పాకిస్తాన్‌తో మూడో టెస్టు.. ఆసీస్‌ జట్టు ప్రకటన! వార్నర్‌కు ఆఖరి మ్యాచ్‌ | Warner named in Australia squad for 3rd Pakistan test | Sakshi
Sakshi News home page

PAK vs AUS: పాకిస్తాన్‌తో మూడో టెస్టు.. ఆసీస్‌ జట్టు ప్రకటన! వార్నర్‌కు ఆఖరి మ్యాచ్‌

Published Sun, Dec 31 2023 8:12 AM | Last Updated on Sun, Dec 31 2023 9:30 AM

Warner named in Australia squad for 3rd Pakistan test - Sakshi

పాకిస్తాన్‌తో మూడో టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్‌లో కోసం జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. రెండో టెస్టుకు ఎంపిక చేసిన జట్టునే సెలక్టర్లు కొనసాగించారు. తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడనున్న స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు ఘనంగా విడ్కోలు పలికేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా సిద్దమైంది. జనవరి 3 నుంచి సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్‌ అనంతరం టెస్టు క్రికెట్‌కు వార్నర్‌ గుడ్‌బై చెప్పనున్నాడు. ఇప్పటికే తన నిర్ణయాన్ని డేవిడ్‌ భాయ్‌ వెల్లడించాడు. తన హోం గ్రౌండ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని వార్నర్‌ భావిస్తున్నాడు. ఇక తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో సిరీస్‌ సొంతం చేసుకుంది.

ఆసీస్‌ జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్,ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్‌,నాథన్ లియోన్,మిచెల్‌ మార్ష్,స్టీవ్ స్మిత్,మిచెల్‌ స్టార్క్,డేవిడ్ వార్నర్
చదవండి: #Saumy Pandey: ఐపీఎల్‌ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement