సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా (న్యూ) మిస్టర్ డిపెండబుల్ ఛటేశ్వర పుజారా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్ట్‌లో ఐదురోజులపాటు బ్యాటింగ్ చేసిన క్రీడాకారుల జాబితాలో చేరిపోయాడు. శ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న టెస్ట్‌లో పుజారా ఈ ఘనత సాధించాడు.
మొత్తం ఐదు రోజులపాటు పుజారా క్రీజులో బంతులను ఎదుర్కున్నాడు. తద్వారా ఈ రికార్డు సాధించిన 9వ ఆటగాడిగా పుజారా రికార్డు సృష్టించాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు అయ్యాడు. అంతకు ముందు జయసింహా, రవిశాస్త్రి ఇలా ఐదురోజులపాటు బ్యాటింగ్ చేశారు. 1960లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో చివరి ఆటగాడిగా బరిలోకి దిగిన హైదరాబాదీ ఆటగాడు ఎంఎల్ జయసింహా ఆపద సమయంలో భారత్‌ను ఆదుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు.
ఇక రవిశాస్త్రి 1984లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు రోజులపాటు ఆడాడు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే... ఈ ముగ్గురు కూడా ఈడెన్ గార్డెన్స్‌లోనే ఈ ఫీట్ సాధించటం. ఈ ఘనత సాధించిన మరికొందరు ఆటగాళ్లు... జే బాయ్‌కాట్(ఇంగ్లాండ్), కేజే హ్యూస్(ఆస్ట్రేలియా), అలన్ లాంబ్(ఇంగ్లాండ్), ఏఎఫ్‌జీ గ్రిఫ్ఫిత్(వెస్టిండీస్), ఆండ్రూ ఫ్లింటాఫ్(ఇంగ్లాడ్), ఏఎన్ పీటర్సన్(సౌతాఫ్రికా)
Cheteshwar Pujara becomes the third Indian cricketer, after Ravi Shastri and ML Jaisimha to have batted on all 5 days of a Test match. pic.twitter.com/1ERgsi6p9r
— BCCI (@BCCI) November 20, 2017
Comments
Please login to add a commentAdd a comment