
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో (Afghanistan) ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England) పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) చెలరేగిపోయాడు.
ఈ మ్యాచ్‌లో ప్రస్తుతానికి (6 ఓవర్లు) మూడు వికెట్లు తీసిన ఆర్చర్.. తొలి వికెట్‌తో ఓ భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 50 వికెట్ల మార్కును చేరుకునేందుకు ఆర్చర్‌కు కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే అవసరమయ్యాయి.
గతంలో ఈ రికార్డు జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉండేది. ఆండర్సన్ 31 వన్డేల్లో 50 వికెట్ల మార్కును తాకాడు. ఇంగ్లండ్ బౌలర్లు స్టీవ్ హార్మిసన్ 32, స్టీవ్ ఫిన్ 33 వన్డేల్లో 50 వికెట్లు తీశారు. వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక మాజీ స్పిన్నర్ అజంతా మెండిస్ పేరిట ఉంది. మెండిస్ కేవలం 19 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని తాకాడు. మెండిస్ తర్వాత నేపాల్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ (22 మ్యాచ్‌ల్లో) అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని తాకాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..
అజంత మెండిస్-19 మ్యాచ్‌లు
సందీప్ లామిచ్చేన్-22
అజిత్ అగార్కర్-23
మెక్‌క్లెనగన్-23
కుల్దీప్ యాదవ్-24
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జోఫ్రా ఆర్చర్ ధాటికి ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆర్చర్.. 11 పరుగుల వద్ద గుర్భాజ్‌ను (6), 15 పరుగుల వద్ద సెదికుల్లా అటల్‌ను (4).. 37 పరుగుల వద్ద రహ్మత్ షాను (4) ఔట్ చేశాడు. అయితే ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌కు జీవం పోశారు. హష్మతుల్లా 40 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
అనంతరం జద్రాన్..అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (29 నాటౌట్) సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జద్రాన్‌కు ఇది వన్డేల్లో ఆరో సెంచరీ. జద్రాన్ 2023 వరల్డ్‌కప్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించాడు. జద్రాన్ సెంచరీ పూర్తయ్యాక అజ్మతుల్లా బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు.
లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో సిక్సర్.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, సిక్సర్లు సాధించాడు. ప్రస్తుతం అజ్మతుల్లా 24 బంతుల్లో బౌండరీ, 3 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. 37.3 ఓవర్ల అనంతరం ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 201/4గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment