సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తన టెస్టు కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన డేవిడ్ వార్నర్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(62) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక 68/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల అధిక్యాన్ని కలుపుకుని ఆసీస్ ముందు 130 పరుగుల లక్ష్యాన్ని పాక్ నిలిపింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ 4 వికెట్లతో పాక్‌ను దెబ్బతీయగా.. లయోన్ 3 వికెట్లు, స్టార్క్, కమ్మిన్స్, హెడ్ తలా వికెట్ సాధించారు.
కాగా అంతకముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో లబుషేన్(60) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లబుషేన్‌తో పాటు మిచెల్ మార్ష్(54), ఖావాజా(47) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమీల్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment