సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. 96 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశ నుంచి పాక్ అద్భుతంగా తేరుకుంది. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు మొహమ్మద్ రిజ్వాన్ (88), అఘా సల్మాన్ (53), ఆమిర్ జమాల్ (82) వీరోచితంగా పోరాడి పాక్ పరువు కాపాడారు.
ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్ డకౌట్లు కాగా.. షాన్ మసూద్ (35), బాబర్ ఆజమ్ (26) కాసేపు ఆసీస్ బౌలర్లను నిలువరించారు. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు సౌద్ షకీల్ (5) ఔట్ కావడంతో పాక్ కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్.. అఘా సల్మాన్, ఆమిర్ జమాల్ సహకారంతో పాక్‌కు ఫైటింగ్ టోటల్‌ను అందించాడు.
తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమిర్ జమాల్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మరోసారి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5/61) చెలరేగి పాక్ వెన్నువిరచగా.. స్టార్క్ (2/75), హాజిల్‌వుడ్ (1/65), లయోన్ (1/74), మార్ష్ (1/27) మిగతా పనిని కానిచ్చేశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ 6, ఉస్మాన్ ఖ్వాజా 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment