ఇంగ్లండ్‌దే సిరీస్‌ | England vs West Indies, 3rd Test: James Anderson destroys West Indies to wrap up England win | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌దే సిరీస్‌

Published Sun, Sep 10 2017 1:10 AM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

ఇంగ్లండ్‌దే సిరీస్‌

ఇంగ్లండ్‌దే సిరీస్‌

మూడో టెస్టులో విండీస్‌పై విజయం  

లార్డ్స్‌: జేమ్స్‌ అండర్సన్‌ ఇన్నింగ్స్‌లో తన కెరీర్‌ ఉత్తమ బౌలింగ్‌ (7/42) గణాంకాలతో చెలరేగడంతో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2–1తో దక్కించుకుంది. శనివారం మూడో రోజు విండీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 65.1 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. రెండో రోజు ఆటలో టెస్టుల్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న అండర్సన్‌ మూడో రోజు మరింత జోరును కనబరచడంతో విండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడలా కూలింది. హోప్‌ (62), పావెల్‌ (45) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 28 ఓవర్లలో 107 పరుగులు చేసి గెలిచింది. స్టోన్‌మన్‌ (40 నాటౌట్‌), వెస్టీ›్ల (44 నాటౌట్‌) రాణించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement