Rare record
-
ఒక్క రోజే 65 లక్షల మంది ప్రయాణం 24 కోట్ల రూపాయల ఆదాయం
సాక్షి, హైదరాబాద్ : ఒకే రోజు బస్సుల్లో 65 లక్షల మందిని గమ్యం చేర్చి ఆర్టీసీ మరో రికార్డు సృష్టించింది. సోమవారం రోజున ఈ ఘనత చోటు చేసుకుంది. సాధారణ రోజులతో పోలిస్తే సోమవారాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు. ఈ పదో తేదీ సోమవారం రోజున ఆ రద్దీ మరింత ఎక్కువగా నమోదైంది. ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ రికార్డు కాని రీతిలో ఏకంగా 109.8 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. బస్సులన్నీ కిక్కిరిసి ప్రయాణించటంతో ఆర్టీ సీకి 24 గంటల్లో ఏకంగా రూ.24.06 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో జీరో టికెట్ల వాటా కూడా ఉంది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు కొనుగోలు చేసిన జీరో టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీ సీకి రీయింబర్స్ చేయాల్సి ఉంది. వాటితో కలుపుకొని ఈ రికార్డు స్థాయి ఆదాయాన్ని ఒకే రోజు ఆర్టీసీ పొందినట్టయింది. ప్రభుత్వం రీయింబర్స్ చేస్తేనే..ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. సోమవారాల్లో ఆ రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతో గత కొన్ని నెలలుగా సోమవారాల్లో ఆర్టీసీ అధిక ఆదాయాన్ని సాధిస్తోంది. జీరో టికెట్ల రూపంలో రికార్డుస్థాయిలో ఆదాయం నమోదవుతున్నా, ఆర్టీ సీకి మాత్రం అదే రోజు ఆ ఆదాయం రావడం లేదు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా, ప్రతినెలా ఆ మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లిస్తేనే దాన్ని ఆదాయంగా పరిగణించాల్సి వస్తుంది. కానీ, పాత బకాయిలతోపాటు, ఈ ఆదాయం మొత్తంగా ఇప్పటి వరకు ఆర్టీ సీకి అందలేదని తెలుస్తోంది. గతేడాది బడ్జెట్‌కు సంబంధించిన బకాయిలతో కలుపుకుంటే ఆర్టీ సీకి ప్రభుత్వం రూ.2200 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు అంతమొత్తం విడుదల కాలేదు. ఇక 2015 వేతన సవరణకు సంబంధించి బాండ్ల డబ్బులు కూడా పూర్తిస్థాయిలో అందలేదు. ఆ మొత్తానికి సంబంధించిన నిధులు ఆర్టీ సీకి విడుదల చేస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించినా, కేవలం డ్రైవర్లకు మాత్రమే ఆ నిధులందాయి. మిగతావారు ఎదురుచూస్తున్నారు. దీనికి కూడా నిధులు లేకపోవటమే కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు కాగితాలపై రికార్డు స్థాయి ఆదాయం నమోదైనా.. ప్రభుత్వం రీయింబర్స్ చేసినప్పుడే అది నిజం ఆదాయంగా ఆర్టీసీ పరిగణించాల్సి ఉంటుంది. -
2 గర్భసంచులు.. 2 రోజులు..2 ప్రసవాలు
అమెరికా మహిళ అరుదైన రికార్డు అద్భుతాలకే అద్భుతంగా చెప్పదగ్గ ఈ ఉదంతం అమెరికాలో జరిగింది. అలబామాకు చెందిన కెల్సీ హాచర్ అనే 32 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో డిసెంబర్ 19న యూనివర్సిటీ ఆఫ్ అలబామాలోని బర్మింగ్‌హాం ఆస్పత్రి (యూఏబీ)లో చేరింది. 10 గంటల పురిటి నొప్పుల తర్వాత సాధారణ కాన్పులో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ పురిటి నొప్పులు మాత్రం అలాగే కొనసాగాయి. మరో 10 గంటల తర్వాత సిజేరియన్ ద్వారా మరో ఆడపిల్లకు జన్మనిచ్చి అబ్బురపరిచింది. కెల్సీకి రెండు గర్భసంచులుండటం, రెండింట్లోనూ ఒకేసారి గర్భధారణ జరగడం వల్ల ఈ అద్భుతం సాధ్యమైంది. మహిళల్లో ఇలా రెండు గర్భసంచులుండే ఆస్కారమే కేవలం 0.3 శాతమట! వారిలోనూ రెండింట్లోనూ ఒకేసారి గర్భం ధరించే ఆస్కారమైతే 10 లక్షల్లో ఒక్క వంతు మాత్రమేనట! అరుదైన ఈ జంట అద్భుతాలు రెండూ కలిసి రావడంతో కెల్సీ ఇలా అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది!! తొలి మూడు కాన్పులు సాధారణమే... కెల్సీకి రెండు గర్భసంచులు ఉన్నట్టు 17వ ఏట బయట పడింది. కానీ పెళ్లి తర్వాత తొలి కాన్పుల్లోనూ సాధారణంగా ఒక్కొక్కరే పుట్టారు. ఈసారీ అలాగే జరగనుందని నెల తప్పినప్పుడు కెల్సీ అనుకుందట. ‘‘కానీ అల్ట్రా సౌండ్ చేయిస్తే రెండు గర్భసంచుల్లోనూ పిండాలున్నట్టు తెలిసి చెప్పలేనంత థ్రిల్‌కు లోనయ్యా. అసలలాంటిది సాధ్యమని మొదట నమ్మకమే కుదర్లేదు’’ అని సంబరంగా చెప్పుకొచ్చిందామె! అక్కణ్నుంచి కెల్సీ తన అసాధారణ జంట గర్భధారణ గాథను ఇన్‌స్టాగ్రాంలో రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచి్చంది. చూస్తుండగానే నెలలు నిండటం, ఆస్పత్రిలో చేరడం, వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు పాపాయిలకు జన్మనిచ్చి రికార్డులకెక్కడం చకచకా జరిగిపోయాయి. ఈ అరుదైన కాన్పుల కోసం ఆస్పత్రి డబుల్ ఏర్పాట్లు చేయడం విశేషం! డబుల్ మానిటరింగ్, డబుల్ చారి్టంగ్ మొదలుకుని కాన్పు కోసం రెండింతల సిబ్బందిని నియమించడం దాకా అన్నీ ‘రెట్టింపు స్పీడు’తో జరిగాయి. ఇద్దరు పాపాయిలూ గర్భంలో ఆరోగ్యంగా పెరిగినట్టు కాన్పు చేసిన వైద్య బృందానికి సహ సారథ్యం వహించిన ప్రొఫెసర్ రిచర్డ్ డేవిస్ తెలిపారు. ‘‘ఒకే గర్భసంచిలో రెండు పిండాలు పెరిగిన బాపతు సాధారణ గర్భధారణ కాదిది. పిల్లలిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో వేర్వేరు ఫ్లాట్లలో మాదిరిగా ఎవరి గర్భసంచిలో వారు స్వేచ్ఛగా ఎదిగారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘డిసెంబర్ 19న రాత్రి 7.45 గంటలకు తొలి పాప పుట్టింది. 10 గంటల పై చిలుకు పురిటి నొప్పుల తర్వాత డిసెంబర్ 20న ఉదయం 6.10 గంటలకు సిజేరియన్ చేసి రెండో పాపను బయటికి తీశాం. ఇంతటి అరుదైన ఘటనకు సాక్షులుగా నిలిచామంటూ మా వైద్య బృందమంతా కేరింతలు కొట్టాం’’ అని వివరించారు. పిల్లల బుల్లి రికార్డు...! నవజాత శిశువులు కూడా రికార్డుల విషయంలో తమ తల్లికి ఏ మాత్రమూ తీసిపోలేదు. వేర్వేరు గర్భసంచుల్లో పెరగడమే గాక ఏకంగా వేర్వేరు పుట్టిన రోజులున్న అత్యంత అరుదైన కవలలుగా రికార్డులకెక్కారు. అంతేకాదు, వీరు ఎవరికి వారు వేర్వేరు అండం, వీర్య కణాల ఫలదీకరణ ద్వారా కడుపులో పడటం మరో విశేషం! ఇలాంటి కవలలను ఫ్రాటర్నల్ ట్విన్స్‌గా పిలుస్తారని ప్రొఫెసర్ రిచర్డ్ తెలిపారు. మొత్తానికి రికార్డులు సృష్టించడంలో తల్లికి తీసిపోమని పుట్టీ పుట్టగానే నిరూపించుకున్నారంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు! బంగ్లా మహిళ బంపర్ రికార్డు! ఇలాంటి అరుదైన ‘జంట జననాలు’ అత్యంత అరుదే అయినా అసలు జరగకుండా పోలేదు. 2019లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఇలాంటి ఘటన దీన్ని తలదన్నేలా ఉండటం విశేషం! రెండు గర్భసంచుల్లోనూ గర్భం దాలి్చన ఓ మహిళ తొలి కాన్పు తర్వాత ఏకంగా నెల రోజుల తర్వాత రెండో పాపాయికి జన్మనిచ్చిందట! ఆ పురుళ్లు పోసిన వైద్యుడు అప్పట్లో ఈ వింతను బీబీసీతో పంచుకున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్ర సృష్టించిన నాథన్ లయోన్.. నో బాల్ వేయకుండా 30,000 బంతులు
146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లయోన్ ఈ అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్ట్‌లో లయోన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇంతకీ లయోన్ సాధించిన ఆ రికార్డు ఏంటంటే.. 1877లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ మొదలైన నాటి నుంచి నేటి వరకు ఒకే ఒక్క బౌలర్ (కనీసం 100 టెస్ట్‌లు ఆడిన క్రికెటర్) టెస్ట్‌ల్లో కనీసం ఒక్క నో బాల్ కూడా వేయకుండా 30,000 బంతులను బౌల్ చేశాడు. ఆ మహానుభావుడే నాథన్ లయోన్. 2011లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసిన లయోన్.. ఇప్పటివరకు 115 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 460 వికెట్లను పడగొట్టాడు. Nathan Lyon today bowled his 30,000th delivery in Test cricket without ever overstepping. Not a single line no-ball in entire career. — Mazher Arshad (@MazherArshad) February 11, 2023 12 ఏళ్ల కెరీర్లో 100కు పైగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన లయోన్ ఒక్కసారి కూడా క్రీజ్ దాటకపోవడమనేది సాధారణ విషయం కాదు. సుదీర్ఘ కెరీర్లో ఇంత పద్ధతిగా, క్రమశిక్షణగా, స్థిరంగా బౌలింగ్ చేయడమనేది నేటి జనరేషన్లో అస్సలు ఊహించలేము. పొట్టి ఫార్మాట్లో ఇటీవలికాలంలో మన టీమిండియా బౌలర్ ఒకరు ఒకే ఓవర్ ఏకంగా ఐదు సార్లు క్రీజ్ దాటి బౌలింగ్ చేసిన ఘటన కళ్లముందు మెదులుతూనే ఉంది. టెస్ట్ క్రికెట్లో ఏ బౌలర్‌కు సాధ్యంకాని ఈ రికార్డును 35 ఏళ్ల లయోన్ నమోదు చేసినట్లు ప్రముఖ గణాంకవేత్త మజర్ అర్షద్ వెలుగులోకి తెచ్చాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా లయోన్ ఈ రేర్ ఫీట్‌ను సాధించినట్లు మజర్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆసీస్‌ను మట్టికరిపించారు. ఫలితంగా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (5/47, 70, 2/34) ఇరగదీయగా, రోహిత్ శర్మ (120) సెంచరీతో, అశ్విన్ (3/42, 5/37) 8 వికెట్లతో, అక్షర్ పటేల్ (84) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో, ఆఖర్లో షమీ మెరుపు ఇన్నింగ్స్ (47 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో విజృంభించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే చాపచుట్టేయగా.. టీమిండియా 400 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ 7 వికెట్లతో విజృంభించగా.. కమిన్స్ 2, లయోన్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అశ్విన్, జడేజా, షమీ (2/13), అక్షర్ పటేల్ (1/6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆసీస్ కేవలం 91 పరుగులకే టపా కట్టేసి ఇన్నింగ్స్ ఓటమిని ఎదుర్కొంది. -
హిట్‌మ్యాన్ ఖాతాలో పలు రికార్డులు.. దిగ్గజాల సరసన చేరిక
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. నిన్న (ఆగస్ట్ 6) విండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో 33 పరుగులు చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 16000 పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌కు ముందు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (34,357), రాహుల్ ద్రవిడ్ (24,064), విరాట్ కోహ్లి (23,726), సౌరవ్ గంగూలీ (18,433), ఎంఎస్ ధోని (17,092), వీరేంద్ర సెహ్వాగ్ (16,892) 16000 పరుగుల మైలురాయిని అధిగమించారు. వన్డేల్లో 9376 పరుగులు, టీ20ల్లో 3487, టెస్ట్‌ల్లో 3137 పరుగులు చేసిన రోహిత్ ఖాతాలో ప్రస్తుతం సరిగ్గా 16000 పరుగులు ఉన్నాయి. హిట్‌మ్యాన్ ఈ మార్కును చేరుకునే క్రమంలో మరో రికార్డును కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఓపెనర్‌గా 3000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 3119 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన రోహిత్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు (477) బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిని (476 సిక్సర్లు) అధిగమించాడు. ఈ జాబితాలో విండీస్ విధ్వంసకర యోధుడు, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో 553 సిక్సర్లు బాదిన గేల్ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదై ఉంది. ఇదిలా ఉంటే, నిన్న విండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ విండీస్‌పై 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. చదవండి: Ind Vs WI: ఎనిమిదింటికి ఎనిమిది గెలిచేశాడు.. నువ్వు తోపు కెప్టెన్! -
IND VS IRE 2nd T20: హార్దిక్ సేన ఖాతాలో చెత్త రికార్డు
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు రికార్డు విజయాన్నినమోదు చేసి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆతిధ్య ఐర్లాండ్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించిన భారత్.. రికార్డు విజయాన్ని నమోదు చేయడంతో పాటు ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్(తొలి బంతికే ఔట్ కావడం)గా వెనుదిరిగారు. దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్‌లు తాము ఎదుర్కొన్న తొలి బంతికే ఔటై పెవిలియన్ బాట పట్టారు. ఓ ఇన్నింగ్స్‌లో టీమిండియా (టీ20ల్లో) తరఫున ఇన్ని(3) గోల్డెన్ డకౌట్లు రికార్డు కావడం ఇదే తొలిసారి. కాగా, దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతమైన శతకంతో, సంజూ శాంసన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సుడిగాలి హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకువచ్చి ఓటమిపాలైంది. చివర్లో ఐర్లాండ్ ఆటగాళ్లు జార్జ్ డాక్రెల్ (16 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్ అడైర్ (12 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) టీమిండియాను బయపెట్టారు. ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సి ఉండగా ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌల్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో ఐర్లాండ్ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (18 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (37 బంతుల్లో 60; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హ్యారీ టెక్టార్ (28 బంతుల్లో 39; 5 ఫోర్లు) భారీ షాట్లతో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. చదవండి: కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన చిన్ననాటి స్నేహితులు -
ENG VS NZ 3rd Test: బెన్ స్టోక్స్ ఖాతాలో మరో రికార్డు
Ben Stokes: న్యూజిలాండ్‌తో జరుగతున్న మూడు టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో 100 సిక్సర్లు, 100కు పైగా వికెట్లు పడగొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం స్టోక్స్ ఖాతాలో 100 సిక్సర్లు (151 ఇన్నింగ్స్‌లు), 177 టెస్ట్ వికెట్లు (81 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో (13 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్) సిక్సర్ బాదడం ద్వారా టెస్ట్‌ల్లో సిక్సర్ల సెంచరీని అందుకున్న స్టోక్స్.. 3.29 ఎకానమీతో 177 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య హెడింగ్లే వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు రెండో సెషన్ సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ లాథమ్ (50), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (23) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ 54 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ 360 పరుగులు స్కోర్ చేసి 31 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. మూడో రోజు ఆటను 264/6 స్కోర్ వద్ద ప్రారంభించిన ఇంగ్లండ్.. మరో 96 పరుగులు జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. జేమీ ఓవర్టన్ (136 బంతుల్లో 97; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని మూడు పరుగుల తేడాతో చేజార్చుకోగా.. వేగంగా పరుగులు సాధించే క్రమంలో బెయిర్ స్టో (161), స్టువర్ట్ బ్రాడ్ (42) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4, నీల్ వాగ్నర్ 2, టిమ్ సౌతీ 3, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: టెస్టుల్లో బెన్ స్టోక్స్ అరుదైన ఫీట్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా..! -
చరిత్ర సృష్టించేందుకు మరో 45 పరుగుల దూరంలో ఉన్న టీమిండియా క్రికెటర్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టీ20ల్లో ఓ భారీ రికార్డును తన పేరిట లిఖించుకునేందుకు అత్యంత సమీపంలో ఉంది. శ్రీలంకతో రేపటి నుంచి (జూన్ 23) ప్రారంభంకాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హర్మన్ మరో 45 పరుగులు సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనుంది. 121 టీ20ల్లో 103 స్ట్రయిక్ రేట్‌తో 2319 పరుగులు చేసిన హర్మన్ శ్రీలంకతో సిరీస్‌లో మరో 45 పరుగులు చేస్తే టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక టీ20 పరుగుల రికార్డును (2364) అధిగమిస్తుంది. మిథాలీ రాజ్ 89 మ్యాచ్‌ల్లో 17 అర్ధ సెంచరీల సాయంతో 37.52 సగటున 2364 పరుగులు సాధించగా.. హర్మన 121 టీ20ల్లో సెంచరీ, 6 అర్ధ సెంచరీల సాయంతో 26.35 సగటున పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే, భారత మహిళా జట్టు శ్రీలంక పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. జూన్ 23, 25, 27 తేదీల్లో డంబుల్లా వేదికగా మొత్తం టీ20లు జరుగనుండగా.. జులై 1, 4, 7 తేదీల్లో పల్లెకెలె వేదికగా వన్డే సిరీస్ జరుగనుంది. చదవండి: మిథాలీరాజ్ రిటైర్మెంట్.. కొత్త కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ -
99 పరుగుల వద్ద స్టంపౌటైన వార్నర్.. వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు
కొలొంబో: సొంతగడ్డపై శ్రీలంక 30 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. 1992 తర్వాత తొలిసారి ఆ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. మంగళవారం (జూన్ 21) జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో ఆసీస్ 50 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటై లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. Sri Lanka won a ODI Series against australia for the first time in the last 30 years. What a historic win for Sri Lanka. pic.twitter.com/vT6yMV4rgN — CricketMAN2 (@ImTanujSingh) June 21, 2022 లంక జట్టులో చరిత్ అసలంక (106 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో సత్తా చాటగా, ధనంజయ డిసిల్వ (61 బంతుల్లో 60; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (112 బంతుల్లో 99; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, చివర్లో ప్యాట్ కమిన్స్ (43 బంతుల్లో 35; 2 ఫోర్లు), కునెర్మన్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. Heartbreak for David Warner. He gone for 99 runs. But nevertheless he played a brilliant Innings in this difficult condition in this run chase against Sri Lanka. Well played, David Warner. pic.twitter.com/YBOFSx6sgq — CricketMAN2 (@ImTanujSingh) June 21, 2022 వీవీఎస్ లక్ష్మణ్ సరసన వార్నర్ లంకతో జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బాధ్యతాయుతంగా ఆడిన వార్నర్ 99 పరుగుల వద్ద ధనంజయ డిసిల్వ బౌలింగ్‌లో స్టంప్ ఔటయ్యాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో 99 పరుగుల వద్ద స్టంప్ ఔట్ అయిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2002లో నాగ్‌పూర్ వేదికగా విండీస్‌తో జరిగిన వన్డేలో టీమిండియా ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఇలానే 99 పరుగుల వద్ద స్టంప్ ఔటయ్యాడు. చదవండి: ఆసీస్‌కు షాకిచ్చిన శ్రీలంక.. 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ గెలుపు -
ఇంగ్లండ్‌తో సిరీస్.. పలు అరుదైన రికార్డులపై కన్నేసిన రోహిత్-విరాట్ జోడీ
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ జోడీల్లో ఒకటిగా పరిగణించబడే రోహిత్ శర్మ-విరాట్ కోహ్లి ద్వయం త్వరలో ప్రారంభంకాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో పలు అరుదైన రికార్డులపై కన్నేసింది. జులై 1 నుంచి ప్రారంభంకాబోయే ఈ సిరీస్‌లో టీమిండియా తొలుత టెస్ట్ మ్యాచ్ ఆ తర్వాత టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. తరుచూ వ్యక్తిగత రికార్డుల పరంగా రికార్డుల్లోకెక్కే రోహిత్, విరాట్లు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జంటగా పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకోనున్నారు. టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 940 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్-విరాట్ జోడీ ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్‌లో మరో 60 పరుగులు జోడిస్తే 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది. టీ20ల్లో ఇప్పటివరకు 991 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్-విరాట్ ద్వయం రానున్న సిరీస్‌లో మరో 9 పరుగులు జోడిస్తే పొట్టి ఫార్మాట్లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది. అలాగే వన్డేల్లో ఇప్పటిదాకా 4906 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఈ దిగ్గజ బ్యాటింగ్ ద్వయం మరో 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ సిరీస్‌లో రోహిత్-విరాట్ జోడీ మరో 133 పరుగులు జోడిస్తే రోహిత్-శిఖర్ ధవన్ జోడీ పేరిట ఉన్న 5039 పరుగుల రికార్డును అధిగమించి.. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టాప్ 7 జోడీగా నిలుస్తుంది. ఈ రికార్డులే కాక టీమిండియా స్టార్ జోడీ మరో అరుదైన రికార్డుపై కూడా కన్నేసింది. ఈ జోడీ టెస్టుల్లో, టీ20ల్లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటే, మూడు ఫార్మాట్లలో వెయ్యికి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన మొట్టమొదటి జోడిగా సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకూ ఏ జోడీ కూడా మూడు ఫార్మాట్లలో 1000కి పైగా పరుగులు జోడించలేదు. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉంది.. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జులై 7న తొలి టీ20 జులై 9న రెండో టీ20 జులై 10న మూడో టీ20 జులై 12న తొలి వన్డే జులై 14న రెండో వన్డే జులై 17న మూడో వన్డే చదవండి: రవిచంద్రన్ అశ్విన్ కు కరోనా పాజిటివ్.. తగ్గాకే ఇంగ్లండ్‌కు..! -
అతనొక్కడే.. 11 మంది కెప్టెన్లు.. భారత వెటరన్ ఖాతాలో అరుదైన రికార్డు
ఐపీఎల్ 2022లో సత్తా చాటడం ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వెటరన్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ దాదాపుగా ముగిసిపోయిందన్న దశలో తిరిగి టీమిండియాలో స్థానం సంపాదించిన డీకే.. తన అంతర్జాతీయ కెరీర్లో ఏకంగా 10 మంది భారత కెప్టెన్ల కింద ఆడి అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ స్థాయిలో ఓ ఆటగాడు ఇంత మంది కెప్టెన్ల కింద ఆడిన దాఖలాలు లేవు. ఐసీసీ ఈవెంట్లతో కలుపుకుంటే డీకే కెప్టెన్ల సంఖ్య 11కు చేరుతుంది. కార్తీక్ పాక్ దిగ్గజ ఆటగాడు షాహిద్ అఫ్రిది నాయకత్వంలో ఐసీసీ ఎలెవెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే 37వ పడిలోకి అడుగుపెట్టిన కార్తీక్ త్వరలో అంతర్జాతీయ స్థాయిలో తన కెప్టెన్ల సంఖ్యను 12కు పెంచబోతున్నాడు. కార్తీక్.. త్వరలో ప్రారంభంకానున్న ఐర్లాండ్ పర్యటనలో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడబోతున్నాడు. 18 ఏళ్ల క్రితం 2004లో తొలిసారి టీమిండియా తరఫున ఆడిన కార్తీక్.. తన అరంగేట్రం మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఆడాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎమ్మెస్ ధోని, అనిల్ కుంబ్లే, సురేష్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌ల కెప్టెన్సీల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: ఒకే జట్టులో కోహ్లి-బాబర్, బుమ్రా-అఫ్రిది..? -
శెభాష్ మిథూ: 23 ఏళ్ల కెరీర్.. అరుదైన రికార్డులు! హ్యాట్సాఫ్!
Mithali Raj Retirement: భారత క్రికెటర్‌గా దాదాపు 23 ఏళ్ల పాటు కొనసాగించిన ప్రస్థానానికి మిథాలీ రాజ్ ముగింపు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. రెండేళ్ల క్రితం పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన ఆమె.. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. కాగా 39 ఏళ్ల మిథాలీ క్రికెటర్‌గా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అరుదైన రికార్డులతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచి లెజెండ్‌గా ఖ్యాతి గడించారు. మిథాలీ రిటైర్మెంట్ సందర్భంగా ఆమె సాధించిన ఘనతల గురించి సంక్షిప్తంగా.. ♦1999లో మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. చివరిసారిగా ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ♦వన్డేల్లో అత్యధిక పరుగులు(7805) సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు ♦వన్డే క్రికెట్లో అత్యధిక అర్ధ శతకాలు బాదిన మహిళా క్రికెటర్‌గా ఘనత ♦వుమెన్ వరల్డ్‌కప్ ఈవెంట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ జాబితాలో రెండో స్థానంలో మిథాలీ రాజ్(1321 పరుగులు) ♦వన్డేల్లో అత్యధిక సెంచరీలు(7) సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా ఖ్యాతి. ♦టీ20 ఫార్మాట్ అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ సాధించిన పరుగులు 2364. 2019లో చివరి మ్యాచ్ ఆడిన ఆమె.. టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ►మహిళా క్రికెట్లో ఇప్పటి వరకు 10 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌గా మిథాలీ. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆమె చేసిన పరుగులు 10868. ►మహిళా ప్రపంచకప్ ఈవెంట్లో ఏకంగా ఆరుసార్లు( 2000, 2005, 2009, 2013, 2017, 2022) పాల్గొన్న క్రికెటర్‌గా గుర్తింపు. ►మహిళా టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా మిథాలీ. 2002లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 214 పరుగులు సాధించిన మిథాలీ. ►మహిళా వన్డే క్రికెట్లో అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన బ్యాటర్‌గా మిథాలీ రాజ్‌కు పేరు. 16 ఏళ్ల 205 రోజుల వయసులో ఆమె ఈ ఘనత సాధించారు. ►మహిళా క్రికెట్లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్ అరుదైన రికార్డు. ఆమె 22 ఏళ్ల 274 రోజుల పాటు క్రికెటర్‌గా ఉన్నారు. ♦మహిళా ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సార్లు(12) హాఫ్ సెంచరీ ప్లస్ స్కోరు చేసిన క్రికెటర్‌గా మిథాలీ(న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబీ హాక్లేతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానం). ♦అదే విధంగా కెప్టెన్‌గానూ మెగా ఈవెంట్లో యాభై కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఎనిమిదోసారి. ♦వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా మిథాలీ రికార్డు. ♦మహిళల క్రికెట్లోనే కాకుండా పురుషుల క్రికెట్లోనూ ఎవ్వరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డు మిథాలీ సొంతం. అదేమిటంటే.. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన, తన అంతర్జాతీయ అరంగ్రేటం తర్వాత నాలుగేళ్లకు పుట్టిన రిచా ఘోష్‌తో కలిసి మిథాలీ వరల్డ్‌కప్-2022లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. చదవండి: Nicholas Pooran: ఐపీఎల్లో పర్లేదు.. అక్కడ మాత్రం తుస్! కానీ పాక్‌తో మ్యాచ్‌లో.. View this post on Instagram A post shared by ICC (@icc) -
పిట్ట కొంచెం.. కూత ఘనం
కడప అర్బన్: కేవలం రెండు సంవత్సరాల 11 నెలల పసిప్రాయంలోనే చిన్నారి లక్షర ఆద్య సోమలరాజు అరుదైన రికార్డును సాధించింది. వివరాల్లోకెళితే.. కడప చిన్నచౌక్ శ్రీనగర్‌కాలనీలో నివసించే సోమలరాజు జగదీష్‌రాజు, హిమబిందు దంపతుల కుమార్తె లక్షర ఆద్య ఏకసంథాగ్రహి. తల్లిదండ్రులు ఏదైనా ఒక్కసారి చెబితే గుర్తుంచుకుని వెంటనే అప్పచెప్పేది. చిన్నారి ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు పాపకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇటీవల పలువురి ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ గురించి తెలుసుకుని ప్రతిభను నిర్వాహకులకు వివరించారు. దేశ వ్యాప్తంగా వేలాదిమంది పోటీపడ్డారు. అందులో అతి పిన్నవయసులో విజేతగా నిలిచి వైఎస్సార్ జిల్లా కీర్తిని పతాకను ఎగరేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పాప ఏం చేసిందంటే.. 8 గ్రహాలు, విష్ణువు అవతారాలు, రాష్ట్రాలు, రాజధానులు, ప్రముఖ వ్యక్తులు, శరీర భాగాలు, కూరగాయలు, పండ్లు, 118 వివిధ రకాల వస్తువుల పేర్లు, క్యాలెండర్లో నెలలు, వారంలో రోజులు, 16 జాతీయ చిహ్నాలు, 17 రంగులు, 19 మ్యాథమేటికల్ షేప్స్, 22 క్రీడలు, నిర్వాహకులు అడిగిన 26 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను అనర్గళంగా చెప్పింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులను, పోటీపడిన వారిని అబ్బురపరుస్తూ ఘనతను చాటింది. చినానరికి జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందన చిన్నారి లక్షర ఆద్య తల్లిదండ్రులు జగదీష్ రాజు, హిమబిందు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ కలిశారు. చిన్నారికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అందజేసిన సర్టిఫికెట్, జ్ఞాపికలను చూపారు. జిల్లా ఎస్పీ లక్షర ఆద్య ప్రతిభను అభినందించి ఆశీర్వదించారు. -
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు
దుబాయ్: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దుబాయ్ వేదికగా జరిగిన కర్వాన్ అండర్-19 గ్లోబల్ లీగ్ టీ20 టోర్నీలో భారత సంతతి(ఢిల్లీ)కి చెందిన స్థానిక కుర్రాడు హర్షిత్ సేథ్ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్‌కు చెందిన హైదరాబాద్ హాక్స్ అకాడమీ ఆర్సీజీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దుబాయ్ క్రికెట్ కౌన్సిల్ స్టార్లెట్స్కు ప్రాతినిధ్యం వహించిన హర్షిత్.. డబుల్ హ్యాట్రిక్ సహా మొత్తం 8 వికెట్లు(4-0-4-8) సాధించడంతో పర్యాటక జట్టు 44 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుత క్రికెట్లో దాదాపుగా అసాధ్యమైన డబుల్ ఈ హ్యాట్రిక్ ఫీట్‌ను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్షిత్ సాధించాడు. ఈ ఏడాది నవంబర్ 28న జరిగిన ఈ ఘట్టం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘట్టం ఇంతవరకు ఆవిష్కృతం కాలేదు. అయితే, 2017 జనవరిలో ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్లో ఇలాంటి ఘట్టమే ఆవిష్కృతమైంది. గోల్డన్ పాయింట్ క్రికెట్ క్లబ్ తరఫున అలెడ్ క్యారీ డబుల్ హ్యాట్రిక్ సాధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతకుముందు 1930లో భారత స్కూల్ క్రికెట్లో వైఎస్ రామస్వామి, 1951లో ఇంగ్లండ్ లోకల్ క్రికెట్లో జి సిరెట్ ఈ రికార్డును సాధించినట్లు తెలుస్తోంది. చదవండి: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌కు కీలక పదవి.. -
అరుదైన ఘటన; కవలలకు మళ్లీ కవలలు..
కరీంనగర్ టౌన్: నిఖిత, లిఖిత ఇద్దరు కవలలు. ఇటీవల నిఖిత ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే మూడు నెలల కిందటే లిఖిత కూడా ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో ఆ కుటుంబం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మనివ్వడం సాధారణమే అయినప్పటికీ కవల పిల్లలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇలా కవల పిల్లలకు జన్మనివ్వడం అరుదైన రికార్డు అని వైద్యులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామానికి చెందిన నిఖిత మొదటి కాన్పు కోసం కరీంనగర్‌లోని యశోద కృష్ణ ఆస్పత్రికి రాగా, పరీక్షించిన వైద్యురాలు ఆకుల శైలజ.. ఆమె గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే 8 నెలలు దాటడం మహిళకు నొప్పులు రావడంతో శనివారం ఉదయం సిజేరియన్ చేశారు. దీంతో ఇద్దరు ఆడ, ఇద్దరు మగ శిశువులు జన్మించారు. శిశువుల బరువు తక్కువగా ఉండటంతో ఇంక్యుబేటర్‌లో ఉంచారు. నిఖిత సోదరి లిఖితకు కూడా 3 నెలల కింద అదే ఆస్పత్రిలో డెలివరీ కాగా, ఆమెకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. నిఖిత భర్త సాయికిరణ్ పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. నిఖితతో పాటు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారని, జన్యుపరంగానే ఇలా పుడతారని డాక్టర్ శైలజ చెప్పారు. ఇది అత్యంత అరుదైన ఘటన అని ఆమె పేర్కొన్నారు. (చదవండి: హమ్మయ్య.. ఆ పాప మళ్లీ నవ్వింది..!) -
కారు డ్రైవర్ అరుదైన రికార్డు
టీ.నగర్: కారైకుడిలో కారు డ్రైవర్ అరుదైన రికార్డు సాధించాడు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని పుదువయల్ నాట్టుచేరి గ్రామానికి చెందిన కార్తియమూర్తి (37) కారు డ్రైవర్. ఇతను గురువారం 1,330 తిరుక్కురల్‌ను 17 గంటల 19 నిమిషాల్లో తలకిందులుగా రాసి చోళన్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో స్థానం సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను వ్యవస్థాపకుడు విమలన్ నీలమేఘం అందజేశారు. దీనిపై కార్తియమూర్తి మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం బస్సు టికెట్లలో తిరుక్కురల్‌ను చదువుతూ వచ్చానని, దానిపై ఆసక్తి పెంచుకున్న తాను అప్పట్లో 1,330 పద్యాలను తలకిందులుగా రాసినట్లు తెలిపాడు. ఇందుకు 15 రోజులు సమయం పట్టిందన్నాడు. ప్రస్తు తం వళ్లువర్ పేరవై సహకారంతో తిరుక్కురల్‌ను 17 గంటల 19 నిమిషాల్లో ముగించి రికార్డు సాధించడం సంతోషంగా ఉందన్నారు. -
రెండున్నర గంటల్లోనే వర్సిటీ పరీక్షల ఫలితాలు
బెంగళూరు : యూనివర్సిటీ పరీక్షల ఫలితాలు రావాలంటే సాధారణంగా పది లేదా పదిహేను రోజులు పడతాయి. కొన్ని యూనివర్సిటీలు మరికొంత ఆలస్యం చేస్తాయి. కానీ తక్కువ సమయంలో ఫలితాలు మాత్రం ప్రకటించవు. ఈ కోవకు చెందినదే బెంగళూరు యూనివర్సిటీ కూడా. ఫలితాల ప్రకటనలో ఈ యూనివర్సిటీ చేసినంత జాప్యం మరొక యూనివర్సిటీ చేయదు. కానీ ఈసారి బెంగళూరు యూనివర్సిటీ సోమవారం అరుదైన రికార్డును సాధించింది. తనకున్న పేరును తిరగ రాసుకుంది. మొట్టమొదటిసారి పరీక్షలు అయిపోయిన రెండున్నర గంటల వ్యవధిలోనే బీఈ(సివిల్ ఇంజనీరింగ్) ఏడు, ఎనిమిది సెమిస్టర్ల ఫలితాలను ప్రకటించింది. బెంగళూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఒకే ఒక్క ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ ‘ది యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్’. దీని ఫలితాల ప్రకటనలోనే బెంగళూరు యూనివర్సిటీ ఈ ఘనత సాధించింది. ప్రతి సబ్జెట్ సమాధాన పత్రాలను, పరీక్ష అయిపోయిన వెంటనే మూల్యాంకనం చేసే వాళ్లమని బెంగళూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీ శివరాజు చెప్పారు. దీంతో గత 10 రోజులుగా జరుగుతున్న అన్ని సబ్జెట్ పరీక్ష పేపర్లను వెంటనే మూల్యాంకనం చేయడం ముగించామని తెలిపారు. 139 మంది విద్యార్థులు ఈ సారి పరీక్షలకు హాజరయ్యారని, ఇంత తక్కువ సమయంలో ఫలితాలను ప్రకటించడం బెంగళూరు యూనివర్సిటీ చరిత్రలోనే ఇది మొదటిసారని పేర్కొన్నారు. లేదంటే ఎనిమిది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందన్నారు. మూల్యాంకన ప్రక్రియను మెరుగుపరిచినందుకు తాము చాల సంతోషంగా ఉన్నామని ఇంజనీరింగ్ విద్యార్థి సురేష్ పీ తెలిపాడు. వెనువెంటనే ఫలితాలతో ఉన్నత విద్యకు వెళ్లడానికి లేదా ఉద్యోగం వెతుకుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. సోమవారం రోజు తాము ఆఖరి పేపరు పరీక్ష రాశామని, అది మధ్యాహ్నం రెండు గంటలకు అయిపోతే, సాయంత్రం నాలుగున్నర వరకు మొత్తం ఫలితాల ప్రకటన వచ్చేసిందని చెప్పాడు. కాలేజీ స్టాఫ్‌కు, బెంగళూరు యూనివర్సిటీ మూల్యాంకన వింగ్‌కు యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ మాజీ ప్రిన్సిపాల్, బెంగళూరు యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ కేఆర్ వేణుగోపాల్ కృతజ్ఞతలు చెప్పారు. -
24 గంటల్లో 980 విమానాలు
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. 24 గంటల్లో 980 విమానాల రాకపోకలతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్‌వే విమానాశ్రయంగా రెండో ఏడాది కూడా రికార్డుల్లోకెక్కింది. జనవరి 20న ఈ విమానాశ్రయం ఈ ఘనత సాధించినట్లు ఎయిర్పోర్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. గతేడాది డిసెంబర్ 6న 24 గంటల్లో 974 విమానాల రాకపోకలతో తన పేరిట ఉన్న రికార్డును ముంబై ఎయిర్పోర్ట్ బద్దలు కొట్టిందన్నారు. గత మార్చిలో ఒక్క రోజు వ్యవధిలో 837 విమానాల రాకపోకలతో ముంబై విమానాశ్రయం లండన్‌లోని గట్విక్ ఎయిర్పోర్ట్ (757 విమానాల రాకపోకలు)ను వెనక్కు నెట్టిందని వెల్లడించారు. ముంబై విమానాశ్రయం 24 గంటల పాటు పనిచేస్తే, ప్రభుత్వ నిషేధం కారణంగా గట్విక్ ఎయిర్పోర్ట్ ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటల వరకే పనిచేస్తుందన్నారు. అయినప్పటికీ ఈ విమానాశ్రయానికి 2018లో రోజుకు 870 ఫ్లైట్ల రాకపోకల సామర్థ్యం ఉందన్నారు. రద్దీ సమయాల్లో ముంబై విమానాశ్రయంలో గంటకు 52 విమానాల రాకపోకలు జరిగితే, గట్విక్లో ఇది 55గా ఉంటుందన్నారు. విమానాలు నిలిపేందుకు ఎక్కువ చోటు లేకపోవడం, మౌలికవసతుల కొరత ముంబై ఎయిర్‌పోర్టుకు సమస్యగా మారిందన్నారు. -
పుజారా... ఓ అరుదైన రికార్డ్
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా (న్యూ) మిస్టర్ డిపెండబుల్ ఛటేశ్వర పుజారా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్ట్‌లో ఐదురోజులపాటు బ్యాటింగ్ చేసిన క్రీడాకారుల జాబితాలో చేరిపోయాడు. శ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న టెస్ట్‌లో పుజారా ఈ ఘనత సాధించాడు. మొత్తం ఐదు రోజులపాటు పుజారా క్రీజులో బంతులను ఎదుర్కున్నాడు. తద్వారా ఈ రికార్డు సాధించిన 9వ ఆటగాడిగా పుజారా రికార్డు సృష్టించాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు అయ్యాడు. అంతకు ముందు జయసింహా, రవిశాస్త్రి ఇలా ఐదురోజులపాటు బ్యాటింగ్ చేశారు. 1960లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో చివరి ఆటగాడిగా బరిలోకి దిగిన హైదరాబాదీ ఆటగాడు ఎంఎల్ జయసింహా ఆపద సమయంలో భారత్‌ను ఆదుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఇక రవిశాస్త్రి 1984లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు రోజులపాటు ఆడాడు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే... ఈ ముగ్గురు కూడా ఈడెన్ గార్డెన్స్‌లోనే ఈ ఫీట్ సాధించటం. ఈ ఘనత సాధించిన మరికొందరు ఆటగాళ్లు... జే బాయ్‌కాట్(ఇంగ్లాండ్), కేజే హ్యూస్(ఆస్ట్రేలియా), అలన్ లాంబ్(ఇంగ్లాండ్), ఏఎఫ్జీ గ్రిఫ్ఫిత్(వెస్టిండీస్), ఆండ్రూ ఫ్లింటాఫ్(ఇంగ్లాడ్), ఏఎన్ పీటర్సన్(సౌతాఫ్రికా) Cheteshwar Pujara becomes the third Indian cricketer, after Ravi Shastri and ML Jaisimha to have batted on all 5 days of a Test match. pic.twitter.com/1ERgsi6p9r — BCCI (@BCCI) November 20, 2017 -
క్రికెట్ చరిత్రలో ఊహించని రికార్డు
సాక్షి, స్పోర్ట్స్ : ఫార్మాట్ ఏదైనా అత్యంత అరుదైన రికార్డులు మాత్రం క్రికెట్ పుస్తకంలో ఈ మధ్య నమోదవుతున్నాయి. విక్టోరియన్ థర్డ్ గ్రేడ్ క్రికెటర్ నిక్ గూడెన్ ఊహకందని ఓ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. కౌంటీ క్రికెట్ లో భాగంగా యాల్లౌర్న్ నార్త్ తరపున ఆడుతున్న నిక్ గూడెన్, పది బంతుల్లో ఎనిమిది వికెట్లను తీశాడు. ఇందులో ఐదు వరుస బాల్స్ లో ఐదు వికెట్లు తీయడం గమనార్హం.ఇందులో ఆరుగుర్ని బౌల్డ్ చేయగా, ఒక ఆటగాడ్ని లెగ్ బి ఫోర్ గా పెవిలియన్ కు పంపడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో నమోదైన ఈ రికార్డులో నిక్ గూడెన్ మొత్తం 17 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. గత డిసెంబర్ నుంచి క్రికెట్ కు దూరమైన ఈ కుడి చేతి బౌలర్ రీఎంట్రీ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించటం మరో విశేషం. ఇదెలా జరిగిందో తనకూ అర్థం కాలేదని, కానీ ఓ మరపురాని అనుభూతి మాత్రం కలిగిందని మ్యాచ్ అనంతరం 'వీకెండ్ సన్ రైజ్' పత్రికతో గూడెన్ పేర్కొన్నాడు. ఇటీవలే వెస్టర్ అగస్టా బీ గ్రేడ్ కు చెందిన ఆటగాడు ఒకరు 40 సిక్సులతో 307 పరుగులు కొట్టి ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. -
వైరల్.. ఒకే బంతిని ఐదుసార్లు!
-
వైరల్.. ఒకే బంతిని ఐదుసార్లు!
సాక్షి, దుబాయ్ : ఓవైపు వరుస వైఫల్యాలు.. మరోవైపు ఆర్థిక కష్టాలు... పాకిస్థాన్ జట్టును కుదేలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం దుబాయ్‌లో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ను ఆడుతున్న పాక్ పేలవమైన ఫామ్‌నే కొనసాగిస్తోంది. అయితే రెండో టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్ వాహెబ్ రియాజ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్క బంతి వేయడానికి ఏకంగా ఐదుసార్లు ప్రయత్నించి చరిత్ర కెక్కాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం ఆటలో రియాజ్ ఈ ఫీట్ చేశాడు. 111వ ఓవర్ నాలుగో బంతిని వేసేందుకు యత్నించాడు. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఆగిపోయాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా ఐదుసార్లు.. ఐదు నిమిషాలపాటు ప్రయత్నించినా బంతిని వేయలేకపోయాడు. అవతల ఉన్న బ్యాట్స్‌మన్ కరుణరత్నెతోపాటు పాక్ కెప్టెన్ కమ్ కీపర్ సర్ఫాజ్ అహ్మద్, అంపైర్ కూడా విసుగుచెందడం కనిపించింది. అదే సమయంలో కోచ్ మైక్ మిక్కీ అర్థర్ హవాభావాలను చూడాలి. చివరకు చిర్రెత్తుకొచ్చిన ఆయన మరో ఆటగాడితో ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లిపోయాడు. క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగటం ఇదే ఫస్ట్ టైమ్ కాబోలు అని పలువురు చెబుతున్నారు. ఏదైతేనేం మొత్తానికి ఆరోసారికి విజయవంతంగా బౌల్ చేయగలిగాడు. ఇక ఈ వీడియోతో ‘వాహెబ్ పాపం బౌలింగ్ మరిచిపోయాడేమో’ అంటూ సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేసి పడేస్తున్నారు. -
భారత బౌలర్ల అరుదైన రికార్డు
చాంపియన్‌ట్రోఫీలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ట్రోఫీలో భారత బ్యాట్మెన్లు తమ సత్తాచాటుతుంటే , బౌలర్లు తమ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, బూమ్రా, జడేలతో బౌలింగ్ లైన్ అసాధారణ రీతిలో చెలరేగిపోతోంది. అనూహ్యంగా అశ్విన్ సైతం జట్టులో వచ్చి బౌలింగ్ బలాన్ని మరింత పెంచాడు. తొలిమ్యాచ్‌లో భారత్ బ్యాట్మెన్ల రాణింపుతో 319 పరుగులు చేయగా, బౌలర్లు తమ పదునైన బౌలింగ్‌తో పాకిస్తాన్‌ను కేవలం 164 పరుగులకే నేలకూల్చారు. అయితే తరువాతి మ్యాచ్‌లో భారత బౌలింగ్ తేలిపోయింది. లంకను ఏ పరిస్థితిల్లో కూడా ఇబ్బంది పెట్టలేక పోయారు. 322 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. భారత బౌలర్లు కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగారు. అది కూడా ఐదో ఓవర్ నాలుగోబంతికి భువనేశ్వర్ డిక్వెల్లా 7(18)పరుగుల వద్దను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం గుణతిలక, మెండిస్‌ల వికెట్లు పడ్డా ఆరెండూ రన్నౌట్లు. మరొకటి రిటైర్డ్ నాటౌట్‌గా పెరీరా వెనుదిరిగాడు. అంటే శ్రీలంకతో కేవలం ఒక్కవికెట్ మాత్రమే అదికూడా4.4 ఓవర్లల్లో. మిగతా 45.2 ఓవర్లలో ఒక్క వికెట్‌కూడా బౌలర్లు తమ ఖాతాలో వేసుకోలేకపోయారు. అనంతరం దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో తొలి వికెట్‌గా ఆమ్లా35(69), అశ్విన్ బౌలింగ్‌లో 17.3 ఓవర్లో అవుట్ అయ్యాడు. అంటే శ్రీలంకతో 45.2 ఓవర్లు, ఇటు దక్షిణాఫ్రికాతో 17.2 ఓవర్లు మెత్తం 62.4 ఓవర్లలో భారత బౌలర్లు ఒక్క వికెట్‌కూడా తమ ఖాతాలో వేసుకోలేకపోయారు. అంతార్జాతీయ క్రికెట్లో ఇదీ ఓ రికార్డే. -
నార్లాపూర్‌లో వరి విత్తనం తయారీ
రైతుల సమష్టి సాగుతో అరుదైన రికార్డు పరకాల ఏడీఏ గంగారాం వెల్లడి పరకాల, న్యూస్‌లైన్ : జిల్లాలోనే తొలిసారిగా పరకాల మండలం నార్లాపూర్‌లో రైతులు వరి విత్తనం తయారు చేశారని పరకాల ఏడీఓ బి.గంగారాం తెలిపారు. శుక్రవారం వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఓ నాగరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. విత్తన తయారీ కోసం ప్రతి ఏటా ఖరీఫ్, రబీలో వ్యవసాయశాఖ నుంచి ‘గ్రామీణ విత్తనోత్పత్తి’ కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో భాగంగా నార్లాపూర్ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక ఆదర్శ రైతు క్లబ్ ఆధ్వర్యంలో 25 ఎకరాల్లో విత్తనాల కోసం వరి సాగును చేపట్టినట్లు చెప్పారు. క్లబ్ కన్వీనర్ చేపూరి సాంబయ్యతోపాటు కొందరు రైతులను ప్రోత్సహించి పంట వేయగా ఇప్పుడు చేతికి వచ్చిందని తెలిపారు. వరి విత్తనాలను పరీక్షకు పంపగా సరైనవేనని రిపోర్టు వచ్చిందని, నార్లాపూర్ ఈ ఘనత సాధించడం జిల్లానే ప్రథమని అన్నారు. ఈ విత్తనానికి డబ్ల్యూజీఎల్-32100 ఫౌండేషన్‌గా నామకరణం చేశారని, గ్రామంలో పండిన ఈ విత్తనాలు 1200 ఎకరాలకు సరి పోతుందన్నారు. క్వింటాల్‌కు రూ.2600లుగా ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే హసన్పర్తికి 60 బస్తాలు, జనగామకు 100 బస్తాలు విక్రయించినట్లు తెలిపారు. రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన(ఆర్కేవీవై) పథకం ద్వారా రూ.4.35 లక్షల మినీ మొబైల్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను 90శాతం సబ్సిడీపై క్లబ్ రైతులకు అందించినట్లు వివరించారు. రైతులు పండించిన వరి విత్తనాలకు బ్యాగులు, లేబులింగ్ అందించి త్వరలోనే మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్పారు. విత్తన సాగుకు రైతులను ప్రోత్సహించిన ఏఓ నాగరాజును ఏడీఏ అభినందించారు.