Ben Stokes: న్యూజిలాండ్‌తో జరుగతున్న మూడు టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో 100 సిక్సర్లు, 100కు పైగా వికెట్లు పడగొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం స్టోక్స్ ఖాతాలో 100 సిక్సర్లు (151 ఇన్నింగ్స్‌లు), 177 టెస్ట్ వికెట్లు (81 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో (13 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్) సిక్సర్ బాదడం ద్వారా టెస్ట్‌ల్లో సిక్సర్ల సెంచరీని అందుకున్న స్టోక్స్.. 3.29 ఎకానమీతో 177 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య హెడింగ్లే వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు రెండో సెషన్ సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ లాథమ్ (50), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (23) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ 54 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ 360 పరుగులు స్కోర్ చేసి 31 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.
మూడో రోజు ఆటను 264/6 స్కోర్ వద్ద ప్రారంభించిన ఇంగ్లండ్.. మరో 96 పరుగులు జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. జేమీ ఓవర్టన్ (136 బంతుల్లో 97; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని మూడు పరుగుల తేడాతో చేజార్చుకోగా.. వేగంగా పరుగులు సాధించే క్రమంలో బెయిర్ స్టో (161), స్టువర్ట్ బ్రాడ్ (42) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4, నీల్ వాగ్నర్ 2, టిమ్ సౌతీ 3, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు.
చదవండి: టెస్టుల్లో బెన్ స్టోక్స్ అరుదైన ఫీట్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా..!
Comments
Please login to add a commentAdd a comment