అజయ్ రాత్రా(వెస్టిండీస్‌లో 115 నాటౌట్), విజయ్ మంజ్రేకర్(వెస్టిండీస్‌లో 118) మాత్రమే ఆసియా ఖండం బయట శతాకలు సాధించిన భారత వికెట్ కీపర్లుగా రికార్డుల్లో నిలిచారు. ఇదిలా ఉంటే, టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ 198 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. రిషబ్ పంత్ వీరోచిత సెంచరీ(100 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(10), కోహ్లి(29), పంత్ మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే. చదవండి: పది రోజుల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు.. ఇంతలోనే..! -
దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు
Most Batsmen Out Caught In A Test Series: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో టీమిండియా సరికొత్త సృష్టించింది. కనీసం మూడు టెస్ట్‌ల సిరీస్‌లో అత్యధిక క్యాచ్ ఔట్లు అయిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. రెండో ఇన్నింగ్స్‌లో రబాడ బౌలింగ్‌లో ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి రహానే(1) వెనుదిరగడంతో ఈ రికార్డు భారత్ ఖాతాలోకి చేరింది. ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటివరకు 49 మంది భారత బ్యాటర్లు క్యాచ్ ఔటై వెనుదిరిగారు. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ పేరిట ఉండేది. 2009/10 న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 48 పాక్ ఆటగాళ్లు క్యాచ్ ఔట్ల రూపంలో వెనుదిరిగారు. కాగా, 2006/07లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో సైతం 47 మంది భారత ఆటగాళ్లు క్యాచ్ ఔట్ కావడం విశేషం. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు కట్టడి చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(16), రిషబ్ పంత్ క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 73 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్లో ఇంగ్లండ్ కెప్టెన్ అరంగేట్రం!.. అయితే.. -
IND Vs SA 3rd Test: సెంచరీ పూర్తి చేసిన కోహ్లి
కేప్‌టౌన్: టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి టెస్ట్‌ల్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. టెస్ట్‌ల్లో సెంచరీ మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అదేంటీ.. కోహ్లి కొత్తగా సెంచరీ సాధించడమేంటీ అని అనుకుంటున్నారా..? అయితే, కోహ్లి ఈ సారి సెంచరీ మార్కును అందకుంది బ్యాటింగ్‌లో కాదు. అతను సెంచరీ పూర్తి చేసింది ఫీల్డింగ్‌లో. Virat Kohli completes 1️⃣0️⃣0️⃣ catches in Test cricket 🙌 He is the sixth Indian fielder, who isn't a wicket-keeper, to get to the milestone in Tests. Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE1P6t pic.twitter.com/g7eoPK0wnB — ICC (@ICC) January 12, 2022 దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో షమీ బౌలింగ్‌లో టెంబా బవుమా క్యాచ్ అందుకోవడం ద్వారా కోహ్లి టెస్ట్‌ల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేశాడు. తద్వారా రాహుల్ ద్రవిడ్(164 టెస్ట్‌ల్లో 210 క్యాచ్‌లు), వీవీఎస్ లక్ష్మణ్(134 మ్యాచ్‌ల్లో 135), సచిన్ టెండూల్కర్(200 మ్యాచ్‌ల్లో 115), సునీల్ గవాస్కర్(125 మ్యాచ్‌ల్లో 108), అజహారుద్దీన్(99 టెస్ట్‌ల్లో 105)ల తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్‌గా(వికెట్‌కీపర్ కాకుండా) నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి కెరీర్లో 99వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో కోహ్లి సెకెండ్ స్లిప్‌లో అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో బవుమా(28) పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజ్‌లో పీటర్సన్(61), వెర్రిన్ ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, ఉమేశ్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, షమీ ఓ వికెట్ సాధించాడు. అంతకుముందు తొలి రోజు భారత్ 223 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: IND vs SA ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక -
IND Vs SA: కోహ్లి ఈగోను పక్కకు పెట్టాడు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Gautam Gambhir Hails Virat Kohli: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 79 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై భారత మాజీ ఓపెనర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విషయం ఏదైన కోహ్లిపై విమర్శనాస్త్రాలు సంధించే గంభీర్.. తొలిసారిగా కోహ్లిని ఉద్దేశించి పాజిటివ్‌గా మాట్లడాడు. కేప్‌టౌన్ టెస్ట్‌లో కోహ్లి.. తన ఈగోను బ్యాగ్‌లో పెట్టి బ్యాటింగ్ చేశాడని, ఆ కారణంగానే కీలక ఇన్నింగ్స్ ఆడగలిగాడని పేర్కొన్నాడు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అహాన్ని పక్కకు పెట్టాలని కోహ్లి తన సహచరులకు సూచించేవాడని, తాజా ఇన్నింగ్స్‌లో కోహ్లి ఆ ఫార్ములాను పక్కాగా అమలు చేశాడని కితాబునిచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో సఫారీ పేసర్లు కవ్వించే బంతులు విసిరినా ఏకాగ్రత కోల్పోకుండా సంయమనంతో బ్యాటింగ్ చేసిన కోహ్లి.. జట్టుకు గౌవరప్రదమైన స్కోర్ అందించాడని ప్రశంసించాడు. ఓపెనర్ల వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. తన సహజ శైలికి భిన్నంగా ఎంతో ఓర్పుతో 201 బంతులను ఎదుర్కొని కీలక ఇన్నింగ్స్ ఆడాడని ఆకాశానికెత్తాడు. చాలా కాలం తర్వాత కోహ్లి.. తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడని ప్రశంసలు కురిపించాడు. కోహ్లి ఆడిన ఈ క్లాసీ ఇన్నింగ్స్ శతకంతో సమానమని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, కోహ్లి రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన సఫారీలు తొలి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్(3)ను బుమ్రా ఔట్ చేయగా.. క్రీజ్‌లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు. చదవండి: ICC Test Rankings: దూసుకొచ్చిన ప్రొటిస్ కెప్టెన్.. టీమిండియా నుంచి అతడొక్కడే! -
శతక్కొట్టి కూతురికి బర్త్ డే గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు.. కానీ..!
Vamika First Birth Day: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకే ఆలౌటై నిరాశపరిచింది. కెప్టెన్ కోహ్లి(201 బంతుల్లో 79; 12 ఫోర్లు, సిక్స్) ఓంటరి పోరాటం చేయడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రెండేళ్లకుపైగా శతక దాహంతో ఉన్న కోహ్లి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. అయితే, వారికి మరోసారి నిరాశే ఎదురైంది. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి ఎంతో ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మించినప్పటికీ, మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతుండడంతో ఒత్తిడికి లోనై 211 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. కాగా, తన వ్యక్తిగత జీవితంలో చాలా ప్రత్యేకమైన ఈ రోజున సెంచరీ మార్కును అందుకోవాలని కోహ్లి సైతం ఎంతో పట్టుదలగా కనిపించాడు. అయితే, రబాడ అద్భుతమైన బంతితో కోహ్లిని బోల్తా కొట్టించాడు. ఇదిలా ఉంటే, కోహ్లి వ్యక్తిగత జీవితంలో ఇవాళ ప్రత్యేకమైన రోజు. తన గారాల పట్టి వామిక ఇవాళ మొదటి పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కూతురికి శతకం సాధించి స్పెషల్ గిఫ్ట్ ఇద్దామని కోహ్లి భావించాడు. అయితే, అతని ఆశలు అడియాశలు అయ్యాయి. చాలా కాలంగా ఊరిస్తున్న సెంచరీ మైలరాయి కోసం కోహ్లి మరో ఇన్నింగ్స్ వరకు వేచి చూడాల్సి ఉంది. కాగా, విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దంపతులకు గతేడాది జనవరి 11న వామిక జన్మించిన సంగతి తెలిసిందే. వామిక ఫోటోను సైతం కోహ్లి దంపతులు ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలీనివ్వకపోవడం విశేషం. చదవండి: 'తగ్గేదేలే' డైలాగ్‌తో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ -
IND Vs SA 3rd Test: ద్రవిడ్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లి
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో టీమిండియా సారధి విరాట్ కోహ్లి మరో రికార్డు నెలకొల్పాడు. సఫారీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో జట్టు కోచ్, భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కునెట్టాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ద్రవిడ్ 11 టెస్ట్‌ల్లో 624 పరుగులు చేయగా, ప్రస్తుత ఇన్నింగ్స్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి.. ద్రవిడ్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ (15 మ్యాచ్‌ల్లో 1161 పరుగులు) అగ్రస్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 7 టెస్ట్‌లు ఆడిన కోహ్లి.. 50కి పైగా సగటుతో 626* పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 28 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్(15), కేఎల్ రాహుల్(12) ఔట్ కాగా.. కోహ్లి(15), పుజారా(26) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: టీమిండియాకు భారీ షాక్.. జట్టు సభ్యుడికి కరోనా -
ఏడో ర్యాంక్‌లో ఉన్న టీమిండియాను నంబర్ వన్‌గా నిలబెట్టాను.. విరాట్ కోహ్లి
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌కు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా సారధి విరాట్ కోహ్లి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని నుంచి టెస్ట్ కెప్టెన్సీ తీసుకునే సమయానికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఏడో స్థానంలో ఉండేదని, దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాని, అలాంటి పరిస్థితుల్లో నుంచి టీమిండియాను నంబర్ వన్‌గా నిలబెట్టానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టెస్ట్‌ల్లో టీమిండియాను నంబర్ వన్ చేయాలనే టార్గెట్‌తో పని చేశానని, అందుకు ఫలితంగానే టీమిండియా నేటికీ అగ్రస్థానంలో కొనసాగుతుందని పేర్కొన్నాడు. రేపటి నుంచి ప్రారంభంకానున్న ఆఖరి టెస్ట్‌కు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా స్పష్టం చేసిన కోహ్లి.. తాను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని అన్నాడు. ఇదే సందర్భంగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై మాట్లాడుతూ.. రెండో టెస్ట్‌లో వికెట్లు తీసేందుకు రాహుల్ అన్ని వ్యూహాలను అమలు చేశాడని, కానీ దక్షిణాఫ్రికా అద్బుతంగా ఆడి మ్యాచ్‌ను లాగేసుకుందని తెలిపాడు. జట్టును నడిపించడంలో ఎవరి స్టైల్ వారికి ఉంటుందని, రాహుల్ కూడా తన స్టైల్లోనే జట్టును నడిపించాడని వివరించాడు. గంటకు పైగా సాగిన ప్రెస్మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు కోహ్లి తనదైన శైలిలో బదులిచ్చాడు. ఇదిలా ఉంటే, రేపటి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్‌లో గాయపడిన సిరాజ్ స్థానంలో ఇషాంత్ శర్మ, విహారి ప్లేస్‌లో విరాట్ కోహ్లి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. టీమిండియా తుది జట్టు (అంచనా): కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా చదవండి: Virat Kohli: పంత్ గుణపాఠాలు నేర్చుకుంటాడు.... ఇక రహానే, పుజారా.. -
ఎక్కడ మొదలెట్టానో అక్కడే ఉన్నాను.. టీమిండియా పేసర్ ఆసక్తికర ట్వీట్
IND Vs SA 3rd Test: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రేపటి(జనవరి 11) నుంచి ప్రారంభంకానున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర ట్వీట్ చేశాడు. టెస్ట్ కెరీర్‌ను ఎక్కడ మొదలుపెట్టానో నాలుగేళ్ల తర్వాత అక్కడే ఉన్నానంటూ తన టెస్ట్ అరంగేట్రాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. 2018 జనవరిలో ఇదే వేదికపై టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. నాలుగేళ్ల కాలంలో ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగానూ పరిణితి చెందానని, తిరిగి కేప్‌టౌన్‌కు రావడం మధుర స్మృతులను నెమరువేసుకున్నట్లు ఉందని భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశాడు. Cape Town, January 2018 - is where it all began for me in Test cricket. Four years on, I’ve grown as a player and a person and to return to this ground brings back special memories. 😊 pic.twitter.com/pxRPNnqwBH— Jasprit Bumrah (@Jaspritbumrah93) January 9, 2022 విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఆ సిరీస్‌లో తొలి మ్యాచ్ ద్వారా బుమ్రా టెస్ట్ అరంగేట్రం చేశాడు. 3 మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో అతను 14 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు 25 టెస్ట్‌లు ఆడిన బుమ్రా.. 23.24 సగటుతో 106 వికెట్లు సాధించాడు. ఇదిలా ఉంటే, 3 టెస్ట్‌ల ప్రస్తుత సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. రేపటి నుంచి ప్రారంభంకాబోయే నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఇరు జట్లు అమితుమీకి సిద్ధమయ్యాయి. చదవండి: విరాట్ కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుని, భార్యకు భరణం కట్టలేనంటావా..? -
IND Vs SA 3rd Test: టీమిండియా అభిమానులకు శుభవార్త..
కేప్‌టౌన్: టీమిండియా అభిమానులకు శుభవార్త. మూడో టెస్ట్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లి అందుబాటులోకి రానున్నాడు. ఈ మేరకు కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనప్రాయంగా వెల్లడించాడు. ఆదివారం కోహ్లి నెట్స్‌లో పాల్గొనడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. కోహ్లి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. నెట్స్‌లో కోహ్లి చాలా సేపు ప్రాక్టీస్ చేయడం చూస్తే.. అతని గాయం పూర్తిగా మానినట్లు తెలుస్తోంది. It's GO time here in Cape Town 👏 👏#TeamIndia all set and prepping for the series decider 👍 👍#SAvIND pic.twitter.com/RgPSPkNdk1 — BCCI (@BCCI) January 9, 2022 కీలక మ్యాచ్ సమయానికి కోహ్లి కోలుకోవడంతో అతని అభిమానులు సహా టీమిండియా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా, వెన్ను నొప్పి కారణంగా కోహ్లి రెండో టెస్ట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కోహ్లి గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో సఫారీల చేతిలో ఓటమిపాలైంది. ఫలితంగా మూడు టెస్ట్‌ల సిరీస్‌లో చెరో గెలుపుతో ఇరు జట్లు సమంగా నిలిచాయి. జనవరి 11 నుంచి సిరీస్‌లో చివరిదైన మూడో టెస్ట్ ప్రారంభంకానుంది. చదవండి: IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..? -
IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..?
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ సందర్భంగా గాయపడిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్, మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతని స్థానాన్ని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మతో భర్తీ చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. సిరాజ్ స్థానానికి ఇషాంత్, మరో పేసర్ ఉమేశ్ యాదవ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. 100 టెస్ట్‌ల అనుభవం ఉందన్న కారణంగా కోచ్ ద్రవిడ్, కెప్టెన్ కోహ్లి.. ఇషాంత్‌వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. ఆఖరి టెస్ట్‌కు వేదిక అయిన కేప్‌టౌన్‌లో పిచ్ బౌన్స్‌కు సహకరించనుండడంతో అక్కడ ఇషాంత్ ఉపయోగకరంగా మారతాడని ద్రవిడ్ భావిస్తున్నాడట. బౌన్సీ పిచ్‌పై ఇషాంత్ హైట్‌ను కూడా పరిగణలోకి తీసుకుని ఆఖరి టెస్ట్ తుది జట్టులో అతన్ని ఆడించాలని ద్రవిడ్ ఫిక్స్ అయ్యాడట. 105 టెస్ట్‌ల్లో 311 వికెట్లు పడగొట్టిన ఇషాంత్.. తన చివరి టెస్ట్‌ను గతేడాది డిసెంబర్లో ఆడాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఫలితంగా అతను దక్షిణాఫ్రికా సిరీస్‌లో డ్రెసింగ్ రూమ్‌కే పరిమితమ్యాడు. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల ప్రస్తుత సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. సిరీస్ డిసైడర్‌గా నిలిచే మూడో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుండగా, రెండో టెస్ట్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఎల్గర్ సేన సైతం గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. జనవరి 11 నుంచి ఆఖరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. చదవండి: IPL 2022: ఈ ఏడాది కూడా విదేశాల్లోనే..? -
జనవరి 11, 2022.. ఆ రోజు కోహ్లికి చిరకాలం గుర్తుండిపోనుంది.. ఎందుకంటే..?
Virat Kohli To Celebrate Daughter First Birthday And 100th Test On Jan 11, 2022: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి వచ్చే ఏడాది(2022) జనవరి 11వ తేదీ ప్రత్యేకమైన రోజు కానుంది. ఆ రోజు కోహ్లి, అనుష్క దంపతుల గారాలపట్టి వామిక మొదటి జన్మదినం కావడంతో పాటు కెరీర్లో కోహ్లికి వందో టెస్ట్ కావడం విశేషం. క్రికెట్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ చిరకాలం గుర్తుండిపోయే ఆ రోజు కోసం కోహ్లి సహా అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ 26న తొలి టెస్టు ఆడనున్న భారత్.. రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి 3న, సిరీస్‌లో ఆఖరుదైన మూడో టెస్ట్ జనవరి 11న ఆడాల్సి ఉంది. ఇప్పటివరకు కెరీర్లో 97 టెస్ట్‌లు ఆడిని ఈ రన్ మెషీన్.. మరో మూడు మ్యాచ్‌లు ఆడితే తన కెరీర్లో మరో అరుదైన మైలరాయిని చేరుకుంటాడు.విరాట్ తన టెస్ట్ కెరీర్లో 50.65 సగటుతో 7,801 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో వారం రోజుటు వాయిదా పడిన దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ వాయిదా పడగా.. టెస్ట్, వన్డే సిరీస్‌లు యధావిధిగా జరగనున్న సంగతి తెలిసిందే. మరోవైపు కోహ్లి తన ముద్దుల తనయ వామికకు సంబంధించిన ఫోటో కాని వీడియో కాని ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడంతో.. ఆ రోజు కోహ్లి ఖచ్చితంగా తన కూతురును ప్రపంచానికి పరిచయం చేస్తాడని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. చదవండి: అందుకే విరాట్‌ను ప్రపంచపు అత్యుత్తమ కెప్టెన్ అనేది: పాక్ మాజీ సారధి -
అదును చూసి విరుచుకుపడ్డాం.. ఇంగ్లండ్ బౌలర్లను ఆకాశానికెత్తిన రూట్
లీడ్స్: టీమిండియాతో జరిగిన మూడో టెస్ట్‌లో అతిధ్య ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్ సారధి జో రూట్ తమ బౌలర్లను ఆకాశానికెత్తాడు. ఈ విజయం కచ్చితంగా బౌలర్లదేనని కొనియాడాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారని, వరుస మెయిడిన్లతో టీమిండియా ఆటగాళ్లపై ఒత్తిడి పెంచారని అన్నాడు. వికెట్లు తీసే అవకాశం కోసం ఎదురు చూసామని, అదును చూసి కనికరం లేకుండా విరుచుకుపడ్డామని పేర్కొన్నాడు. నాలుగో రోజు కొత్త బంతితో తమ బౌలర్లు చెలరేగుతారని ముందే ఊహించామని తెలిపాడు. తొలి రోజు అండర్సన్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాపై పైచేయి సాధించేలా చేశాడని, అతనికి రాబిన్సన్ మద్దతు తోడవ్వడంతో ప్రత్యర్ధిని కోలుకోలేని దెబ్బ తీసామని అన్నాడు. లేటు వయసులో అండర్సన్ యువ బౌలర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడని, అందుకే అతడిని టెస్టు క్రికెట్లో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్' అని అభివర్ణిస్తారని కొనియాడాడు. ఇక బ్యాటింగ్‌లో రాణించిన ఓపెనర్లు రోరీ బర్న్స్, హమీద్‌తో పాటు డేవిడ్ మలన్‌పై కూడా రూట్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన హోమ్ గ్రౌండ్లో చాలా రోజుల తర్వాత శతకం బాదడం గొప్పగా ఉందని రూట్ పేర్కొన్నాడు. కాగా, లీడ్స్‌లో విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానుంది. చదవండి: క్రీడలను అలవాటుగా మార్చుకోండి.. సచిన్ సందేశం